సాక్షి, వరంగల్: పంట పొలంలో బంగారం కలకలం రేపింది. పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. పొలం దున్నుతున్న క్రమంలో బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు - కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. గతంలో కూడా ఈ పొలంలో బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది.
బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి బంగారం పంచాయతీ వచ్చింది. తనకు వాటా ఇవ్వాలని ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయంటూ కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు.


