వరంగల్ జిల్లా: మండలంలోని ఆశాలపల్లి జాక్‌పాట్ సర్పంచ్‌గా పిలుచుకునే ఒకే ఒక ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్ యాదవ్, నాయకులు కొంతం దశరథంతో కలిసి ఆమె గవిచర్ల కేంద్రంలో నామినేషన్ వేశారు. గ్రామంలో ఎస్సీ జనాభా లేకపోవడం.. ఉన్న ఒకే ఒక్క మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కావడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతిని రంగంలోకి దింపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు గ్రామంతో పాటుగా మండలంలో చర్చ జరుగుతోంది. నామినేషన్లకు ఒక్క రోజే గడువు ఉండడంతో మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఉత్కంఠకు తెరపడనుందని ఊహగానాలు వినవస్తున్నాయి. జాక్‌పాట్ సర్పంచ్‌గా మల్లమ్మ ఎన్నిక కానుందా లేక ప్రేమవివాహం యువతి తెరపైకి వస్తే, పోటీ పడి మల్లమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.


