జగన్నాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం | The worst road accident in Poduru | Sakshi
Sakshi News home page

జగన్నాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Mar 28 2018 9:06 AM | Updated on Aug 30 2018 4:20 PM

The worst road accident in Poduru - Sakshi

మృతదేహాలను పరిశీలిస్తోన్న పోలీసులు, స్థానికులు

సాక్షి, పోడూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.

మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండిత విల్లూరుకు చెందిన ఆటోడ్రైవర్‌ డి. వెంకటేశ్వరరావు(40), కృష్ణా జిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు మృతిచెందినట్టుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement
 
Advertisement
Advertisement