ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండే: పేర్వారం | Telangana government to implement naxals agenda | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండే: పేర్వారం

Sep 5 2014 6:49 PM | Updated on Sep 2 2017 12:55 PM

ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండే: పేర్వారం

ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండే: పేర్వారం

టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. నక్సల్స్ ఎజెండాలా ముందుకు పోతున్నదని రిటైర్డ్ డీజీపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు అన్నారు.

రఘునాథపల్లి: దళితులకు భూమి, యువతకు ఉపాధిలాంటి ఎన్నో హామీలను నెరవేరుస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. నక్సల్స్ ఎజెండాలా ముందుకు పోతున్నదని రిటైర్డ్ డీజీపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు అన్నారు.  వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

దళితులకు భూ పంపిణీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల దుర్బర దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నందున నక్సల్సై ఎజెండా.. ప్రభుత్వ ఎజెండా ఒక్కటిలా ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపకాలు పూర్తి కాలేదని, ఒక్కొక్కరు మూడు నాలుగు శాఖలు నిర్వహిస్తూ ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయాల్సి వస్తుందన్నారు. సంక్రాంతి వరకు పాలన గాడిలో పడుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement