అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Lokesh Babu | Sakshi
Sakshi News home page

అచ్చెన్నే అప్రూవర్ అయితే వారి పరిస్థితి?

Jun 17 2020 1:05 PM | Updated on Jun 17 2020 1:36 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Lokesh Babu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ.. ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రమే. కులాలను రెచ్చగొట్టి, అహింసాగ్నిలో చలికాచుకునే చరిత్ర చంద్రబాబుదే..! బడ్జెట్లో కేటాయింపులో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం మైనార్టీలకు 116శాతం పెంపు' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు'

కాగా మరో ట్వీట్‌లో.. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్ల రూల్స్‌కు విరుద్ధంగా కొనుగోలు చేస్తామని చెప్పారంట. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్‌సైడ్‌ స్టోరీలు బయటపెట్టారంట. వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో? అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘లోకేశ్‌ను మాలోకం అనేది అందుకే’

Advertisement
 
Advertisement
Advertisement