సంబురాలకు సమాయత్తం | The 60-year-old dream of the people come time | Sakshi
Sakshi News home page

సంబురాలకు సమాయత్తం

May 30 2014 11:38 PM | Updated on Sep 17 2018 6:18 PM

తెలంగాణ ఆవిర్భావ సంబురాలను అధికారికంగా నిర్వహించనున్నారు. జూన్ 2న ఉదయం 8.45 గంటలకు సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకరమయ్యే సమయం సమీపిస్తున్నది. అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావాన్ని అదిరిపోయేలా చేసుకునేందుకు తెలంగాణ సకల జనులు సిద్ధమవుతున్నారు. అపాయింటెడ్ డే జూన్ 2 కావడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే సంబురాలు హోరెత్తనున్నాయి. మరోవైపు అధికారులు వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ స్మితాసబర్వాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.   
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ఆవిర్భావ సంబురాలను అధికారికంగా నిర్వహించనున్నారు. జూన్ 2న ఉదయం 8.45 గంటలకు సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
 
 శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్, ఎస్పీ షెముషీ బాజ్‌పాయ్‌తో కలిసి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ఆంశాల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులకు అప్పగించారు. పరేడ్ గ్రౌండ్‌లో జూన్ 2న జరగనున్న కార్యక్రమాల షెడ్యూల్ ఇది..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement