breaking news
Rajini tendulkar
-
ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చిన సచిన్
కేవలం క్రీడా ప్రేమికులే కాదు.. యావత్ ప్రపంచం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ పుస్తకం వచ్చేసింది. 'ప్లేయింగ్ ఇట్ మై వే' అనే పేరుతో సచిన్ రాసిన ఈ పుస్తకం విడుదలకు ముందే విపరీతమైన సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పుస్తకం తొలి కాపీని మాస్టర్ బ్లాస్టర్ తన తల్లి రజనీకి స్వయంగా అందించాడు. తన ఆత్మకథ తొలి కాపీని అమ్మకు ఇచ్చానని, ఆమె ముఖంలో కనిపించిన గర్వం అమూల్యమని ట్విట్టర్లో కామెంట్ కూడా పెట్టాడు. దాంతోపాటు తన తల్లికి పుస్తకం ఇస్తున్న ఫొటోను సైతం ఉంచాడు. 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి రికార్డు సృష్టించిన తర్వాత సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక టెండూల్కర్ తన పుస్తకంలో.. భారత జట్టు మాజీ కోచ్ ఛాపెల్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించడం, అది తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే. Gave the first copy of my book to my mother.Look of pride on her face was a priceless moment ! #PlayingItMyWayLaunch pic.twitter.com/tjU2bxN0sw — sachin tendulkar (@sachin_rt) November 5, 2014 -
అమ్మకు మొదటి మ్యాచ్
ముంబై: ప్రపంచం అంతా సచిన్ టెండూల్కర్ చివరిసారి మైదానంలో ఆడుతుండగా చూడటానికి ఆరాటపడుతుంటే... అతని తల్లి రజనీ టెండూల్కర్ మాత్రం మొదటిసారి తన కుమారుడు ఆడే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ప్రపంచంలో సచిన్ గురించి అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి, కావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లి చూడగల వ్యక్తి 24 సంవత్సరాల పాటు కొడుకు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడకుండా ఆగారు. అంతేకాదు... రెండు పుష్కరాలుగా ఆమె టీవీలో కూడా క్రికెట్ మ్యాచ్‌ను లైవ్‌లో చూడలేదు. ఎందుకు? దీనికి సమాధానం ఆమె దశాబ్దం క్రితమే చెప్పారు. సచిన్ ఆడుతుండగా చూస్తే ఆమె టెన్షన్‌కు లోనవుతారట. అందుకే లైవ్ కూడా చూడకుండా తర్వాతి రోజు హైలైట్స్ మాత్రం చూస్తారట. అప్పటికే ఫలితం ఏమిటో తెలిసిపోతుంది కాబట్టి టెన్షన్ పడకుండా రజనీ టెండూల్కర్ హైలైట్స్‌తో సరిపెట్టుకుంటారు.