అమ్మకు మొదటి మ్యాచ్ | sachin Tendulkar first match for her mother | Sakshi
Sakshi News home page

అమ్మకు మొదటి మ్యాచ్

Nov 14 2013 1:33 AM | Updated on Sep 2 2017 12:34 AM

అమ్మకు మొదటి మ్యాచ్

అమ్మకు మొదటి మ్యాచ్

ప్రపంచం అంతా సచిన్ టెండూల్కర్ చివరిసారి మైదానంలో ఆడుతుండగా చూడటానికి ఆరాటపడుతుంటే... అతని తల్లి రజనీ టెండూల్కర్ మాత్రం మొదటిసారి తన కుమారుడు ఆడే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడబోతున్నారు.

ముంబై: ప్రపంచం అంతా సచిన్ టెండూల్కర్ చివరిసారి మైదానంలో ఆడుతుండగా చూడటానికి ఆరాటపడుతుంటే... అతని తల్లి రజనీ టెండూల్కర్ మాత్రం మొదటిసారి తన కుమారుడు ఆడే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ప్రపంచంలో సచిన్ గురించి అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి, కావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లి చూడగల వ్యక్తి 24 సంవత్సరాల పాటు కొడుకు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడకుండా ఆగారు.
 
 అంతేకాదు... రెండు పుష్కరాలుగా ఆమె టీవీలో కూడా క్రికెట్ మ్యాచ్‌ను లైవ్‌లో చూడలేదు. ఎందుకు? దీనికి సమాధానం ఆమె దశాబ్దం క్రితమే చెప్పారు. సచిన్ ఆడుతుండగా చూస్తే ఆమె టెన్షన్‌కు లోనవుతారట. అందుకే లైవ్ కూడా చూడకుండా తర్వాతి రోజు హైలైట్స్ మాత్రం చూస్తారట. అప్పటికే ఫలితం ఏమిటో తెలిసిపోతుంది కాబట్టి టెన్షన్ పడకుండా రజనీ టెండూల్కర్ హైలైట్స్‌తో సరిపెట్టుకుంటారు.
 

Advertisement
 
Advertisement
Advertisement