సర్క్యూలర్‌ బిజినెస్‌ మోడల్‌లో తొలి స్పోర్ట్స్ రిటైలర్‌ | Decathlon embedding circularity into its core business model | Sakshi
Sakshi News home page

సర్క్యూలర్‌ మోడల్‌ అనుసరిస్తున్న తొలి స్పోర్ట్స్ రిటైలర్‌

Jun 5 2025 5:22 PM | Updated on Jun 5 2025 6:35 PM

Decathlon embedding circularity into its core business model

డెకాథ్లాన్ ఇండియా తన ప్రధాన వ్యాపార నమూనాలో సర్క్యూలర్‌ బిజినెస్‌ మోడల్‌ను అనుసరిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలోనే ఈ చొరవ చూపిన మొదటి స్పోర్ట్స్ రిటైలర్‌గా నిలిచినట్లు పేర్కొంది. ఈ ‘మిషన్ ఎల్ఐఎఫ్ఈ (లైఫ్స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌)’ స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ వ్యర్థాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.

సర్క్యులర్ బిజినెస్ మోడల్‌లోని అంశాలు..

రిపేర్ సర్వీసులు: 95+ స్టోర్లలో రిపేర్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇది వినియోగదారులు వారి స్పోర్ట్స్ వస్తువులకు మరింత సర్వీసు వెసులుబాటును పొందవచ్చు.

సెకండ్ లైఫ్ రీసేల్: పునరుద్ధరించిన ఉత్పత్తులు 90+ స్టోర్లలో తిరిగి విక్రయించనున్నారు. ఇది క్రీడా పరికరాలను మరింత చౌకగా చేస్తుంది.

బైబ్యాక్ ప్రోగ్రామ్: ఉపయోగించిన పరికరాలను 50+ స్టోర్లలో తిరిగి ఇవ్వవచ్చు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందం

సుస్థిరత లక్ష్యాలు

డెకాథ్లాన్‌ 2024 స్థాయితో పోలిస్తే 2027 నాటికి సర్క్యులర్ బిజినెస్‌ టర్నోవర్‌లో 200% వృద్ధిని అంచనా వేస్తుంది. 2027 నాటికి 3,00,000 కంటే ఎక్కువ క్రీడా ఉత్పత్తులను పునరుద్ధరించాలని భావిస్తుంది. డెకాథ్లాన్ గ్లోబల్ డీకార్బనైజేషన్ వ్యూహంలో భాగంగా 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను, 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే అధిక నాణ్యత, దీర్ఘకాలిక ఉత్పత్తులను సరసమైనవిగా మార్చడం లక్ష్యమని డెకాథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్ ఛటర్జీ నొక్కి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement