దారుణం; తహశీల్దార్‌ సజీవ దహనం | Abdullapurmet Tahsildar Vijaya Reddy Murder By Kerosene Attack | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండగుడు

Nov 4 2019 2:44 PM | Updated on Nov 24 2020 3:31 PM

Abdullapurmet Tahsildar Vijaya Reddy Murder By Kerosene Attack - Sakshi

సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.  ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

నిందితులపై కఠిన చర్యలు..
తహశీల్దార్‌ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement