శ్రీవారి ఆలయంలో తిరుప్పావై పఠనం ప్రారంభం | tiruppavai parayanam in tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో తిరుప్పావై పఠనం ప్రారంభం

Dec 17 2017 8:12 AM | Updated on Dec 17 2017 8:12 AM

సాక్షి, తిరుమల : ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వేకువజామున సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదించారు. ధనుర్మాస ఘడియలు శనివారం ఉదయం 11.13 గంటలకు ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఘడియలు 2018 జనవరి 14వ తేదీన ముగియనున్నాయి. తిరుప్పావై పఠనం ఏకాంతంగా జరుగుతుంది. ధనుర్మాసంలో భోగశ్రీనివాసమూర్తులకు బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement