ఎమ్మార్వో సజీవ దహనంపై రేవంత్‌ ట్వీట్‌ | Abdullapurmet Tahsildar murder Case: Revanth Reddy Tweet | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో సజీవ దహనంపై రేవంత్‌ ట్వీట్‌

Nov 4 2019 4:29 PM | Updated on Nov 4 2019 5:47 PM

Abdullapurmet Tahsildar murder Case: Revanth Reddy Tweet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విధుల్లో ఉన్న తహశీల్దార్‌ను పట్టపగలు ఓ వ్యక్తి సజీవ దహనం చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న విజయారెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్ అనే వ్యక్తి, అనంతరం అతను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడన్నీఈ ప్రమాదంలో ఎమ్మార్వో మృతి చెందగా.. నిందితుడు ప్రస్తుతం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అధికారిక ట్విటర్‌లో స్పందించిన ఆయన.. తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.

చదవండి : తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు

చదవండి : తహశీల్దార్‌ సజీవ దహనం; అసలేం జరిగింది?

Advertisement
 
Advertisement
Advertisement