breaking news
Gold found
-
వరంగల్: పంట పొలంలో ‘బంగారం’ కలకలం
సాక్షి, వరంగల్: పంట పొలంలో బంగారం కలకలం రేపింది. పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. పొలం దున్నుతున్న క్రమంలో బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు - కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. గతంలో కూడా ఈ పొలంలో బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది.బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి బంగారం పంచాయతీ వచ్చింది. తనకు వాటా ఇవ్వాలని ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయంటూ కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. -
బాంబు అనుకుని తెరిస్తే బంగారం..
శంషాబాద్: అనుమానిత వస్తువుగా భావించిన ఓ బ్యాగులో బంగారం బయటపడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని అంతర్జాతీయ అరైవల్‌లో బ్యాగులు తీసుకొచ్చే బెల్టుపై ఆదివారం రాత్రి ఓ బ్యాగు మిగిలిపోయింది. ప్రయాణికులు ఎవరూ దానిని తీసుకోకపోవడంతో సీసీ కెమెరాల్లో పరిశీలించిన అధికారులు వెంటనే సీఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో బాంబు ఉండవచ్చేమోనని అనుమానించిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించారు. స్కానింగ్ ద్వారా బ్యాగ్‌లో ఓ అనుమానిత వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మోటార్‌ను బయటికి తీశారు. దానిని బద్దలు చేసి చూడగా.. బంగారు ప్లేట్లకు ఇనుప పూతపూసి మోటారులో పెట్టినట్లు గుర్తించారు. ఈ బంగారు ప్లేట్ల బరువు దాదాపు 1.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దీనిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలు గమనించిన ప్రయాణికుడే దానిని బెల్టుపై వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రయాణికుడు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ప్లేట్లపై ఇనుపపూత -
పోలీసుల తనిఖీల్లో 4 కేజీల బంగారం లభ్యం
సికింద్రాబాద్: నగరంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా నాలుగు కేజీల బంగారం లభ్యమైంది. ఈ ఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


