మా కోడలికి దక్కిన గొప్ప గౌరవం: మెగాస్టార్‌ ట్వీట్‌ | Megastar Chiranjeevi tweet about Upasana Selected as Sports Hub Member | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'మా కోడలికి పెద్ద బాధ్యత.. చాలా ఆనందంగా ఉంది'

Aug 4 2025 5:29 PM | Updated on Aug 4 2025 6:34 PM

Megastar Chiranjeevi tweet about Upasana Selected as Sports Hub Member

కోడలికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ కో ఛైర్మన్గా అవకాశం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రీడల అభివృద్ధికి ఉపాసన నియామకం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది గొప్ప బాధ్యతతో పాటు మా కోడలికి దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. ఉపాసన నిబద్ధత, అభిరుచి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధానాలను రూపొందించడానికి ఉపాసన తప్పకుండా కృషి చేస్తుందని.. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని చిరంజీవి పోస్ట్ చేశారు.

కాగా.. మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ని నియమించింది. ఇందులో ఉపాసనకు చోటు దక్కింది. ఇందులో భాగంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విషయంమై క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్డ్ ఏర్పాటు చేసింది. 

ఈ బోర్డ్‌లో ఐపీఎల్‌లో లక్నో జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంజీవ్ గోయెంకాని ఛైర్మన్‌గా నియమించారు. కో- ఛైర్మన్‌గా ఉపాసనకు బాధ్యతలు అప్పగించారు. బోర్డ్ సభ్యులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, భూటియా, రవికాంత్ రెడ్డిని నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement