sports
-
కోట్ల మంది హృదయాలను కదిలించిన డెలివరీ బాయ్
-
ఇంటికెళ్లి విజిల్ వేసుకోండి.. ఇషాన్ కిషన్ మాస్ ర్యాగింగ్
-
గురువుకు తగ్గ శిష్యుడు... సంజు కళ్ళు చెదిరే స్టంపింగ్
-
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
-
సంతలో సరుకులా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు..
-
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ టాప్
-
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
-
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
-
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
-
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
-
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
-
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
-
చితక్కొట్టిన సన్ రైజర్స్
-
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
-
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
-
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
-
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
-
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
-
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
-
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలు, కొత్త నిబంధనలను కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తాయి. ఆన్లైన్ మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ.. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహించడం ఈ చట్టం ఉద్దేశం. చట్ట ప్రకారం ఇప్పటికే నిషేధించిన రియల్ మనీ గేమ్స్ కాకుండా చాలా వరకు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు.కేవలం నిర్ధిష్ట కేసుల్లోనే పర్యవేక్షణ ఉంటుందన్నారు. చట్టం కింద ఈస్పోర్ట్స్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘వీలున్నంత వరకు నియంత్రణలను సులభతరంగా ఉంచాలన్నదే మా ఉద్దేశం. మనీ గేమ్స్ కాని చాలా వరకు గేమ్స్ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఆన్లైన్ మనీ గేమ్ లేదా ఆన్లైన్ సోషల్ గేమ్ లేదా ఈస్పోర్ట్స్‌లో ఏదన్నది నిర్ధారించుకోవాలంటూ ఎవరినీ బలవంతం చేయడం లేదు’’అని కృష్ణన్ పేర్కొన్నారు. కొత్త నిబంధనల్లో యూజర్ల భద్రతా సదుపాయాలను సైతం నిర్వచించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: టిమ్ కుక్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు -
పిచ్చి కూతలు కూసారు.. పిక్చర్ చూపించాడు.. తెలుగోడి విశ్వరూపం
-
నిమ్మకాయలకు వికెట్లు IPLలో బ్లాక్ మ్యాజిక్
-
ఎవ్వడిని వదల్లేదు, RCB పొగరు దింపిన మిల్లర్
-
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
-
టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది
-
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
-
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
-
నొప్పితో అల్లాడిపోయిన పంత్.. హాజెల్‌వుడ్ దెబ్బకి కన్నీళ్లు
-
టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు
-
ఆయా షేర్.. SRH ఊపిరి పీల్చుకో.. పాట్ కమ్మిన్స్ తిరిగివస్తునాడు ..
-
వైభవ్ సూర్యవంశీ 'గోల్డెన్ డక్'.. కావ్యపాప కాంతార సెలబ్రేషన్స్
-
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
-
హీరో నుంచి జీరో, బొక్క బోర్ల పడ్డ బుడోడు....
-
అదరగొట్టిన SRH వైభవ్ డకౌట్...
-
లైట్ బ్రో.. చర్చల వేళ ట్రంప్ ఆటవిడుపు
పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో నిన్న (శనివారం) అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచం అంతా ఈ భేటీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే ఉద్విగ్న సమయాలలో యుద్ధానికి కారణమైన ట్రంప్ మాత్రం ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరించాడట.. తనకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఆ సమయంలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు వెళ్లారట.ఇరాన్- అమెరికా మధ్య నిన్న జరిగిన శాంతి చర్చలు ఏలాంటి పురోగతి లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా డిమాండ్లకు ఇరాన్ తలొగ్గకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అయితే చర్చల ఫలితం ఏముంటుందా అని ప్రపంచ దేశాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూశాయి. అయితే అంత కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎంతో కూల్‌గా ఉన్నారట. అతనికి ఏమి పట్టనట్లు ఒక క్రీడా కార్యక్రమానికి వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.మాయామిలోని ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు ట్రంప్‌తో తన కుటుంబంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో, భారత్‌లోని అమెరికా రాయభారి సెర్గియో గోర్, ఇతర అధికారులతో కలిసి గంటల సమయం గడిపారు. అధికారులు చర్చల వివరాలు తెలియజేయడానికి వచ్చినప్పటికీ ట్రంప్ పెద్దగా పట్టించుకోకుండా గేమ్ ఎంజాయ్ చేశారని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్‌కు ఫోన్ చూపిస్తూ ఏదో చెప్పినప్పటికీ ఆయన ముఖంలో ఏలాంటి భావాలు లేవని తెలిపారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విజేతలను అభినందించారని వారితో కలిసి గడిపారని కథనాలు పేర్కొన్నాయి.. అయితే గతంలోనూ ఈ చర్చలు గురించి తాను పట్టించుకోనని ఇరాన్ సైనికంగా ఎప్పుడో ఓడిపోయిందని అన్నారు. కాగా అమెరికాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చర్చలు జరుగుతున్నప్పుడు అధ్యక్షుడు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్‌కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్‌గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్‌పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్‌లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్‌లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్‌తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్‌లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్‌లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్‌పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్‌ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్‌లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్‌లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్‌ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్‌లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్‌లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్‌లాండ్‌కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్‌పూర్‌లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్‌లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. -
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
-
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
-
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
-
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
-
హోమ్ గ్రౌండ్ లో 200 కూడా కాపాడలేకపోయిన రుతురాజ్!
-
ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ
మన దేశంలోని గ్రామీణ, అటవీ ప్రాంత బాలలు ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. వాళ్లంతా రకరకాలుగా ఆడుకునే ప్రయత్నం చేస్తారు. నేలపై గీతలు గీయడం, కొన్ని ఆకారాలతో ఆట స్థలాలను సృష్టించడం, ఎండిన పండ్ల గింజలను పాచికలుగా – పావులుగా వాడటం వంటివి చేస్తుంటారు. ఎండిన ఆకులు, చింకిపాత లతో బంతులు చేస్తారు. వెదురు బొంగులతో హాకీ, ఫుట్‌బాల్ గోల్‌పోస్టులను తయారు చేస్తారు. చాలామంది బూట్లు లేదా జెర్సీలతో నిమిత్తం లేకుండా ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు. చెరువులు, సరస్సులలో ఈదులాడుతూ ఆనందిస్తారు. ఒడిషాలోని జాజ్‌పూర్ వాస్తవ్యురా లైన 15 ఏళ్ల అంజలి ముండా ఇదే తరహాలో తనకు అందుబాటులో గల వనరులు, శిక్షణతో ఈతలో తన ప్రతిభకు సానబెట్టుకుని, ‘ఖేలో ఇండియా తొలి గిరిజన క్రీడలు–2026’లో తొలిరోజునే 3 స్వర్ణ పత కాలను కైవసం చేసుకుని యువతలో ఎనలేని స్ఫూర్తి నింపింది.ఏకలవ్యుడి వారసత్వంగిరిజనులకు విలువిద్యపై సహజంగా మక్కువ. సంథాల్ సమాజం తమపై దోపిడీని ఎదిరిస్తూ 1855లో బ్రిటిష్ పాలకులపై సాగించిన భీకర పోరాటం ‘సంథాల్ హూల్’ (తిరుగుబాటు)గా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. బ్రిటిష్ దళాలు ఆధునిక ఆయుధాలతో ఆ తిరుగుబాటును అణచివేసినప్పటికీ, సంథాల్ యోధుల యుద్ధ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా గ్రంథస్థం చేశారు. నేను జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అక్కడి ‘ఊరి –మారి’ గ్రామంలోగల ‘సంథాల్ హూల్’ వీరులు, అమర సోదరు లైన సిధో–కన్హు, చండ్–భైరవ్ సహా శౌర్యశీలురైన సోదరీమణులు ఫూలో–ఝానోల విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కింది. అసమాన విలుకాడిగా పూజలందుకునే ఏకలవ్యుని ఖ్యాతిఎంతటిదో భారతదేశంలోని ఏ బిడ్డను అడిగినా గొప్పగా వర్ణిస్తాడు. ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా గిరిజనులకు ఏకలవ్యుడు స్ఫూర్తి ప్రదాత మాత్రమేగాక విలువిద్యలో ఆదర్శప్రాయుడు. ఆయన వార సత్వానికి అనుగుణంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లోని ‘క్రీడా నైపుణ్య కేంద్రాలు’ బాలలకు ఆధునిక క్రీడా సౌకర్యాలు, విధా నాలను చేరువ చేస్తున్నాయి. నా వంతు కృషి ఫలితంగా మా స్వగ్రామంలోనూ నిరుపేద బాలల కోసం ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటైంది. మరికొంత ప్రయ త్నంతో ఆ పాఠశాల ప్రాంగణంలో విలువిద్యా శిక్షణకూ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు చిన్నచిన్న వ్యక్తిగత, సమష్టి ప్రయత్నాల ద్వారా గిరిజన బాలల్లో సహజ క్రీడా ప్రతిభ ఇనుమ డిస్తుందనడంలో సందేహం లేదు.క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధమా గ్రామంలోని ఇతర గిరిజన బాలల తరహాలోనే నేను కూడా చిన్నతనంలో ఈత కొట్టడం సహా ఇతర కసరత్తులు, క్రీడలపై ఆసక్తి చూపేదాన్ని. మా పాఠశాల క్రీడా పోటీలలో తరచూ ప్రథమ స్థానంలో నిలవడం నాకు పరిపాటి. అలాంటి ఓ పోటీ సందర్భంగా నా నేస్తానికి ప్రథమ బహుమతి ఆనందానుభూతినిచ్చే ఉద్దేశంతో నేను కావాలనే వెనుకబడటం ఓ మధుర జ్ఞాపకం. క్రీడలు బాలల్లో జట్టు స్ఫూర్తిని పెంచి, బలమైన సామాజిక స్నేహానుబంధాలకు తోడ్పడతాయి. మైదానంలో తీవ్రంగా పోటీపడే క్రీడాకారుల నడుమ సాధారణంగా స్నేహబంధం పటిష్ఠంగా ఉంటుందన్నది వాస్తవం.మా సోదరుడు ఫుట్‌బాల్ చక్కగా ఆడేవాడు కానీ తీవ్ర గాయంతో ఆటలో కొనసాగలేకపోయాడు. మా కుటుంబ సభ్యు లందరూ వివిధ క్రీడలలో రాణించినవారే. గిరిజన కుటుంబాలకు ఉజ్వల క్రీడా సంప్రదాయం సహజాతమని చెప్పడానికే నా వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నాను. వారి జీవితాల్లో క్రీడలు ఒక వినోదంగా, సామాజిక కార్యకలాపాల సాధనంగా మాత్రమే మిగిలి పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కొన్ని క్రీడా సంస్థల సహకారంతో శ్రీకారం చుట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం నలు దిశలా నిబిడీకృతమైన ప్రతిభను విశేషంగా వెలుగులోకి తెస్తోంది.మన దేశంలో కొన్నేళ్ల కిందటి దాకా కేవలం పెద్ద నగరాల్లోనే ఉత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉండేవి. గిరిజన ప్రాంతాల్లో క్రీడల అకాడమీలు, శిక్షణ సౌకర్యాలు లభ్యమయ్యేవి కావు. కానీ, ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో బాలలకు క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం నుంచి ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ వంటి అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.ఖేలో ఇండియా!నా విద్యార్థి దశలో– అయిదారు గ్రామాల క్రీడా ఔత్సాహికులు ఏకమై, గ్రామీణులను సమీకరించి పోటీలు నిర్వహించడం నాకింకా గుర్తుంది. అలాగే, కొన్ని ఆధ్యాత్మిక–సాంస్కృతిక సంస్థలు కూడా గిరిజన ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ, అలాంటి పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు గ్రామీణ స్థాయిని దాటి ఎదగలేకపోయేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా కొన్నేళ్ల నుంచీ ప్రశంసనీయ కృషి సాగుతోంది. ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ అలాంటి చర్యలకు మరింత ఉత్తేజమిచ్చాయి. భారత్ తన క్రీడాకారుల సహజ ప్రతిభ వల్లనే 1928 ఒలింపిక్ క్రీడల్లో తొలి హాకీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి ఘన విజయంలో కీలక పాత్రధారులు గిరిజన క్రీడాకారులే. అప్పటి నుంచీ దిలీప్ టిర్కీ, సుబోధ్ లక్రా, సలీమా టెటే వంటి క్రీడాకారులు భారత కీర్తికిరీటంలో మణిమాణిక్యాలై హాకీ క్రీడకే వన్నెతెచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం ‘ఖేలో ఇండియా’ కింద స్థానికం నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని భౌగోళిక ప్రాంతాలు, సామాజిక వర్గాలు, సంస్థలకు తగిన క్రీడావరణం కల్పించేందుకు కృషి కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ‘అస్మిత’ పథకం అమలవుతోంది. దీనిద్వారా మన గిరి పుత్రికల సామర్థ్యం ఇనుమడించడమే కాకుండా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ ఇచ్చిన ఉత్తేజాన్ని నిరంతరం బలోపేతం చేయాలి. తదనుగుణంగా గిరిజన క్రీడాకారులను స్థిరంగా ప్రోత్సహిస్తే మన దేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలబెట్టగల క్రీడాకారుల సమూహం రూపొందుతుంది.‘బస్తర్, సుర్గుజా ఒలింపిక్స్’లో ఏడు లక్షల మందికిపైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్సలిజాన్ని వీడి, క్రీడలనే సానుకూల మార్గంగా ఎంచుకున్న యువతరం కూడా వారిలో ఉన్నారు. గిరిజన వర్గాలు సహా మన యువతరం క్రీడాప్రతిభ, దేశానికి అమూల్య సామాజిక మూలధనం. ఈ వెలలేని వనరును సద్వినియోగం చేసుకోవడం ద్వారా జాతీయ క్రీడా రంగం ఎన్నో అద్భుత ప్రమాణాలను నెల కొల్పగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ‘ఖేలో ఇండియా! ఖూబ్ ఖేలోఇండియా!’ అంటూ నా వంతుగా నినదిస్తున్నాను.ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి(మార్చి 25న ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలి ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ నేటితో ముగియనున్నాయి.) -
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
-
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
-
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
-
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
-
ఎంతో కొంత కళా పోషణ ఉండాలి
గన్ ఫౌండ్రీ (హైదరాబాద్): మనిషన్నాక ఎంతో కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చాలామంది ప్రజా ప్రతినిధులు తమలో ఉన్న ప్రతిభను మర్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించే వారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేదన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలను కొందరు రాజకీయం చేసి బహిష్కరించారని, కనీసం వచ్చే సంవత్సరమైనా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్తూ.. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు శాసన సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. విజేతలు వీరే.. : క్రికెట్లో మంత్రి శ్రీహరి జట్టు విజయం సాధించగా.. బ్యాడ్మింటన్‌లో రాందాస్ నాయక్, ఆదినారాయణ జోడి విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. పవర్ లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో శంకర్ నాయక్, 93 కేజీల విభాగంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, 105 కేజీల విభాగంలో అనిరుధ్ రెడ్డి విజయం సాధించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శాసనసభ్యుల కోసం రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. దుర్యోధనుడి వేషధారణలో మంత్రి వాకిటి శ్రీహరి పలికిన డైలాగులు, గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టప్ప పాత్రలో శంకర్ నాయక్ ఒదిగిపోగా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గిరిజన పాటలకు హుషారుగా డ్యాన్స్ చేయగా.. రామచంద్రనాయక్ తనదైన స్టెప్పులు వేశారు. -
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
-
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
-
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.నివేదికలోని ముఖ్యాంశాలుక్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.టీమ్, లీగ్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.ఎదురులేని రారాజు క్రికెట్భారత మార్కెట్లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
-
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
-
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
-
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
-
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్‌లో హార్ట్ టచింగ్ మూమెంట్
-
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
-
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
-
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
-
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
-
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
-
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
-
గెలవాలంటే ఆ మ్యాచ్ విన్నర్ ని దింపాల్సిందే.. ఒక్కడు చాలు...
-
సెమీస్‌కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు
-
సంజూ తలరాత మార్చేసిన మ్యాచ్ ఇది... ఇంగ్లాండ్‌కి అంత సీన్ లేదు.. కానీ..!
-
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
-
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
-
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
-
పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం లోకేష్ క్రికెట్ మ్యాచ్ ఖర్చు కోటి పైనే
-
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
-
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
-
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
-
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
-
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
-
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
-
‘క్రీడా’ బడ్జెట్ 2026: కీలక అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 4479.88 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3346.54 కోట్లు నిధులివ్వగా తాజా బడ్జెట్లో రూ.1133.34 కోట్ల మేర హెచ్చింపు చేశారు.దేశ వ్యాప్తంగా క్రీడా కేంద్రాల నిర్వహణ, శిబిరాలు ఏర్పాటు చేసే భారత స్పోర్ట్స్ అథారిటీకి రూ. 917.38 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.880 కోట్లు ఇవ్వగా కాస్త పెంచారు. అయితే డోప్ పరీక్షల ల్యాబోరేటరీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) నిధుల్లో కోత పెట్టారు. డోపింగ్ టెస్టులకు క్రితం ఏడాది రూ.28.55 కోట్లు ఇస్తే... ప్రస్తుతం రూ.23 కోట్లకు కుదించారు. జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీకి గతంలో రూ. 78.64 కోట్లు విదిల్చిన ఆర్థిక మంత్రి తాజాగా రూ.46.98 కోట్లే కేటాయించారు.ఇక 1998లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను రూ. 28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్ని రూ. 400 కోట్ల నుంచి 425 కోట్లకు హెచ్చింపు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఖేలో ఇండియా’కు రూ.924.35 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 1000 కోట్లు నిధులివ్వగా... కేవలం రూ.700 కోట్లే వెచ్చించడంతో ఇప్పుడు దానిని తగ్గించారు. -
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
-
Vaibhav : 15వ బర్త్‌డే లోపు భారత్‌కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
-
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
-
ముందుగా వ్యవస్థను మార్చండి!
న్యూఢిల్లీ: క్రీడల్లో విజేతల్ని చూడాలంటే ఇప్పుడున్న క్రీడా వ్యవస్థని సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ సూచించింది. మాజీ ఒలింపిక్ చాంపియన్ అభినవ్ బింద్రా నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్ మంగళవారం క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తుది నివేదికను సమర్పించింది. 170 పేజీల నివేదికలో పలు కీలకమైన సిఫార్సులతో పాటు వేళ్లూనుకుపోయిన వ్యవస్థీకృత లోటుపాట్లను టాస్క్‌ఫోర్స్ ఎండగట్టింది. రాష్ట్ర క్రీడా సంఘాలు, జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లన్నీ సంస్థాగత లోపాలతో మునిగిపోయాయని, క్రీడా పరిపాలకుల్లో సరైన అథ్లెట్లే లేరని టాస్‌్కఫోర్స్ ఎత్తి చూపింది. ఉన్నా ఒకరిద్దరిలో అర్హతలు, సమర్థత లేనివారేనని గుర్తించింది. ప్రస్తుత క్రీడా వ్యవస్థపై టాస్క్‌ఫోర్స్ లోతుగా అధ్యయనం చేసింది. ఏదో అరకొరగా, ఒకరిద్దరితో తమ భేటీని ముగించలేదని... అథ్లెట్లు, ప్రభుత్వ అధికారులు, ‘సాయ్’ వర్గాలు, రాష్ట్ర, కేంద్ర క్రీడా సంఘాలు, సమాఖ్యలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థలతోనూ టాస్‌్కఫోర్స్ చర్చించింది. అంతర్జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ప్యానెల్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మాజీ అధ్యక్షుడు థామస్ బాచ్ (మాజీ ఒలింపిక్ ఫెన్సింగ్ చాంపియన్), ప్రస్తుత అధ్యక్షుడు కిర్స్టీ కొవెంట్రీ (మాజీ ఒలింపిక్ చాంపియన్), ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) చీఫ్ సెబాస్టియన్ కొ (మాజీ ఒలింపిక్ మిడిల్డిస్టెన్స్ రన్నింగ్ చాంపియన్)లతో చర్చించింది. » రాష్ట్ర సంఘాలు, జాతీయ సమాఖ్యలు, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి, ముఖ్యంగా క్రీడా శిక్షణకు, క్రీడా పరిపాలన నియంత్రణకు జాతీయ స్థాయిలో సమన్వయ మండలి అవసరమని బింద్రా కమిటీ సూచించింది. ఇందుకోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జాతీయ క్రీడా శిక్షణ–సమర్థ నిర్వహణ మండలి (ఎన్‌సీఎస్‌ఈసీబీ) ఏర్పాటు చేయాలని అందులో పేర్కొంది. » ప్రస్తుత క్రీడా పాలనలో గుణాత్మక మార్పు రావాలని, సుప్తావస్థని రూపుమాపేలా కొన్ని కఠినమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సిఫార్సుల్ని బింద్రా టాస్‌్కఫోర్స్ సూచించింది. » ‘సాయ్’కి గానీ, రాష్ట్ర క్రీడాశాఖల్లో గానీ నిబద్ధత, సమర్థత కలిగిన కార్యాలయ సిబ్బందే లేదు. సాధారణ అధికారులు లేదంటే కాంట్రాక్టు సిబ్బందితో ఆయా పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఇది తూతూ మంత్రంగా పనులు చక్కబెడుతోంది. తద్వారా పాలక వ్యవస్థనే నీరుగారుస్తోంది. » క్రీడా పాలనలో అథ్లెట్లకు సరైన మార్గ నిర్దేశనమే లేదు. ఉదాహరణకు జాతీయ క్రీడా పాలసీ ప్రకారం క్రీడా సమాఖ్య కార్యవర్గాల్లో అథ్లెట్లను తప్పనిసరి చేసినప్పటికీ ఆయా అథ్లెట్లు కార్యనిర్వహణలో రాణించేలా ఎలాంటి శిక్షణ వ్యవస్థ లేదు. » దేశంలో ఇప్పటికీ క్రీడాకారుల వృద్ధి కోసం దీర్ఘకాలిక అభివృద్ధి మండలిలాంటిది ఏదీ లేదు. ఇదే ఉంటే విద్య, అథ్లెట్ కెరీర్‌కు సంబంధించి సంయుక్త ప్రణాళిక, కెరీర్ ఓరియంటేషన్ కార్యక్రమం సరైన మార్గంలో సాగేది. -
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
-
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
-
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
-
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
-
హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్.. ఛాంపియన్‌గా 'క్రెడికాన్ మావెరిక్స్'
హైదరాబాద్: హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (HPL) తొలి సీజన్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని 'ది లీగ్' వేదికగా జరిగిన తుది పోరులో క్రెడికాన్ మావెరిక్స్(Credicon Mavericks) జట్టు అఖండ విజయం సాధించి, తొలి సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆల్ స్టార్స్ జట్టుతో జరిగిన ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. పోరు హోరాహోరీగా సాగి, ఏడో సెట్ అయిన నిర్ణయాత్మక టై-బ్రేకర్ వరకు వెళ్ళింది. అక్కడ మావెరిక్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి, 4–3 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంతో హెచ్పీఎల్ చరిత్రలో తొలి టైటిల్ విజేతలుగా క్రెడికాన్ మావెరిక్స్ జట్టు తమ పేరును లిఖించుకుంది.సుమారు 2,000 మంది పికిల్‌బాల్ క్రీడాభిమానులు ఈ అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారు. ఇది హైదరాబాద్‌లో పికిల్‌బాల్ క్రీడపై పెరుగుతున్న ఆసక్తిని, ఈ లీగ్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందుతుందో తెలియజేస్తుంది. విజేతగా నిలిచిన క్రెడికాన్ మావెరిక్స్ జట్టు ట్రోఫీతో పాటు రూ. 6 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఆల్ స్టార్స్ జట్టు తమ అద్భుత ప్రదర్శన తర్వాత రూ. 3 లక్షల నగదు బహుమతిని అందుకుంది.చివరి రాత్రి క్రీడ, వినోదం కలగలిసి సాగింది. మ్యాచ్ మధ్యలో ప్రముఖ గాయకుడు లక్కీ అలీ, అతని బృందం ప్రదర్శించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తొలి సీజన్ విజయవంతంపై స్పందిస్తూ, సెంటర్ కోర్ట్ స్పోర్ట్ & ఎంటర్టైన్మెంట్, హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ కో ఫౌండర్ యశ్వంత్ బియ్యాల మాట్లాడుతూ.. "ఈ ఫైనల్స్, హెచ్పీఎల్ ముఖ్య లక్షణాలైన.. ఉత్కంఠ, సామాజిక అనుబంధం, వినోదం అన్నింటినీ బలంగా చూపించింది" అని అన్నారు. ఆల్ స్టార్స్ జట్టుకు చెందిన సమీర్ వర్మ 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' అవార్డును గెలుచుకున్నారు. -
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ భారీ స్కోర్
-
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ 'ఆట' మొదలైంది!
సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ జానర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్ వేయండి.క్రికెట్... కబడ్డీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్ పాత్ర ఏ విధంగా కనెక్ట్ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ (బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.బైకర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్ సినిమా చూసిన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్’ సినిమా టీమ్ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ ‘బైకర్’. ఈ చిత్రంలో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తనను తాను కొత్తగా మలచుకున్నారు.వెండితెరపై పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్నెస్ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్ పీరియడ్‌లో ‘బైకర్’ సినిమా ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తొలిసారి స్పోర్ట్స్ డ్రామా దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే ఓ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండకు ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ నచ్చిందట.‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్ కె. కుమార్. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యాన్లతో విజయ్ చేయాల్సిన సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ కె. కుమార్ సినిమాను విజయ్ టేకప్ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్ దేవరకొండకు విక్రమ్ కె. కుమార్ ఎలాంటి కథ చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. లబ్బరు పందు మేక్... క్రికెట్ నేపథ్యానికి లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండం విశేషం.థండర్ హీరో ఆది పినిశెట్టి ఫిట్నెస్, కటౌట్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.మట్టి కుస్తీ సీక్వెల్ విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.మండాడి తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్ గురించి మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇటు క్రికెట్... అటు లవ్ ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్ నేపథ్యంలో సాగినా, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.పతంగుల పోటీ ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన తారాగణంగా, సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్’. ఈ కామెడీ స్పోర్ట్స్ మూవీకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
-
చిరుప్రాయంలో చిగురిస్తున్న ఆలోచనలు..!
బాల్యం ఒక ఆనందాల హరివిల్లు, స్వచ్ఛతకు పొదరిల్లు.. అంతేకాకుండా అద్భుతమైన భవిష్యత్తుకు దారులు వేసే మొదటి పాఠశాల. చిరు ప్రాయంలో చిగురించిన ఆలోచనలు, ఆసక్తికర విషయాలే వారి అందమైన భవిష్యత్తుకు ప్రణాళికలను రూపొందిస్తాయి. పసి హృదయాల్లో నిలిచిపోయిన ఆలోచనలు ఆశయాలుగా పరిణామం చెంది.. వారిని అనేక రంగాల్లో రాణించేలా చేస్తాయనడానికి సాక్ష్యాలెన్నో. చిన్నతనం అంటే కేవలం చదువులే కాదు.. కళలు, క్రీడలు, సాహిత్యం ఇలా ఎన్నో అంశాలపైన ఆసక్తి పెంచుకుని ముందుకు సాగుతున్న పిల్లలెందరో. తమకు నచ్చిన అంశాల్లో రాణిస్తూనే.. ప్రముఖ వేదికలపై గుర్తింపు పొందడం.. మరి కొందరు చిన్నారులకు స్ఫూర్తిగా నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. బాలల దినోత్సవం నేపథ్యంలో అలాంటి కొందరు చిన్నారులను ‘సాక్షి’ పలుకరించింది. వారిలోని జిజ్ఞాసను, అకుంటిత దీక్షను, అభ్యసనా లక్షణాలను అభినందిస్తూ.. నేటి తరానికి వారిని పరిచయం చేస్తుంది. ఆ విశేషాలు.. నాట్య మయూరి.. అభినయం చూపిన దారి.. శాస్త్రీయ నృత్యంలో తానొక నాట్య మయూరి.. అభినయంలో కూచిపూడి అందాన్ని ప్రదర్శించే అభినేత్రి ఆమే.. జూపాక తన్మయ్. తొమ్మిదో తరగతి చదువుతున్న తన్మయ్ చిన్న వయసులోనే అత్యద్భుత ప్రదర్శనలు చేస్తుంది. అయితే అందరిలా సాంస్కృతిక వేదికలపై శిక్షణతో ఇదంతా సాధ్యపడలేదంటోంది తన తల్లి జోష్న. పుట్టుకతోనే క్లెఫ్ట్ లిప్ట్ సమస్యతో పుట్టిన తన్మయ్.. అందరిలా మాట్లాడలేదు.. అనుకున్నది చెప్పలేదు. ఈ తరుణంలో ఏది చెప్పాలన్నా కనుసైగలతో, చేతులు ఊపుతూ చెబుతుంటే నాట్యం చేస్తున్నట్టే అనిపించింది.. దీంతో తనను కూచిపూడి శిక్షనలో చేరి్పంచానని జోస్న చెబుతున్నారు. అలా మొదలైన తన్మయ్ సాంస్కృతిక నృత్య ప్రయాణం తెలంగాణలో విభిన్న వేదికపై ప్రదర్శన చేసే వరకూ చేరింది. ఇందులో భాగంగా నగరంలోని రవీంద్రభారతి మొదలు తిరుపతి, ధర్మపురి, బాసర, వేములవాడ వంటి పుణ్య క్షేత్రాలతో పాటు మైసూర్ వంటి ఇతర ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు చేసింది. తన నాట్య ప్రయాణంలో ఇప్పటి వరకూ నాట్య మయూరి అవార్డుతో పాటు జాతీయ స్థాయి స్వర్ణ నంది, నాట్య ఊర్వశి అవార్డు, బాల నాట్య రత్న, శివ శూలం పురస్కారం (2021), నాట్య సరస్వతి, అన్నమయ్య కీర్తనల పాద నృత్య యాగం అవార్డు వంటివి అందుకుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కళ ఉత్సవ–2025లో పాల్గొంది. నృత్య ప్రయాణం అందించిన ఆత్మస్థైర్యంతో ప్రస్తుతం తన జన్యు వైల్యాన్ని శస్త్ర చికిత్సతో తొలగించుకుని భవిష్యత్ వైపు అడుగులు వేస్తోంది. ఇటు చదువులను, అటు కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తానని అంటోంది తన్మయ్. తన శిక్షణను బెంగళూరుకు చెందిన ప్రముఖ నృత్య శిక్షకురాలు మణిపూరి్ణమ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా నేర్చుకున్నానని చెబుతోంది. ఆర్చరీలో అద్భుతం.. ఒలింపిక్సే లక్ష్యం..! అందరిలా కాకుండా వినూత్నంగా తనదైన లక్ష్యంపై గురిపెట్టింది.. నగరానికి చెందిన అనణ్య నిమ్మల. మన వారసత్వ కళ, భవిష్యత్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఆర్చరీలో రాణిస్తోంది. నగరంలోని స్లోకా ది హైదరాబాద్ వా్రల్డాఫ్ స్కూల్లో చదువుతూ.. విలువిద్యలోనూ రాణిస్తోంది. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. గతేడాదిలో సీబీఎస్సీ టీం సౌత్ జోన్లో గోల్డ్ మెడల్, సీబీఎస్సీ టీం నేషనల్స్‌లో బ్రాంజ్ మెడల్, సీబీఎస్సీ ఇండివీడ్యువల్ సౌత్ జోన్లో 5వ స్థానంలో నిలిచి తన విల్లు ప్రతాపాన్ని చూపింది. నగరంలోని ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్లో కోచ్ గంగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. తన తదుపరి లక్ష్యం– 2028 ఒలింపిక్స్ అని గర్వంగా చెబుతోంది. ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ, క్రమశిక్షణతో మెలగడం వంటి లక్షణాలను ఆర్చరీ వల్లే నేర్చుకున్నానని చెబుతోంది.సెయిలింగ్ క్వీన్.. రమీజా భాను జాతీయ, అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో రాణిస్తూ.. ఇటు నగరానికి, అటు దేశానికి కీర్తి ప్రతిష్టతలు తీసుకొస్తోంది 14 ఏళ్ల సెయిలర్ ఎస్కే.రమీజా భాను. నగరంలోని రెయిన్బో హోంలో చదువుకుంటున్న రమీజా భాను ఇప్పటి వరకూ నేషనల్స్‌లో పలు పతకాలు సాధించి ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. గత ఏడాది నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో కోచ్ సుహీం షేక్ శిక్షణలో రాటుదేలుతోన్న రమీజా ఈ ఏడాది నేషనల్స్‌లో పలు విభాగాల్లో మెడల్స్ సాధించి ఒమన్ వేదికగా జరిగిన రెండు అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. తన ప్రతిభను గుర్తించిన భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఇటీవల రమీజా భానును ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకుని సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించే దిశగా యాచ్ క్లబ్లో శిక్షణ పొందుతున్నానని, ఎప్పటికైనా ఒలింపిక్స్ సెయిలింగ్‌లో భారత్‌కు పతకం తేవడమే తన లక్ష్యమని రమీజా చెబుతోంది. (చదవండి: చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు) -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్‌తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్‌తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్‌లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్‌తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్‌గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్‌గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ది. అయితే ఆ బ్యాట్‌ను స్మృతి సోదరుడు శ్రవణ్‌కు (జూనియర్ క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్‌తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్‌కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్‌ప్రీత్‌కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్‌తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్‌ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్‌ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్‌తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్‌స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్‌స్టార్ అయింది. క్రికెట్‌తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్‌కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్‌గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్‌గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్‌లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్‌చైర్‌లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్‌చైర్‌లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్‌చైర్‌పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్‌లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్‌గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్‌బాల్ ప్లేయర్స్‌ను పరిచయం చేశారు. -
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్‌కప్-2025 విజేతగా భారత్
-
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
-
విరాట్, రోహిత్ బలిపశువులా? టీమిండియా లో భారీ కుట్ర!
-
చీప్ ట్రీక్స్... పాక్ కి బుద్ధి చెప్పిన లేడీస్
-
Tilak : కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటతో పాక్‌ను గడగడలాడించాడు..
-
ట్రోఫీ, మెడల్స్ ని ఎత్తుకెళ్లిన మొహసిన్ నఖ్వీ..
-
ప్రధాని మోదీ ట్వీట్ పై PCB చీఫ్ మోషిన్ నఖ్వీ అక్కసు
-
వెస్ట్ ఇండీస్ టూర్ కోసం టీమిండియా స్క్వాడ్
-
తెలుగోడు ఎక్కడున్నా ఏలేస్తాడు..! తిలక్ వర్మకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఆ ఒక్క టీమ్ ని ఓడిస్తే.. అమ్మాయిలు వరల్డ్ కప్ తెచ్చేస్తారు
-
ఆసియా కప్ లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
-
టీమిండియా తస్మాత్ జాగ్రత్త!
-
గన్ సెలబ్రేషన్‌పై సిగ్గులేకుండా ఫర్హాన్ బలుపు కామెంట్స్..
-
పాక్ స్పిన్నర్ చిల్లర వేషాలు.. చావుదెబ్బ కొట్టిన హసరంగా
-
వక్ర బుద్ధి మారదా..? మరో వివాదంలో ఆసియా కప్
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
-
IND PAK మ్యాచ్ జరగదా? ఐసీసీ కీలక నిర్ణయం!
-
Team India: హ్యాండ్ షాక్ గొడవేంటి గురూ!!
-
జిత్తులమారి పాక్... దొంగ ఏడుపులు
-
తగిన శాస్త్రి జరిగింది! పాక్ సీట్ చింపిన భారత్
-
Asia Cup: గంభీర్ గుండాగిరి! ఫైర్ అయిన అయ్యర్
-
కోహ్లి ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా?
-
కాలం నను తరిమిందో సూలంలా ఎదిరిస్తా రోహిత్ మాస్
-
కెప్టెన్ అయ్యర్ గిల్ కు భారీ షాక్
-
కష్టాలనూ ఆడేసుకున్నారు
‘మాది పేదకుటుంబం అయినా, నా దగ్గర విలువైన సంపద ఉంది’ అంటూ ఉండేది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఓపీ జైషా. ‘ఆ సంపద ఏమిటి?’ అని అవతలి వ్యక్తి అడిగే లోపే... ‘కష్టం, పట్టుదల’ అని చెప్పేది జైషా. జైషా మాత్రమే కాదు...పేదరికంలో పుట్టి పెరిగిన ఎంతోమంది అమ్మాయిలు ‘కష్టం, పట్టుదల’ అనే విలువైన సంపదతో పేదరిక కష్టాలను అధిగమించారు. హాకీ నుంచి ఆర్చరీ వరకు ఎన్నో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాకాలు ఎగరేశారు.ఆకలి తట్టుకోలేక మట్టితిన్న అమ్మాయిఓపీ జైషా అయిదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చని పోయాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆకలి తట్టుకోలేక జైషా మట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయి. పొద్దుటే లేచి కిలోమీటర్ల కొద్దీ దూరాలు నడిచిపాలు అమ్మేది. ‘రేపు భోజనం ఎలా?’ అనేది జైషా కుటుంబం ముందు ఉన్న ప్రధాన సవాలు. అయినప్పటికీ ఆటలపై తన ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. కేరళకు చెందిన జైషా ప్రఖ్యాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. మారథాన్‌లో నేషనల్ రికార్డ్ హోల్డర్. ‘అవకాశాలు, అదృష్టాలు అనేవి ఎక్కడి నుంచో రావు. మన కష్టంలో నుంచే వస్తాయి’ అంటుంది జైషా.గురి తప్పని లక్ష్యంరాంచీలో పుట్టి పెరిగిన దీపిక కుమారి తండ్రి ఆటోడ్రైవర్. చిన్నప్పుడు చెట్టు పైనున్న మామిడి కాయలను గురి తప్పకుండా కొట్టేది. గురితప్పని ఆ ఉత్సాహమే దీపికను ఆర్చరీ వైపు అడుగులు వేసేలా చేసింది. ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన దీపిక కుమారికి రోజుకు మూడు పూటలా భోజనం దొరికేది. పేదరికం నేపథ్యం నుంచి వచ్చిన దీపికకు అదే లగ్జరీగా అనిపించేది.కష్టాల్లో సైతం వెరవని ధైర్యం, అంకితభావంతో ఎన్నో విజయాలు సాధించింది దీపిక. కామన్వెల్త్ గేమ్స్ (2010)లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ‘కొన్ని సంవత్సరాల క్రితం చాలామందికి ఆర్చరీ అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా ఆర్చరీ గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆర్చరీపై ఆసక్తి కలగడానికి మీరే స్ఫూర్తి అని పిల్లలు చెబుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది’ అంటుంది దీపిక కుమారి.పరుగు ఆపొద్దు‘ఐ బికమ్ ఏ రన్నర్’ పేరుతో పుస్తకం రాసింది సొహినీ ఛటో పాధ్యాయ. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది ప్రసిద్ధ ఉమెన్ రన్నర్ల స్ఫూర్తిదాయక జీవిత కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 1952 ఒలింపిక్స్‌లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన మేరీ డిసౌజా, బ్యాంకాక్ అసియన్ గేమ్స్(1970)లో బంగారు పతకం గెలుచుకున్న కమల్జిత్ సందు, పీటి ఉషా, శాంతి సౌందర్యరాజన్, పింకీ ప్రమానిక్, దూతీ చంద్‌లాంటి క్రీడకారుల జీవితవిశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.ఈ విజేతలకు క్రీడా ప్రయాణం అనేది నల్లేరు మీద నడక కాలేదు. ‘ఆర్థిక కష్టాలు’ కొందరికీ, ‘అమ్మాయిలకు ఆటలెందుకు!’ అనే ఈసడింపులు మరికొందరికీ... ఇలా రకరకాల సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వారు పరుగు ఆపలేదు. ఆటలకు పేదరికాన్ని దూరం చేసే శక్తి ఉందనే విషయాన్ని కూడా ఈ పుస్తకం ద్వారా చాటిచెప్పింది సోహిని. ‘పేదరికం నుంచి బయటపడడానికి ఆటలు నాకు ఉపకరించాయి’ అంటుంది ఒలింపియన్ లలిత బాబర్.మైదాన ఆటలే మేలుపిల్లల ప్రపంచానికి ఆన్లైన్ ఆటలు దగ్గరయ్యాయి. మైదాన ఆటలు దూరం అయ్యాయి. ఆన్లైన్ ఆటలతో పోల్చితే మైదానాల్లో ఆడే ఆటల వల్ల పిల్లలకు అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. మైదాన క్రీడలు పిల్లలకు వ్యాయామంలా పనిచేస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. నలుగురిలో త్వరగా కలిసి పోయే స్వభావాన్ని పెంచుతాయి. కుంగుబాటును దూరం పెట్టి చురుగ్గా ఉండేలా చేస్తాయి. శరీరంపై నియంత్రణ ఉండేలా చేస్తాయి.ఆకలి రోజుల నుంచి టోక్యో వరకురోజుకు రెండు పూటలా కడుపు నిండా తింటే, ఆ కుటుంబానికి ఆరోజు ఘనమైన రోజులా ఉండేది. అలాంటి కడు పేద కుటుంబంలో పుట్టిన భావనా జాట్ ఆర్థిక కష్టాలను అధిగమించి ‘రేస్ వాకర్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా రేస్ వాకర్‌గా చరిత్ర సృష్టించింది. రాజస్థాన్‌లోని కబ్రా అనే చిన్న గ్రామానికి చెందిన భావనా జాట్ పేదరికపు సమస్యలకు ఎప్పుడూ భయపడలేదు. కలలకు తెరవేయలేదు.విరిగి పోయిన హాకీ స్టిక్‌తో...ఆసియన్ గేమ్స్ (2018) మహిళల హాకీ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహించిన రాణి రాం పాల్ పేదింటి బిడ్డ. హరియాణకు చెందిన రాణి ఇల్లు ఎండొచ్చినా, వానొచ్చినా సమస్యే అన్నట్లుగా ఉండేది. విద్యుత్ సదు పాయం ఉండేది కాదు. దోమలు వీరవిహారం చేసేవి. రాణికి హాకీపై ఆసక్తి చిన్నప్పటి నుంచే మొదలైంది. తన ఇంటికి సమీపంలోని హాకీ అకాడమీలో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గంటల తరబడి చూస్తుండేది. ఎక్కడో దొరికిన విరిగి పోయిన హాకీ స్టిక్‌తో వారిని అనుకరిస్తూ ఉండేది.‘నాకు హాకీలో శిక్షణ ఇవ్వండి’ అని హాకీ అకాడమీ వారిని అడిగితే తిరస్కరించారు. ‘ఆ సమయంలోనే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను’ అంటున్న రాణి తన కలను నిజం చేసుకుంది. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది.వెక్కిరింపులు ఎదురైనా...మణిపుర్‌లోని పేద కుటుంబంలో పుట్టిన బింద్యారాణిదేవికి చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం. ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంపిక చేసుకుంది. అంతకుముందు తైక్వాండో సాధన చేసేది. ‘ఎందుకు తల్లీ ఈ కష్టాలు, బరువులు ఎత్తడాలు....’ అనేవాళ్లు చుట్టుపక్కల వాళ్లు. ఎవరి మాట ఎలా ఉన్నా తనకు మాత్రం పెద్ద కలలు ఉండేవి.‘మహా అంటే జిల్లా స్థాయి వరకు వెళ్లగలవు’ అనే వెక్కిరింపుల మాట ఎలా ఉన్నా జిల్లా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది రాణిదేవి. థాయ్‌లాండ్‌లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్(2024)లో కాంస్య పతకం గెలుచుకుంది. ఐడబ్ల్యూఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ కప్‌లో మహిళల 55 కేజీ ఈవెంట్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ‘ప్రతికూల మాటలు ఎన్ని వినబడినా లక్ష్యసాధనలో దృఢంగా ఉండాలి’ అంటుంది బింద్యారాణి దేవి. -
స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి ఓలా ఎలక్ట్రిక్
ముంబై: ఓలా ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా స్పోర్టియర్ వెర్షన్లో కనిపిస్తున్న ఓ స్కూటర్ టీజర్‌ను బుధవారం విడుదల చేసింది. ఓలా ‘కృత్రిమ్’ ఏఐ ఫీచర్స్‌తో ఈ స్పోర్ట్స్ స్కూటర్లు రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.ప్రతి ఏటా ఆగస్టు 15న నిర్వహించే తన వార్షిక ‘సంకల్ప్’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా టీవీఎస్ ఎన్‌టార్క్, యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్ఆర్160 మోడళ్లు స్పోర్ట్స్ స్కూటర్ల విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్ డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయాలతో పాటు సొంతంగా తయారు చేసిన 4680 సెల్ ఫీచర్లతో జెన్ 3 స్కూటర్లను ఆవిష్కరించింది. -
6 నెలల్లో క్రీడా బిల్లు అమలు
న్యూఢిల్లీ: రాబోయే ఆరు నెలల్లో జాతీయ క్రీడా బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు ఆమోద ముద్ర లభించడంతో... ప్రపంచంలో క్రీడా చట్టం అమల్లోకి వచ్చిన 21వ దేశంగా భారత్ నిలిచింది. ఈ బిల్లు అమలుతో దేశ క్రీడారంగానికి ఎంతో లబ్ధి చేకూరనుంది. మౌలిక వసతులు మెరుగు పడటంతో పాటు... క్రీడల్లో పారదర్శకత పెరగనుంది. పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం క్రీడా మంత్రి దీనిపై స్పందిస్తూ... ఇప్పటికే నియమ నిబంధనల రూపకల్పన ప్రారంభమైందని వెల్లడించారు. ‘ఈ బిల్లు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తుంది. రాబోయే ఆరు నెలల్లో వంద శాతం దీన్ని అమలు చేసే విధంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. దీనివల్ల క్రీడారంగానికి ఇతోధిక లబ్ధి చేకూరుతుంది. భారత అథ్లెట్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గేనే సమయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే జాతీయ విధానానికి అనుగుణంగా కొన్ని సూచనలు ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వినియోగిస్తారు. అవసరమైన పోస్టుల సృష్టి, పరిపాలనా అనుమతుల వంటి వాటి ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ), జాతీయ క్రీడా ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ)కు విధానపరమైన అనుమతులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం’ అని మాండవీయ పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో క్రీడా రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణ అని క్రీడా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వానికి సర్వాధికారాలు... బిల్లు ఆమోదంతో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. గతంలోనూ ఇదే పద్ధతి కొనసాగినా... దానికంటూ ప్రత్యేకమైన విధానం లేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో క్రీడల్లో పోటీపడాల్సి వచ్చిన సందర్భంతో పాటు దౌత్యపరంగా సఖ్యతగా లేని మరే దేశంలో పర్యటించాల్సి వచ్చినా... ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా క్రీడా చట్టం అమలవుతున్న దేశాల్లో... అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అంశంపై ఆయా దేశాల ప్రభుత్వాలదే తుది నిర్ణయం. ఇది కేవలం అసాధారణ పరిస్థితుల కోసం ఉద్దేశించి రూపొందించింది... అంతే తప్ప జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం కోసం తీసుకొచ్చింది కాదు. జాతీయ భద్రతా బెదిరింపులు, దౌత్య బహిష్కరణలు లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితులు వంటివి సంభవించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. 2008 ముంబై దాడుల సమయం నుంచే పాకిస్తాన్‌తో భారత పురుషుల క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ప్రధాన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో విదేశాంగ శాఖ అనుమతులతోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడుతోంది. ఇకపై కూడా ఈ విధానమే కొనసాగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... ఈ బిల్లు ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలు, జాతీయ క్రీడా ట్రైబ్యునల్, జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ ఇలా అన్నింటిని జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ) పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. దీంతో క్రీడల్లో పారదర్శకత పెరగడంతో పాటు వివాద పరిష్కారం మరింత సులువు కానుంది. ఆరంభంలో ఈ బిల్లుపై అవగాహన కొరవడినా... ఆ తర్వాత జాతీయ క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దీనికి మద్దతునిచ్చాయని క్రీడా శాఖ మంత్రి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో చర్చించి విశ్లేషించి 60 రౌండ్లకు పైగా ‘చింతన్ శిబిర్’లను నిర్వహించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరమే బిల్లును పార్లమెంట్ ముందుంచినట్లు క్రీడా మంత్రి వెల్లడించారు. కొత్త చట్టంతో దేశ క్రీడా రంగం పురోగతి సాధిస్తుందనే నమ్మకముందన్న మాండవీయ... రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌ను క్రీడల్లో సూపర్ పవర్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ... ‘జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో రోజుల తరబడి మాట్లాడిన తర్వాతే ఈ బిల్లును రూపొందించాం. అథ్లెట్లు, కోచ్‌లు, క్రీడా విశ్లేషకులు, నిపుణులు ఇలా ఒక్కరేంటి అందరీని సంప్రదించాం. బిల్లులోని ప్రతి నిబంధనను వారికి వివరించాం. వాటి అవసరమేంటో స్పష్టంగా చెప్పిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఎలాంటి బిల్లు కావాలో వారినే అడిగాం. వారిచ్చిన సూచనలు సలహాలతో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని క్రీడా న్యాయవాదుల నుంచి కూడా సలహాలు తీసుకున్నాం. వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ముసాయిదా క్రీడా బిల్లును రూపొందించింది. కానీ దాన్ని అమలు చేయలేకపోయింది’అని క్రీడా శాఖమంత్రి వెల్లడించారు. అథ్లెట్లతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే క్రీడా సమాఖ్యల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ‘మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం పెంచాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీలో నలుగురు మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ‘స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ’’ని కూడా తీసుకొస్తాం. ఇది అంతర్జాతీయ టోర్నీల్లో మన అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రోడ్‌మ్యాప్‌లా నిలవనుంది’ అని మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. -
IPL : తలైవర్ ఫ్యాన్ Thala గూటికి..
-
World Cup 2027: రోహిత్, కోహ్లి ఖేల్ ఖతం.. గంభీర్ గర్జన!
-
IND Vs ENG: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
England Vs India: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
మా కోడలికి దక్కిన గొప్ప గౌరవం: మెగాస్టార్ ట్వీట్
కోడలికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో ఛైర్మన్‌గా అవకాశం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రీడల అభివృద్ధికి ఉపాసన నియామకం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది గొప్ప బాధ్యతతో పాటు మా కోడలికి దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. ఉపాసన నిబద్ధత, అభిరుచి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధానాలను రూపొందించడానికి ఉపాసన తప్పకుండా కృషి చేస్తుందని.. నీకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని చిరంజీవి పోస్ట్ చేశారు.కాగా.. మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ని నియమించింది. ఇందులో ఉపాసనకు చోటు దక్కింది. ఇందులో భాగంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంమై క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్డ్ ఏర్పాటు చేసింది. ఈ బోర్డ్‌లో ఐపీఎల్లో లక్నో జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంజీవ్ గోయెంకాని ఛైర్మన్‌గా నియమించారు. కో- ఛైర్మన్‌గా ఉపాసనకు బాధ్యతలు అప్పగించారు. బోర్డ్ సభ్యులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, భూటియా, రవికాంత్ రెడ్డిని నియమించారు.Our ‘Kodalu’ is the Co - Chairperson of Telangana Sports Hub now ☺️Delighted at the appointment of @upasanakonidela to the esteemed position. It is as much an honour as much as it is a great responsibility. Dear Upasana, I am sure with your commitment and passion you will…— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2025 -
రసవత్తరంగా ఇంగ్లాండ్-భారత్ ఐదో టెస్ట్
-
ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..!
వైకుంటపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. పులి–మేక.. ఈ పేర్లన్నీ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన నేటితరానికి అప్పటి ఆటల్లో ఉన్న మజా.. అసలే తెలియకపోవచ్చు. అలాంటి ఆటల పట్ల బాలలకు ముచ్చటగొలిపేలా కృషి చేస్తోంది.. ‘క్రీడ’ సంస్థ. వీరితోపాటు పెద్దలకు సైతం గత స్మృతులను గుర్తుచేసే ప్రయత్నం చేస్తోంది.. ఈ ఆటలు ఆడిన నగరానికి చెందిన కొందరు పెద్దలు చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు. నగరీకరణలో భాగంగా మనలో చాలా మంది ఆర్టిఫీషియల్ లైఫ్‌కి అలవాటుపడిపోయారు. ఎంత వరకూ ఉద్యోగాలు, వ్యాపారాలు, సమాజిక మాధ్యమాలు ఇవే తప్ప సహజసిద్ధమైన ఆటలను మర్చిపోతున్నారు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆనందానికి దోహదపడే అచ్చతెలుగు ఆటలైన వైకుంఠపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. వంటి పేర్లన్నీ వింటుంటే 1970–80 కాలం నాటి రోజులు తప్పకుండా గుర్తుకొస్తాయి.. మైక్రో ఫ్యామిలీలుగా మారిపోతున్న కల్చర్‌లో నానమ్మలు, తాతయ్యల వద్ద పెరిగే వారే లేరంటే అశ్చర్యపోవాల్సిన పని. ఒకవేళ ఉన్నా.. టెక్నాలజీ మోజులో పడి పులిని చూసి నక్క వాతబెట్టుకున్న చందాన ఆన్లైన్ గేమ్స్ అలవాటు చేసి.. ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలకు దూరమైన కొందరు ఒంటరితనాన్ని తగ్గించుకునేందుకు సామాజిక మాధ్యమాల చట్రంలో ఇరుక్కుపోయి వాటికి పూర్తిగా బానిసలవుతున్నారు. నగరంలోని ‘క్రీడ’ సంస్థ ఈ ఆటలపట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆవరణలో నాటితరం ఆటలను నేటి తరానికి పరిచయం చేస్తోంది. అందుకు తగిన ఏర్పాటను సైతం చేసింది. పిల్లలు పెద్దలు చక్కగా ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నారు. క్రీడ సంస్థ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారు కూడా.. అలనాటి ఆటలు ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయగా.. అప్పటి తరంలోని కొందరు.. 80 ఏళ్లకు పైబడిన వారు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పులి–మేక, దాడీ, అచ్చంగిల్ల వంటి ఆటలను ఆడించడమే కాదు.. నాటి, నేటి తరానికి చెందిన కొందరికి ఈ ఆటలను ఎలా ఆడాలో నిర్వాహకులే నేర్పిస్తున్నారు.. పిల్లలు, పెద్దలు కూడా ఈ ఆటలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. మెదడుకు పదును.. ఈ ఆటలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయని, వీటిని ఆడటం వల్ల మెదడుకు పదును పెరుగుతుందని, పైగా దీనివల్ల దు్రష్పభావాలు కూడా ఏమీ ఉండవని, ఒత్తిడిని సైతం జయించవచ్చని పలువురు నిపుణులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇటువంటి ఆటల వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని, పైగా క్రీడాస్ఫూర్తి కూడా పెరుగుతుందని, ఓటమిని సైతం తట్టుకునే శక్తి వస్తుందని, పైగా పరిచయాలు బలపడతాయని చెబుతున్నారు. మెల్లమెల్లగా కనుమరుగవుతున్న ఇటువంటి ఆటలను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వెలుగులోకి తీసుకురావడం మంచి పరిణామమని చెబుతున్నారు. నేటి తరం కోసం.. నాకు మా అమ్మమ్మ అష్టాచెమ్మాతో పాటు వామనగుంట, వైకుంఠపాళి, సోలాసీబీ వంటి ఆటలను నేరి్పంచింది. మా అమ్మకు ఈ ఆటలన్నీ రావు. నాకు నేర్చుకోవాలని ఉన్నా చెప్పేవారు లేరు. పిల్లలకు వీటి గురించి చెప్పేవారే కరువయ్యారు. అందుకే క్రీడ అనే సంస్థ ద్వారా నెలలో 25 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాను. ఇది పూర్తిగా ఉచితం. చిన్నా పెద్దా అందరూ వచ్చి ఆడుకోవచ్చు. వీటి గురించి నేరి్పంచడమే కాకుండా ఆడిస్తాం. ఇక్కడ రోజుకు 200 మంది వరకూ వస్తున్నారు. – వినీత సిద్ధార్థ, క్రీడ సంస్థ నిర్వాహకులుఇదో మంచి ప్రయత్నం.. మా దగ్గర అలనాటి ఆటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషమేసింది. ఈ ఆటల గురించి తెలియని వారికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను కూడా సరదాగా ఆడుకున్నా. ఈ ప్రయత్నం అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయిస్తాం. పిల్లలు, పెద్దలు ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొద్దిసేపు నేను కూడా ఆడుకుని నాటి రోజులను గుర్తుచేసుకున్నా. – విజయలక్ష్మి, సీసీటీ సభ్యురాలు (చదవండి: Masaba Gupta Weight Loss Tips: డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్) -
ఒలింపిక్స్ పతకం లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్స్ నిర్వహించేందుకు మన వద్ద నిధులు, వేదికలు, అన్ని వనరులు, హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇంతా చేసి మనం ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేకపోతే మన ముఖం ప్రపంచానికి ఎలా చూపిస్తాం? అందుకే మున్ముందు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రీడా సదస్సు(స్పోర్ట్స్ కాంక్లేవ్) నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఒలింపిక్ పతక విజేతలు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, ప్రపంచ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ అంజూ బాబీ జార్జ్, మాజీ వాలీబాల్ ప్లేయర్ రవికాంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. పలువురు మాజీ క్రీడాకారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు ‘క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో కలిసి పని చేస్తాం. స్పోర్ట్ పాలసీ అమలుకు సంబంధించి పలువురు ప్రముఖులతో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై క్రీడల్లో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోరు. ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న, నిష్ణాతులైన వారిని ఏరికోరి భాగస్వాములను చేస్తున్నాం. వారంతా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తారని నమ్ముతున్నా..’అని సీఎం పేర్కొన్నారు. మున్ముందు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ ‘పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన చూసిన తర్వాతే నాకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చాలా కాలంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ అనేదే లేదు. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానం గురించి నిర్ణయం తీసుకున్నాం. విజన్ 2047లో క్రీడలకు ప్రత్యేక అధ్యాయం కేటాయించాం. మున్ముందు క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తాం. ఈ పాలసీ లైబ్రరీలో పడేసే కాగితం ముక్క కాదు. బంగారంతో గీసిన రేఖ లాంటిది..’అని రేవంత్ అన్నారు. హైదరాబాద్‌కు చాన్స్ ఇవ్వమని అడిగాం.. ‘1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టులో 9 మంది హైదరాబాదీలే ఉన్నారు. హైదరాబాద్‌లో గతంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ క్రీడలను సమర్థంగా నిర్వహించాం. అయితే గత ప్రభుత్వం పదేళ్లు క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్టేడియంలు ఫంక్షన్ హాళ్లుగా, సన్‌బర్న్‌లాంటి ఈవెంట్లకు వేదికలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. 2026లో ఖేలో ఇండియా నిర్వహణ హక్కులు మనకు కేటాయించాలని, 2036లో భారత్‌లో ఒలింపిక్స్ జరిగితే రెండు క్రీడాంశాలను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. కొరియా యూనివర్సిటీ నుంచి కోచ్‌లు ‘రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంతో యువత పెడదారి పడుతోంది. అటువంటివారిని సరైన మార్గంలోకి తెచ్చేందుకు క్రీడలే తగిన మార్గమని భావిస్తున్నాం. గత ఏడాది నేను కొరియా వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వచ్చిన విషయం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడే అదే యూనివర్సిటీతో జత కట్టి కోచ్‌లను తీసుకురానున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది..’అని రేవంత్ ప్రకటించారు. సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తిలాంటి ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 మందితో గవర్నింగ్ బోర్డు కొత్త స్పోర్ట్స్ పాలసీని సమర్థంగా నిర్వహించేందుకు 15 మందితో ప్రభుత్వం గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు మాజీ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, భైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, మాజీ అధికారులు పాపారావు, ఇంజేటి శ్రీనివాస్, వ్యాపారవేత్తలు సంజీవ్ గోయెంకా, ఉపాసన కామినేని, విటా దావి, కావ్య మారన్, సి.శశిధర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పలు సంస్థలతో ఎంఓయూలు ‘స్పోర్ట్ కాంక్లేవ్’లో భాగంగా వేర్వేరు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఫుట్‌బాల్ అకాడమీ కోసం ‘ఫిఫా’, ‘ఏఐఎఫ్ఎఫ్’లతో, ఒలింపిక్ వాల్యూస్ ప్రోగ్రామ్‌కు సంబంధించి అభినవ్ బింద్రాతో, షూటింగ్లో ప్రతిభాన్వేషణ, శిక్షణ కోసం ‘గన్ ఫర్ గ్లోరీ’అకాడమీతో, బాస్కెట్ బాల్ క్రీడలో ప్రతిభాన్వేషణ, అభివృద్ధి కోసం ‘స్పోర్ట్స్ ప్రిక్స్’సంస్థతో, క్రీడలతో పాటు చదువులో కూడా కెరీర్ మార్గనిర్దేశం చేసేలా ‘హర్ స్పోర్ట్స్ కీ చాంపియన్’సంస్థతో ఒప్పందాలు కుదిరాయి. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన ‘టెన్విక్’సంస్థ రాష్ట్రంలోని 50 పాఠశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఎంఓయూ కుదిరింది. -
గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణం: సీఎం రేవంత్
హైదరాబాద్: క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ప్రతేక పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి,. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంక్లేవ్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో సరైన పాలసీ లేకపోవడంతో యువత పెడదారి పట్టిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కొదవలేదని, క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, నజరానాలు ఇచ్చామన్నారు. గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐసీసీ(HICC)లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి , సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జాతీయ ,అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రముఖులు, క్రీడా సంస్థల నిర్వాహకులు హజరయ్యారు. -
క్రీడలలో ఎథిక్స్ & లీడర్షిప్ 7వ ప్రపంచ సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం
వరల్డ్ ఫోరమ్ ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ - WFEB (World Forum for Ethics in Business)నిర్వహించిన క్రీడలలో నైతికత, నాయకత్వంపై 7వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం చేశారు.7వ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఎథిక్స్ అండ్ లీడర్షిప్ ఇన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో విలువలు రాజీపడితే విజయం నిజంగా కొనసాగుతుందా లేదా అనే దానిపైనా, తీవ్ర ఒత్తిడి ఉన్న ప్రపంచంలో సమగ్రతతో గెలవడానికి ఏమి అవసరమో అనే దానిపై ఆలోచనాత్మక ఆలోచనల మార్పిడిలో క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం, విద్యాసంస్థలు, NGOలు , థింక్ ట్యాంక్‌ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురితో చర్చించింది.క్రీడలలో, మీరు గెలుస్తారు లేదా మీరు ఇతరులను గెలిపించుకుంటారు" అని రవిశంకర్ తన ముఖ్యోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో యుద్ధాలు క్రీడలుగా, క్రీడలు యుద్ధాల్లా జరుగుతున్నాయని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఆటల్లో జయాపజయాలను రెండింటినీ స్వీకరించాలన్నారు. ఆట అనే చర్య ఆనందాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం సహజంగానే క్రీడలలో నైతికంగా ఉంటాం ,లేదంటే క్రీడా రంగాలు హింసాత్మకంగా మారిపోతాయన్నారు.బిడ్డ నడవడం ప్రారంభించినంత సహజంగా క్రీడలుంటాయిని మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని పడవేస్తాయన్నారు. క్రీడలు ,సంగీతం ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఒంటరిగా, నిరాశ, అసంతృప్తులతో బాదపడుతున్నారని ఇది ఆలోచించాల్సిన విషయమని రవిశంకర్ గుర్తు చేశారు మనం మొత్తం జీవితాన్ని ఒక క్రీడగా తీసుకోగలిగితే, ప్రపంచంలో యుద్ధం ఉండదు, గుండెల్లో మంటలు ఉండవు, అపనమ్మకం ఉండదు అని గురుదేవ్ అన్నారు"ఫుట్‌బాల్ నాకు స్వేచ్ఛగా మారింది," అని ఫలస్తీనియన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సహవ్యవస్థాపకురాలు హనీ తల్జీహ్ పంచుకున్నారు. "అది కేవలం ఆట కాదు, అది ఓ ప్రకటన. ఇది కదలడానికి, మాట్లాడడానికి, కలలు కనడానికి ఓ హక్కు.అడ్డంకులను ఛేదించడంలో , అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో క్రీడలు పోషించగల పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాలస్తీనా మహిళా ఫుట్‌బాల్ జట్టు మొదటి కెప్టెన్ హనీ థాల్జీ ఇలా వ్యాఖ్యానించారుఈ మధ్య కాలంలో రికార్డులు నెలకొల్పడం, ఖ్యాతిని సాధించడం అనే లక్ష్యాల్లో నైతిక ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా మారాయి. వీటి వల్ల ప్రేక్షకుల విశ్వాసం దెబ్బతింటోంది. అదే సమయంలో, క్రీడాస్ఫూర్తి, క్రీడా నైపుణ్యం మరియు నైతికత ఒక ఆట యొక్క స్ఫూర్తిని ఎలా ఉద్ధరిస్తాయి, మొత్తం తరాన్ని ఏకం చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి అనేదానికి తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.క్రీడలు శాంతిని నెలకొల్పడానికి ఒక సాధనంగా, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, గరిష్ట పనితీరు మరియు దీర్ఘాయువు మరియు క్రీడలలోనే కాకుండా జీవితంలో మరియు నాయకత్వంలో ఉత్తమంగా ఉండటానికి ఏమి అవసరమో అనే దానిపై సమ్మిట్‌లో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి. ఫెయిర్ ప్లే, టీమ్ స్పిరిట్ ,ఓర్పు వంటి రంగాల నుండి పాఠాలు రాజకీయాలు మరియు వ్యాపారంలో నైతిక నాయకత్వాన్ని ఎలా రూపొందిస్తాయో కూడా సదస్సులో చర్చకు వచ్చింది.ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన 17 ఏళ్ల కామ్య కార్తికేయన్; ఒలింపిక్ బంగారు పతక విజేత, 400 మీటర్ల హర్డిల్స్‌లో మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్ కెవిన్ యంగ్; ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన స్వ్యటోస్లావ్ యురాష్; పాలస్తీనా ఫుట్‌బాల్ మార్గదర్శకుడు హనీ థాల్జీ; యూరో '96 ఛాంపియన్, టీవీ పర్సనాలిటీ థామస్ హెల్మెర్; ఆసియా క్రీడలలో స్వర్ణం గెలుచుకున్న భారతదేశపు తొలి మహిళా గుర్రపు స్వారీ దివ్యకృతి సింగ్ ఇతర ప్రముఖ వక్తలలో ఉన్నారు.క్రీడా స్ఫూర్తి మరియు నైతికతలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించే ప్రదర్శనలను ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డులతో సత్కరించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ జెర్డాన్ షకీరికి 'క్రీడ ద్వారా ఏకీకరణ, న్యాయబద్ధత, అంతర్ సాంస్కృతిక సంభాషణకు అతని దీర్ఘకాల నిబద్ధత' కోసం అత్యుత్తమ వ్యక్తిగత అవార్డును ప్రదానం చేశారు. క్రీడలలో మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ సహకారం మానసిక ఆరోగ్యం, క్రీడలో న్యాయబద్ధత , యువ మహిళా అథ్లెట్లకు మద్దతు కోసం ఆమె వాదనకు గాను ఎలైట్ స్విస్ రోవర్ జీనిన్ గ్మెలిన్కు లభించింది.ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్, రెండు దశాబ్దాలకు పైగా నైతిక వాదనలో ముందంజలో ఉంది. శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికత ప్రకారం, విలువలు పనితీరు విరుద్ధమైనవి కావు.అవి విడదీయరాని మిత్రులు అనే సందేశాన్ని ప్రచారం చేయడానికి WFEB యూరోపియన్ పార్లమెంట్, FIFA, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు జెనీవాలోని UN వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని నిర్వాహకులు ప్రకటించారు. -
ప్రేమతో టై... పెళ్లితో బ్రేక్!
మైదానంలో అలరించిన భారత క్రీడాకారులు పతకాలు, ట్రోఫీలతో పాటు అభిమానుల మనసుల్ని గెలుస్తారు. అలాగే తమ మనసు గెలిచిన వారితో మనసారా ఒక్కటవుతారు. టోరీ్నల్లో లాగానే మొదట పరిచయంతో ప్రేమపెళ్లికి ‘క్వాలిఫై’ అవుతారు. తర్వాత ‘మెయిన్ రౌండ్’లో ప్రేమించుకుంటారు. ‘ఫైనల్’కు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడితోనే ‘పెళ్లి’ టైటిల్‌కు శుభం కార్డు పడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! కొన్నాళ్లకు, కొన్నేళ్లకు కొన్ని క్రీడా జంటలకు ‘విడాకులు’తో అశుభం కార్డు పడుతోంది. అలా ఈ కోవలో ఒక్క‘టై’.. ‘బ్రేక్’ చేసుకున్న జంటల కథలు...క్రీడాకారుల విజయాలు వార్తలవడం సహజం. విజయవంతమైన క్రేజీ స్టార్ల ప్రేమలు కూడా హాట్ న్యూస్లే! తర్వాత ఫారిన్ ట్రిప్పులు, చెట్టాపట్టాల్ అన్నీ కూడా మీడియా కంటపడకుండా ఉండవు. చివరకు పెళ్లి ముచ్చట ఇవన్నీ బాగానే ఉన్నా... కొందరి ‘ప్రేమ–పెళ్లి–విడాకుల’ తంతు పరిపాటిగా మారడమే క్రీడాకారుల దాంపత్య బంధాన్ని పలుచన చేస్తున్నాయి. తాజాగా వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ల జోడీ సైనా నెహా్వల్, పారుపల్లి కశ్యప్ తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. గతంలో పాపులర్ షట్లర్లు గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్‌లు బ్యాడ్మింటన్ కోర్టులో జోడీ కట్టి... తర్వాత పెళ్లి పీటలెక్కారు. కొన్నాళ్లకే కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ‘టై బ్రేక్’ జోడీల సంఖ్య ఎక్కువవుతోంది. వారి వివరాలివే...హార్దిక్ పాండ్యానటాషాభారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ మనసుపడి మనువాడాడు. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిన సమయంలో తొలుత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ 2023లో హిందూ, సెర్బియా మతాచారాల ప్రకారం మళ్లీ పెళ్లాడారు. కానీ ఇంతలా ఇష్టపడ్డ సెర్బియన్ నెచ్చెలితో పెళ్లి ముచ్చట కొన్నాళ్లకే ముగిసింది. 2024లో ఇద్దరు విడాకుల ప్రకటన చేశారు. ధావన్ అయేషాభారత క్రికెటర్ శిఖర్ ధావన్ సరిహద్దులు దాటిన ప్రేమ తదుపరి పెళ్లినాటి ప్రమాణాలు కూడా కొన్నేళ్ల తర్వాత గుదిబండగా మారడంతో చివరికి చెరోదారి చూసుకోవాల్సి వచి్చంది. మెల్బోర్న్లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అయేషా ముఖర్జీతో మొదలైన పరిచయం కొన్నాళ్లకే ప్రణయానికి దారితీసింది. ధావన్ కంటే అయేషా ఏకంగా 12 ఏళ్లు పెద్ద వయసు్కరాలు. అయితే ఈ వయస్సు ప్రేమకి, పెళ్లికి అడ్డంకి కాలేదు. 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మనస్పర్థలతో 2023లో విడిపోయింది.చహల్ ధనశ్రీ భారత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్‌గా బక్కపలుచని యోధుడు యజువేంద్ర చహల్ కొన్నాళ్లు వెలుగు వెలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన చహల్... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. వీరిజంట నెట్టింట ‘మూడు రీల్స్... ఆరు జిగేల్స్’గా తెగ హల్చల్ చేసింది కొన్నాళ్లు! కానీ చిత్రంగా పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే చెదిరిపోయింది. ప్రేమ బాసలు, పెనవేసుకున్న ఊసులతో 2020లో మ్యారేజ్ చేసుకున్న చహల్–ధనశ్రీ వర్మ రెండేళ్లకే విడిపోయారు. 2022లో డివోర్స్ కార్డ్ వేశారు.షమీ హసీన్ జహన్ భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ప్రేమ పెళ్లి ముచ్చట వివాదాలు, ఆరోపణలతో నాలుగేళ్లకే క్లీన్»ౌల్డయ్యింది. తనకు పరిచయమైన హసీన్ జహన్‌తో కొంతకాలం ప్రేమాయణం జరిపిన తర్వాత 2014లో ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే హసీన్ రచ్చకెక్కి మరీ గృహహింస కేసులు పెట్టి చివరకు 2018లో విడిపోయారు.సైనా కశ్యప్సింధు మేనియా ముందువరకు సైనానే సూపర్‌స్టార్‌గా వెలుగొందింది. కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచింది. ఒకప్పుడు క్రీడా వార్తల్లో టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో సైనాల విజయాలే పతాక శీర్షికలయ్యేవి. 2012–లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలుచుకుంది అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... గోపీచంద్ అకాడమీలో శిక్షణ సందర్భంగా పారుపల్లి కశ్యప్‌ను ప్రేమించింది. వీరి ప్రేమాయణం 2018లో మూడుముళ్ల బంధంగా మారింది. ఏడడుగులు నడిచిన ఈ జంట ఏడేళ్లు పూర్తయ్యేసరికి తమ బంధానికి బైబై చెప్పింది. -
వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె..!
అనూజ వైద్య మరో రికార్డు సాధించింది. పర్వతారోహకురాలైన అనూజ వైద్య ఇప్పుడు కొత్త రికార్డుల కోసం నీటి మీద దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె. గుజరాత్ రాష్ట్రం, సూరత్‌కు చెందిన అనూజవైద్య గత నెల (జూన్) 24 నుంచి 29 వరకు థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ వాటర్ స్కీయింగ్ అండ్ వేక్ బోర్డింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. బాల్యం నుంచి అనూజ స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేవారు. ట్రెకింగ్, స్విమ్మింగ్‌తోపాటు తండ్రి ప్రోత్సాహంతో తాపి నదిలో వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఆమె తల్లి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్. తల్లి ప్రోత్సాహంతో అనూజ ఆమె చెల్లి అదితి ఇద్దరూ పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ పర్వతాన్ని 2019లో తొలి ప్రయత్నంలోనే అధిరోహించి ’ఎవరెస్ట్ సిస్టర్స్’ గా గుజరాత్ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈ సిస్టర్స్ ఉత్తరాఖండ్‌లో ‘గెట్ సెట్ అడ్వెంచర్స్’ పేరుతో అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ స్థాపించారు. ఇదిలా ఉండగా 27 ఏళ్ల అనూజ వైద్య తాజాగా వాటర్ స్కీయింగ్ స్పోర్ట్స్‌లో భారత్ తరఫున పాల్గొన్నారు. రికార్డుల్లో శిఖరాగ్రాన్ని చేరిన అనూజ ప్రస్తుతం నీటి/మీద రికార్డుల బాట పట్టారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ క్రీడ మనదేశ మహిళల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. వీరికంటే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని హరియాణకు చెందిన తాషి, నున్‌గ్షి మాలిక్‌లు ఎవరెస్ట్‌ను (2023)అధిరోహించారు. సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన తొలి సిస్టర్స్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు. అనూజ వేసిన తొలి అడుగుతో కొత్తతరం క్రీడాకారిణులు ఆ దారిలో నడుస్తారని ఆశిద్దాం. (చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..) -
పాతాళం నుంచి ఆకాశమంత ఎదిగిన ఆకాశ్ దీప్
-
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం
-
RCB: కోహ్లి అరెస్ట్?
-
రోహిత్ ను చావు దెబ్బ తీసింది ఇతనే!
-
ఈ ఏడాది... కలిసొచ్చింది!
ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు! తాజా ఐపీఎల్ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్‌బాష్ టి20 లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ), ఎఫ్ఏ కప్‌లో క్రిస్టల్ ప్యాలెస్ జట్లు ఈసారే తొలి టైటిల్ సాధించాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం90 ఏళ్ల తర్వాత... బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ రాయల్ యూనియన్ సెయింట్ గిల్లోయిస్ ఇప్పటి వరకు 12 టైటిల్స్ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్ యూనియన్ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్‌కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.క్రిస్టల్ ప్యాలెస్... 119 ఏళ్ల తర్వాత!ఐపీఎల్లో తొలి టైటిల్ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్‌బాల్ అసోసియేషన్ చాలెంజ్ కప్ (ఎఫ్ఏ కప్)లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్ ప్యాలెస్ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ సిటీ జట్టును ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తొలిసారి...ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్ బిగ్‌బాష్ లీగ్ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్ సునాయాసంగా గెలుపొందింది. అదే బాటలో ఇండియానా పేసర్స్..నేషనల్ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) లీగ్‌లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో టైటిల్ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్బీఏ ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్‌పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్ 123–107తో ఇండియానా పేసర్స్ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. పీఎస్జీ 43 ఏళ్ల తర్వాత...ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్ 1న జరిగిన తుదిపోరులో పీఎస్జీ జట్టు 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్ కప్‌లో పీఎస్జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ...టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్‌లో పోటీ పడుతున్న ఆర్సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది. అర్ధశతాబ్దం తర్వాత...సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్‌బాల్ క్లబ్... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏసీ మిలాన్ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. 1933 తర్వాత తొలిసారి...నెదర్లాండ్స్‌లోని డెవెంటర్ నగరానికి చెందిన ‘గో అహెడ్ ఈగల్స్’ ఫుట్‌బాల్ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్... 1933 తర్వాత తొలి సారి డచ్ కప్ గెలుచుకుంది. ఏప్రిల్ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్’లో ఈగల్స్ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది. స్టుట్గార్ట్ 28 ఏళ్ల తర్వాత... జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ వీఎఫ్బీ స్టుట్గార్ట్.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్బీ పోకల్ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్గార్ట్ 4–2 గోల్స్ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్గార్ట్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన స్టుట్గార్ట్... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.హ్యారీ కేన్‌కు మరింత ప్రత్యేకం...ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు స్టార్ హ్యారీ కేన్‌కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్‌కు టైటిల్ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్ స్ట్రయికర్ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్ మ్యూనిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన కేన్... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 ఏళ్ల తర్వాత...1955లో చివరిసారిగా ఎఫ్ఏ కప్ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్ ఫుట్‌బాల్ లీగ్ కప్ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో లివర్‌పూల్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత...ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ టోటెన్హామ్ హాట్స్పర్... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్హామ్ ఎఫ్‌సీ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ యునైటెడ్‌పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. -
Bengaluru Stampede Case: ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే అరెస్ట్
-
సర్క్యూలర్ బిజినెస్ మోడల్లో తొలి స్పోర్ట్స్ రిటైలర్
డెకాథ్లాన్ ఇండియా తన ప్రధాన వ్యాపార నమూనాలో సర్క్యూలర్ బిజినెస్ మోడల్‌ను అనుసరిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలోనే ఈ చొరవ చూపిన మొదటి స్పోర్ట్స్ రిటైలర్‌గా నిలిచినట్లు పేర్కొంది. ఈ ‘మిషన్ ఎల్ఐఎఫ్ఈ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)’ స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ వ్యర్థాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.సర్క్యులర్ బిజినెస్ మోడల్లోని అంశాలు..రిపేర్ సర్వీసులు: 95+ స్టోర్లలో రిపేర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇది వినియోగదారులు వారి స్పోర్ట్స్ వస్తువులకు మరింత సర్వీసు వెసులుబాటును పొందవచ్చు.సెకండ్ లైఫ్ రీసేల్: పునరుద్ధరించిన ఉత్పత్తులు 90+ స్టోర్లలో తిరిగి విక్రయించనున్నారు. ఇది క్రీడా పరికరాలను మరింత చౌకగా చేస్తుంది.బైబ్యాక్ ప్రోగ్రామ్: ఉపయోగించిన పరికరాలను 50+ స్టోర్లలో తిరిగి ఇవ్వవచ్చు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంసుస్థిరత లక్ష్యాలుడెకాథ్లాన్ 2024 స్థాయితో పోలిస్తే 2027 నాటికి సర్క్యులర్ బిజినెస్ టర్నోవర్‌లో 200% వృద్ధిని అంచనా వేస్తుంది. 2027 నాటికి 3,00,000 కంటే ఎక్కువ క్రీడా ఉత్పత్తులను పునరుద్ధరించాలని భావిస్తుంది. డెకాథ్లాన్ గ్లోబల్ డీకార్బనైజేషన్ వ్యూహంలో భాగంగా 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను, 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే అధిక నాణ్యత, దీర్ఘకాలిక ఉత్పత్తులను సరసమైనవిగా మార్చడం లక్ష్యమని డెకాథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్ ఛటర్జీ నొక్కి చెప్పారు. -
IPL 2025: శ్రేయస్ వేట..గంభీర్ విలవిల
-
IPL 2025: పంత్ తప్పు చేశాడా?
-
కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్
-
పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం
-
Miss World 2025: అందాల భామల ఆటవిడుపు (ఫోటోలు)
-
IPL 2025: ఐపీఎల్ మళ్లీ షురూ
-
IPL 2025: ముంబై అంపైర్లను కొనేసిందా?
-
Vaibhav Suryavanshi: అమ్మా నాన్నల త్యాగం సూర్యవంశీ ఎమోషనల్
-
బుమ్రా కొడుకుపై ట్రోలింగ్ ఇచ్చిపడేసిన భార్య సంజన
-
IPLలో గుజరాత్ పై రాజస్థాన్ ఘన విజయం
-
టీమిండియా స్టార్లతో ? కోహ్లి తన్నులాట విరాట్ కు ఏమైంది
-
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్‌నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్‌లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్‌కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్‌పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్‌సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్‌బాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్‌ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్‌బాల్ వేదిక: సనత్‌నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్‌కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన SRH
-
IPL: MATCH FIX అడ్డంగా దొరికిపోయిన ముంబై
-
రోహిత్ పై పాండ్యా విషం.. నువ్వు మారవా బ్రో?


