ఖుషి కలెక్షన్స్‌ దాటేసిన కింగ్డమ్‌.. ఎంతొచ్చాయంటే? | Vijay Devarakonda Kingdom Movie Day 4 Worldwide Box Office Collections Details Inside, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

Kingdom Movie Collections: ఖుషి టోటల్‌ కలెక్షన్స్‌ దాటేసిన కింగ్డమ్‌.. ఎంతొచ్చాయంటే?

Aug 4 2025 4:29 PM | Updated on Aug 4 2025 4:40 PM

Vijay Devarakonda Kingdom 4 Days Collections

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కింగ్డమ్‌ మూవీ (Kingdom Movie)కి కొంత మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. జూలై 31న విడుదలైన ఈ సినిమా మౌత్‌టాక్‌తోనే దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.82 కోట్లు వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ రికార్డు సాధ్యమైంది. నిన్న ఆదివారం కావడంతో వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు.

ఖుషిని దాటేసిన కింగ్డమ్‌
విజయ్‌ హీరోగా నటించిన ఖుషి సినిమా టోటల్‌ రన్‌లో దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసింది. కింగ్డమ్‌ ఆ రికార్డును దాటేసింది. ఏకంగా వంద కోట్ల క్లబ్‌ దిశగా పరుగులు పెడుతోంది. కింగ్డమ్‌ సినిమా విషయానికి వస్తే.. సత్యదేవ్‌, విజయ్‌ దేవరకొండ అన్నదమ్ములుగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించాడు. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. అనిరుద్‌ రవించందర్‌ సంగీతమందించాడు.

 

 

చదవండి: సైలెంట్‌గా తీసుకునేందుకు ఇదేం పెన్షన్‌ కాదు.. ఊర్వశి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement