'కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు' | Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter | Sakshi
Sakshi News home page

సిగ్గు పడాల్సింది పోయి.. బెదిరిస్తున్నారు..

Jun 20 2020 11:47 AM | Updated on Jun 20 2020 12:13 PM

Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్‌లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నారు. వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు. ప్రజలు ఛీ కొడుతున్నా!' అంటూ మండిపడ్డారు. (‘టీడీపీ మేనిఫెస్టోలాగే అంతా ఉత్తుత్తి వ్యవహారమే’)

కాగా మరో ట్వీట్‌లో.. తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి' అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (అచ్చెన్నే అప్రూవర్ అయితే వారి పరిస్థితి?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement