breaking news
Raghunathpally
-
‘మమ్మల్ని చూసేవారెవరు?’.. వృద్ధ దంపతుల చివరి నిర్ణయం!
తెలంగాణ: జీవన గమనంలో వారు అలిసిపోయారు...ఒకరికొకరుగా జీవించి ఇక తమ వల్ల కాదంటూ లోకం విడిచి వెళ్లారు. వృద్ధాప్య సమస్యలు, చివరి దశలో చూసే వారు లేక ప్రాణాలు తీసుకున్నారు. ఏళ్లుగా కలిసున్న వారు చావునూ కలిసే స్వాగతించారు...ఈ వయసులో తమను పట్టించుకునే వారెవరు... సాయం చేసే వారు లేరనుకున్నారో ఏమో.... పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.వృద్ధ దంపతుల మరణంతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గబ్బెట గ్రామానికి గైని పుల్లయ్య (86) గైని లక్ష్మి (81) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కొడుకులు సత్యనారాయణ, శ్రీనివాస్, అశోక్, ఇద్దరు కూతుళ్లు లలిత, మంజుల ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ముగ్గురు కొడుకులు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. దీంతో వారి భార్యలు, పిల్లలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్, హనుమకొండకు వలస వెళ్లారు.ఓ కూతురు నెల్లుట్ల, మరో కూతురు స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉంటున్నారు. పుల్లయ్య, లక్ష్మి సొంత గ్రామంలోనే నివసిస్తున్నారు. వీరికి పింఛన్ ఒకటే ఆదాయం. అప్పుడప్పుడు కోడళ్లు, కూతుళ్లు, వారి పిల్లలు వచ్చి వెళ్తుంటారు. వయసు భారం, అనారోగ్య సమస్యలతో వృద్ధులిద్దరూ కొంత కాలంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, ఈ క్రమంలో గురువారం ఉదయం తెల్లవారినా ఇంటి తలుపులు తీయలేదు. పాల ప్యాకెట్ ఇచ్చేందుకు వచి్చన వ్యక్తి అనుమానంతో లోపల చూశాడు.ఇద్దరు మంచంపై పడి ఉండడంతో చుట్టు పక్కల వారిని పిలిచాడు. విషం తాగారని గుర్తించారు. అప్పటికే పుల్లయ్య మరణించగా, కొనఊపిరితో ఉన్న లక్ష్మీని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అక్కడ మృతి చెందింది. పుల్లయ్య మృతదేహానికి జనగామలో, లక్ష్మి మృతదేహానికి వరంగల్‌లో పోస్టుమార్టం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. కుమార్తె లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: వనస్థలిపురంలో షాకింగ్ ఘటన.. పాల వ్యాపారి దారుణ హత్య! -
మాస్కు ధరించలేదని చిన్నారులతో..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేటలో మాస్క్‌లు లేని చిన్నారులతో ఓ పంచాయతీ కార్యదర్శి రహదారిపై కప్పగంతులు వేయించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరంగారెడ్డి మంగళవారం గ్రామంలో పర్యటిస్తూ మాస్క్‌లు ధరించని ఇద్దరికి జరిమానా వేశారు. ఆ తర్వాత పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మాస్క్ లేకుండా కనిపించగా.. వారిని కప్పగంతులు వేయాలని ఆదేశించారు. దీంతో చిన్నారులు మోకాళ్లపై కొద్దిదూరం కప్పగంతులు వేయగా, స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై శ్రీరంగారెడ్డి మాట్లాడుతూ కరోనాపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు కప్పగంతులు వేయించానే తప్ప మరే ఉద్దేశం లేదని తెలిపారు. ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ .. బాధితుల్లో ఐదు నెలల బాబు స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని అక్కపెల్లిగూడెంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఇప్పగూడెం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక తెలిపారు. పీహెచ్‌సీకి వచ్చిన కుటుంబ సభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. కాగా, బాధితుల్లో ఐదు నెలల వయసు కలిగిన బాబు కూడా ఉన్నాడని తెలిపారు. చదవండి: ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ? -
ప్రభుత్వానిది నక్సల్స్ ఎజెండే: పేర్వారం
రఘునాథపల్లి: దళితులకు భూమి, యువతకు ఉపాధిలాంటి ఎన్నో హామీలను నెరవేరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. నక్సల్స్ ఎజెండాలా ముందుకు పోతున్నదని రిటైర్డ్ డీజీపీ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు అన్నారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. దళితులకు భూ పంపిణీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల దుర్బర దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నందున నక్సల్సై ఎజెండా.. ప్రభుత్వ ఎజెండా ఒక్కటిలా ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపకాలు పూర్తి కాలేదని, ఒక్కొక్కరు మూడు నాలుగు శాఖలు నిర్వహిస్తూ ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయాల్సి వస్తుందన్నారు. సంక్రాంతి వరకు పాలన గాడిలో పడుతుందని తెలిపారు.


