'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు' | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Atchannaidu Kinjarapu | Sakshi
Sakshi News home page

కార్మికుల ఉసురు తీశారు

Jun 14 2020 11:01 AM | Updated on Jun 14 2020 11:01 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Atchannaidu Kinjarapu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'ఒక చిన్న రాష్ట్రం సీఎంగా ఉండి కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్, 8 ప్రాంతీయ పార్టీలకు బాబు గారు వేల కోట్ల ఫండింగ్ చేసారు. అంత డబ్బు ఈయనకు ఎక్కడి నుంచి వచ్చిందని అప్పట్లో జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బాబు గారి అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా మోదీ, అమిత్ షా గార్లకు తెలుసంటూ' విమర్శనాస్త్రాలు సంధించారు.

కాగా మరో ట్వీట్‌లో.. 'వాళ్లంతా 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులు. ఈఎస్‌ఐ సభ్యత్వం కింద నెలకు రూ.50-70 చెల్లిస్తారు. అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటి. 900 కోట్ల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారు' అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చదవండి: టీడీపీ వ్యూహం.. అట్టర్‌ ఫ్లాప్‌

Advertisement
 
Advertisement
Advertisement