
హైదరాబాద్: క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ప్రతేక పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి,. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంక్లేవ్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో సరైన పాలసీ లేకపోవడంతో యువత పెడదారి పట్టిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
మన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కొదవలేదని, క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, నజరానాలు ఇచ్చామన్నారు. గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

హెచ్‌ఐసీసీ(HICC)లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి , సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జాతీయ ,అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రముఖులు, క్రీడా సంస్థల నిర్వాహకులు హజరయ్యారు.