విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు దుర్మరణం | two farmers died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు దుర్మరణం

Feb 11 2016 9:10 AM | Updated on Sep 28 2018 3:41 PM

గుంటూరు జిల్లా రెంట చింతల మండలం పాతపాల్వాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

రెంటచింతల: గుంటూరు జిల్లా రెంట చింతల మండలం పాతపాల్వాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం బోరుకు విద్యుత్ వైర్లు బిగిస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. పాతపాల్వాయి గ్రామానికి చెందిన మందలపు శ్రీనివాసరెడ్డి(42), మందలపు వెంకటరెడ్డి(40) అనే రైతులు ఇద్దరూ అన్నదమ్ములు. వీరు కొత్తగా తవ్విన బోరుకు కరెంట్ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ వైరు లాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వైర్లు తగిలి షాక్ కొట్టడంతో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కొర్రపాటి కాశి అనే మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108లో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ భార్యా పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement