రాజాసాబ్‌ బ్యూటీ బర్త్‌డే.. స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ | The Raja Saab Movie Actress Malavika Mohanan Birthday Poster Released | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: రాజాసాబ్‌ బ్యూటీ బర్త్‌డే.. స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

Aug 4 2025 5:27 PM | Updated on Aug 4 2025 6:27 PM

The Raja Saab Movie Actress Malavika Mohanan Birthday Poster Released

బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan).. ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు (ఆగస్టు 4) ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విషెస్‌తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో చీరకట్టులో ట్రెడిషనల్‌గా కనిపించి ఆకట్టుకుంటోంది మాళవిక. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్‌లో మాళవిక అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో మాళవిక నటన, అందం ప్రత్యేక ఆకర్షణ కానుంది.

"రాజా సాబ్" లాంటి క్రేజీ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం కావడం ఎంతో స్పెషల్‌గా భావిస్తోంది మాళవిక మోహనన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "రాజా సాబ్" చిత్రాన్ని డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement