'ముస్లిం, యాదవ్ అభ్యర్థులను నిలబెడతాం' | Bihar: NDA will field more Muslim, Yadav candidates this time | Sakshi
Sakshi News home page

'ముస్లిం, యాదవ్ అభ్యర్థులను నిలబెడతాం'

Sep 14 2015 7:43 PM | Updated on Jul 18 2019 2:17 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని కూటమిని ఎదుర్కొనేందుకు ముస్లిం, యాదవ్ అభ్యర్థులను ఎక్కువగా పోటీకి నిలపాలని ఎన్డీఏ భావిస్తోంది.

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని కూటమిని ఎదుర్కొనేందుకు ముస్లిం, యాదవ్ అభ్యర్థులను ఎక్కువగా పోటీకి నిలపాలని ఎన్డీఏ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ముస్లిం, యాదవ్ అభ్యర్థులను అధికంగా బరిలోకి దింపుతామని బీజేపీ బిహార్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ తెలిపారు.

బీజేపీతో విడిపోయి కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపిన తర్వాత నితీశ్ కుమార్ పాలన గాడి తప్పిందని ఆయన విమర్శించారు. మహాకూటమికి యాదవుల మద్దతు ఉందన్న వాదనను మోదీ తోసిపుచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో లాలూ భార్య రబ్రీదేవి, కుమార్తె మిసా భారతి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ పట్ల ముస్లింలు వ్యతిరేకంగా లేరని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోని వస్తే సీఎం పదవికి సుశీల్ కుమార్ మోదీ పేరు బలంగా విన్పిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement