కాంగ్రెస్‌కు షాక్‌.. కారెక్కిన మాజీ ఎమ్మెల్యే | Congress Senior Leader Arepally Mohan Join In TRS | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌.. కారెక్కిన మాజీ ఎమ్మెల్యే

Mar 17 2019 3:50 PM | Updated on Mar 17 2019 7:55 PM

Congress Senior Leader Arepally Mohan Join In TRS - Sakshi

సాక్షి, కరీంనగర్‌: లోక్‌సభ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టిషాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం కరీంనగర్‌లో పూరించనున్న విషయం తెలిసిందే. స్థానిక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలక నేతలను ఆకర్షింకుచేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ‍ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను రంగంలోకి దింపారు.

రెండు రోజుల కిందటే టీఆర్‌ఎస్‌ స్థానిక నేతలతో చర్చించిన మోహన్‌.. ఆదివారం కేటీఆర్‌తో సమావేశమై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ముందు సీనియర్‌ నేత పార్టీని వీడడం.. కాంగ్రెస్‌ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎస్సీ రిజర్వ్‌ స్థానమైన మానకొండూర్‌ నుంచి 2009లో అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన రెండుసార్లు ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేతిలో ఓటమి చెందారు. 

Advertisement
 
Advertisement
Advertisement