
వరల్డ్ ఫోరమ్ ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ - WFEB (World Forum for Ethics in Business)నిర్వహించిన క్రీడలలో నైతికత, నాయకత్వంపై 7వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం చేశారు.7వ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఎథిక్స్ అండ్ లీడర్‌షిప్ ఇన్ స్పోర్ట్స్ సమ్మిట్లో విలువలు రాజీపడితే విజయం నిజంగా కొనసాగుతుందా లేదా అనే దానిపైనా, తీవ్ర ఒత్తిడి ఉన్న ప్రపంచంలో సమగ్రతతో గెలవడానికి ఏమి అవసరమో అనే దానిపై ఆలోచనాత్మక ఆలోచనల మార్పిడిలో క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం, విద్యాసంస్థలు, NGOలు , థింక్ ట్యాంక్‌ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురితో చర్చించింది.
క్రీడలలో, మీరు గెలుస్తారు లేదా మీరు ఇతరులను గెలిపించుకుంటారు" అని రవిశంకర్ తన ముఖ్యోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో యుద్ధాలు క్రీడలుగా, క్రీడలు యుద్ధాల్లా జరుగుతున్నాయని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఆటల్లో జయాపజయాలను రెండింటినీ స్వీకరించాలన్నారు. ఆట అనే చర్య ఆనందాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం సహజంగానే క్రీడలలో నైతికంగా ఉంటాం ,లేదంటే క్రీడా రంగాలు హింసాత్మకంగా మారిపోతాయన్నారు.
బిడ్డ నడవడం ప్రారంభించినంత సహజంగా క్రీడలుంటాయిని మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని పడవేస్తాయన్నారు. క్రీడలు ,సంగీతం ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఒంటరిగా, నిరాశ, అసంతృప్తులతో బాదపడుతున్నారని ఇది ఆలోచించాల్సిన విషయమని రవిశంకర్ గుర్తు చేశారు మనం మొత్తం జీవితాన్ని ఒక క్రీడగా తీసుకోగలిగితే, ప్రపంచంలో యుద్ధం ఉండదు, గుండెల్లో మంటలు ఉండవు, అపనమ్మకం ఉండదు అని గురుదేవ్ అన్నారు
"ఫుట్‌బాల్ నాకు స్వేచ్ఛగా మారింది," అని ఫలస్తీనియన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సహవ్యవస్థాపకురాలు హనీ తల్జీహ్ పంచుకున్నారు. "అది కేవలం ఆట కాదు, అది ఓ ప్రకటన. ఇది కదలడానికి, మాట్లాడడానికి, కలలు కనడానికి ఓ హక్కు.అడ్డంకులను ఛేదించడంలో , అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో క్రీడలు పోషించగల పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాలస్తీనా మహిళా ఫుట్‌బాల్ జట్టు మొదటి కెప్టెన్ హనీ థాల్జీ ఇలా వ్యాఖ్యానించారు
ఈ మధ్య కాలంలో రికార్డులు నెలకొల్పడం, ఖ్యాతిని సాధించడం అనే లక్ష్యాల్లో నైతిక ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా మారాయి. వీటి వల్ల ప్రేక్షకుల విశ్వాసం దెబ్బతింటోంది. అదే సమయంలో, క్రీడాస్ఫూర్తి, క్రీడా నైపుణ్యం మరియు నైతికత ఒక ఆట యొక్క స్ఫూర్తిని ఎలా ఉద్ధరిస్తాయి, మొత్తం తరాన్ని ఏకం చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి అనేదానికి తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
క్రీడలు శాంతిని నెలకొల్పడానికి ఒక సాధనంగా, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, గరిష్ట పనితీరు మరియు దీర్ఘాయువు మరియు క్రీడలలోనే కాకుండా జీవితంలో మరియు నాయకత్వంలో ఉత్తమంగా ఉండటానికి ఏమి అవసరమో అనే దానిపై సమ్మిట్‌లో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి. ఫెయిర్ ప్లే, టీమ్ స్పిరిట్ ,ఓర్పు వంటి రంగాల నుండి పాఠాలు రాజకీయాలు మరియు వ్యాపారంలో నైతిక నాయకత్వాన్ని ఎలా రూపొందిస్తాయో కూడా సదస్సులో చర్చకు వచ్చింది.
ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన 17 ఏళ్ల కామ్య కార్తికేయన్; ఒలింపిక్ బంగారు పతక విజేత, 400 మీటర్ల హర్డిల్స్‌లో మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్ కెవిన్ యంగ్; ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన స్వ్యటోస్లావ్ యురాష్; పాలస్తీనా ఫుట్‌బాల్ మార్గదర్శకుడు హనీ థాల్జీ; యూరో '96 ఛాంపియన్, టీవీ పర్సనాలిటీ థామస్ హెల్మెర్; ఆసియా క్రీడలలో స్వర్ణం గెలుచుకున్న భారతదేశపు తొలి మహిళా గుర్రపు స్వారీ దివ్యకృతి సింగ్ ఇతర ప్రముఖ వక్తలలో ఉన్నారు.
క్రీడా స్ఫూర్తి మరియు నైతికతలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించే ప్రదర్శనలను ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డులతో సత్కరించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ జెర్డాన్ షకీరికి 'క్రీడ ద్వారా ఏకీకరణ, న్యాయబద్ధత, అంతర్ సాంస్కృతిక సంభాషణకు అతని దీర్ఘకాల నిబద్ధత' కోసం అత్యుత్తమ వ్యక్తిగత అవార్డును ప్రదానం చేశారు. క్రీడలలో మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ సహకారం మానసిక ఆరోగ్యం, క్రీడలో న్యాయబద్ధత , యువ మహిళా అథ్లెట్లకు మద్దతు కోసం ఆమె వాదనకు గాను ఎలైట్ స్విస్ రోవర్ జీనిన్ గ్మెలిన్‌కు లభించింది.

ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్, రెండు దశాబ్దాలకు పైగా నైతిక వాదనలో ముందంజలో ఉంది. శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికత ప్రకారం, విలువలు పనితీరు విరుద్ధమైనవి కావు.అవి విడదీయరాని మిత్రులు అనే సందేశాన్ని ప్రచారం చేయడానికి WFEB యూరోపియన్ పార్లమెంట్, FIFA, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు జెనీవాలోని UN వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని నిర్వాహకులు ప్రకటించారు.