స్కాం ఎఫెక్ట్‌: మార్కెట్ల పతనం | Sensex tanks 287 points | Sakshi
Sakshi News home page

స్కాం ఎఫెక్ట్‌: మార్కెట్ల పతనం

Feb 16 2018 3:42 PM | Updated on Jul 11 2019 8:55 PM

 Sensex tanks 287 points - Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు  అనూహ్యంగా భారీ నష్టాల్లో ముగిశాయి.   ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు పీఎన్‌బీ మెగా స్కాం సెగ తగిలింది. దీంతో ఫైనాన్షియల్‌ సంస్థలు,బ్యాంకింగ్‌ షేర్లలో  సెల్లింగ్‌  ప్రెజర్‌ నెలకొంది. అలాగే మెటల్‌, ఆటో రంగాల నష్టాలు మార్కెట్లను  ప్రభావితం చేశాయి. ఒక్క ఐటీ,పార్మ తప్ప అన్ని సెక్టార్లలో నష్టాలే. దీంతో  ఒక దశలో  సెన్సెక్స్‌ 330పాయింట్లు పతనమై 34వేల  దిగువకు చేరింది.  చివరకు వారాంతంలో సెన్సెక్స్‌ 287పాయింట్ల పతనంతో 34, 010వద్ద, నిఫ్టీ 93 93 పాయింట్ల నష్టంతో 10452 వద్ద ముగిసింది.

ఎస్‌బీఐ, పీఎన్‌బీ,బీఓబీ, కెనరా బ్యాంకు, ఆంధ్రా, ఐసీఐసీఐ,యస్‌బ్యాంక్‌తోపాటు  ఐషర్‌, ఐబీ హౌసింగ్‌, వేదాంతా, భారతీ, మారుతీ, టాటా స్టీల్‌, మదరన్‌ సుమీ భారీగా నష్టపోయాయి.  అంబుజా, కొటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మైండ్‌ ట్రీ  స్వల్పంగా లాభపడ్డాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement