
మలయాళ నటి ఊర్వశి (Urvashi)కి జాతీయ అవార్డు వచ్చింది. ఉళ్లోళుక్కు చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి పురస్కారం వరించింది. అయితే ఈ అవార్డు గెలిచినందుకు ఊర్వశికి సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉత్తమ నటి పురస్కారం ఇస్తే బాగుండేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఊర్వశి మాట్లాడుతూ.. యాక్టింగ్ అంటే ఇలా ఉండాలనేమైనా కొలమానాలు రాసిపెట్టారా?
పెన్షన్ కాదు
లేదంటే ఫలానా వయసు దాటిందంటే బెస్ట్ యాక్ట్రెస్‌కు బదులుగా ఇలాంటి అవార్డులే ఇవ్వాలని ఏమైనా రూల్ పెట్టారా? మరేంటిదంతా? సైలెంట్‌గా ఇచ్చిందేదో తీసుకునేందుకు ఇదేమీ పెన్షన్ డబ్బు కాదు. మీరు నన్ను సహాయ నటిగా ఏ లెక్కన పరిగణించారు? ఏయే విధానాలు ఫాలో అయ్యారో చెప్పండి. ఉత్తమ నటి/నటుడు పురస్కారానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారో వెల్లడించండి. అవార్డు ప్రకటించారంటే గర్వంతో పొంగిపోయేలా ఉండాలే తప్ప మేము తిరిగి ప్రశ్నించేలా ఉండకూడదు అని జ్యూరీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో పూర్తి విచారణ జరపాలని కేంద్ర మంత్రి సురేశ్ గోపిని కోరింది.
రెండుసార్లు జాతీయ అవార్డు
ఉళ్లోళుక్కు సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇందులో ఊర్వశి లీలమ్మ పాత్ర పోషించింది. ఈ పాత్రకుగానూ ఊర్వశికి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు వరించింది. 2006లో వచ్చిన అచ్చువింటే అమ్మ సినిమాకు సైతం ఊర్వశికి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. ఈ మూవీలో ఆమె హీరోయిన్ అయినప్పటికీ సహాయనటి పురస్కారమే గెలుచుకుంది.
చదవండి: కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్?