Peddapalli District News
-
శ్రమించారు.. విజయం సాధించారు
● టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల హవా ● 550కి పైగా మార్కులు సాధించిన పేదింటి పిల్లలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చూపారు. ఆయా మండలాల్లో టాపర్‌గా నిలిచి ఔరా అనిపించారు. మొత్తం 600 మార్కులకు 550 కిపైగా మార్కులు సాధించిన విద్యార్థుల ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు, తల్లిదండ్రులు అభినందించారు. ప్ర త్యేక తరగతుల నిర్వహణ, సందేహాల ని వృత్తిలో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం, నిరంతరం చదవడం ద్వారా తామీ ఫలితాలు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. జూలపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన పాటకుల ఆశ్విత 568 మార్కులు సాధించింది. అదేవిధంగా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన పిట్టల శ్రీవల్లి 569, రామగిరి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన సిరిపురం శ్రీజ, ఎస్.వర్షిత 580, కమాన్‌పూర్ మండలం జూలపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన వైద్య శ్రీవరుణ్ 572, ఓదెల మోడల్ స్కూల్‌కు చెందిన బి.తన్మయి 561, కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల మోడల్ స్కూల్‌కు చెందిన సహస్ర వర్షిణి 564 మార్కులు సాధించారు. మేనేజ్మెంట్ వారీగా ఫలితాలు -
ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
ధర్మారం(పెద్దపల్లి): ధాన్యంలో నిర్దేశి త తేమశాతం వచ్చిన వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. దొంగతుర్తి, ఖిలావనపర్తి, సాయంపేట, నందిమేడారంలోని ధాన్యం కొనుగో లు కేంద్రాలతోపాటు నందిమేడారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఖిలావనపర్తి పల్లె దవాఖానాను కలెక్టర్ బుధవా రం తనిఖీ చేశారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ గర్భిణి వివరాలను నమోదు చేయాలని, బీపీ, మధుమేహం బాధితులకు మందులు పంపిణీ చేయాలన్నారు. అనంతరం బంజేరుపల్లిలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 71 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్ర గతిపై ఆరా తీశారు. ఏఎంసీ చైర్మన్ రూప్లానాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. -
కొత్తపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ మూసివేత
పెద్దపల్లిరూరల్: కొత్తపల్లిలోని 37వ నంబరు లెవల్‌క్రాసింగ్ గేట్ మూసివేతకు రైల్వే ఉన్నతాధికారు లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం గే ట్ను మూసిఉంచారు. రైల్వేగేట్‌తో అవసరం లే కుండా.. రాకపోకలు సాగించేలా అధికారులు అండర్‌బ్రిడ్జి నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అండర్ బ్రిడ్జి ద్వారా తమ పంట పొలాల కు వెళ్లాలన్నా, పనుల కోసం జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా దూరభారం అవుతోందని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బాలసాని లెనిన్, కలవేన రాజయ్య, పల్లె సదానందం, షుకూర్, శ్రీనివాస్, సతీశ్, అశోక్, సుందర్, సాయి, రాజేందర్, ప్రతాప్, అరుణ్, శంకర్ తదితరులు డిమాండ్ చేశారు. దూరభారమే కాకుండా వానాకాలంలో భూగర్భ వంతెనలోకి వరదనీరు వచ్చిచేరి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
బాలికలదే హవా
● పదో తరగతిలో 96.89శాతం ఉత్తీర్ణత నమోదు ● రాష్ట్రస్థాయిలో జిల్లాకు 10వ స్థానం ● కేజీబీవీ, మైనార్టీ, రెసిడెన్షియల్ స్కూళ్ల సత్తా ● 45 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం పాస్ ● 2024తో పోల్చితే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత ● జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు సాక్షి, పెద్దపల్లి: పదో తరగతి వార్షిక పరీక్షలో జిల్లా విద్యార్థులు ఈసారి మెరుగైన ఫలితాలు సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే.. ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. అయితే, రాష్ట్రస్థాయిలో గతేడాది 8వ స్థానంలో ఉన్న జిల్లా.. ఈఏడాది 10వ స్థానానికి పడిపోయింది. ఎప్పటిలాగే ఫలితాల్లో బాలికల హవా కనిపించింది, గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 7,387మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 7,157 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 96.11శాతం కాగా, బాలికలు 97.67శాతం నమోదు చేసి.. బాలుర కన్నా బాలికలు ముందు వరుసలో నిలిచారు. 45 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత.. జిల్లాలోని 103 ప్రభుత్వ పాఠశాలల్లో 45 పా ఠశాలలు పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఏ ఒక్క పాఠశాలలోనూ జీరో ఉత్తీర్ణత నమోదుకాలేదు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల తరఫున పరిశీలిస్తే.. నిట్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కె.నిత్యామీనన్ 584 మార్కులు సాధించగా, కేజీబీవీ నుంచి 580 మార్కులతో సిరిపురం శ్రీజ, ఎస్.వర్షిత అత్యధిక మార్కులు సాధించారు. నందీమేడారం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి నవిత 568 మార్కులతో టాపర్‌గా నిలవగా, అంతర్గాం మోడల్ స్కూల్ విద్యార్థిని పిట్టల శ్రీవల్లి 569, మైనార్టీ రెసిడెన్షియల్ నుంచి విశ్వశ్రీ 586 మార్కులు సాధించారు. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ.. రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 15రోజుల్లోగా ట్రెజరీ చలానా తీసుకుని హాల్‌టికెట్లు జతచేసి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంత కం చేయించి జిల్లా విద్యాశాఖ అధికారి కా ర్యాలయ పరీక్షల విభాగంలో సమర్పించా లని అధికారులు సూచించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజును మే 16 లోగా, అపరాధ రుసుంతో మే 18వ తేదీ వరకు చెల్లించే వీలుందని అధికారులు వివరించారు. -
ఆస్పత్రులపై దాడులు చేస్తే సహించేది లేదు
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హెచ్చరిక గోదావరిఖని: ప్రభుత్వ వైద్యాధికారులు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులపై దాడులు చేస్తే సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైద్యులు దైవంతో సమానమని, అలాంటి వారిపై దాడులు చేస్తే వైద్యానికి దూరమవుతామన్నారు. తక్కువ ఫీజుతోనే వైద్యం అందించే మంచి డాక్టర్లు ఉన్నారని ఆయన తెలిపారు. రామగుండాన్ని మెడికల్ హబ్‌గా మార్చాలనే ప్రయత్నంలో ప్ర భుత్వ డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తు న్నారని తెలిపారు. మీడియా పేరిట వారిని బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకునేది లేదని మక్కాన్‌సింగ్ హెచ్చరించారు. ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీని వాస్, మాజీ మేయర్, బంగి అనిల్‌కుమార్, డాక్టర్లు నాగిరెడ్డి, లక్ష్మీవాణి పాల్గొన్నారు. కార్మికవాడల్లో బీటీ రోడ్ల ఆధునికీకరణ కార్మిక వాడల్లో బీటీ రోడ్లకు మహర్దశ పడుతోందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆర్జీ–1 ఏరియాలోని సింగరేణి కార్మిక వాడల్లో బీటీ రోడ్డు పనులను జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.5 కోట్ల సింగరేణి నిధులతో 23 కి.మీ. పొడవున తారురోడ్ల ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డీజీఎం కిరణ్‌బాబు, సివిల్ ఎస్ఈ వరప్రసాద్, ఈఈ వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
గోదావరిఖని: నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్ర మాదాలు తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించా రు. సీపీ కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కలిసి పనిచేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విలేజ్, టౌన్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చే యాలన్నారు. దొంగతనాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యా యం చేసేలా చూడాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రవాణా, తాగే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణా కర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పె షల్ బ్రాంచ్, మంచిర్యాల, పెద్దపల్లి, జైపూ ర్, బెల్లంపల్లి, ట్రాఫిక్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రకాశ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, నర్సింహులు పాల్గొన్నారు. గాలివాన బీభత్సం మంథని: డివిజన్లో బుధవారం రాత్రి గా లివాన బీభత్సం సృష్టించింది. మంథని పట్టణంతో పాటు ఆయా మండలాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శాస్తుర్లపల్లి గ్రామంలో రెండు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
నర్సింగ్ విద్యార్థులకు నివాళి
కోల్‌సిటీ(రామగుండం): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని రామగుండం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పల్లె సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన నర్సింగ్ విద్యార్థినులు మహేశ్వరి, మనీషశ్రీ చిత్రపటాలకు గోదావరిఖని శారదానగర్‌లోని నర్సింగ్ కాలేజీలో బుధవారం పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. నర్సింగ్ కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్న విద్యార్ధినులను వాహనం ఢీకొనగా ఇద్దరూ మృతి చెందారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ లు స్వాతి, ప్రియాంక, సంధ్య, భావన, ఉషా, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
అప్పు తీసుకున్న వారు మోసం చేశారని..
జగిత్యాలక్రైం: మాయమాటలు చెప్పి అవసరం నిమిత్తం బంగారం, నగదు తీసుకున్న ఇద్దరు మహిళలు ఇప్పుడు అప్పుడు అంటూ తిప్పుకుంటుండడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధురాలు జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన తోట బాలవ్వ వద్ద జగిత్యాలకు చెందిన అశ్విని, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన విజయ ఇద్దరూ కలిసి తమ అవసరం నిమిత్తం 14 నెలల క్రితం 15 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకుని ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. కాలపరిమితి ముగియడంతో బాలవ్వ డబ్బులు చెల్లించాలని కోరగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దీంతో గతంలోనే బాలవ్వ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ముందు కూడా వారు డబ్బులు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. బుధవారం డబ్బులు చెల్లించేందుకు వాయిదా ఉండటంతో బాలవ్వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు అశ్విని, విజయను పిలిపించారు. వారు డబ్బులు చెల్లించేందుకు కొంతసమయం కావాలని, ఇప్పుడే కావాలంటే తమ వద్ద లేవని నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలవ్వ వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగింది. అక్కడున్న వారు గమనించి బాలవ్వను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలవ్వ చికిత్స పొందుతోంది. పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం ఆస్పత్రికి తరలించిన పోలీసులు -
‘బండ’బారిన బతుకులు
కండలు కరిగించినా.. కొండలు పగులదీసినా.. ● కుండలో మెతుకులు కరువు ● కష్టజీవులకు దక్కని హక్కులు ● ప్రమాదబీమా ఊసేలేదు ● రెక్కాడితే తప్ప డొక్కాడని తుర్కాశీ కార్మికులు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 82 గ్రామాల్లో.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 82 గ్రామాల్లో తుర్కాశీ కార్మికులు ఉన్నారు. వీరంతా నిత్యం గుట్టలు, గుట్టబోరును నమ్ముకుని బండలు కొడుతున్నారు. భవన నిర్మాణాలకు, ప్రహరీలకు, పునాదుల నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తారు. ఎంతో కష్టతరమైన పనిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కండలు కరిగించి కొండలు పగలదీసినా ఇంట్లో కుండలు వెలితిగానే ఉంటున్నాయి. ఎదుగుబొదుగు లేని జీవితంతో బతుకు జట్కాబండిని భారంగా ఈడుస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ధైన్యం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎండా, వాన, చలి ఇవేవి వాళ్లని భయపెట్టవు... రేపటికి పని దొరక్కపోతే ఎలాగన్న వేదన తప్ప... పండుగ పబ్బాలకు పరమాన్నం రుచి ఎరుగరు. జిల్లాలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న తుర్కాశీల బతుకుచిత్రం దుర్భరం. అటవీ ప్రాంతాల్లో పనిచేయడంతో ఫారెస్ట్ అధికారులు బండలు కొట్టవద్దని పనిముట్లను లాకెళ్తున్నారని కార్మికులు వాపోయారు. రెక్కల కష్టాన్ని నమ్మకున్న కార్మికుల బతుకులు బండలవుతున్నాయి. గుర్తింపు లేదు తుర్కాశీ కార్మికులను భవన నిర్మాణరంగ కార్మికులుగా గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా.. కార్మికశాఖ వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణానికి అవసరమైన బండలను కొట్టి సరఫరా చేస్తున్నా గుర్తింపుకార్డులు, భవన నిర్మాణ కార్మికులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు చొరవచూపి జిల్లాలోని తుర్కాశీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు ఇస్తాం భవన నిర్మాణ కార్మికులుగా తుర్కాశీ కార్మికులను గుర్తిస్తాం. తుర్కాశీ కార్మికులు దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో చాలా మందికి గుర్తింపు కార్డులు ఇచ్చాం. ఇంకా ఎవరైనా గుర్తింపు కార్డులు లేని వారు ఉంటే కార్మిక శాఖ ఆఫీస్‌ను సంప్రదిస్తే జారీ చేస్తాం. – నాజర్ అహ్మద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సిరిసిల్ల సిరిసిల్ల: కండలు కరిగించి.. గుట్టలను పిండి చేస్తున్నారు. ఎండ..వాన..చలి.. లెక్కచేయని తనంతో కష్టపడుతున్నారు. అయినా పూటగడవని స్థితిలో తుర్కాశీలు కాలం వెల్లదీస్తున్నారు. భవన నిర్మాణాలకు బండలను సరఫరా చేస్తున్నా వారికి కనీసం కార్మికులుగా గుర్తింపుకార్డులు లేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. బండలు కొడుతూ ‘బండ’బారిన జీవనం గడుపుతున్న తుర్కాశీలపై మేడే సందర్భంగా ప్రత్యేక కథనం. -
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
వేములవాడ: సివిల్ జడ్జి(జూనియర్ బెంచ్) పరీక్షల్లో వేములవాడకు చెందిన సంకెపల్లి జాహ్న వి అర్హత సా ధించారు. పట్టణంలోని భీమేశ్వరాలయం వీధికి చెందిన ఎస్.హరికిషన్ కూతురు జాహ్నవి ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నా రు. నాలుగో ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించారు. 8లోగా దరఖాస్తు చేయాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మున్సిపాలిటీల రికార్డులను ఆడిట్ చేసేందుకు ఆసక్తిగల ఆడిటర్లు ఈనెల 8లోగా దరఖాస్తు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్‌కు సంబంధించిన రికార్డులను ఆడిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత, అనుభవం గల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆడిటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తులను మెప్మా కార్యాలయంలో ఈనెల 8లోగా అందించాలన్నారు. వివరాలకు 63048 94940 నంబరులో సంప్రదించాలని అదనపు కలెక్టర సూచించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఉత్తమ ఫలితంరుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోనగిరి శశివర్ధన్ పదో తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో తన చిన్నబాపు బోనగిరి లక్ష్మీరాజం గుండెపోటుతో మృతిచెందాడు. పుట్టెడు దుఃఖంలోనూ తరగతి పరీక్షలు రాసిన శశివర్ధన్ బుధవారం వెలువడిన ఫలితాల్లో ఉత్తమ 521 మార్కులు సాధించాడు. రుద్రంగి జెడ్పీ హైస్కూల్ టాపర్‌గా నిలిచాడు. విద్యార్థి శశివర్ధన్ను జెడ్పీ హైస్కూల్ అధ్యాపకబృందం, ప్రజా ప్రతినిధులు అభినందించారు. -
వేటగాడి నిప్పు.. చెట్టుకు ముప్పు
బోయినపల్లి(చొప్పదండి): వణ్యప్రాణుల కోసం ఓ వేటగాడు భారీ వృక్షం మొదట్లో నిప్పుపెట్టగా.. అది నేలకొరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పివేశారు. బోయినపల్లి మండలం తడగొండ నుంచి గంగాధర వెళ్లే మార్గంలో ఓ పెద్దచెట్టు మొదలుకు ఓ వేటగాడు రెండు రోజుల క్రితం నిప్పుపెట్టాడు. చెట్టు బొర్రెలో దాగి ఉన్న వణ్యప్రాణుల కోసం మొదట్లో నిప్పు పెట్టాడు. పెద్ద ఎత్తున మంటలు లేవడంతో చెట్టు కూలిపోయి రోడ్డుపై పడింది. అయినా మంటలు తీవ్రంగా ఉండడంతో సమీప పొలాల్లోని రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అనంతరం చెట్టును తొలగించారు. -
కరీంనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయండి
కరీంనగర్‌టౌన్: జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. శాతవాహన వర్శిటీలో శ్రీఖేలో ఇండియా కింద మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్.. మూడు అంశాలపై చర్చించారు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు అనివార్యమని బండి అన్నారు. మెడికల్ హబ్‌గా మారిన నగరానికి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని, బీడీ, నేత కార్మికులతోపాటు వివిధ రంగాల్లో కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈఎస్ఐ సౌకర్యం లేక వారందరు వైద్య చికిత్సకు నోచుకోవడం లేదన్నారు. అదేవిధంగా నగరంలోని అంబేడ్కర్ స్టేడియానికి నిత్యం వేలాది మంది వస్తుంటారని, వారికోసం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని బండి కోరారు. ఖేలో ఇండియా పథకం కింద శాతవాహన వర్శిటీలో రూ.16 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్హాల్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రప్రభుత్వానికి పంపారని గుర్తుచేశారు. స్పందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల వర్శిటీని సందర్శించి మల్టీపర్పస్ హాల్ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ.. ఈఎస్ఐ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, శాతవాహన వర్శిటీలో మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు అంశాలను త్వరితగతిన పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. అంబేడ్కర్ స్టేడియానికి సింథటిక్ ట్రాక్ మంజూరు చేయండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు బండి సంజయ్ వినతి -
పిచ్చికుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
● వరంగల్ ఎంజీఎంకు తరలింపు ఇల్లందకుంట(హుజూరాబా ద్): పిచ్చికుక్కల దాడిలో బా లుడికి తీవ్రగాయాలు అయి న ఘటన బుధవారం మండలంలోని కనగర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన రాజు–వనిత దంపతుల కుమారుడు రెండేళ్ల అయాన్ ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పిచ్చికుక్కలు దా డి చేశాయి. అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, గతంలో కూడా గ్రామంలో పలువురిపై కుక్కలు దాడిచేశాయని, సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు కోల్‌సిటీ(రామగుండం): లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్టైన్ సెటిల్మెంట్ పథకం(ఓటీఎస్) బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ టీకే శ్రీదేవి ఉత్తర్వులను జారీచేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజుపై 25 శాతం రాయితీతో చెల్లింపు గడువు తొలుత మార్చి 31తో ముగియగా, తర్వాత ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించింది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ పూర్తయితేనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వివిధ స్థాయిలో వెరిఫికేషన్ పెండింగ్ ఉండడంతో ఫీజు జనరేషన్ కావడం లేదు. దీనికితోడు కొన్నిసాంకేతిక సమస్యలతో కూడా దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోమూడు రోజులపాటు గడువు పొడిగించడంపై రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లించడానికి ముందుకు వచ్చే దరఖాస్తుదారులకు కొంత ఊరట లభించినట్లయ్యింది. -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల చిన్న గంగన్న (55) బుధవారం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గంగన్న ఏడాది క్రితం చెట్టుపై నుండి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయినా శరీరంలో విపరీతమైన నొప్పులు ఉండడంతో అసౌకర్యానికి గురవుతున్నాడు. మందులు వాడినా నొప్పులు తగ్గడంలేదు. జీవితంపై విరక్తి చెంది ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గంగన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్ కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన కల్లెడ జైపాల్ అక్రమంగా గంజాయి తరలిస్తూ విక్రయిస్తున్న క్రమంలో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. జైపాల్ గంజాయిని కోరుట్ల, కథలాపూర్ ఏరియాలో విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి తనిఖీ చేపట్టగా సిరికొండ శివారులో పట్టుబడ్డాడు. అతడి నుంచి 96 గ్రాముల గంజాయి, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహంకథలాపూర్(వేములవాడ): మండలంలోని పోసానిపేటకు చెందిన గుంట హన్మంతు(42) సౌదీ అరేబియాలో రెండు నెలల క్రితం హత్యకు గురికాగా.. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. హన్మంతు కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాడు. తాను ఉంటున్న గదిలో నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరి 28న గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హన్మంతు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మల్యాల: మండలంలోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన వేల్పుల మార్క్ (21) దుర్మరణం పాలయ్యాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. మార్క్ జగిత్యాల నుంచి వేములవాడ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. మల్యాల క్రాస్‌రోడ్ వద్దకు రాగానే కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 లో జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మార్క్ తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కోన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత జగిత్యాలటౌన్: జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి ఆమెకు అప్పగించారు సిబ్బంది. జగిత్యా ల డిపోకు చెందిన బస్సులో వరంగల్‌కు చెందిన సులోచన కరీంనగర్లో ఎక్కింది. తులం బంగారం, సెల్‌ఫోన్, డబ్బులు ఉన్న బ్యాగ్ ను బస్సులో మరిచిపోయి దిగిపోయింది. బస్ కండక్టర్ గంగప్రసాద్ ఆ బ్యాగ్‌ను గుర్తించి జగిత్యాల డిపోలో అప్పగించారు. ఇంటికెళ్లిన ప్రయాణికురాలు బ్యా గ్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించి టికెట్ ఆధారంగా జగి త్యాల డిపోకు చేరుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన ఆర్టీసీ సిబ్బంది ఆ బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగును అందించిన కండక్టర్ గంగప్రసాద్, సిబ్బ ందికి సులోచన ధన్యవాదాలు తెలిపారు. డిపో క్లర్క్ మొండయ్య తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సులో పొగలు
మల్లాపూర్: అసలే ఎండాకాలం.. ఆపై 120 మంది ప్రయాణికులు.. ఓవర్ హీట్‌తో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ఓ ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటన మల్లాపూర్ మండల కేంద్రం శివారులో బుధవారం చోటుచేసుకుంది. జగిత్యాల డిపోకు చెందిన బస్సు నిర్మల్‌కు బయల్దేరింది. అందులో సుమారు 120మంది ప్రయాణికులు ఎక్కారు. మల్లాపూర్ శివారుకు చేరగానే ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. మరో బస్సు వచ్చేవరకూ ప్రయాణికులు ఎండలోనే వేచి ఉండి ఇబ్బందిపడ్డారు. -
కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్‌అర్బన్: సమ్మర్ క్యాంపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించినట్లు వివరించారు. నాలుగు వారాలపాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఫొటోషాప్ స్కిల్‌లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం 25 మంది చొప్పున విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి రోజూ ఒక పేజీ చేతి రాత ప్రాక్టీస్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి -
ఆరెకరాల్లో మక్క నేలవాలింది
నాకున్న ఆరెకరాల్లో మొక్కజొన్న పంట వేశా. అకాల వర్షంతో కంకి పెట్టే సమయంలో పంట పూర్తిగా నేలవాలింది. దాదాపు రూ.రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. పరిహారం ఇస్తే బాగుంటుంది. – మేకల రామయ్య, మియ్యాపూర్ సర్వేలతో సరిపెట్టవద్దు నాకున్న ఏడెకరాల్లో వరి పంట సాగు చేశా. దాదాపు రూ.2.10లక్షలు పెట్టుబడి పెట్టా. ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట కిందపడి నష్టం జరిగింది. అధికారులు సర్వేలతో సరిపెట్టకుండా, పరిహారం అందిస్తే మాకు కొంత నష్టం పూడుతుంది. – గోపతి సమ్మయ్య, ఓదెల గింజలు రాలిపోయాయి నాకున్న రెండెకరాల్లో సన్నవడ్లు నాటు పెట్టిన. గాలివానకు పొలమంతా నేలమీద పడ్డది. వానకు గింజలు రాలిపోయాయి. అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతంలో లెక్క సర్వేతో సరిపెట్టక పరిహారం అందించి ఆదుకోవాలి. – బుర్ర కొమరయ్య, పెద్దరాతుపల్లి -
పరిహారంపైనే ఆశలు
● ‘అకాలం’తో 3,566 ఎకరాల్లో పంట నష్టం ● ప్రాథమిక సర్వే తర్వాత ప్రభుత్వానికి నివేదిక ● ప్రతిపాదనలు సరే.. పరిహారం ఏదంటున్న అన్నదాత సాక్షి, పెద్దపల్లి: ప్రకృతి మిగుల్చుతున్న విషాదం అన్నదాతను అతలాకుతలం చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందకుండానే పోతున్నాయి. ఈ సీజన్లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన పంటల బీమా పథకం ఊసేలేకపోవడంతో అన్నదాతకు పరిహారం రాని పరిస్థితి నెలకొనిఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మంజూరు చేసే పంట పరిహారంపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. రూ.3.53 కోట్ల నష్టం.. గత మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 505.23 ఎకరాల్లో వరి, 642 ఎకరాల్లో మొక్కజొన్నతోపాటు 1,359మంది రైతులకు చెందిన దాదాపు 1,175.16 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలతో 2,278.07 ఎకరాల్లో వరి, 113ఎకరాల్లో మామిడి.. మొత్తంగా 2,228 మంది రైతులకు చెందిన 2,391.07 ఎకరాల్లో పలు పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తంగా యాసంగి సీజన్లో 3,566.23 ఎకరాల్లో సుమారు రూ.3.53 కోట్ల విలువైన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పంటల బీమా లేదు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఫసల్ బీమా యోజన పథకం లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. ఈపథకంలో ఎకరాకి నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 50శాతం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 25శాతం, రాష్ట్ర ప్రభుత్వం మరో 25శాతం చెల్లించేది. ఈపథకం అమలులోలేక గతంలో పంటనష్టం వాటిల్లినా.. అన్నదాతకు పరిహారం అందలేదు. 2023లో యాసంగి సీజన్లో 6,910 ఎకరాల్లో ఒకసారి, రెండోసారి కురిసిన వర్షంతో 21,900 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పరిహారం మంజూరుపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇప్పడైనా ప్రభుత్వం సర్వేలతో సరిపెట్టక పరిహారం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇదే విషయమై డీఏవో ఆదిరెడ్డిని వివరణ కోరగా ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించామని, త్వరలో రైతుల ఖాతాల్లో పరిహారం సమ్ము జమఅవుతుందన్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సునీతా కుంచాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా న్యాయస్థానంలో జిల్లా జడ్జిని కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు కాంట్రాక్టు కార్మికుల నిరసన ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తమ వేత నాలు, బోనస్, అలోవెన్స్ సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సీఎల్ మ జ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విధులు బహిష్కరించారు. యూనియ న్ నాయకుడు అంబటి నరేశ్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించినా.. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కాలయాపన చేస్తోందన్నా రు. అనంతరం సీజీఎం ఉదయ్ రాజహంసతో నాయకులు చర్చలు జరపగా.. మే 3వ తేదీలో గా డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చార ని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమురన్న, రాంకీగౌడ్, అఫ్జల్, దేవయ్య, నయీమ్, నరేశ్, రవి, శ్రీనివాస్, రమేశ్, ప్రకాశ్, మహేందర్, సతీశ్ పాల్గొన్నారు. కరాటే విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్మంథని: స్థానిక శ్రీలక్ష్మీభారతి ఫంక్షన్హాల్లో మంగళవారం షోటోకాన్ కరాటే ఇన్స్ట్రక్టర్ కోండ్ర నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి జూనియర్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ బెల్ట్‌లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమలో షోటోకాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య, రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎప్‌సెట్ రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో మంగళవారం ఎప్‌సెట్ ప్రారంభమైంది. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించారు. ఆన్లైన్ పద్ధతిన ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి. ఉదయం పరీక్షకు 100 మందికి గాను 95 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 92 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు గోదావరిఖని: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంతర్గాం, పాలకుర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యలు తదితర విషయాలపై మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతో ఆయన చర్చించారు. ఈకార్యక్రమంలో అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
కార్మికులకు అందని ఇన్సెంటివ్
గోదావరిఖని: అధికారుల తప్పిదమా.. బ్యాంకర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ.. యూనియన్ బ్యాంక్ కస్టమర్ల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో గత మార్చినెలకు సంబంధించిన ఇన్సెంటివ్ జమకాలేదు. సింగరేణిలోని రామగుండం డివిజన్–2 ఏరియాలో అత్యధిక బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకునే కార్మికులకు ప్రతీనెల యాజమాన్యం ప్రత్యేక ఇన్సెంటివ్ (ప్రోత్సాహకం) అందిస్తోంది. నెలలో పనిచేసిన మస్టర్లు, ట్రిప్పుల ఆధారంగా ఇన్సెంటివ్ అందజేస్తోంది. ఈ లెక్కన మార్చిలో సుమారు రూ.1,500 – రూ.3,500 వరకు ఒక్కోకార్మికుడి బ్యాంక్ ఖాతాలో జమకావాల్సి ఉంది. ఇది నెల వేతనానికి అదనమని అధికారులు చెబుతున్నారు. ప్రతీనెల 20వ తేదీన ఇన్సెంటివ్ ఖాతాలో జమకావాల్సి ఉంది. ఈవిషయంపై యూనియన్ బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే.. తమకు సంబందం లేదని, యా జమాన్యం జమచేస్తే తాము బ్యాంక్ ఖాతాల్లో జ మచేస్తామంటున్నారని కార్మికులు వాపోతున్నారు. ఎస్బీఐ ఖాతాదారులకు గతనెల 23వ తేదీ వరకే ఇన్సెంటివ్ జమచేశారని వారు పేర్కొంటున్నారు. ఇబ్బందుల్లో యూనియన్ బ్యాంక్ కస్టమర్లు -
బ్యాంకర్లు స్పందించడం లేదు
ఇన్సెంటివ్ కోసం యూనియన్ బ్యాంక్‌కు వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదు. సింగరేణి నుంచి వస్తే మా ఖాతాలో జమచేస్తామంటున్నరు. బొగ్గు ఉత్పత్తి కోసం ఆరాట పడి పనిచేస్తే ఇన్సెంటివ్ జమకావడం లేదు. – జనగామ నర్సయ్య, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3 అధికారులు పరిష్కరించాలి కార్మికులకు రావాల్సిన ఇన్సెంటివ్ చెల్లింపు విషయంలో యాజమాన్యం జోక్యం చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్‌కు వెళ్తే మాకు సంబంధం లేదని అంటున్నరు. సకాలంలో ఇన్సెంటివ్ చెల్లించేలా బ్యాంకర్లతో మాట్లాడాలి. – ఆర్.మోహన్‌రావు, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3 బ్యాంక్‌కో పద్ధతా? ఎస్బీఐలో ఖాతాలు ఉన్న కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఇన్సెంటివ్ ఇప్పటికే జమైంది. యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పటికీ జమకాలేదు. బ్యాంక్ తప్పా, లేక అధికారులు పట్టించుకోవడం లేదా? అనేది తేలాల్సి ఉంది. – మెండె ఓదెలు, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3 -
ప్రధాన కూడళ్లు.. ప్రమాదాలకు నిలయాలు
● కమాన్ చౌరస్తా వద్ద డివైడర్‌ను ఢీకొన్న లారీపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. స్థానిక కమాన్ వద్ద మంగళవారం కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన తాత్కాలిక డివైడర్లతో రోడ్డు ఇరుకుగా మారింది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకున్నా.. రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రాకపోకలను నిత్యం పర్యవేక్షిస్తున్నా.. ప్రమాదాలను నియంత్రించలేకపోతున్నారు. రంగంపల్లి, చీకురాయి క్రాస్‌రోడ్డు, కమాన్‌చౌరస్తా, కూనారం క్రాస్‌రోడ్డు, సివిల్ ఆస్పత్రి, ప్రగతినగర్, బస్టాండ్ ప్రాంతాల వద్ద రోడ్లు దాటేందుకు వాహనదారులు, పాదచారులు జంకుతున్నారు. బస్టాండ్ కూడలిని విస్తరించేందుకు ప్రతిపాదించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించడం, చౌరస్తాల వద్ద రోడ్డు దాటేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. -
కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు కల్పించాలి
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధ మైన హక్కులు కల్పించి, కోలిండియా వేతనాలు అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ క మిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీ–1 జీఎం కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణిలోని వివిధ విభాగాల్లో సుమారు 35వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నా రన్నారు. వారందరికీ చట్టబద్ధమైన వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారని అన్నారు. జేబీసీసీఐ నిర్ణయించిన హైపవర్ క మిటీ వేతనాలను 2013 నుంచి అమలు చేయాల్సి ఉండగా సింగరేణి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆరోపించా రు. కోలిండియా పరిధిలోని కొన్ని సంస్థలు హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేస్తున్నా.. లాభాల్లో నడుస్తున్న సింగరే ణి కుంటిసాకులు చూపి అమలు చేయకపోవడం అన్యాయ మన్నారు. జేఏసీ నాయకులు రియాజ్ అహ్మద్, ఐ.కృష్ణ, కోటగిరి పాపయ్య, సుద్దాల కుమారస్వామి, ఇ.నరేశ్, కొండ్ర మొగిలి, సంగం రాజు, చిటికెల రాయలింగు, గోనె సంతోష్, దబ్బెట సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీ–1 ఎస్వోటూ జీఎంకు వినతిపత్రం అందజేశారు. -
శాంతిచర్చలు జరపాలి
పెద్దపల్లిరూరల్: కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆదివాసీలపై జరుపుతున్న ఏకపక్ష దాడులను ఆపేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ తదితరులు మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసి, గిరిజన ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబి క్కుమంటూ బతుకుతున్నారన్నారు. సాయుధ పోలీసు బలగాలను వెనక్కి పిలిపించి, మావోలతో శాంతి చర్చలు జరపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో వ్యవహరించడం సరి కాదని, అరెస్టు చేసిన ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలన్నారు. నాయకులు నరేశ్, అశోక్, శంకర్, రాజేశం, మల్లేశ్, చంద్రయ్య, లింగమూర్తి, రమేశ్, బుచ్చయ్య, బాలకృష్ణ, బాబు, రాయమల్లు, ప్రసాద్, మొండయ్య తదితరులున్నారు. -
రోడ్డుపై కంకర, ఇసుక కుప్పల తరలింపు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఇసుక, కంకర కుప్పలు, స్టీలు సామగ్రి.. పాటు అక్కడక్కడా పైపులైన్ లీకేజీ మరమ్మతు కుప్పలు.. రోడ్లపై రాకపోకలు సాగించే ప్రజలను తిప్పలు పెడుతున్నాయంటూ ‘సాక్షి’లో సోమవారం ‘మున్సిపాలన ఆగమాగం’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రోడ్లపై పోసిన కంకర, ఇసుకను తీసుకెళ్లారు. చాలారోజులుగా ఉన్న కుప్ప ల తరలింపు మొదలు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ కి కృతజ్ఞతలు తెలిపారు. -
రేషన్‌కార్డును సవరించాలి
నాకు మంజూరు చేసిన రేషన్ కార్డులో అడ్రస్ పొరపాటున కరీంనగర్ అని రాశారు. దానిని సవరించాలని ఆన్లైన్లో విన్నవించుకున్నా. సంబంధిత అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదు. ఇప్పటికై నా రేషన్‌కార్డులో జరిగిన పొరపాటును సవరించాలి. – కొయ్యడ రాము, రంగాపూర్, పెద్దపల్లి దారిని పునరుద్ధరించాలి అంతర్గాం మండలం గోయిల్‌వాడ శివారులో ఉన్న మా భూముల్లోకి వెళ్లేందుకు బ్రాహ్మణపల్లి శివారు నుంచి గోయిల్వాడకు ఉన్న రోడ్డును కొందరు ఆక్రమించుకున్నారు. దీంతో మా భూములను సాగు చేసేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నక్ష ప్రకారం ఉన్న దారిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి. – ఇనగంటి సంతోష్‌రావు, బ్రాహ్మణపల్లి -
సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు
గోదావరిఖని(రామగుండం): డీఎంఎఫ్టీ నిధులు విడుదల చేయాలని కోరుతూ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసినవారిలో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఉన్నారు. అడిషనల్ జూనియర్ జడ్జికి సన్మానంమంథని: మంథని కోర్టులో అడిషనల్ జూని యర్ జడ్జిగా మూడున్నరేళ్లు పనిచేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు బదిలీపై వెళ్తున్న మూల స్వాతిగౌడ్కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ తరఫున సన్మానించి మెమొంటో అందించారు. సీనియర్ సివిల్ జడ్జి భవాని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, జనరల్ సెక్రెటరీ సయేందర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె.రఘోత్తంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మే 1 నుంచి జూన్ 10వరకు ఉచితంగా సమ్మర్‌క్యాంపు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7వతరగతి చదివే విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో 400 మంది వలంటీర్లతో 305 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సమ్మర్‌క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు క్యాంపు ఉంటుందన్నారు. ఈ క్యాంపులో శిక్షణ పొందేందుకు వచ్చే విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఉచిత బోధన అందిస్తామన్నారు. విద్యార్థులకు చదవు పట్ల ఆసక్తి పెంచేలా సూచనలు ఇవ్వడం తోపాటు ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. పాఠాలు భోధించడం, ఆట, పాటలతో చదవడం, నీతికథలు వినిపించడం, కుటుంబ బంధాలు, విలువలు, చదువు ప్రాముఖ్యత తదితర అంశాలను వివరించేలా వలంటీర్ల బోధన సాగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పని సరిగా సమ్మర్క్యాంపులకు పంపించి సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. నేడు బల్దియాలో దరఖాస్తుల పరిశీలనకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు పరిశీలించనున్నట్లు కమిషనర్(ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కండేయకాలనీ శాఖ, రమేశ్‌నగర్ శాఖ, లక్ష్మీనగర్శాఖ పరిధిలోని అభ్యర్థుల అర్జీలు పరిశీలించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ పాన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్, ఆహారభద్రత కార్డు, ఆదాయం, కులధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కమిషనర్ కోరారు. ప్రభుత్వానికి పంట నష్టం నివేదికపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలు, రైతుల పేర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించామని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి తెలిపారు. మార్చి 21న కురిసిన అకాల వర్షాలతో 1,175 ఎకరాల 16 గుంటల్లో పంటనష్టం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 15న కురిసిన వానలకు 2,391 ఎకరాల 7గుంటల్లో పంట నష్టం సంభవించిందని వివరించారు. ఇందులో వరి 2,7 83 ఎకరాల 30 గుంటలు, మొక్కజొన్న 642 ఎకరాల 7గుంటలు, ఇతరపంటలు 140 ఎకరా ల 26 గుంటలుగా ఉందని పేర్కొన్నారు. రైతు ల వారీగా పంట నష్టం వివరాలు, బ్యాంకుఖా తా, ఆధార్‌కార్డు వివరాలు నివేదించామని, ప్ర భుత్వం నుంచి పరిహారం నిధులు నేరుగా రై తుల ఖాతాకే జమ చేసే అవకాశముందన్నారు. -
బైపాస్ పనులకు బ్రేక్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల– పెద్దపల్లి సెక్షన్‌లోని బైపాస్ రైల్వేలైన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇటీవలకాలంలో పనులు వేగంగా సాగాయి. కానీ.. అకస్మాత్తుగా పెద్దపల్లి బైపాస్‌లో పనులు నిలిచిపోయాయని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకా రం.. పెద్దపల్లి బైపాస్ పనులు నిబంధనల మేరకు జరగడం లేదని, పనుల్లో నాణ్యతపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని, తదుపరి ఆదేశాలు వచ్చేసరికి పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల ఆఖరును ప్రారంభం కావాల్సిన రైల్వేలైన్ మరికాస్త ఆలస్యం కానుందని సమాచారం. వాస్తవానికి మార్చి ఆఖరునాటికి బైపాస్ పనులు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. మార్చి 28నుంచి ఇంటర్‌లాకింగ్ పనులు మొదలవుతాయని, ఉగాది కల్లా పనులు పూర్తవుతాయ ని, ఉన్నతాధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాక.. మే నెలాఖరునాటికి బైపాస్ లైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తారని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ఇటీవల ఇంటర్‌లాకింగ్ పను ల పరిశీలనకు వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు పనులు నిబంధనల ప్రకారం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మొత్తం 1.78 కిమీ పొడవున్న రైల్వేలైన్‌లో 500 మీటర్ల వరకు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో బైపాస్ రైల్వేలైన్ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. జూన్ నుంచి కానరాని కరీంనగర్–తిరుపతి రైలు కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా తిరుపతివెళ్లే కరీంనగర్– తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మొన్నటి వరకు మే 29 తేదీ నుంచి పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా బైపాస్ మీదుగా వెళ్తుందని ప్రచారం జరిగింది. దీన్ని బలపరుస్తూ ఐఆర్సీటీసీ పోర్టర్‌లోనూ మే 29 తరువాత పెద్దపల్లి రైల్వేస్టేషన్ కనిపించలేదు. జూన్ 1 నుంచి కరీంనగర్–తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐఆర్సీటీసీ పోర్టర్లో కానరావడం లేదు. దీనికి కారణాలు అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం బైవీక్లీగా ఉన్న ఈ ససర్వీసు కరీంనగర్‌కు ఉదయం 8.15 గంటలకు వస్తుంది. ఆ తరువాత సాయంత్రం 7.15 గంటలకు తిరిగి తిరుపతి బయల్దేరుతుంది. ఈనేపథ్యంలో ఈ రైలును నిజామాబాద్ వరకు పొడగిస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ రైలును పొడిగిస్తారా? లేదా సర్వీసును వారానికి ఐదురోజుల పెంచుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పెద్దపల్లి రైల్వే బైపాస్ లైన్లో అనూహ్య మలుపు! తొలుత మే నెలాఖరుకు ప్రారంభిస్తారని ప్రచారం పనులు జరుగుతున్న తీరుపై అధికారుల అసంతృప్తి? పూర్తి అయ్యేందుకు మరింత సమయం ఐఆర్సీటీసీలో కానరాని కరీంనగర్– తిరుపతి రైలు నిజామాబాద్ వరకు పొడిగింపుపై ఉత్కంఠపెద్దపల్లి రైల్వేబైపాస్లో స్టేషన్ కట్టాల్సిందే అదే సమయంలో బైపాస్ రైల్వే లైన్ వద్ద హాల్టింగ్ లేకుండా ప్రారంభమైతే.. తాము తిరుపతి వెళ్లేందుకు అవకాశం కోల్పోతామని పెద్దపల్లిలో రైలెక్కే మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, సిర్పూర్ కాగజ్‌నగర్, చెన్నూరు, ధర్మారం, ఆసిఫాబాద్ భక్తులు ఆందోళన చెందుతున్నారు. లేకపోతే గతంలోలా తామంతా కాజీపేట వరకు ప్రయాణం చేసి పద్మావతి లాంటి రైళ్లను అందుకోవాల్సి వస్తుందని, ఇది దూరాభారంతోపాటు తమకు సమయం కూడా వృథా అవుతుందని వాపోతున్నారు. దీనికి పరిష్కారంగా పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ వద్ద రైల్వేస్టేషన్ నిర్మించి, తిరుపతి–కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. -
ఊరిస్తున్న పదవులు
● హస్తం పార్టీలో సంస్థాగత సందడి ● మండల స్థాయి నుంచి డీసీసీ వరకు పదవుల నియామకానికి కసరత్తు ● డీసీసీపై పలువురు నేతల ఆసక్తి, జోరుగా ప్రయత్నాలు ● 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులని స్పష్టత ● సీనియర్లుతో పాటు మహిళలు, యువతకు పెద్దపీట సాక్షి, పెద్దపల్లి: కాంగ్రెస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీలో పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జిల్లాకు పీసీసీ పరిశీలకులుగా అజ్మతుల్లా హుస్సేనీ, సంగీతం శ్రీనివాస్‌ను నియమించింది. వీరు ఈనెల 30వ తేదీ వరకు జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. మే 4 నుంచి 19 వరకు బ్లాక్, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు, అదే నెల 13 నుంచి 20 వరకు మండలస్థాయి సమావేశాలు నిర్వహించేలా రూట్ మ్యాప్ ను ప్రకటించింది. ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఏఐసీసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల విస్తృత అభిప్రాయాలను పరిశీలకులు సేకరించి జాబితాలను వడపోస్తారు. చివరికి పీసీ సీకి నివేదించనున్నారు. సామాజి క సమీకరణలు, నాయకుల సమర్థత, సీనియార్టీ, నియోజకవర్గాలు, ఆయా బ్లాక్, జిల్లాల్లో పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలోని ముఖ్యనాయకులు పదవులు దక్కించుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి మొదలైంది. సీనియర్లకే ప్రాధాన్యం 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే మండల, బ్లాక్, డీసీసీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. డీసీసీలు, మండల, బ్లాక్ కమిటీలే ఇకపై పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలివ్వడంతో ఈ పదవులు దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. మండల అధ్యక్ష పదవికి ఐదుగురు, బ్లాక్, డీసీసీ అధ్యక్ష పదవులకు ముగ్గురు చొప్పున పేర్లను సూచించాలని నిర్ణయించారు. పదవుల్లో మహిళలతో పాటు యువతకు పెద్దపీట వేయనున్నారు. డీసీసీ పీఠం పైనే ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో మండల, బ్లాక్, జిల్లా అధ్యక్ష పదవులపై నేతల్లో పోటాపోటీ నెలకొంది. అయితే ప్రధానంగా జిల్లా అధ్యక్ష పదవులు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి క్యాడర్లో నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ పేర్కొనడంతో అందరి దృష్టి డీసీసీ కమిటీలపై పడింది. దీంతో కొందరు నేతలు తమ అనుచరులను డీసీసీ పీఠాలపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2017 నిబంధన కూడా మరికొందరికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. 2017 నిబంధనతో కొత్తగా పార్టీలో చేరిన వారి ఆశలు నెరవేరే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పదవుల పంపకాల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందో అనే ఉత్కంఠ క్యాడర్లో నెలకొంది.నామినేటెడ్ మరింత ఆలస్యమే..తాజాగా పార్టీ సంస్థాగత కమిటీల నియామకాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలవడంతో మరికొంత కాలం నామినేటడ్ పదవుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులకు పార్టీ డీసీసీ అధ్యక్షులుగా, ఇతర కీలక పదవులు అప్పగిస్తారనే చర్చ సైతం జరుగుతోంది. దీంతో నామినేటెడ్ పదవుల ఆశావహుల్లో ఒకింత గందరగోళం నెలకొంది. -
ప్రజా‘వాణి’.. పరిష్కరించాలని
పెద్దపల్లిరూరల్: ‘సారూ.. నా భూమికి పట్టాదార్ పాసుపుస్తకం ఇప్పించండి’ అంటూ కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లికి చెందిన కనకయ్య ప్రజావాణిలో విన్నవించుకున్నాడు.’ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అందించిన వినతులను సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచొద్దని, వెంటనే పరిష్కరించాలన్నారు. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై విన్నవించిన బాధితులు అర్జీలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ వేణు -
ఉత్సాహం నింపిన కేసీఆర్ స్పీచ్
● మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ అన్నివర్గాల ప్రజల్లో ఉత్సాహం నింపిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సభకు ఎన్ని అడ్డంకులు పెట్టినా మంథని నియోజకవర్గంలోని కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, పలిమేల మండలాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, రైతులు, అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను సభకు తీసుకువెళ్లి సభ సక్సెస్‌కు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతీ మాటను అర్థం చేసుకోవాలని, ఆయన స్ఫూర్తితోనే ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జీజీహెచ్‌లో డాక్టర్ చంద్రశేఖర్ సరెండర్కోల్సిటీ(రామగుండం): రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డి.చంద్రశేఖర్‌ను ప్ర జా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులకు సరెండర్ చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్‌సింగ్ సోమవారం ప్రకటనలో తె లిపారు. ఈనెల 26న జిల్లా కలెక్టర్ జీజీహెచ్ ఆస్పత్రిని పరిశీలించిన సందర్భంగా, డాక్టర్ చంద్రశేఖర్ ఆస్పత్రిలోని ఎంఐసీయూ వార్డు పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తూ వైద్య వృత్తికే అవమానకరంగా వ్యవహరించడం, పేషెంట్లకు అందించే సేవలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సూపరింటెండెంట్ తెలి పా రు. అలాగే ఎలాంటి సమాచారం అందించకుండా రెండు రోజులపాటు విధులకు గైర్హాజరు అ య్యారని తెలుసుకున్న కలెక్టర్, డాక్టర్ చంద్రశేఖర్‌ను సరెండర్ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. పెద్దపల్లి ‘బంద్’కు బీజేపీ మద్దతుపెద్దపల్లిరూరల్: పహల్గాంలో ఉగ్రవాద చర్యను నిరసిస్తూ 29న చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తలపెట్టిన పెద్దపల్లి బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ సహ అన్నివర్గాల వారు బంద్‌లో పాల్గొంటున్నారని, ప్రజలు సహకరించాలని కోరారు. నాయకులు సదానందం, పర్శ సమ్మయ్య, నర్సింగం, మోర మనోహర్, శివంగారి సతీశ్, మంథని కృష్ణ, రాజవీరు, సంతోష్, నితీశ్తివారీ, కరుణాకర్ ఉన్నారు. -
మే ఒకటి నుంచి శిక్షణ శిబిరాలు
జ్యోతినగర్(రామగుండం): జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మే ఒకటి నుంచి జూన్ 10 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. సోమవారం ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎంఈవో చంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్, పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్స్‌లో శిక్షణ నిమిత్తం 90 మంది వలంటీర్లను ఎంపిక చేసి జిల్లా రిసోర్స్‌పర్సన్స్ రవి, సంపత్‌రెడ్డి ఒక రోజు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వలంటీర్లు ఆటలు, డ్రాయింగ్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ బోధిస్తారని పేర్కొన్నారు. రెండు మండలాల విద్యాధికారులు ఏకాంబరం, విమల, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సంగీత, కమలాకర్‌రావు, గాయత్రిదేవి, గోపి, భూమయ్య, క్లస్టర్ రిసోర్స్‌పర్సన్స్ రామ్‌కుమార్, వెంకట్, శ్రీనివాస్, సతీశ్, శ్రీలత, గౌస్, జ్యోతి, వాణిశ్రీ తదితరులున్నారు. -
జీరో బిల్లు రావడం లేదు
ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ, నాకు ఆ పథకం కింద లబ్ధి చేకూరడం లేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. ఉన్నతాధికారులు స్పందిస్తారనే ఆశతో వచ్చా. – కలవేన కోటేశ్, పెద్దపల్లి ప్రభుత్వ భూమిని కాపాడాలి సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారు. ఆ భూమిని ప్ర జో పయోగ పనులకే విని యోగించేలా చూడాలి. సంబంధిత భూసర్వే అధి కారులతో హద్దులు నిర్ణయించి ఆక్రమణ దా రుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలి. – ఎదుల్ల మల్లయ్య, తొగర్రాయి -
జీవాలకు మేత లేకుండాపోతోంది
ఎనుకట పశువులు, జీవాలు (మేకలు, గొర్లు)మేసేందుకు ఆకు ఆలం, గడ్డి పుష్కలంగా ఉండేది. నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు ఇప్పటికీ అక్కడక్కడ తిరుగుతున్నాయి. గుట్టలు తవ్వి మట్టి తీసుకుపోతుండటంతో కనపడకుండా పోయాయి. గుట్టలు ఉంటే వానలు కూడా పడతాయని ఎనుకటోళ్లు చెప్పేటోళ్లు. సర్కారు చర్యలు తీసుకుని గుట్టలను కాపాడాలి. – తిప్పనవేన కొమురయ్య, కాల్వశ్రీరాంపూర్ నోటీసులు ఇచ్చాం పాండవుల గుట్ట ఆక్రమణకు గురువుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. కొందరికి నోటీసులు ఇచ్చాం. ఆక్రమణకు పాల్పడినా, మట్టిని తరలించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు పెట్టాం. ఇటీవల పందిల్ల బోళ్ల గుట్ట ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకున్నాం. – జగదీశ్వర్‌రావు, తహసీల్దార్, కాల్వశ్రీరాంపూర్ -
టెండర్లకే పరిమితం
● జెడ్పీ కార్యాలయం భవన నిర్మాణానికి నిధులు మంజూరు ● ఇంకా ప్రారంభం కాని పనులు ● ప్రత్యేకాధికారికి చాంబర్ కరువు ● రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహణ ● కొత్త పాలకమండలి వస్తే సమావేశాలెక్కడో..?పెద్దపల్లిరూరల్: జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మించేందుకు నిధులు మంజూరైనా.. ఇంకా పనులు మొదలు కావడంలేదు.. తాత్కాలికంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఇరుకై న గదుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జెడ్పీ పాలకమండలి పదవిలో కొనసాగినంత కాలం చైర్మన్ చాంబర్ కోసం కేటాయించిన భవనాన్ని, పదవీకాలం ముగియడంతో తహసీల్దార్ ఆఫీసుకు కేటాయించారు. దీంతో ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎప్పుడైనా కార్యాలయానికి వస్తే కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ఎంపీడీవో ఆఫీసును కూల్చి కట్టాలనుకుంటే.. పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న ఎంపీడీవో ఆఫీసు భవనాన్ని కూల్చి ఆ స్థానంలో జిల్లా పరిషత్ కార్యాలయ భవనంతో పాటు, మండల కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రతిపాదించినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఎంపీడీవో ఆఫీసు భవనాన్ని ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటుకు కేటాయించారు. దీంతో ఎంపీడీవో కార్యాలయమే ప్రస్తుతం అద్దె భవనంలోకి మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని ఖాళీ స్థలంలోనే జెడ్పీ కార్యాలయాన్ని నిర్మించేలా చర్యలు చేపట్టారు. నిధులు మంజూరై టెండర్లు పూర్తయినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రత్యేకాధికారిగా వచ్చినా.. జిల్లా పరిషత్ కార్యాలయానికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రావతరణ, రిపబ్లిక్, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో కార్యాలయానికి వచ్చినా.. బయటే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వెనుదిరగాల్సిన పరిస్థితులున్నాయి. కార్యాలయంలో కూర్చునేందుకు చాంబర్ ఏర్పాటుకు అనువుగా లేకపోవడమే కారణం. కార్యాలయ సిబ్బందే ఇరుకై న గదుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. నిధులు మంజూరయ్యాయి జిల్లా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోనే నిర్మించనున్నారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు మొదలు కావాల్సి ఉంది. – నరేందర్, జెడ్పీ సీఈవో -
దారి పొడవునా.. దర్జాగా
ముత్తారం(మంథని): ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీకి వెళ్లే లారీలు వందల సంఖ్యలో ఇలా నడిరోడ్డుపై నిలపడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక క్వారీ నుంచి తాడిచెర్లకు వెళ్లే ప్రధాన రోడ్డు వరకు ఇష్టారీతిన నిలుపుతున్నారు. రోడ్డుపై లారీలు నిలపడమేంటని ఎదురుగా వచ్చే వాహనాదారులు ప్రశ్నిస్తే క్వారీ నిర్వాహకులు, డ్రైవర్లు దురుసుగా ప్రవరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఖాళీ స్థలంలో లారీలు నిలపాలని, రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చెయ్యొద్దని స్థానికులు కోరుతున్నారు. -
కేసీఆర్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలి
మంథని/పెద్దపల్లిరూరల్: మాజీ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మంథని నియోజకవర్గంలో వెలుగులు నింపేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్తున్న సందర్భంగా మంథని ప్రభుత్వ కళాశాల ఎదురుగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి 40 ఏళ్లు అవకాశం ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతలేదని, కనీస వసతులు లేని నియోజకవర్గంగా మారిందన్నారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16నెలలు గడుస్తున్నా 16 పైసల పని చేయలేదన్నారు. సభకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ ప తాకాన్ని ఆవిష్కరించారు. నియోజకవర్గం లోని అ న్ని మండలాలు, గ్రామాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో ఎల్కతుర్తికి తరలివెళ్లారు. మనోహర్‌రెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. సభకు తరలివెళుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
వైద్యులపై చర్యలు
నిర్లక్ష్యం వహించే ● సకాలంలో సమర్థవంతమైన సేవలందించాలి ● సూపర్‌స్పెషాలిటీ వైద్యం కోసం ప్రత్యేక ఆస్పత్రి ● రామగుండంలో కార్డియాలజీ సేవలు ● సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్రాజ్కుమార్సింగరేణి వ్యాప్తంగా..● కొత్తగూడెంలో మెయిన్ ఆస్పత్రి ● 6 ఏరియా ఆస్పత్రులు ● 21 డిస్పెన్సనరీలు ● 821 బెడ్లు ● 180 మంది వైద్యులు ● 57 మంది స్పెషలిస్ట్ వైద్యులు ● 123 మంది మెడికల్ ఆఫీసర్లువైద్య సేవలు పొందుతున్న ఉద్యోగులు.. ● 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ● 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ● 1.60 లక్షల మంది మాజీ ఉద్యోగులు -
పాండవుల గుట్ట గుల్ల
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో 597 సర్వే నంబర్లో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాండవుల గుట్ట ఆక్రమణకు గురై ఆనవాళ్లు కోల్పోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అజ్ఞాత సమయంలో పాండవులు ఇక్కడ సేద తీరినందువల్లే పాండవుల గుట్టగా ఇక్కడి ప్రజలు చెప్పుకునే చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పాండవుల గుట్ట నేడు ఆక్రమణకు గురై కనుమరుగువుతోంది. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గుట్ట మట్టిని తవ్వి ఆ నేలను ఆక్రమిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గుట్టపై జగత్ మౌనీశ్వరాశ్రమం, సప్తదేవ కన్యలు, సప్తమాత్రుకలు, శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, నాగదేవత ఆలయాలు కొలువై ఉన్నాయి. వేద పాఠశాల నిర్వహణతో నిత్యం వేద పారాయణంతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోంది. ఇటీవల ఇదే ప్రాంత్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణంతో భజనలు, కీర్తనలతో ఈప్రాంతం అలరారుతోంది. ఈ ఆలయాలకు వెనుక వైపు భాగం ఆక్రమణకు గురవుతుండటంతో ఈ గుట్ట మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఆవాసం, మేత కరువు.. ఈగుట్టపై నెమళ్లు, కుందేళ్లు, చెట్లపై రకరకాల పక్షులు నివాసముండేవి. గుట్ట మట్టితో పాటు చెట్లను నరికివేయడంతో పక్షులు, వన్యప్రాణులు కనుమరుగుతున్నాయి. చెట్లు నరికి వేస్తుండటంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికై నా ఆక్రమణకు గురికాకుండా అడ్డుకుంటేనే పశుపక్షాదులు, వన్యప్రాణుల రక్షణ సాధ్యమవుతుంది. ఆక్రమిస్తూ.. మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు చారిత్రక నేపథ్యం ప్రశ్నార్థకం పశుపక్షాదులు, వన్యప్రాణులకు మేత, ఆవాసం కరువు -
మున్సి‘పాలన’ ఆగమాగం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో మున్సి‘పాలన’ గాడి తప్పుతోంది. వాహనదారులు, పాదచా రులు పట్టణంలో రోడ్లపై నడవాలంటే భయపడే ప రిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం కోసమంటూ తెచ్చిన కంకర, ఇసుక కుప్పలను జెండా ప్రాంతంలోని ఆటోస్టాండ్ ప్రాంతంలో పోసి నె లలు గడుస్తోంది. ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు త ప్పడం లేదు. ఇక జెండా నుంచి కమాన్ వెళ్లే మార్గంలోనూ భవన నిర్మాణాల కోసం తెచ్చిన సామగ్రి రో డ్లపైనే పోయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాంగ్రెస్ ఆఫీసు సమీపంలో ప్రధానరోడ్డుపైనే పైపులైన్ లీకేజీని గుర్తించిన అధి కారులు పనులు చేపట్టకుండా వదిలేశారు. ఇప్పటికై నా రోడ్లపై ఉన్న నిర్మాణ సామగ్రిని తొలగించేలా చర్యలు చేపట్టడంతో పాటు లీకేజీ పనులు పూర్తయ్యేలా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
రేపు పెద్దపల్లి బంద్
పెద్దపల్లిరూరల్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి మృతులకు సంతాప సూచకంగా ఈనెల 29న (మంగళవారం) పెద్దపల్లి బంద్ పాటిస్తున్నామని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిషోర్ శారడ, ప్రధాన కార్యదర్శి మస్రత్, కోశాధికారి వినోద్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో మాట్లాడారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ సహ, ఆటో, వ్యాన్, లారీ అసోసియేషన్లు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటాయని పేర్కొన్నారు. బంద్‌తో ప్రజలకు కొంత ఇబ్బంది కలిగినా.. దేశ పౌ రులను ఉగ్రవాదులు బలితీసుకోవడానికి నిరసనగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎల్లంపల్లిలో తగ్గుతున్న నీటిమట్టంరామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం సగానికి పైగా తగ్గిపోయింది. ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 356 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోకు 316, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి కేంద్రాలకు మిషన్ భగీరథ కోసం 81, 190 క్యూసెక్కులు ఎండకు ఆవిరి అవుతుండగా మొత్తం ప్రాజె క్టు నుంచి 708 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. మూడురోజులు దరఖాస్తుల పరిశీలన కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు దరఖాస్తుల పరిశీలన చేయనున్నట్లు కమి షనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. సోమవా రం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గోదావరిఖని శాఖ, మేడిపల్లి లింగాపురం శాఖ, 8 ఇంక్లయిన్‌కాలనీ శాఖ పరిధిలో దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. మంగళవారం యూ నియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్, మార్కండేయ కాలనీశాఖ, రమేశ్‌నగర్ శాఖ పరిధిలోని అభ్యర్థులకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని, బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్, గోదావరిఖని శాఖ, మేడిపల్లి చౌరస్తా శాఖ, బ్యాంక్ ఆఫ్ ఇండియా జ్యోతినగర్ శాఖ, హెచ్డీఎఫ్ సీ, రామగుండం శాఖ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, గోదావరిఖని శాఖ, ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీసీ బ్యాంక్, కేడీసీసీ, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకు శాఖల పరిధిలోని అభ్యర్థుల దరఖా స్తుల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఆహారభద్రత కార్డు, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో షెడ్యూల్ ప్రకారం హాజరుకావాలని కోరారు. -
కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం
సుల్తానాబాద్/జూలపల్లి: పథకాల పేరిట నాయకులు డబ్బు వసూలు చేస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ కట్ చేసుడేనని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్లో రూ.60 లక్షలతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, ట్రాలీలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. అవినీతి లేకుండా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలుపాల్సిన అవసరం ఉందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, సీవో స్వరూప, మేనేజర్ అలీమొద్దీన్, ఏఎంసీ చైర్మన్ మినూపాల ప్రకాష్ రావు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. గడువులోగా స్టిచ్చింగ్ చేయాలి మహిళా సంఘాలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘానికి అందించిన ఆటోను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మహిళ సంఘాల సభ్యులకు కుట్టుమిషన్ శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారితో విద్యార్థుల డ్రెస్సులను స్టిచ్చింగ్ చేయించి గడవులోగా అందజేయాలని కోరారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. శనివారం మండలంలోని కోనరావుపేట, జూలపల్లి మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. స్థానిక ఫంక్షన్‌హాలులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. తహసీల్దార్ స్వర్ణ, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే విజయరమణారావు -
నలభై ఏళ్ల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలే
● మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్మంథని: నలభై ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన తండ్రీకొడుకల హయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మించలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. శనివారం మండలంలోని అడవిసోమన్‌పల్లి సమీపంలో మానేరు బ్రిడ్జి మరమ్మతు పనులను పరిశీలించారు. స్వర్గీయ పీవీ నరసింహారావు మంథని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను రెండు బ్రిడ్జిలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం రూ.300 కోట్లతో అవసరం లేని చోట బ్రిడ్జి తీసుకవచ్చారని ఆరోపించారు. 16 నెలలు గడుస్తున్నా సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండడం విడ్డూరమని, కనీసం మరమ్మతులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా మరమ్మతు పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు తగరం శంకర్‌లాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి రామగిరి(మంథని): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కారించాలని మాజీ ఎమ్మెల్యే మధుకర్ డిమాండ్ చేశారు. మంథని జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కళాశాల ఎదుట 8 రోజులుగా చేస్తున్న సమ్మెకు శనివారం మద్దతు పలికారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. వివిధ కళాశాలల్లో సుమారు 1,100 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల్లు విధులు నిర్వహిస్తున్నారని, నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయలన్నారు. మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
ధైర్య సాహసాలకు రివార్డు
గోదావరిఖని(రామగుండం): విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్‌కు శనివారం డీజీపీ జితేందర్ హైదరాబాద్‌లో నగదు రివార్డు అందజేశారు. గంజాయి కేసులో నిందితుడు ఎస్సారెస్పీ కెనాల్లో దూకి పారిపోతుండగా టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్ ప్రాణాలకు తెగించి కెనాల్లో దూకి నిందితుడిని పట్టుకున్నారు. ఇద్దరినీ డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. నార్కోటిక్ ఏడీజీ సందీప్‌శాండిల్యా, లాఅండ్ఆర్డర్ ఏడీజీ మహేశ్‌భగవత్, ఏడీజీ పర్సనల్ అనిల్, నార్కోటిక్స్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ పాల్గొన్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్ ఎస్సై, కానిస్టేబు ల్కు రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా అభినందనలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం● పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరిఖని(రామగుండం): శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు పోలీస్‌శాఖ ఎలా వ్యవహరిస్తుంది? ఘర్షణలకు పాల్పడిన వారిపై ఏ చర్యలు తీసుకుంటారనే అంశాలపై పోలీసులతో మాక్‌డ్రిల్ చేపట్టామన్నారు. జన సమూహాలను కంట్రోల్ చేసేందుకు మొదటగా హెచ్చరికలు వినకపోతే మెజిస్ట్రేట్, ఉన్నతాధికారుల అనుమతితో భా ష్పవాయువు ప్రయోగించడం తదితర అంశాలను ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. గోదావరి ఖని ఏసీపీ ఎం.రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సైలు రమేశ్, భూమేశ్, ఉదయ్‌కిరణ్, మానస, సంధ్యారాణి, వెంకట్ ఆర్ఎస్సై శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బంద్ ప్రశాంతంసుల్తానాబాద్(పెద్దపల్లి): దేశంలో ఉగ్ర మూలాలను అంతం చేయాల్సిందేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం సుల్తానాబాద్‌లో హిందూ ఐక్యవేదిక పిలుపుమేరకు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. పట్టణంలో బీజేపీ నాయకులు, హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇస్తున్నవారిని కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు. హిందువులందరూ ఐక్యంగా నిలిచి ముందుకు వెళ్లినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులు ఎస్.కుమార్, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్, గుర్రాల మల్లేశం, కామనీ రాజేంద్రప్రసాద్, నాగరాజు, వెంకటేశ్, సతీశ్, నాగేశ్వర్, కొల్లూరి సతీశ్, రాజు, కుమార్, వనజ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డీపీవో ఆకస్మిక తనిఖీరామగుండం: అంతర్గాం మండలం గోలివాడ గ్రామాన్ని శనివారం జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సందర్శించారు. పంచాయతీలో రికార్డులు పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని సెగ్రిగేషన్ షెడ్‌ను పరిశీలించారు. పారిశుధ్య కార్మికులు చెత్తను తడి, పొడిగా విభజించి కంపోస్టు ఎరువు తయారుచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, ఖాళీ స్థలాలకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) రుసుము చెల్లించేలా ఓనర్లతో నేరుగా సంప్రదింపులు జరపాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పారిశుధ్య పనులు ఉదయం 11 లోగా, సాయంత్రం 5–7 గంటల వరకు పూర్తి చేయించాలన్నారు. ఎంపీడీవో వేణుమాధవ్, సూపరింటెండెంట్ కరుణాకర్, ఏపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మనిషికి ఆధార్.. భూమికి భూధార్
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: సమాజంలో మనిషికి ఆధార్‌కార్డు ఇచ్చిన మాదిరిగానే.. భూమి ఉన్న రైతుకు భూధార్ కార్డు అందించి భూ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి శివారు రంగంపల్లిలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూసమస్యలు పెరిగాయని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. రైతుల సమస్యలు అధికారులే పరిష్కరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సకాలంలో పూర్తి చేయాలి సుల్తానాబాద్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో చేపడుతున్న కొత్త నిర్మాణాలపై నిఘా పెట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్అండ్బీ ఈఈ భావ్‌సింగ్, కమిషనర్ నిహాజ్ తదితరులున్నారు. వైద్యులకు కలెక్టర్ అభినందన అపెండిక్స్ వ్యాధితో బాధపడుతున్న పెద్దపల్లికి చెందిన మహిళకు ప్రభుత్వాసుపత్రిలో సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులు సాయిప్రసాద్, అమరసింహరెడ్డి, సూపరింటెండ్ శ్రీధర్ లను కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలను మెరుగ్గా అందిస్తున్నారని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. -
ఏడాదిలోగా పెర్క్ ్సపై ఇన్‌కంట్యాక్స్ మాఫీ
గోదావరిఖని/రామగిరి(మంథని): ఏడాదిలోగా కార్మికుల పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేస్తామ ని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1, 2లో ఏర్పాటు ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మా ట్లాడారు. సింగరేణి భవిష్యత్, కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ పోరాటం చేస్తుందన్నారు. మొన్న కవిత గోదావరిఖనిలో మాట్లాడు తూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు బోగస్ అనటం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా రూ.5వేల చొప్పున అందజేసిందని అన్నారు. నాయకులు నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, వికాస్కుమార్, దాస్ ఉన్నారు. -
భూ సమస్యలకు పరిష్కారం
పాలకుర్తి(రామగుండం): భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. స్థానిక రైతువేదికలో శు క్రవారం నిర్వహించిన భూభారతి చట్టంపై రై తులకు ఆయన అవగాహన కల్పించారు. ధర ణి పోర్టల్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల కు కొత్త చట్టం ద్వారా మేలు చేకూరుతుందని తెలిపారు. తహసీల్దార్ జ్యోతి, ప్రత్యేకాధికారి జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్‌చారి, వ్యవసాయాధికారి ప్రమోద్, సింగిల్‌విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, సదస్సుకు అనూహ్యంగా రైతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రైతువేదిక భవనం కిక్కిరిసిపోయింది. చాలామంది స్థలంలేక ఆరుబయట నిల్చోవాల్సి వచ్చింది. వినియోగం పెంచాలి గోదావరిఖని: పనిగంటలు సద్వినియోగం చే సుకోవాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3ని ఆ యన శుక్రవారం సందర్శించారు. తొలుత కృషిభవన్‌లో బొగ్గు ఉత్పత్తిపై సమీక్షించారు. క్యాంటిన్లో సదుపాయాలు తనిఖీ చేశారు. అ ధికారులు, ఉద్యోగులతో కలిసి టిఫిన్ చేశారు. జీఎం వెంకటయ్య, ఎస్వోటూ జీఎం రాము డు, ఏరియా ఇంజినీర్ నర్సింహారావు, ఇంజినీర్ రాజాజీ, పర్సనల్ డీజీఎం అనిల్‌కుమార్, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ప్రాజెక్టు మేనేజర్ భారత్‌కుమార్, డీజీఎం విజయ్‌కుమార్, సీఎస్ పీ ఇన్చార్జి సదానందం పాల్గొన్నారు. పంచాయతీ ఆఫీస్ తనిఖీ రామగిరి: నాగెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీపీవో వీరబుచ్చయ్య శుక్రవారం తనిఖీ చేశారు. పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. వివిధ అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. పగిలిన పైపులైన్ పరిశీలన రామగుండం: స్థానిక అక్బర్నగర్కాలనీ సమీపంలో పగిలిన బూడిద పైపులైన్‌ను ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సామంత శుక్రవారం పరిశీలించారు. గత బుధవారం బూడిద పైపులైన్ పగిలి కాలనీలోని పలు ఇళ్లను బూడిదనీరు ముంచెత్తిన విషయం విదిదమే. బాధిత కు టుంబాలను పరామర్శించిన ఈడీ.. నష్ట నివారణ చర్యలను చేపట్టాలని ఎన్టీపీసీ హెచ్ఆర్ ఏజీఎం సిగ్దర్ను ఆదేశించారు. తమకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయాలని, యాష్‌పాండ్ నుంచి వచ్చే బూడిద నివారణకు నీటిని చల్లించాలని, డ్రైనేజీ, రోడ్లు నిర్మించాల ని కాంగ్రెస్ మైనార్టీ మహిళా విభాగం ప్రతినిధులు నాజియా సుల్తానా, సంగనవేణి శేఖర్, జక్కుల నారాయణ, షేక్ ముంతాజ్ అహ్మద్ తదితరులు ఈడీని కోరారు. మెడికోలకు సిమ్స్‌లో జిమ్ కోల్‌సిటీ(రామ గుండం): గోదావ రిఖనిలోని సిమ్స్ లో మెడికోల కో సం త్వరలో కొత్త గా జిమ్ ఏర్పాటు చేస్తామని ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ తెలిపారు. శుక్రవారం మెడికల్ కాలేజీలో మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీతోపాటు హాస్టల్లో రక్షిత మంచినీటిని సరఫరాకు రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లు, జీజీహెచ్‌లో మరో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేసినట్లు తె లిపారు. కాలేజీలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్, ఎమర్జెన్సీ, గైనిక్ పీజీతోపాటు పీడీయాట్రిక్, జనరల్ సర్జన్ పీజీ కోర్సుల కోసం విన్నవించామని తెలిపారు. జీజీహెచ్‌లో సేవలు మెరుగయ్యాయని ఆమె అన్నారు. కాగా, సెకండీయర్లోని 138 మంది మెడికోలు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇందులోని 28 మందికి 75 శాతానికిపైగా మార్కులు వచ్చినట్లు వెల్లడించారు. జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో మేలు
● ధరణి సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం అమలులోకి.. ● అప్పీలుకు జిల్లాస్థాయిలో భూట్రిబ్యునల్ ఏర్పాటు ● సాదాబైనామాల విషయంలో ఆర్డీవోకు అధికారాలు ● స్థోమతలేని పేదలకు ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయసేవలు ● రైతుల సందేహాలు నివృత్తి చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష సాక్షి: కొత్త చట్టంపై అవగహన సదస్సులు ఎలా ఉన్నాయి? రైతులు అధికంగా ప్రస్తావిస్తున్న అంశాలు ఏమిటి? కలెక్టర్: జిల్లాలోని 14మండలాల్లో ఇప్పటివరకు 10 మండలాల్లో చేపట్టిన అవగాహన సదస్సులకు హాజరయ్యా. పేర్లు, విస్తీర్ణంలో పొరపాట్ల సవరణ, సాదాబైనామా, సర్వే నంబర్ల మిస్సింగ్స్‌పై రైతులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భూహక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అ ర్హులైన వారు కొత్త చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఆర్డీవో, తహసీల్దార్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈనెల 30 వరకు ప్రతీ మండలంలో కొత్త చట్టం గురించి వివరిస్తూ, రైతుల సందేహాలు నివృత్తి చేస్తాం. సాక్షి: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా? కలెక్టర్: ధరణిలో మ్యుటేషన్‌కు ముందు విచారణ లేదు. దీంతో వారసుల మధ్య వివాదాలు తలెత్తాయి. కానీ కొత్త చట్టంలో వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే దరఖాస్తుతోపాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, సర్వేమ్యాపు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ 30రోజుల్లో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అవుతుంది. సాక్షి: గతంలో భూ సమస్య పరిష్కారానికి సీసీఎల్‌కు వెళాల్సి వచ్చేది. కొత్త చట్టం ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది? కలెక్టర్: ధరణి చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదు. కోర్టులను ఆశ్రయించాల్సిందే. కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రెండంచెలుగల అప్పీల్ వ్యవస్థ ఉంది. తహసీల్దారు చేసిన మ్యుటేషన్లు లేదా జారీచేసిన పాసుపుస్తకాలు లేదా భూధార్‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు, ఆయన ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌కు, కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్‌కు రెండో అప్పీల్ చేసుకునే వీలుంది. ఇలా జిల్లాలోనే సమస్య పరిష్కారమవుతుంది. సాక్షి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూభారతిలో అవకాశం ఉందా? కలెక్టర్: 2014 జూన్ 2వ తేదీకన్నా ముందు వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి, 12ఏళ్లుగా అనుభవంలో ఉంటే క్రమబద్ధీకరణ కోసం .. 2020 నవంబర్ 11 కన్నా ముందు దరఖాస్తు చేసుకున్న వాటిపై ఆర్డీవోలు విచారణ చేస్తారు. అర్హుల నుంచి ప్రస్తుత రిజిస్టేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీచేస్తారు. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు. సాక్షి: కొత్త చట్టంలోని గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చాయా? కలెక్టర్: భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఈ రికార్డులో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యుటేషన్ చేసిన ప్రతీసారి ఆన్లైన్లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అధికారిని నియమిస్తారు. మాట్లాడుతున్న కలెక్టర్ కోయ శ్రీహర్షసాక్షి, పెద్దపల్లి: ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ధరణిలోని అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందన్నారు. సమస్యపై దరఖాస్తు చేస్తే నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తుందని తెలిపారు. ఏటా డిసెంబర్ 31న భూభారతి రికార్డులు అప్డేట్ చేస్తారన్నారు. అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి భూ భారతి ఆర్వోఆర్ చట్టం–2025లోని అనేక సందేహాలకు ‘సాక్షి’ ఇంటర్యూలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిష్కార మార్గాలు చూపారు. సాక్షి: భూ భారతి, ధరణికి మధ్య తేడా ఏమిటి? కలెక్టర్: ధరణితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకే భూభారతి చట్టం తీసుకొచ్చారు. విస్తీర్ణం తగ్గడం, సర్వే నంబర్, పేర్లలో పొరపాట్లు, పట్టాభూమి ప్రభుత్వ భూమిగా, కొనుగోలు చేసిన భూమి వారసత్వ భూమిగా నమోదు కావడం.. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఇప్పటిదాకా కోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదు. భూ భారతితో అప్పీల్ చేసుకునేందుకు జిల్లాస్థాయిలోనే ట్రిబ్యునల్ అందుబాటులోకి వస్తుంది. కోర్టుకు వెళ్లే అవసరం లేదు. జిల్లాస్థాయిలోనే భూసమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రికార్డు అవుతాయి. సాక్షి: భూ ఆధార్ కార్డు అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? కలెక్టర్: భూ రికార్డుల ఆధునీకరణలో భాగంగా ప్రతీ భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. భవిష్యత్‌లో మనిషికి ఆధార్‌కార్డు ఉన్నట్లు భూమికి భూదార్ కార్డు అందిస్తారు. దీనికోసం జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేసి ఫొటోతో కూడిన భూధార్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, మ్ముటేషన్కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. -
ఊరూవాడా ఉప్పైనె కదులుతోంది..
గోదావరిఖని: ఎల్కతుర్తి శివారులో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవసభకు ఊరూవాడా ఉప్పైనె కదులుతోందని ఆ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక ప్రె స్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండాను గుండెకు హత్తుకుందామని మహాసభకు ప్రజానీకం తరలివస్తోందని అన్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది సభకు తరలివెళ్లేలా 70 బస్సులు, పెద్దసంఖ్యలో కార్లు, ఆటోలు సమకూర్చామని ఆయన వెల్లడించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో బషీర్‌బాగ్ పోలీస్కాల్పుల్లో రైతుల మృతికి నిరసనగా ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 14 ఏళ్ల ఉద్యమంతో తెలంగాణ సాధించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానం వెనక్కి పోయిందని విమర్శించారు. తెలంగాణ గొంతుక కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నినదిస్తోందని ఆయన పేర్కొన్నారు. నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, గోపు అయిలయ్య యాదవ్, బోడ్డు రవీందర్, కుమ్మరి శ్రీనివాస్, కలవచర్ల కృష్ణవేణి, బొడ్డుపల్లి రవీందర్, జనగామ కవితాసరోజిని, తోట వేణు, చెలకలపెల్లి శ్రీనివాస్, అచ్చె వేణు, నూతి తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలిరండి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ -
బిల్లులు రాక.. నిర్మాణం పూర్తికాక
● ఇబ్బందుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ● తొలిదశలో రూ.లక్ష సాయం అందక చాలామంది పేదల ఆవేదన సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బేస్మెంట్స్థాయిలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ తొలిదశ బిల్లులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల మేరకు 600 చ.గ. విస్తీర్ణంలోపు నిర్మించుకుంటేనే బిల్లులు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని, ఆపై నిర్మించుకుంటే నిబంధనలు అంగీకరించవని మరోవైపు అధికారులు వివరిస్తున్నారు. 61 మందికి చెల్లింపు.. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం తొలిదశలో రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఇలా జిల్లావ్యాప్తంగా 61 మందికి రూ.61లక్షలను హౌసింగ్ అధికారులు జమచేశారు. తొలిదశలో మంజూరైన ఇళ్లు 1,940 జిల్లాలో తొలిదశలో 1,940 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ముగ్గు పోసినవి 671 ఉండగా, 149 బేస్మెంట్స్థాయికి చేరాయి. మరో 140 ఇళ్లు జీపీఎస్ సహకారంతో పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈ పరిశీలించారు. మిగతా ఇందిరమ్మ ఇళ్లు ప్రగతి దశలో ఉన్నాయి. 600 చ.గ. విస్తీర్ణం కన్నా ఎక్కువ ఉంటే.. తొలిదశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. 600 చ.గ. కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్నాయని, అందుకే బేస్మెంట్ స్థాయికి చేరినా బిల్లులు మంజూరు కావడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బేస్మెంట్స్థాయిలోని ఇళ్ల వివరాలను ఆన్లైన్లో సవరించుకునే అవకాశం ఉందని, ఈ విషయాన్ని లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలూ ఉన్నాయి. ఎమ్మెల్యే దృష్టికి సమస్య.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. మంత్రి శ్రీధర్‌బాబు సూచనలతో స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. నిబంధనల మేరకు బిల్లుల చెల్లింపు జిల్లాలో నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తాం. 400 చ.గ. – 600 చ.గ. విస్తీర్ణం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మించుకున్న 61 మందికి తొలిదశలో రూ.లక్ష చొప్పున బిల్లులు చెల్లించాం. మిగతా వారికి విచారణ జరిపాక బిల్లులు చెల్లిస్తాం. – రాజేశ్వర్, హౌసింగ్ పీడీ, పెద్దపల్లి -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జూలపల్లి(పెద్దపల్లి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. వడ్కాపూర్, కాచాపూర్, వెంకట్రావు పల్లె, కీచులాటపల్లె, కుమ్మరికుంట గామాల్లో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాక మాట్లాడారు. ధాన్యంలో కోతలు విధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో ప్రత్యూష, ప్యాక్స్ చైర్మస్ వేణుగోపాలరావు, నాయకుడు నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యంతో చదివితేనే గుర్తింపు సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): విద్యార్థులు ఉ న్నత లక్ష్యంతో చదివితేనే మంచిగుర్తింపు లభించడంతోపాటు భవిష్యత్ బాగుంటుందని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి మో డల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియేట్ పరీక్ష ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వారిని ఎమ్మె ల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సి పాల్ గోల్డీ బల్బీర్‌కౌర్, అధ్యాపకులు ఉన్నారు. ● ఎమ్మెల్యే విజయరమణారావు -
మే నెలంతా సెలవులివ్వాలి
పెద్దపల్లిరూరల్: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా మే నెలంతా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెలవులివ్వాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి కోరారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావుకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావుతో పాటు శోభ, అంజనాదేవి, శ్యామల, రామలక్ష్మి, కృష్ణకుమారి, సుగుణ, మహేశ్వరి, సులోచన, వసంత పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ అధికారుల వైఫల్యంతోనే పగిలిన బూడిద పైపు
● ఎంపీ వంశీకృష్ణరామగుండం: ఎన్టీపీసీ అధికారుల నిర్లక్ష్యంతోనే అక్బర్‌నగర్ సమీపంలో బూడిద పైపులైన్ పగి లిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం అక్బన్నగర్లో సందర్శించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. పునరావాస గ్రామాలపై ఎన్టీపీసీ యాజమాన్యం తాత్కాలిక అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ నిధులు వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. రక్షణచర్యల్లో భాగంగా పైపులైన్ల నాణ్యత, గడువు కాలంపై ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిన అవస రం ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ దృష్టికి తీసుకెళ్లి విచారణను కోరనున్నామన్నారు. ఇప్పటికై నా ఎన్టీపీసీ అధికారులు బాధితులకు సంపూర్ణ నష్టపరిహారం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీతో డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీని వాస్, ఎన్టీపీసీ అధికారులు తదితరులున్నారు. -
సాదా బైనామాలకు మోక్షం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్: రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదాబైనామాలకు రాష్ట్ర ప్రభుత్వం మోక్షం కలిగించిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పూసాల, శాసీ్త్రనగర్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతులెవరూ లేరని అన్నారు. 15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూభారతి చట్టం ప్రవేశపట్టారని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, అందుగులపల్లి గ్రామాల్లో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. నాయకులు ఆడెపు వెంకటేశం, చందశంకర్, గంట రమేశ్, సంతోష్, కందుల అశోక్, మల్లన్న తదితరులున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
ఓదెల/ముత్తారం: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం ఓదెల, ముత్తారం తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 9.25లక్షల సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయన్నారు. భూభారతి చట్టం ద్వారా భూమి సరిహద్దులు పక్కాగా నిర్ణయిస్తారని తెలిపారు. భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉందని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయించాల్సి ఉంటుందని, ఇందుకు గ్రామస్థాయిలో పరిపాలన అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ, ఐకేపీ సెంటర్ సందర్శన ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ శ్రీహర్ష గురువారం సందర్శించి రోగుల కు వైద్య సేవలు అందుతున్నాయా లేదా తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలనపై ఆరా తీశా రు. ఐకేపీ సెంటర్‌ను సందర్శించి ధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ సునీత తదితరులున్నారు. ఆస్పత్రి నిర్మాణానికి భూమి చూడండి మంథని: మంథనిలో నూతనంగా 50 పడకల ఆస్పత్రి నిర్మించేందుకు భూమిని త్వరగా అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం మంథనిలో పలు స్థలాలను సందర్శించారు. పాత నీటి పారుదల కార్యాలయం, ఇతర కార్యాలయాలను అనువైన చోటికి తరలించే పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు ఉన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తప్పనిసరి
కాల్వశ్రీరాంపూర్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని డీపీవో వీరబుచ్చ య్య పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో తాగునీటి సమస్యలు, పారిశుధ్య పనులపై సమీ క్ష సమావేశం నిర్వహించారు. తాగునీటి బావుల్లో పూడికతీత, ఆర్డబ్ల్యూఎస్ పథకాలు, వాగు, మానేరు నదిలో బోరుబావుల నుంచి పైపులైన్లను పరిశీలించారు. తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో పూర్ణచందర్రావు, ఎంపీవో మహ్మద్ ఆరీఫ్, సూపరింటెండెంట్ శ్రీధర్, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం కాల్వశ్రీరాంపూర్: జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ వేడుకలను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీపీవో వీరబుచ్చయ్య హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జాతీయ పంచాయితీ రాజ్ ఆవశ్యకత, ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ పంచాయతీ రాజ్ ఆవిర్భావంతో పాలన వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి వేగవంతమైందన్నారు. ఎంపీడీవో పూర్ణచందర్రావు, ఎంపీవో మహ్మద్ ఆరీఫ్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
రోడ్డు దాటడం కష్టమైతంది
పెద్దపల్లి పట్టణంలో వాహనాల రద్దీ పెరిగింది. రాజీవ్ రోడ్‌ను దాటాలంటే కష్టమైతంది. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానకూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసినా వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులను నియమించాలి. – సోడాబాబు, పెద్దపల్లి బైపాస్ రోడ్డు పనులు చేపట్టాలి రాజీవ్ రోడ్డుపై బైక్‌పై ప్రయాణించడం సాహసం చేసినట్టే అవుతోంది. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. పట్టణానికి మంజూరైందంటున్న బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలి. బైపాస్ రోడ్డు నిర్మిస్తే భారీ వాహనాలతో ఇబ్బందులుండవు. –ముత్యాల రాజయ్య, తుర్కలమద్దికుంట కూడళ్ల వద్ద నియంత్రణ చర్యలు ప్రధాన కూడళ్ల వద్ద నియంత్రణ చర్యలు చేపడతాం. కమాన్ వద్ద యూటర్న్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న కారణంగా ఇటు చీకురాయి క్రాస్‌రోడ్డు, అటు కూనారం క్రాస్‌రోడ్డు వద్ద నుంచి యూటర్న్ తీసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటాం. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలను నియంత్రిస్తాం. – అనిల్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి -
పచ్చదనం పెంచేలా చర్యలు
కోల్‌సిటీ: రామగుండంలో పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. గురువారం అశోక్‌నగర్ ఉపరితల జలాశయం ఆవరణలోని పట్టణ ప్రకృతి వనంను పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా ఉద్యానవనాలు, పచ్చదనం పెంచేందుకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విఠల్‌నగర్‌లో డ్రైయిన్ నిర్మాణ పనులు, 27, 29, 7వ డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులకు సంబంధించి పలు సూచనలుచేశారు. ఆమె వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రామన్, ఏఈ తేజస్విని, టీపీఎస్ నవీన్ తదితరులున్నారు. మలవ్యర్థాలను ఎఫ్‌ఎస్‌టీపీకి తరలించాలి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనాల ద్వారా సేకరించిన మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన ఫీకల్ స్లడ్స్ ట్రీట్మెంట్(ఎఫ్ఎస్టీపీ)కు తరలించాలని కమిషనర్ అరుణశ్రీ సూచించారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే అన్ని వాహనాలు నగర పాలక సంస్థ కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకొని అనుమతి పొందాలన్నారు. మలవ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తే వాహనాలకు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలనకోల్సిటీ: రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సాఫీగా సాగుతోంది. గురువారం మూడు బ్యాంకు శాఖలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. భారీగా దరఖాస్తుదారులు తరలివస్తుండడంతో బ్యాంకు శాఖల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఇబ్బందులు కలగకుండా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షిస్తున్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణపెద్దపల్లిరూరల్: కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం దుర్మార్గమన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. న్యాయవాదులు సత్యనారాయణరెడ్డి, మొగిలి, అజయ్ క్రాంతిసింగ్, డివిఎస్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దుకు పోరాడుదాం గోదావరిఖని: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్కోడ్ల రద్దు కోసం ఉద్యమించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇ.నరేశ్ అన్నారు. ఆర్జీ–1 సివిక్ విభాగంలో గురువారం మేడే పోస్టర్ విడుదల చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సింగరేణి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం నిలిపివేసి, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని కోరారు. నాయకులు ఐ.రాజేశం, ఎడ్ల రవికుమార్, దీక్ష కుమారి, రాజేశ్వరి, సాయి, హరి, లక్ష్మి, మమత, దుర్గ, సంపత్, పోశమ్మ, శేఖర్ పాల్గొన్నారు. -
భయపెడుతున్న భానుడు
● ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి ● భారీగా పగటి ఉష్ణోగ్రతలు ● గరిష్టంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుజ్యోతినగర్: జిల్లాలో భానుడు ఎండ వేడిమికి ప్రజలు భయపడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గురువారం జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లిలో గరిష్టంగా ఉష్ణోగ్రత 44.5 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రజలు ఎండ వేడిమికి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు (డిగ్రీల సెల్సియస్‌లలో) ఇలా ఉన్నాయి.. మండలం ప్రాంతం కనిష్టం గరిష్టం పాలకుర్తి ఈశాలతక్కళ్లపల్లి 34.1 44.5 రామగిరి ఆర్జీ–3 ముల్కలపల్లి 34.0 44.5 పెద్దపల్లి పాలితం 33.1 44.4 సుల్తానాబాద్ సుగ్లాంపల్లి 33.9 44.3 పెద్దపల్లి రంగంపల్లి 32.8 44.2 ఓదెల ఓదెల 32.9 44.2 సుల్తానాబాద్ కనుకుల 33.1 44.1 పెద్దపల్లి భోజన్నపేట 32.4 44.0 -
ఒకే వంట
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఒకే ఇల్లు..బలం.. బలగం ● ఇంటి పెద్ద మాటకు కట్టుబడి ● బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ ● ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలుభీమనాతి బలగంఉమ్మడి కుటుంబం.. జీవిత పాఠం.. అలాంటి కుటుంబాల్లో భావోద్వేగాలకు..ఆప్యాయతలకు చోటుంటుంది. ఏది మంచో.. ఏది చెడో బాల్యం నుంచే చిన్నారులకు చెప్పే వారుంటారు. నీతి కథలు.. పెద్దల అనుభవాలు జీవిత పాఠాలుగా ఉపయోగపడుతాయి. ఏ ఆపదొచ్చినా.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరు కాపురాల సంఖ్య పెరుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరి దారి వారిదే.. ఇలాంటి రోజుల్లో కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. విభేదాలు లేకుండా క లిసిమెలిసి ఉంటున్నారు. అలాంటి వారిపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.. – కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్‌కాలనీ వేములవాడ/ముత్తారం/మల్యాలతరతరాలుగా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కాలం గడుపుతూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కుటుంబం కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో నివాసముంటోంది. కుటుంబ పెద్ద భీమనాతి కాంతయ్య–గంగుబాయి దంపతులకు ఒక కుమార్తె, ఆరుగురు కుమారులు. భీమనాతి శ్రీనివాస్, వేణుగోపాల్, జనార్దన్, శ్రీధర్, దామోదర్, సాయికృష్ణ. కాంతయ్య ఇటీవల మృతిచెందినా ఆయన కొడుకులు తల్లి గంగుబాయితో కలిసే ఉంటున్నారు. వారసత్వంగా వస్తున్న ఐరన్హార్ట్వేర్ వ్యాపారంలో వీరంతా స్థిరపడ్డారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో పాటు పిల్లలు ఉన్నారు. తల్లి గంగుబాయితో కలిసి కొడుకులు–కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు అంతా 27 మంది ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉండటమే కాదు.. ఒకే వంట కావడం విశేషం. రోజూ చిన్నపాటి ఫంక్షన్ తీరుగా ఇల్లంతా పెద్దలతో పాటు పిల్లాపాపలతో కళకళలాడుతుంది. తరతరాలుగా ఈ కుటుంబం ఉమ్మడిగా కాలం గడపటం నిజంగా ఈ కాలంలో ఓ వింతగానే తోస్తోంది. – వివరాలు 10లోuన్యూస్‌రీల్ -
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికొత్తపల్లి: నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్‌రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో ‘ఖని’ యువకుడు మృతి
కోల్‌సిటి(రామగుండం): గోదావరిఖనికి చెందిన సాఫ్ట్ట్వేర్ లక్కేడి శ్రీధర్‌రెడ్డి(42) అమెరికాలో మృతి చెందారు. కుటుంబ స భ్యుల కథనం ప్రకారం.. స్థానిక ఎల్బీనగర్కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి లక్కేడి మాధవరెడ్డి ప్రస్తుతం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు శ్రీధర్‌రెడ్డి పదేళ్లుగా అమెరికాలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉ న్నారు. మూడు నెలల క్రితం శ్రీధర్‌రెడ్డి క్యాన్సర్‌కు గురయ్యారు. అక్కడే చికిత్స పొందుతున్నా రు. కొడుకును చూసుకోవడానికి రెండు నెలల క్రితం తండ్రి మాధవరెడ్డి కూడా అమెరికా వె ళ్లారు. ఈ నేపథ్యంలోనే భారతకాలమానం ప్ర కారం మంగళవారం సాయంత్రం శ్రీధర్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ జరిగిన రెడ్డి అంత్యక్రియలను గోదావరిఖనిలోని అతడి సోదరుడు రమణారెడ్డి, బంధువులు ఆన్లైన్ లో వీక్షించారు. పోయిందనుకున్న బంగారం దొరికింది మల్యాల(చొప్పదండి): ఏమరుపాటులో ఓ గృహిణి ఓ వ్యక్తికి బియ్యం విక్రయించింది. అయితే అందులో మూడు తులాల బంగారం దాచిన విషయాన్ని మరిచిపోయింది. మరుసటి రోజు విషయం గమనించిన ఆ గృహిణి సదరు వ్యక్తిని పట్టుకుని విచారించడంతో బంగారం దొరికింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మల్యాల మండలం నూకపల్లికి చెందిన ఓ గృహిణి మూడు రోజుల క్రితం దొడ్డుబియ్యాన్ని ఓ వ్యక్తికి విక్రయించింది. అందులో మూడు తులాల బంగారాన్ని దాచిన విషయాన్ని మరిచిపోయింది. అదేరోజు సాయంత్రం బంగారం దాచిన విషయం గుర్తుకొచ్చి.. బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి కోసం గాలించింది. అయినా అతడి ఆచూకీ లభించలేదు. రెండురోజులు క్రితం సదరు వ్యక్తి నూకపల్లికి రాగా.. గృహిణి అతడిని ప్రశ్నించింది. తాను బంగారాన్ని చూడలేదని, బియ్యాన్ని గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు చెప్పడంతో మంగళవారం సదరు మహిళా కుటుంబసభ్యులు గుంజపడుగుకు వెళ్లి బియ్యంలో వెదికారు. అందులో బంగారం బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. యువతి ఆత్మహత్యజగిత్యాలక్రైం: పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ(28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతుజగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగి త్యాలలో చోటుచేసుకుంది. స్థానిక మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నా నమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశానవాటిక పక్కనే ఉ న్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గ ల్లంతయ్యాడు. గజఈతగాళ్లను రంగంలోకి దింపినా ఆచూకీ లభ్యం కాలేదు. యువకుడు మృతి చెంది ఉంటాడని కుటుంబీకులు రోదిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జూలైలో గుంటూరుపల్లిలో దొంగలు తాళంవేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ.2.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డులోని రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగుటగొట్టి మద్యం సీసాలు, బైక్ అపహరించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్, హత్రుసింగ్, జితేన్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని ఏసీపీ వివరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను గత నెలలో రిమాండ్‌కు పంపించామని, మరో నిందితుడైన హత్రుసింగ్ను కొత్తపల్లి ఎస్సై ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో దార్ జిల్లా నరవాలిలో అదుపులో తీసుకొని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈకేసులో మరో నిందితుడు జితేన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే ఆయనూ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది శ్రీనాథ్, అబ్దుల్ ఖదీర్, షరీఫ్, సాంబరెడ్డి, దేవేందర్‌ను అభినందించారు. -
‘చీట్’ఫండ్ వ్యాపారం
జగిత్యాల పట్టణంలోని ఓ షాపు నిర్వాహకుడు రాజు కరీంనగర్రోడ్లోగల లో చిట్‌ఫండ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి చాలా రోజులు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్రోడ్లోగల ఓ చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో 15 రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. ● జగిత్యాల జిల్లాలో ప్రతినెలా రూ.70 కోట్ల లావాదేవీలు ● కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించని వైనం ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు 19జెజిఎల్51 : రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా చిట్‌ఫండ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో దాదాపు 33 చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కేవలం పదింటికి మాత్రమే లైసెన్స్ ఉంది. అలాగే జిల్లాలో 100కు పైగా ఫైనాన్స్‌లు నడుస్తున్నాయి. అనధికారికంగా మరో 150 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్ల వ్యాపారం రూ.80 కోట్ల వరకు.. ఫైనాన్స్ వ్యాపారం రూ.70 కోట్ల వరకు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ నిర్వాహకులు అయితే తెల్ల పేపర్లపై లేకుంటే ఖాళీచెక్కులపై సంతకాలు చేయించుకుని 4 నుంచి 8 శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్‌ఫండ్ ఫైనాన్స్ కొనసాగిస్తున్నా.. వారిపై నిఘా కరువైంది. చిట్‌ఫండ్స్ మోసాలు జిల్లాలో ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, ఇతరత్రా వ్యక్తుల నుంచి లైసెన్స్డ్ చిట్‌ఫండ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకొని కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్‌ఫండ్స్ కంపెనీలో చిట్టీ తీసుకునే వారు ప్రభుత్వ ఉద్యోగితో ష్యూరిటీగా తీసుకొని డబ్బులు చెల్లిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చిట్ ఫండ్ మోసాలకు దారితీస్తోంది. జిల్లాలో రిజిస్టర్ లేని చిట్టీలు కోట్ల వ్యాపారంలో కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు చిట్టీ నిర్వాహకులు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాకట్టు వ్యాపారం జిల్లాలో తాకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో చాలామంది డబ్బులు అవసరమున్న వారు వాహనాల పేపర్లతోపాటు బంగారం, భూమి కాగితాలు పెట్టి అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే తాకట్టు పెట్టిన వస్తువులను వ్యాపారులు అమ్ముకుంటున్నారు. చాలా మంది వడ్డీ వ్యాపారులు తెల్లపేపర్లపై స్టాంప్ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. రిజిస్టర్డ్ అయిన చిట్‌ఫండ్స్ నిర్వాహకులు డిపాజిట్లు సేకరించి.. కాలపరిమితి ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా సుమారు ఏడు కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఫలితంగా బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనుమతుల్లేని ఫైనాన్స్‌లపై చర్యలు జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఫైనాన్స్‌లు, చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు చేపడతాం. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చిట్‌ఫండ్స్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం. – రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల -
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
● అర్ధరాత్రి జరిగితే బూడిద కింద సజీవ సమాధి అయ్యేవారు ● కాలనీలను ముంచెత్తిన బూడిదనీరు ● ఆందోళనలో కాలనీవాసులు రామగుండం: పట్టణంలోని అక్బర్‌నగర్ కాలనీ పక్కనున్న ఎన్టీపీసీ బూడిద పైపులైన్ బుధవారం రాత్రి ఒక్కసారిగా పగిలిపోవడంతో స్థానికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. విద్యుత్ కేంద్రం నుంచి యాష్‌పాండ్ వరకు నిర్మించిన బూడిద పైపులైన్ పగిలిపోవడంతో నీటితోకూడిన వేడిబూడిద పైకి ఎగజిమ్మిది. సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. అప్పుడే ఎండతగ్గడంతో ఆరుబయట కూర్చొని చల్లటిగాలికి సేద తీరుతున్న కాలనీవాసులు.. ఒక్కసారిగా బూడిదపైపులైన్ పగిలి భారీశబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. కొన్నిక్షణాలు అసలు ఏం జరిగిందో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయారు. ఈక్రమంలోనే బూడిదనీరు ఇళ్లలోకి చేరింది. కనీసం ప్రాణాలైన దక్కించుకుందామని కాలనీవాసులు దూరంగా పరుగులు పెట్టారు. బూడిద పైపులైన్ పగిలిందని గుర్తించి అదే కాలనీలో నివాసముండే కొండల రాజేందర్ వెంటనే ఎన్టీపీసీ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు వెంటనే బూడిద సరఫరాను నిలిపివేశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగినా, అర్ధరాత్రి పైపులైన్ పగిలినా పదుల సంఖ్యలో ప్రజలు బూడిదకింద సజీవ సమాధి అయ్యేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూడిద నీరు కారింది మా ఇంటికి కొద్ధిదూరంలోని పైపు పగిలి బూడిదనీరు పైకిఎగజిమ్మింది. మా ఇంటిపై వేడి బూడిదపడింది. ఆ వేడిబూడిద ఒత్తిడితో రేకులు పగిలిపోయాయి. బూడిద ఇంట్లోకి చేరింది. మూడు గదుల్లో బూడిద చేరింది. కిచెన్‌లోని నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. బెడ్స్, తలుపులు, గోడలు తడిసి ముద్దయ్యాయి. – సజ్జు, స్థానికుడు శాశ్వత పరిష్కారం చూపించాలి ఎన్టీపీసీ బూడిదనీరు తరలించే పైపు పగిలిన ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలను శాశ్వత ప్రాతిపదికన ఆదుకోవాలి. ఇళ్లలో నిండిన బూడిదను వెంటనే తొలగించాలి. బూడిదతో శిథిలావస్థకు చేరిన నివాసాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఇందుకోసం ఎన్టీపీసీ వెంటనే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉపేక్షించేదిలేదు. – మక్కాన్‌సింగ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం పైసాపైసా జమచేసి ఇల్లు కట్టుకున్న నా భర్త మీరా హోటల్ నడు పుకుంటూ కుటుంబాన్ని పో షించేవాడు. ప్రమాదవాశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. పై సాపైసా కూడబెట్టి రెండు గదులతో ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు బూడిద పైపు పగిలి ఇల్లంతా బూడిదతో నిండిపోయింది. కూలీపని చేసుకుంటేనే దినం గడిచే పరిస్థితి. ఇప్పుడు నా బతుకు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఎన్టీపీసీ ఆదుకోవాలి. – ఖైరున్నీసా, స్థానికురాలు ఇంట్లోకి చేరింది మా ఇంటి వెనుకాల ఉన్న పైపు పగిలి వేడి బూడిద ఇంట్లోకి వచ్చిచేరింది. క్షణా ల్లో మోకాలి లోతుకు బూడి ద పేరుకుపోయింది. సా మాను పూర్తిగాబూడిదమయమైంది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగితే ప్రాణాలపై ఆశలు ఉండేవికాదు. ఎన్టీపీసీ అధికారులు స్పందించి మా ఇళ్లకు రక్షణ కల్పించాలి. – ఖదీరా, స్థానికురాలు -
సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు
కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 11,446 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,195 మంది బల్దియా కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించారు. యూనిట్ల వారీగా అర్హులను గుర్తించడం కోసం ఈనెల 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. తొలిరోజు ఎన్టీపీసీ, రామగుండం ఏరియాలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పరిధిలోని దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ రెండు బ్యాంకులకు 1,050 మంది దరఖాస్తు చేసుకోగా, ఇదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇద్దరే అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించడంతో ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేశించారు. అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్, పాన్‌కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. -
ఉగ్రవాదుల దాడి అమానుషం ● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: జమ్ముకశ్మీర్‌లో అమాయకులపై ఉ గ్రవాదులు దాడిచేసి కాల్చిచంపడం అమానుషమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఖండించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. ముష్కరుల దాడిలో అనేకమంది అసువులు బాశారన్నారు. దేశభద్రత విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్ దుర్ఘటనపై ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ముష్కరులు ముందుగా హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈదుర్ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే ఆరోపించారు. దేశంలో శాంతిస్థాపన కోసం పౌరులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, కాలువ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, పాతిపెల్లి ఎల్లయ్య, బాలరాజ్ కుమార్, గట్ల రమేశ్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే చెప్పండి ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్/ఎలిగేడు: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నారని, తూకంలో కోతలు ఉండ వని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, హన్మంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లితోపాటు ఎలిగేడు మండలంలోని వివిధ గ్రా మాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు బ్యాంకర్లు పిలిచి పంట రుణాలిస్తున్నారని, అదే బీఆర్ఎస్ హయాంలో రైతులను బ్యాంకుల్లో డిఫాల్టర్లు చేశారని ఆరో పించారు. నాణ్యమైన ధాన్యాన్ని తెస్తే తూకం త్వరితంగా పూర్తవుతుందని రైతులు గ్రహించాలన్నారు. ప్రతినిధులు స్వరూప, రామ్మూర్తి, నర్సింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, సంతోష్, మహేందర్, మల్లయ్య, పె గడ రమేశ్, బషీరోద్దీన్, భాస్కర్‌రావు, విజయభాస్కర్‌రెడ్డి, దేవేందర్‌రావు, రవీందర్, నరేంద్రచారి, సుధాకర్, సంతోష్‌రెడ్డి, సంతోష్‌రావు, వెంకటేశ్వర్రావు, పరుశరాములుగౌడ్, తిరుపతిగౌడ్ ఉన్నారు. -
మానేరులో ఇసుక తోడేళ్లు
ముత్తారం(మంథని): నిబంధనల ప్రకారం వంతెన పియర్లకు సుమారు అర్ధ కిలోమీటరు పరిధిలో ఇసుక తవ్వకాలు నిషేధం. కానీ, పెద్దపల్లి – జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దు మానేరులో ఈ నిబంధనేదీ అమలు కావడం లేదు. పియర్ల చెంతనే మీటర్ల కొద్దీ లోతులో ఇసుక తోడేస్తున్నారు. గతేడాది వీచిన గాలిదుమారానికే వంతెనపై గడ్డర్లు కుప్పకూలాయి. అయినా, ఇసుకాసురులు తవ్వకాలు ఆపడం లేదు. అక్రమార్కులను నిలువరించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏళ్లు గడిచినా పూర్తికాని నిర్మాణం.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ – జయంశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరుపై వంతెన నిర్మాణానికి రూ.47.7 కోట్లతో 2016 ఆగస్టు 4న శంకుస్థాపన చేశారు. సుమారు తొమ్మిదేళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాలేదు. గతేడాది 2024 ఏప్రిల్ 23న వీచిన బలమైన ఈదురుగాలులకే పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు కుప్పకులాయి. అయితే, కూలిన గడ్డర్లు పనిచేస్తాయా? లేదా అనేదానిపై జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇటీవల నాణ్యతా పరీక్షలు జరిపారు. రీ టెండర్‌తో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్.. ఏడాది గడుస్తున్నా వంతెన నిర్మాణాన్ని పునఃప్రారంభించలేదు. పియర్ల వద్ద కనీసం ఇసుక తవ్వకాలనూ నిలువరించలేకపోతున్నారు. ఇది ఆర్ అండ్ బీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు ఉన్నాయి. అడ్డుకోకుంటే వంతెనకే ముప్పు.. పియర్ల సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోతే వంతెనకు ముప్పు పొంచిఉంటుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పకూలిన గడ్డర్ల కింద ప్రమాదం పొంచిఉంది. అయినా, వాటికిందనే ఇసుక పనులు చేసే కూలీలు సేద తీరుతున్నారు. అక్కడ ప్రమాద సూచికల బోర్టు కూడా ఏర్పాటు చేయలేదు. నంబర్లు ఉండవు.. రాత్రింబవళ్లు రవాణా నంబరు ప్లేట్లులేని ట్రాక్టర్లలో అక్రమార్కులు మానేరు నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తున్నారు. అక్రమార్కులను ఎవరైనా అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారు. అడ్డుకోవాల్సి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇసుక తరలింపు ఆపకపోతే పియర్లు కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పియర్ల వద్ద జోరుగా తవ్వకాలు వంతెనకు ముప్పు పొంచి ఉందంటున్న ఇంజినీర్లు ఇప్పటికే కూలిన గడ్డర్లు.. పట్టించుకోని అధికారులు అధికారుల కనుసన్నల్లోనే.. ఓడేడ్–గర్మిళ్లపల్లి మానేరుపై రవాణా సౌకర్యం కోసం నిర్మించిన మట్టిరోడ్డు నిర్వాహకులపై చర్యలు తీసుకున్న రెండు జిల్లాల అధికారులు.. మానేరు వంతెన సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమంగా తవ్వుతున్నా కనిపించడం లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజాకీయ పలుకుబడి, అధికారుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేకుండా మానేరు మధ్యలోంచే కాకుండా వంతెనను ఆనుకుని తాత్కాలిక మట్టిరోడ్డు ఉండటంతో పియర్ల వద్దే రోజూ ఇసుక తోడేస్తూ వందలా ది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇక్కడ తవ్విన ఇసుకను గర్మిళ్లపల్లి ఆవల.. కలికోటతాళ్లలో నిల్వ చేస్తున్నారు. అక్కడ జేసీబీలతో లారీల్లో లోడ్‌చేస్తూ వరంగల్, హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. హెచ్చరించినా ఆపడం లేదు మానేరు వంతెన పియర్ల వద్ద సుమారు అర్ధ కిలోమీటరు మేర ఇసుక తీయొద్దని హెచ్చరించినా అక్రమార్కులు ఆపడం లేదు. రెండు జిల్లాల పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు దీనిని అడ్డుకోవాలి. కూలిన గడ్డర్లపై జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీర్లు ఇటీవల అధ్యయనం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వంతెన పనులు మళ్లీ ప్రారంభిస్తాం. – జాఫర్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులపై నిరసనలు
పెద్దపల్లిరూరల్: జమ్ముకశ్మీర్‌లో హిందూ పర్యాటకు లు లక్ష్యంగా ఉగ్రదాడులకు దిగిన ముష్కరుల చర్య ను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కమాన్‌వద్ద రాజీవ్రోడ్డుపై బుధవారం బైఠాయించా రు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజే పీ పట్టణ అధ్యక్షుడు రాకేశ్, మండల అధ్యక్షుడు ర మేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలారపు పర్వతాలు, నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, శ్రీనివాస్, తిరుపతి, రాజగోపాల్, శంకర్, రాజన్నపటేల్, శ్రీకాంత్, హరీశ్, రాజేశం, కృష్ణ, మధుకర్, అంజి, శివసాయి, దేవేందర్, లింగయ్య, రాజు, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో ఐఎన్టీయూసీ నేత బాబర్ సలీంపాషా, ఉద్యోగ గుర్తింపు సంఘం నేత ఆరెపల్లి రాజేశ్వర్, మాజీ కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కొలని కవితారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి అమరులకు నివాళి అర్పించారు. -
ఓ పాఠం
గెలుపు ఓటమిఆవేశంతో జీవితాలను అంతం చేసుకోవద్దు.. ఆలోచన.. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ఎన్నో విజయాలు మీ సొంతం. చరిత్ర.. గతం.. వర్తమానం చూస్తే అనేక విషయాలు ఇట్టే దోహదపడుతాయి. ఎందుకు పనికిరారు అని పలువురితో ఛీత్కారాలు ఎదుర్కున్నవారు కష్టపడి విజయ తీరాలకు చేరుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గెలుపు.. ఓటమికి నాంది అనేదానిని మరవొద్దు. సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. పదోతరగతి కూడా పాస్కాలేని ఆయన బ్యాట్ ఝలిపిస్తే.. పరుగుల వర్షమే కురిసేది. క్రికెట్ ఆడితే లక్షల కళ్లు ఆయనవైపే ఉండేవి. ఎన్నో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన విషయం మరవొద్దు.. అంతేకాదు.. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారినపడ్డా.. మనోధైర్యం కోల్పోలేదు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన గొప్ప పరిశోధకుడై ప్రపంచమే మెచ్చుకునే వాడయ్యాడు. ఫెయిలయ్యామని కుంగిపోవద్దు ● పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీలేదుఈ ఏడాది ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యఇంటర్హుజూరాబాద్: ప్రతిభ కొందరికే పరిమితం కాదు. ప్రతీ మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసి, కఠోర సాధన చేస్తే జీవితంలో గొప్పవ్యక్తిగా ఎదగొచ్చు. అలా కాదని నేనేం చేయలేను.. నాతో కాదు.. నేనింతే అంటూ కుంగిపోవద్దు. చదువూ అంతే.. పుస్తకాన్ని నేస్తంగా మలు చుకుని చదివితే విజయం నీ బానిస అవుతుంది. పరీక్ష నీతో స్నేహం చేస్తుంది. ఫలితం ఎప్పుడూ నీ వెంటే నడుస్తుంది. విద్యార్థులకు ‘పరీక్ష’కాలం ముగిసింది. ఫలితాల సమయం సా గుతోంది. మంగళవారం నాటి ఇంటర్ ఫలితాల్లో చాలా మంది ప్రతిభ చూపారు. కొందరు ఫెయిలయ్యా రు. త్వరలో పదోతరగతి ఫలితాలు రానున్నాయి. ఫలితాలను జీవితంలో ఒక భాగం మా త్రమే చూడాలి. ఓటమి గెలుపునకు గట్టి పునాది గా మారుతుందని గ్రహించాలి. మళ్లీ ప్రయత్నించి, తప్పులను సవరించుకుని, కన్నీళ్లు పెట్టుకు న్న చోట తలెత్తుకుని చూడాలి తప్పా.. విఫల మయ్యామని కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. గెలుపైనా ఓటమైనా.. ఓ పాఠంగా నేర్చుకోవాలి.కరీంనగర్పెద్దపల్లిజగిత్యాలసిరిసిల్ల -
భూభారతి చట్టంతో రైతులకు మేలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథని: భూ భారతి చట్టం–2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. నాగారం రైతువేదికలో భూభారతి చట్టంపై బుధవారం అవగాహ న కల్పించారు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కారించే వెసులుబాటు ఈ చట్టంలో ఉందన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని, భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు ముందు తప్పనిసరి భూమి సర్వే చేయించి మ్యాప్ తయారుచేయాల్సి ఉంటుందన్నారు. ఏమైనా సందేహలు ఉంటే తీర్చడానికి అధికారులు సిద్ధంగా ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమార్‌స్వామి తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తికి అభినందన
గోదావరిఖనిటౌన్: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని కన్నాపురం స్ఫూర్తి ఇంటర్ హెచ్ఈసీలో 1000 మార్కు లకు 978 మార్కులు సాధించడంతో అధికారులు అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన, అడిషనల్ కలెక్టర్ వేణు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. విద్యార్థిని తండ్రి నాగేందర్, అధ్యాపకులు సంపత్, నరేశ్, శంకర్ పాల్గొన్నారు. కర్రిగుట్టలో కూంబింగ్ ఆపండి పెద్దపల్లిరూరల్: కర్రిగుట్టలో సాయుధ పోలీసు బలగాలు చేపట్టిన కూంబింగ్‌ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం నాయకులు మాదన కుమారస్వామి, రాజగోపాల్, సుచరిత కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలపై అణచివేతను ఆపాలన్నారు. మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని వారు కోరారు. సమావేశంలో నాయకులు పర్వతాలు, సత్యనారాయణ, విశ్వ నాథ్, బాలసాని రాజయ్య, గాండ్ల మల్లేశం, మార్వాడి సుదర్శన్, బాపు, మల్లయ్య, సదా నందం, రాజమల్లయ్య, రత్నకుమార్, రవీందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. పీసీసీ అబ్జర్వర్ల నియామకం సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పీసీసీ అబ్జర్వర్లగా సయ్యద్ అజ్మాతుల్లా హుస్సేనీ, సంగీ తం శ్రీనివాస్‌ను పీసీసీ నియమించింది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అబ్జర్వర్లను ప్రకటించారు. వీరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేందుకు పనిచేయనున్నారు. పార్టీ కార్యకర్తలను కలుసుకొని పార్టీ పరిస్థితిపై ఆరా తీయనున్నారు. త్వరలో ప్రకటించబోయే డీసీసీ, మండల, బ్లాక్ అధ్యక్షుల నియామకం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి పీసీసీకి నివేదించనున్నారు. ఆయా నివేదికల ఆధారంగా నేతలకు కాంగ్రెస్ పార్టీ లో పదవులు వరించనున్నాయి. 5న టాలెంట్ టెస్ట్ పెద్దపల్లిరూరల్: అనాథ విద్యార్థులకు ఉచిత వి ద్య అందించేందుకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మే 5న పీపీటీ (పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్) టా లెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బాధ్యులు కుమారస్వామి, లక్ష్మణ్ తెలిపారు. టెస్ట్‌లో ప్రతి భ చూపిన విద్యార్థులకు హైదరాబాద్‌లోని పా ఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య అందిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4, 5, 6వ తరగతుల్లో ప్రవేశానికి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 94385 81045, 98854 46299 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. ఓపెన్ తరగతులు ప్రారంభం పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ తరగతులు ఈ నెల 20న ప్రారంభించామని ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. అడ్మిషన్ పొందిన వారు తరగతులకు హాజరు కావాలని కో ఆర్డినేటర్ షుకూర్ కోరారు. లివర్ సిరోసిస్ బాధితులకు ప్రత్యేక సెలవు గోదావరిఖని: తీవ్ర కాలేయ జబ్బు(లివర్‌సిరోసిస్) బారినపడిన సింగరేణి కార్మికులకు సగం జీతంతోపాటు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ యాజమాన్యం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు ఏడు దీర్ఘకాలిక వ్యాధుల కు మాత్రమే సెలవు వర్తింపచేస్తున్నారు. గుండెజబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్ఠు, పక్షవాతం, మూత్రకోశవ్యాధులు, ఎయిడ్స్, మెదడు సంబంధిత వ్యాధులుకు ప్రత్యేక సెలవు ఇస్తున్నారు. ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ (తీవ్ర కాలేయ వ్యాధి) బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని నిర్ణయించడంతో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలేయ వ్యాధికి గురైన కార్మికునికి స్పెషల్ లీవు మంజూరు చేయవచ్చని, వ్యాధి నయమై, విధులకు ఫిట్ అయ్యేంతవరకూ ఉద్యోగికి 50 శాతం వేతన మొత్తం (బేసిక్ పే, వీడీఏ, ఎస్డీఏలో 50 శాతం) చెల్లించవచ్చని ఆ ఉత్తర్వులో సింగరేణి వివరించింది. -
కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్/పాలకుర్తి/రామగిరి: సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్య మించాలని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం రా త్రి గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీరేణుకా ఎలమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులలో నివాళి అర్పించారు. సెంటినరీకాలనీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడు తూ, టీబీజీకేఎస్ హయాంలో అనేక హక్కులు సా ధించామన్నారు. రాబోయే రోజుల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. మూడుజెండాల పా ర్టీ ఇచ్చింది బోనస్ కాదని, బోగస్ అని ఎద్దేవా చేశా రు. కేసీఆర్‌ను కలిసి యూనియన్ను బలోపేతం చేద్దామన్నారు. సింగరేణిని ఆగం పట్టించిందే ఎర్రజెండా పార్టీ అని విమర్శించారు. ఈనెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని కోరారు. అంతకుముందు కవితకు పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రాంమూర్తి, కాపు కృష్ణ, సురేందర్‌రెడ్డి, కొమురయ్య, సంపత్, పర్లపల్లి రవి, ఐలి శ్రీనివాస్, అల్లం పద్మ, కాపురబోయిన శ్రీదేవి, కౌశిక హరి, కౌశిక లత, మాదాసు శ్రీనివాస్, ముల్కల కొంరయ్య, బండి శ్రీనివాస్, బండారి కిరణ్, బత్తిని సతీశ్ తదితరులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత -
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని ట్రినిటి విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనాయత్, రశ్మిత, నేహ, నిఖిత 467మార్కులు సాధించారు. 48మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్.హేమనందిని 438 మార్కులు, 16మంది 436 మార్కులు, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494మార్కులు, రాహుల్, దీపిక 490 మార్కులు, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994 మార్కులు, 13మంది 993, 21మంది 992, 27మంది 991మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996, మహతి, పల్లవి 994మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి అభినందించారు. -
సత్తాచాటిన ‘రెసోనెన్స్’ విద్యార్థులు
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కోట ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎంపీసీలో టి.భావన, జి.సాయిఅక్షిత్, కె.సహనశ్రీ, యూ.అహన్య, ఎన్.శ్రీఅక్షిత, పి.సంజన 467/470 మార్కులు, కె.కీర్తన, ఎం.అక్షయ, కె.అక్షయవర్దన్, బి.సహశ్రీ, టి.విజయవర్దన్, ఎం.నివ్యరెడ్డి, కె.సాత్విక్, సిహెచ్ హాస్యరెడ్డి 466/470 మార్కులు, ఏడుగురు 465, 10 మంది 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎం.శ్రీష 436, బి.సాయిత్రిపుర 435, వై.వంశిక, ఎం.సంజనా నాయక్, ఎం.తేజస్వీనిలు432 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎం.శ్రీనిత, ఎస్.శృతిలు 987/1000 మార్కులతో పాటు ఆరుగురు 980 ఆపై మార్కులు సాధించినట్లు తెలిపారు. -
కేంద్రం నుంచి రాయితీ అందుతోందా?
● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆరా పెద్దపల్లిరూరల్: మత్స్యకార సొసైటీల ద్వారా రు ణాలు పొందారా.. కేంద్రప్రభుత్వం నుంచి సబ్బిడీ అందుతోందా? అని జాతీయ ఎస్సీ కమిషన్ స భ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆరా తీశారు. దళిత సొ సైటీల్లో సభ్యులుగా ఉన్నామే తప్ప రాయితీ గురించి తెలియదని సభ్యులు బదులిచ్చారు. రాయితీపై ఎందుకు అవగాహన కల్పించలేదని అధికారులపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర ధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం అందిస్తూ, అనేక పథకాలను అమలు చేస్తోందని రాంచందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా అందిస్తున్న పథకాలు, రాయితీలపై దళిత సొసైటీల సభ్యులకు జిల్లా కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రాంచందర్ మాట్లాడుతూ, రాయితీ పథకాలను సభ్యులకు ఎందుకు అందించలేకపోతున్నారని అధికారులను నిలదీశారు. జిల్లాలో ఆరు సొసైటీలు ఉన్నాయని జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్ తెలిపారు. సబ్సిడీ కోసం వారు దరఖాస్తు చేసుకోలేదని చెప్పడంతో ఆగ్రహించిన వడ్డేపల్లి.. వారికి అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం చేశారని, ఇకనుంచి ఇలా చేయొద్దని హెచ్చరించారు. దళితులకే కాకుండా అర్హులైనవారికీ పథకాల ఫలాలు అందేలా చూడాలని చెప్పారు. మత్స్యశాఖ ఈడీ నెహ్రూ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీపాసుమన్, జిల్లా అధికారి నరేశ్‌కుమార్ నాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలారపు పర్వతాలు, గనెబోయిన రాజేందర్ తదితరులు రాంచందర్‌ను సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, సురేందర్, దళిత సంఘాల నాయకులు బాపయ్య, కుక్క అశోక్, తిరుపతి, నరేందర్, కై లాసం పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలకు అవార్డు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఊశన్నపల్లె ప్రభుత్వ పాఠశాల ఎఫ్ఎల్ఎన్ చాంపియన్ స్కూల్ అవార్డు లభించింది. హెచ్ఎం సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేశ్‌కుమార్‌కు డీఈవో మాధవి మంగళవారం చాంపియన్ స్కూల్ అవార్డు అందజేశారు. చతుర్వి ద ప్రక్రియలతో ఆంగ్లభాషలో బోధన చేయడంతో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచినందున 2024–25 విద్యా సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంకై ంది. ఎంఈవో మహేశ్‌కుమార్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, స్కూల్ కాంప్లెక్స్ చైర్పర్సన్ స్వరూప, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కమాన్‌పూర్(మంథని): ముల్కలపల్లి, రాజాపూర్, గొల్లపల్లె, నాగారం ప్రభుత్వ పాఠశాలలు ఎఫ్ఎల్ఎన్ చాంపియన్లుగా ఎంపికయ్యాయి. దీంతో డీఈవో చాంపియన్ అవార్డును హెచ్ఎంలకు అందజేశారు. ఎంఈవో విజయ్‌కుమార్ ఉన్నారు. ‘గురుకులం’లో వందశాతం ఉత్తీర్ణత సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): దుబ్పపల్లిలోని మై నార్టీ గురుకుల కళాశాల(బాలురు)లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి మొత్తం 100మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందరూ పాసైనట్లు ప్రిన్సిపాల్ చంద్రమోహన్ తెలిపారు. ఈటీ ప్రథమ సంవత్సరంలో చరణ్‌తేజ(993/1000), ఎంఎల్టీ మొ దటి సంవత్సరంలో మహమ్మద్ రెహమాన్ (493 /500) రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. అలాగే ఎంఎల్టీ ద్వితీయ సంవత్సరంలో వెంకటేశ్ (976 /1000), ఈటీ మొదటి సంవత్సరంలో గణేశ్(489 /500) మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ చంద్రమోహన్, అధ్యాపకులు అభినందించారు. నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన గోదావరిఖని: ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత బుధవారం కోల్‌బెల్ట్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 5గంటలకు గోదావరిఖనిలోని రేణుకా ఎల్ల మ్మ కల్యాణవేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ముఖ్య శ్రేణులతో సమావేశమవుతారు. -
‘ఎస్వీజేసీ’ విజయదుందుబి
కరీంనగర్: ఇంటర్ ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఫస్టియర్‌లో ఎంపీసీలో సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి 468, బి.వెన్నెల 466, బి.శ్రీనిత్య 466, బి.హరిణి 465, ఎన్.అరుణ్‌తేజ 464, కె.సహస్ర 463, ఎస్కే.తమన్నా 463, జె.సునీల్ 462, పి.సంజన 462, ఏ.హర్షవర్దన్ 462 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర 437, డి.శివకుమార్ 437, డి.శ్రీనిధి యాదవ్ 435, ఎం.స్పందన 434, అనికేత్ మిశ్రా 434,శ్రీవల్లి 432, బి.రుచిత 431, ఎన్.నిహారక 430 మార్కులు సాధించారు. సెకండియర్ బైపీసీలో పి.లిఖిత 992, ఎం.స్పూర్తి 992, ఎస్.రిషిక 991, టి.లిఖిత గౌడ్ 989, ఆర్.మేఘన 988, కె.కార్తీక్ 988, ఎస్.లావణ్య 987, ఎం.త్రిణిజ 987, ఎస్.రక్షిత 987 మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటా
జ్యోతినగర్(రామగుండం): పారిశుధ్య కార్మికులకు ఇల్లు నిర్మించే బాధ్యత తనదేనని రామగుండం ఎ మ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. ఎన్టీపీసీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశు ధ్య కార్మికులకు మంగళవారం దుస్తులు పంపిణీ చే సి మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం గోదావరిఖని: మున్సిపల్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ చలివేంద్రం ప్రారంభించారు. అన్నదాతకు కాంగ్రెస్ అండ రామగుండం: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడా రు. మహేశ్, తిరుపతిగౌడ్, హన్మాన్రెడ్డి, రాజలింగం, కుమార్‌గౌడ్, రవీందర్ పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ -
పకడ్బందీగా తొలిమెట్టు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు రూ పొందించిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన అభినంద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాధవితోపాటు ఉపాధ్యాయులను ఆయన సత్కరించి సర్టిఫికెట్లు అందించారు. అకడమిక్ అధికారి షేక్‌తో పాటు ఎంఈవోలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్ట పరిస్థితుల్లోని పేషెంట్లకు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన వైద్యాధికారులను కలెక్టర్ శ్రీహర్ష అభినందించారు. 92 ఏళ్ల వీరారెడ్డికి తుంటి ఎముక విరగడంతో ఈనెల12న అడ్మిట్ చేశారు. అతడి ఆరోగ్యపరిస్థితులను కుటుంబీకులకు వివరించి మంగళవారం వైద్యబృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసిందని కలెక్టర్ అన్నారు. సుల్తానాబాద్‌కు చెందిన ఆసియా తబస్సుంకు శస్త్రచికిత్స చేసిన సూపరింటెండెంట్ శ్రీధర్‌తోపాటు వైద్యులను కలెక్టర్ అభినందించారు. ఎల్ఆర్ఎస్కు ఇదే ఆఖరుగడువు.. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 25శాతం రాయితీని వర్తింపజేస్తూ ఈనెలాఖరు వరకు గడువు పెంచిందని, ఇదే ఆఖరు గడువుగా ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పలు అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, ఆర్డీవో గంగయ్య పాల్గొన్నారు. భూభూరతితో ‘సాదాబైనామా’కు పరిష్కారం కమాన్‌పూర్/రామగిరి(మంథని): భూభారతి ఆర్వోఆర్ చట్టం ద్వారా పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారవముతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కమాన్‌పూర్ మండలం నాగారం రైతువేదిక, రామగిరి మండలం సెంటినరీకాలనీ కమ్యూనిటీఖాల్లో మంగళవారం భూభారతిపై నిర్వహించిన అవగహన సదస్సలో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతీ గ్రామంలో గ్రామపరిపాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. ఆధార్ మాదిరిగా భూధార్ సంఖ్య కేటాయించడంతో ఆక్రమణలకు తావుండదని అన్నారు. ఈ చట్టం ప్రకారం భూ సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకా శం ఉందన్నారు. ఆర్డీవో, కలెక్టర్, భూమి ట్రిబ్యు నల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. అప్పీల్ వ్యవస్థ ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివి ల్ కోర్టుకు వెళ్లవచ్చని, దరఖాస్తుదారులకు ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ వేణు, మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్లు వాసంతి, సుమన్, ఎంపీడీవోలు లలిత, శైలజారాణి, డిప్యూటీ తహసీల్దార్ మానస, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించాలి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల కు సకాలంలో డబ్బులు చెల్లించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కల్వచర్ల, నవాబ్‌పేట, బేగంపేటలో ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. -
జవాబుదారీగా పనిచేస్తున్నా
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మారం/జూలపల్లి: సేవే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జూలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ధర్మారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడారం రిజర్వాయర్ నుంచి లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లలు మంజూరు చేయకపోవడంతో మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లారని, రిజర్వాయర్ కోసం నామమాత్రపు ధరతో రైతుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు సేకరించిందని, కేసీఆర్ హరీశ్‌రావు, కేటీఆర్ ఇక్కడి నీటిని తమ ప్రాంతాలకు తరలించుకుపోయారని, అయినా, మాజీమంత్రి పట్టించుకోలేని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.10 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. త్వరలోనే ధర్మారంలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తిచేసి చివరి ఆయకట్టుకూ సాగునీరు అందిస్తామన్నారు. కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి విడుదలైన రూ.3కోట్లు వెచ్చించి డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. అంతకుముందు జూలపల్లి మండలంలో నీళ్లు అందక ఎండిన వరి పంటను విప్ పరిశీలించారు. పెద్దాపూర్ శ్రీయోగానంద శ్రీలక్ష్మీనర్సింమస్వామిని దర్శించుకున్నారు. ఖిలావనవపర్తి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, పోల్దాసరి సంతోష్, యశోద అజయ్, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, సోగాల తిరుపతి, రవీందర్‌రెడ్డి, బొల్లి స్వామి, కొత్త నర్సింహం, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, అష్షు, ఎల్లయ్య, పసునూటి శ్రీనివాస్, దండె వెంకటేశం పాల్గొన్నారు. -
‘ఎస్ఆర్’ ప్రభంజనం
తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్‌లో ఎంపీసీలో 45 మంది 990 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో నలుగురు 990కిపైగా మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 63 మంది 465 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో 435 మార్కులకుపైన సాధించి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ సెకండియర్‌లో కాసర్ల భవాని, అబ్దుల్ రయాన్ 994 మార్కులు, సింధూజ 993 మార్కులు సాధించగా, 992 మార్కులు 16మంది సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి.సహస్ర 993మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992మార్కులు, నాదే పూజిత 991మార్కులు సాధించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో బండి ప్రతిష్ట, మండలోజి వైశాలిని 468 మార్కులు, ఏడుగురు 467 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435మార్కులు సాధించారు. వీరిని జోనల్ ఇన్చార్జి తిరుపతి, విద్యాసంస్థలు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి అభినందించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అ య్యాననే మనస్తాపంతో ఘ నశ్యాందాస్నగర్(జీడీనగర్ ) కు చెందిన సాపల్ల శశిరేఖ (17) ఉరివేసుకుని ఆత్మహ త్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంగళవారం వెలువడిన ఫ లితాల్లో కామర్స్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో బాలిక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. గంగ మ్మ– ఎల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒకకుమార్తె ఉన్నారు. ఒక కొడుకు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుండగా, మరొక కు మారుడు నేవీలో ఉద్యోగ శిక్షణ పొందుతున్నా డు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. కార్మికుల విధులు బహిష్కరణ ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించారు. ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూనియన్ నాయకుడు అంబటి నరేశ్ మాట్లాడుతూ కార్మికులకు మూ డు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. యాజమాన్యం వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు, కార్మికులు రత్నం శ్రీనివాస్, కొమురన్న, అఫ్జల్, తన్నీరు నరేశ్, రవి, శ్రీనివాస్, రమేశ్, ప్రకాశ్, మహేందర్, సతీశ్ పాల్గొన్నారు. 24లోగా దరఖాస్తు చేసుకోండి పెద్దపల్లిరూరల్: జిల్లా, మండలస్థాయి రిసోర్స్‌పర్సన్‌గా పనిచేసేందకు అర్హతగల ఉపాధ్యాయులు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలిపారు. గెజిటెడ్ హె చ్ఎం, ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు, సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు అర్హులన్నారు. వివరాలకు జి ల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ పీఎం షేక్‌ను సంప్రదించాలని డీఈవో కోరారు. కారు ఢీకొని యువకుడి మృతితిమ్మాపూర్: కొత్తపల్లి శివారులో కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్సై వివేక్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన దొప్ప సంతోష్ కుమార్(32) హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న కంకులు విక్రయించి తిరిగి వెళ్లే క్రమంలో కొత్తపల్లి వద్ద వాహనాన్ని నిలిపాడు. అనంతరం నీరు తాగు తూ మరో వ్యక్తికోసం వేచి చూస్తూనే క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. పైప్‌లైన్ లీకేజీ పనుల పరిశీలన ఎలిగేడు(పెద్దపల్లి): వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎల్పీవో వేణుగోపాల్ సూచించారు. మండల కేంద్రంలో ఆయన మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. తాగునీటి పైపులైన్ లీకేజీ పను లు పరిశీలించారు. ఎస్సీకాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీవో కిరణ్, పంచాయతీ కార్యదర్శిఽ అంజలి ఉన్నారు. రేపు వాహనాలకు వేలం గోదావరిఖని: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహ నాలకు రామగుండం ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో ఈనెల 24న వేలం నిర్వహిస్తామని ఎకై ్సజ్ సీఐ మంగమ్మ తెలిపారు. ఆసక్తి గలవారు ఆదేరోజు ఉదయం 9 గంటలకు రామగుండం ఎకై ్సజ్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు. -
మెరుగుపడింది
● గతేడాదితో పోల్చితే కాస్త పెరిగిన ఉత్తీర్ణ శాతం ● ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిచిన బాలికలు ● ఫస్టియర్‌లో 62.45 .. సెకండియర్‌లో 70.03 శాతం ఉత్తీర్ణత నమోదు ● ఇంటర్లో బాలుర వెనుకంజసాక్షి, పెద్దపల్లి/సుల్తానాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జిల్లాస్థానం ఈసారి కాస్త మెరుగుపడింది. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 31వ స్థానంలో నిలవగా, తాజా ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో జిల్లా 11వ స్థానం, ఫస్ట్‌ఇయర్‌లో 12వ స్థానం సాధించి ఫలితాలు మెరుగుపర్చుకుంది. ప్రథమ సంవత్సరంలో 62.45శాతం, ద్వితీయ సంవత్సరంలో 70.03 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కాలేజీల్లో మంథని బాలికల కళాశాల విద్యార్థిని శ్రీజ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. సెకండియర్ ఎంపీసీ గ్రూప్‌లో సుల్తానాబాద్ ప్రభుత్వ జానియర్ కాలేజీకి చెందిన విద్యార్థి నవీన్‌కుమార్ 980 మార్కులతో, గోదావరిఖని జూనియర్ కాలేజీకి చెందిన కె.స్ఫూర్తి హెచ్ఈసీలో 978 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. రాఘవాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలిక జూనియర్ కాలేజీ విద్యార్థి నల్ల హర్షిత బైపీసీలో 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. సత్తా చాటిన బాలికలు.. ఎప్పటిలాగే ఇంటర్ ఫలితాల్లో బాలురుపై బాలికులు ఈసారి కూడా పైచేయి సాధించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌లో కలిపి 4,487 మంది బాలికలకు గాను 75.66 శాతంతో 3,395 మంది విద్యార్థినులు పాసయ్యారు. 3,137 మంది బాలురు పరీక్ష రాయగా 52.72 శాతంతో 1,654 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ ఫలితాలు ఇలా.. వొకేషనల్ సెకండియర్‌లో 918మందికి 700మంది 76.25శాతంతో ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ ప్రైవేట్‌లో 168 మందికి 91 మంది 54.17శాతంతో పాసయ్యారు. ప్రైవేట్‌లో సెకండియర్‌లో 751 మందికి 278 మంది(37.02)శాతం పాసయ్యారు. ఫస్ట్ ఇయర్ వొకేషనల్‌లో 1,069మందికి 650 మంది ఉత్తీర్ణులై 60.80 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ప్రభుత్వ కళాశాలల సత్తా.. పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ జూనియ ర్ కాలేజీల విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటా రు. జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఫస్టియర్ విద్యార్థులు 95.38శాతంతో కమాన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అగ్రస్థానంలో ఉండగా ఆఖరున 15.79 శాతంతో ధర్మారం ప్రభుత్వ కాలేజీ ఉంది. సెకండియర్ ఫలితాల్లో రామగుండం 88.1శాతంతో టాపర్‌గా నిలవగా, 33.1శా తంతో గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కా లేజీ వెనుకబడింది. అలాగే వొకేషనల్ కోర్సు ల్లో ఫస్టియర్‌లో రామగుండం కాలేజీ విద్యార్థులు 85.19శాతంతో టాపర్‌గా నిలవగా, 40.29శాతంతో పెద్దపల్లి కాలేజీ చివరన ఉంది. అలాగే సెకండియర్‌లో రామగుండం ప్రభుత్వ కాలేజీ 96శాతం ఉత్తీర్ణత సాధించగా ధర్మారం 55.2శాతం సాధించింది. బాలురు, బాలికల వారీగా ఫలితాలు సంవత్సరం విద్యార్ధులు హాజరు ఉత్తీర్ణత శాతం ఫస్ట్ఇయర్ బాలురు 1,558 759 48.72 ఫస్ట్ఇయర్ బాలికలు 2,269 1,631 71.88 సెకండ్ ఇయర్ బాలురు 1,579 895 56.68 సెకండ్ ఇయర్ బాలికలు 2,218 1,764 79.53 -
ఫలితాల్లో ‘స్ఫూర్తి’
గోదావరిఖనిటౌన్: స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన కన్నాపురం స్ఫూర్తి ఇంటర్ హెచ్ఈసీలో 978 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్ఫూర్తి ఇంటర్మీడియెట్ చదివింది. ఆమె తండ్రి నాగేందర్.. స్థానిక గౌతమినగర్‌లోని ఓ రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి లావణ్య గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా చిన్నకూతురు స్ఫూర్తి చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తోంది. ఐదు నుంచి పదో తరగతి వరకు స్థానిక సప్తగిరికాలనీ మహాత్మాజ్యోతిబా పూలే గురుకులంలో చదివింది. పదో తరగతిలో 9.2 జీపీఏ సాధించింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 493 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఇప్పుడు సెకండియర్లలో ప్రతిభ చాటింది. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని స్ఫూర్తి తెలిపింది. తనది పేద కుటుంబమని, తన పైచదువులకు ప్రభత్వం ప్రోత్సాహం అందించాలని విద్యార్థిని కోరింది. -
డాక్టర్ కావాలనేదే లక్ష్యం
రామగిరి(మంథని): పన్నూర్ గ్రామానికి చెందిన నల్ల హర్షిత ఇంటర్ బైపీసీలో 991 మార్కులు సాధించింది. నల్ల రజిత – శ్రీనివాస్ దంపతుల పెద్ద కూతురు హర్షిత.. రాఘవాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ బా లికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివింది. ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు రావడం సంతోషంగా ఉందని, డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని హర్షిత తెలిపింది. మంచి విద్యాబోధన అందుబాటులో ఉండటంతో తనకు కలిసి వచ్చిందని పేర్కొంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని, భవిష్యత్‌లో మరింత కష్టపడి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకుని వస్తానని తెలిపింది. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
పాలకుర్తి(రామగుండం): పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా కన్నాల జెడ్పీ హైస్కూల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ఉంటుందన్నారు. అనంత రం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్, నినాదాలు తదితర అంశాల్లో పో టీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. హెచ్ఎంలు కమలాకర్‌రావు, అంజనీదేవి, ఉపాధ్యాయులు విఠల్, శ్రీనివాస్, రాజ య్య, జ్యోతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కుష్ఠు నివారణకు కృషిచేయాలి కమాన్‌పూర్(మంథని): కుష్ఠు నివారణకు వై ద్యసిబ్బంది కృషి చేయాలని కుష్ఠు నివారణ మిషన్ రాష్ట్ర బృందం సూచించింది. స్థానిక ప్ర భుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవా రం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతీఇంటికి వె ళ్లి కుష్ఠు లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలో ఎండీఈ మాత్రలు వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సంపత్, వెంకటేశ్వరచారి, సకలరెడ్డి, డీఎంహెచ్‌వో అన్నప్ర సన్న కుమారి, సుధాకర్‌రెడ్డి, దేవశ్రీ, రమేశ్, పీ హెచ్‌సీ వైద్యాధికారి సల్మాబేగం పాల్గొన్నారు. -
సన్నాల మిల్లింగ్‌కు సన్నద్ధం కావాలి
పెద్దపల్లిరూరల్: యాసంగిలో సాగుచేసిన సన్నరకం వడ్లు లక్ష మెట్రిక్ టన్నులు సేకరించి మిల్లింగ్ చేసేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. సన్నరకం ధాన్యం మిల్లింగ్ చేసేందుకు 10 బాయిల్డ్ రైస్‌మిల్లులను గుర్తించాలన్నారు. డీఆర్డీవో, సివిల్ సప్లయ్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. రా రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సన్నరకం ధాన్యంపై మార్గదర్శకాలు వెల్లడించాలన్నారు. నిబంధనలు పాటించే మిల్లర్లకే ధాన్యం కేటాయించాలని అన్నారు. మిల్లర్లు ముందుకు రాకుంటే ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలని సూచించారు. డీఏవో ఆదిరెడ్డి, డీఎస్వో రాజేందర్, డీఎం శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. లాభదాయక యూనిట్లకు ప్రాధాన్యం రాజీవ్ యువ వికాసం కింద లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఒక గ్రామంలో ఒకేరకమైన యూనిట్లు స్థాపించకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈనెలాఖరులోగా మండలాల వారీగా విచారణ పూర్తిచేసి తుది జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఆ జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో ఖరారు చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారుల సర్టి ఫికెట్లను తహసీల్దార్ పరిశీలించాలని ఆదేశించారు. డీఆర్డీవో కాళిందిని, లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బీసీ వెల్పేర్ ఆఫీసర్ రంగారెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్ ఉన్నారు. సమస్యల పరిష్కారానికే భూ భారతి ఎలిగేడు(పెద్దపల్లి): భూ సంబంధిత సమస్యల పరిష్కారానికే భూ భారతి ఆర్వోఆర్– 2025 చట్టం అమలు చేస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. భూముల క్రయ, విక్రయాలు, మ్యాప్, హద్దుల తయారీ, స్లాట్ బుకింగ్, పాస్‌పుస్తకాలు తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ హైస్కూల్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ తదితర పనులు పరిశీలించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న సుల్తాన్పూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్యారెడ్డిని శాలువాతో సత్కరించారు. ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డీఎం శ్రీకాంత్, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో కిరణ్, ఐకేపీ ఏపీఎం సుధాకర్, ఏవో ఉమాపతి, ఆర్ఐలు శేఖర్, జయలక్ష్మి సింగిల్విండోచైర్మెన్ గోపు విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 10 బాయిల్డ్ రైస్‌మిల్లులను గుర్తించాలి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ముందుకు.. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
జలవెల!
● అడుగంటుతున్న జలాశయాలు ● ఎల్ఎండీ డెడ్‌స్టోరేజీకి రాలేదంటున్న అఽధికారులు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎనిమిది టీఎంసీలు ● మిడ్ మానేరులోనూ అదే తీరు ● సాగునీటికి ఇబ్బందులు లేవంటున్న ఇరిగేషన్శాఖఎల్లంపల్లిలో 8.76 టీఎంసీలు 20.175 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 8.76 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఇదే రోజు 6.75టీఎంసీల నీరు ఉండేది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 2టీఎంసీల నీరు ఎక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలకు ఢోకాలేదని సబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మె ట్రోవర్క్ స్కీం (హెచ్ఎండబ్ల్యూఎస్) కోసం 330 క్యూసెక్కులు, రామగుండంలోని ఎన్టీపీసీ పంప్ హౌజ్‌కు 121 క్యూసెక్కులు, పెద్దపల్లి, రామగుండం మిషన్ భగీరథ పథకం కోసం 58 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మంచిర్యాల జిల్లా ప్ర జల తాగునీటి అవసరాల కోసం 23 క్యూసెక్కుల ను విడుదల చేస్తున్నారు. ఎండల కారణంగా 190 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రతిరోజు ప్రాజె క్టు నుంచి 723 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రస్తు తం ప్రాజెక్ట్‌లోని నీరు జూన్ వరకు తాగునీటి అవసరాలు తీరుస్తుందని అధికారులు వెల్లడించారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్: రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు క్రమంగా అడుగంటుతున్నాయి. వరదకాలువ, కాళేశ్వరం నుంచి కొంతకాలంగా ఎత్తిపోతలు లేకపోవడంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తయిన నేపథ్యంలో వ్యవసాయపరంగా ఇబ్బందులు లేవని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు జూన్ వరకు సరిపోతుందని, తాగునీటికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. దంచికొడుతున్న ఎండల నేపథ్యంలో రోజుకు పదుల సంఖ్యలో క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. తాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితే ఉత్పన్నమవదని, ఆలోపు వర్షాలు వచ్చేస్తాయని ఇరిగేషన్‌శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లోయర్ మానేరులో ఏడు టీఎంసీలు లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం ఏడు టీఎంసీల నీరు నిల్వఉంది. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ భగీరథకు డెడ్‌స్టోరేజీ 3.8 టీఎంసీలు, కాగా సాధారణ డెడ్‌స్టోరీజీ 2 టీఎంసీలుగా పరిగణిస్తామని తెలిపారు. తాగునీటి అవసరం కోసం ప్రాజెక్టు నుంచి ఇప్పటి నుంచి జూలై నెలవరకు వరకు రోజుకు సుమారు 300 క్యూసెక్కుల నీటిని వాడుకున్నా.. 1.5 టీఎంసీలు అవసరం అవుతుంది. ఇతర అవసరాలకు టీఎంసీ కావాలి. 3.8 టీఎంసీల కన్నా దిగువకు వస్తే ఎలగందుల, పరిసర ప్రాంతాలకు మాత్రం ఇబ్బందిగా మారుతుంది. ఆలోపు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మిడ్‌మానేరులో 7.074 టీంఎసీలు మిడ్‌మానేరు జలాశయం నుంచి పంటలకు, తాగునీటి అవసరాలకు ఇప్పటి వరకు కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్ట్‌లోకి 20 టీఎంసీల మేర నీరు తరలింది. ఎండలకు రోజుకు 140 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. జూలై వరకు ఒకటిన్నర టీఎంసీ నీరు ఆవిరి కానుంది. మిడ్ మనేరు ప్రాజెక్ట్ నుంచి సిరిసిల్ల జిల్లాకు రోజుకు మిషన్ భగీరథ కింద 40క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. జూలై 31వరకు మిడ్ మానేరులో తాగునీటి అవసరాలకు నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేదని మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఈఈ జగన్ తెలిపారు. 2024 ఏప్రిల్ 21న ప్రాజెక్ట్‌లో 5.96 టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడు 7.074 టీఎంసీల మేర నీరు ఉందని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ఎక్కువగా ఉందన్నారు. -
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
జూలపల్లి(పెద్దపల్లి): భూ భారతి ఆర్వోఆర్ చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. భూ వివాదాలు, ఇతర సమస్యల సత్వర పరిష్కారానికి ఈ చట్టం మార్గం చూపుతుందని వివరించారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీవో పద్మ, ఏవో ప్రత్యూష, డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్, ప్యాక్స్ చైర్మన్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వంతెన అభివృద్ధికి చర్యలు రామగుండం: స్థానిక రైల్వే ఫ్లై ఓవర్‌ను టీ–జంక్షన్‌గా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ సిబ్బంది సోమవారం పలుచోట్ల మట్టి శాంపిళ్లు సేకరించారు. ఫ్లై ఓవర్ ప్రస్తుతం గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్ మధ్య రాకపోకలు సాగించే వారికే సౌకర్యంగా ఉంది. దీంతో దీనిని విస్తరిస్తూ అంతర్గాం బైపాస్ నుంచి వచ్చిపోయే వాహనదారులకు కూడా సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈక్రమంలోనే గురుకుల విద్యాలయం సమీపం వరకు టీ జంక్షన్‌గా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. ఫలితంగా అంతర్గాం నుంచి రాకపోకలు సాగించే వాహనాలు నేరుగా వంతెనపై నుంచి రైల్వేస్టేషన్, గోదావరిఖని వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని రేవెల్లి శిరీష జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బాలిక అత్యంత ప్రతిభ కనబర్చిందని పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో శిరీష తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటుందని ఆయన వివరించారు. శిరీషను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. 23న ఉద్యోగ మేళా కమాన్‌పూర్(మంథని): గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 23న ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.సుధాకర్ తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బీపీసీ చదివి 20ఏళ్ల లోపు వయసు గలవారు అర్హులన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.15 వేల వేతనంతోపాటు ఉచిత భోజన, వసతి కల్పిస్తారన్నారు. అంతేకాదు.. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదువుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుందని ఆయన వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు బుధవారం ఉదయం 9.30 గంటలకు కళాశాలలో హాజరు కావాలని ఆయన కోరారు. క్రీడలకు ఎన్టీపీసీ పెద్దపీట జనరల్ మేనేజర్ అలోక్ కుమార్ త్రిపాఠి జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రాజెక్టు జనరల్ మేనేజర్ అలోక్‌కుమార్ త్రిపాఠి అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ ఉద్యోగులు విధులతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని తెలి పారు. పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో జీఎంలు ముఖుల్ రాయ్, కేసీ సింగరాయ్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ గనేశ్వర్ జడ్జితోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు. -
భరోసా ఏది?
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, పెద్దపల్లి: ఆత్మీయ భరోసా పథకం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకావడంలేదు. ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉండి 20 రోజులు పనిచేసిన భూమిలేని రైతు కూలీలకు ఏడాదిలో రెండు విడతలుగా రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆత్మీయ భరోసా పేరిట ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గత జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకం, కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలు ప్రారభించిన విషయం తెలిసిందే. ఈ పథకాలను ఆరంభించిన రోజే మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాలకు ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు వర్తింపజేశారు. మిగిలిన గ్రామాల్లోని రైతుకూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించినా.. వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేయలేదు. దీంతో ఉపాధిహామీ కూలీలు ఆ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లోనే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 20రోజల పాటు ఉపాధిహామీ పథకం ద్వారా కూలి పనులు చేసిన భూమిలేని వారు జిల్లావ్యాప్తంగా 15,046 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 2,156 మంది రైతు కూలీలు ఉన్నారని అధికారులు తేల్చారు. జాబితాలో లేనివారి కోసం.. అర్హుల జాబితాలో పేర్లు రానివారి నుంచి గత జనవరి 24, 25వ తేదీల్లో నిర్వహించిన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఇలా జిల్లావ్యాప్తంగా మరో 6,584 మంది రైతు కూలీలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 13 గ్రామాల్లో గుర్తించిన రైతు కూలీలు మినహా మిగతా గ్రామాల్లోని రైతు కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. ఎమ్మెల్సీ కోడ్ ముగిసినా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో రైతుకూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేందుకు బ్రేక్ పడింది. అయితే, కోడ్ ముగిసి నెలలు గడుస్తున్నా తమ బ్యాంకు ఖాతాల్లో ఇంకా డబ్బులు జమచేయలేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు లబ్ధిదారులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా అర్హులైన ప్రతీఒక్కరి బ్యాంకు ఖాతాల్లో తొలివిడత కింద రూ.6వేలు జమచేయాలని వేడుకుంటున్నారు.అర్హులైన ఈజీఎస్ కూలీలు మండలం గుర్తించిన కూలీలు పెద్దపల్లి 2,156 సుల్తానాబాద్ 1,907 మంథని 1,960 ఎలిగేడు 472 ఓదెల 1,010 రామగిరి 1,049 కమాన్‌పూర్ 568 పాలకుర్తి 1,216 జూలపల్లి 440 ముత్తారం 575 ధర్మారం 1,341 అంతర్గాం 1,133 కాల్వశ్రీరాంపూర్ 1,219 న్యూస్‌రీల్ అందని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లోనే అమలు మిగతా పల్లెల్లో తప్పని ఎదురుచూపులు జిల్లాలో 15,046 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు నిరాశలో ఉపాధిహామీ రైతు కూలీలు -
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ భరోసా
● టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేందుకు ఆదేశాలు ● రామగుండం ప్రాంతంలో 65 వేల మంది పింఛన్దారులుగోదావరిఖని: కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) బోర్డు, కోలిండియా యాజమాన్యం గత జనవరిలో హైదరాబాద్ సింగరేణి భవన్లో సమావేశమయ్యాయి. సీఎంపీఎఫ్ ట్రస్ట్‌లో లోటు బడ్జెట్‌ను అధిగమించేందుకు పింఛన్ నిధి పెంచు కోవాలని నిర్ణయించాయి. దీంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కమిషనర్ విక్రమ్దేవదత్ ఆదేశాలతో కోలిండియా యాజమాన్యం స్పందించింది. అప్పటివరకు టన్ను బొగ్గుపై రూ.10 ఉన్న పింఛన్ ఫండ్‌ను రూ.20కు పెంచింది. అంతేకాకుండా.. రెండునెలలుగా కోలిండియా దీనిని అమలు చేస్తోంది. గత శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఎంఫీఎఫ్ సమావేశంలో సింగరేణి సీఎండీ బలరాం.. కోలిండియా సూచనల మేరకు స్పందించారు. టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేందుకు అంగీకరించారు. ఈమేరకు సింగరేణిలో ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చేనెల నుంచి నిధులు జమచేసేందుకు సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. సీఎంపీఎఫ్‌లో రూ.22,452 కోట్ల మూలనిధి సీఎంపీఎఫ్‌లో ప్రస్తుతం రూ.22,452 కోట్ల మూలనిధి ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కోలిండియాలో 5.4లక్షల మంది, సింగరేణిలో 84వేల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మరో ఆరేళ్లలో వారిసంఖ్య మరింత పెరుగుతుంది. అప్పటివరకు పింఛన్ ఫండ్‌లో లోటు ఏర్పడుతుందని ట్రస్ట్ ప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. -
రూ.10వేల పింఛన్ ఇవ్వాలి
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల్లో భరోసా కల్పించేందుకు రెండుసార్లు పార్లమెంట్లో ప్రస్తావించా. గతంలో రూ.10 సింగరేణి చెల్లించేది. నా పోరాటంతో మరో రూ.10 కలిపి ప్రస్తుతం రూ.20 చెల్లించేలా అంగీకారం కుదిరింది. ప్రతీరిటైర్డ్ ఉద్యోగికి నెలకు కనీసం రూ.10వేల పింఛన్ వచ్చేలా పోరాటం చేస్తా. – వంశీకృష్ణ, ఎంపీ, పెద్దపల్లి భరోసా కల్పించాం కోలిండియా యాజమాన్యం ఆదేశాల మేరకు టన్ను బొగ్గుపై రూ.20 చెల్లించేందుకు అంగీకరించాం. సింగరేణిలో అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేశాం. వచ్చేనెల నుంచి సీఎంపీఎంఫ్ ఖాతాలో ఈ సొమ్ము జమవతుంది. సుమారు 80 వేల మంది పైచిలుకు రిటైర్డ్ ఉద్యోగులకు దీనిద్వారా భరోసా లభిస్తుంది. – బలరాం, సీఎండీ, సింగరేణి -
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పది వేల మంది
పెద్దపల్లిరూరల్: ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 10వేల మందిని తరలించేలా కార్యాచరణ సిద్ధం చేశామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సభ ప్రచార పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలన్నారు. సభ పూర్తయ్యాక బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, ప్రస్తుతం అందుతున్న పథకాలు, పాలనతీరుపై ఊరూరా రచ్చబండ చర్చలు జరపాలని సూచించారు. ఎండల తీవ్రతతో వాహనాల్లో ప్రయాణించే వారికి మంచినీళ్లు, మజ్జిగ పాకెట్లు, భోజనం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నాయకులు మర్కు లక్ష్మణ్, ఉప్పు రాజ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, బాలాజీరావు, శ్రీనివాస్, మోహన్‌రావు, మోబిన్, దేవయ్య, చంద్రశేఖర్, సతీశ్, శ్రీధర్, ప్రేమ్, శ్రీకాంత్, నటరాజ్, అతీఖ్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గోదావరిఖని: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సింగరేణి యాజమాన్యం ముందుకు సాగుతోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నా రు. జనగామ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ పనులను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. సంక్షేమ పథకాలతోనే రైతులకు గౌరవం పెరుగుతుందని అన్నారు. రూ.25కోట్లతో సింగరేణి నిర్మించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ద్వారా త్వరలో కార్మిక వాడలకు మిషన్‌భగీరధ తరహాలో స్వచ్చమైన నీరు అందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కిరణ్‌బాబు, వెంకటేశ్వర్రావు, కర్ణ, వరప్రసాద్, వసంత్‌కుమార్, కాంగ్రెస్ నేతలు స్వామి, ముస్తఫా పాల్గొన్నారు. -
చెరువులో మునిగి ఒకరి మృతి
● చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బ యటపడ్డ సంఘటన ము స్తాబాద్ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్‌కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రా మ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో ము నిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గా లించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీ ద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు. విద్యుత్ షాక్‌తో రైతు..బుగ్గారం: పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మో టార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు త గిలి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుగ్గారం మండలం గోపులాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్, బంధువుల కథనం ప్ర కారం.. గ్రామానికి చెందిన గోవిందుల మల్లేశం(58) సోమవారం ఉదయం పెసరు, ను వ్వుల పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ డబ్బా ఇనుపది కావడంతో సర్వీస్ వైరు మధ్యలో కొద్దిగా కట్ అయిన విషయం తెలియక మోటార్ స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. డబ్బాకు అంటిన సర్వీస్ వైరుకు విద్యుత్ సరఫరా అయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆటో.. బైక్ ఢీకొని ఒకరు..వీణవంక: ఐలబాద్ గ్రామ శివారులో ఆటో, బైక్ ఢీకొని ఆటో డ్రైవర్ కర్నాల నాగరాజు(46)అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని కో తిరాంపూర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు జమ్మికుంట నుంచి కరీంనగర్‌కు వె ళ్తున్నాడు. ఐలబాద్ శివారులో కరీంనగర్ నుంచి వీణవంకకు బైక్‌పై వస్తున్న మర్రి రమేశ్ అతివేగంతో ఆటోను ఢీ కొట్టాడు. దీంతో నాగరాజు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రమేశ్, బైక్ వెనక కూర్చున్న మల్లేశం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య దేవలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. సాగునీరు విడుదల చేయాలిజూలపల్లి: సాగునీరు లేక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయే అవకాశం ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జూలపల్లిలో మాట్లాడారు. శ్రీరాంసాగర్ డీ– 83,86 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని, లేకుంటే ఎల్లంపల్లి నీటిని రాగంపేట వద్ద కెనాల్‌కు అనుసంధానం చేసి నీరివ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే నాయకులు రైతు భరోసా, రుణమాఫీ ఇప్పటికి పూర్తి చేయలేదని విమర్శించారు. -
భూ భారతిపైనే ఆశలు
● పెండింగ్ సమస్యలకు పరిష్కార మార్గం ● ‘చట్టం’పై జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు సుల్తానాబాద్(పెద్దపల్లి): రాష్ట్రప్రభుత్వం అమలులో కి తీసుకొచ్చిన భూ భారతి ఆర్వోఆర్ –2025 చట్టంపైనే భూ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈమేరకు పెండింగ్‌తోపాటు పార్ట్ –బీ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం గ్రామాల వారీగా అవగాహ న సదస్సులు నిర్వహిస్తోంది. అధికారుల ద్వారా అందే సేవలు, అప్పిలేట్ అధికారి తదితర అంశాలపై అవగాహన సదస్సుల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. సదస్సులు ఈ నెల 17న ప్రారంభం కాగా.. ఈనెల 28వరకు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. విస్తృత ప్రచారం చేస్తేనే ప్రయోజనం రైతుల్లో అత్యధిక శాతం నిరక్షరాస్యులే. దీంతో గ్రా మాల వారీగా భూ భారతిపై విస్తృతంగా ప్రచారం చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు భావిస్తున్నారు. రెవెన్యూ సంబంధిత తప్పిదాల్లో సవరణ చేయడంతోపాటు ప్రభుత్వ, పోరంబోకు భూములు తదితర అంశాలకూ ఇందులో పరిష్కార మార్గాలు సూచిస్తారని అంటున్నారు. సవరణలకు అవకాశం పట్టాదారు పాసుపుస్తకాల్లో పొరపాట్ల సవరణ, రికార్డుల్లో నమోదుకు నోచుకోని భూహక్కుల కోసం ఈనెల 14వ తేదీ నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం అఫిడవిట్‌తోపాటు తగిన ఆధారాలను సమర్పించాలి. తహసీల్దార్ జారీచేసిన మ్యుటేషన్ పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీవో ఇచ్చే ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే మరో 30 రోజుల్లో కలెక్టర్‌కు రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.విచారణ జరపాలి భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని సాదాబైనామాపై భూములు కొనుగోలు చేసినవారు గతంలో దరఖాస్తు చేశారు. ఇలాంటి అర్జీలపై విచారణ జరపాలి. అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలి. ఇంకా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే వారికి మరో అవకాశం ఇవ్వాలి. – మహిపాల్‌రెడ్డి, రైతు, సుద్దాలసద్వినియోగం చేసుకోవాలి భూ భారతిపై గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సాదాబైనామాపై భూములు కొనుగోలు చేసిన వారు విచారణ సమయంలో అధికారులు అడిగిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. – గంగయ్య, ఆర్డీవో, పెద్దపల్లి -
జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ చానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపా క లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్‌ని సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్, వికాస్‌రావు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. ప్రసాద్ స్కీంలోకి రాజన్న గుడి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రసాద్స్కీంలో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ అనేక అవమనాలు ఎదుర్కొన్నారు.. కరీంనగర్‌టౌన్: దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొ న్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తన మేధాశక్తిని అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడని కొని యాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన సెమినార్‌కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ను దళిత జాతికే పరిమి తం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయన్ను తక్కువ చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసిన రెండుసార్లు అంబేద్కర్‌ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబసభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ అని అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్‌రెడ్డి, సోమిడి వేణు పాల్గొన్నారు. -
ఆకట్టుకునే గోడ రాతలు
గతంలో వాల్రైటింగ్స్కు ఎంతో క్రేజ్ ఉండేది. ఎన్నికలు, ఇతరత్రా వేడుకల సందర్భంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ గోడలన్నీ నాయకులు, పార్టీల గుర్తులు, అతిథులు, ప్రతినిధుల పేర్లు, చిత్రాలతో నిండిపోయేవి. ప్రత్యర్థులు పోటాపోగా ప్రచారం చేసేందుకు ఈ పద్ధతి ఎంచుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఆ స్థానాన్ని భర్తీ చేయగా.. ఇప్పుడు గోడలపై రాతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్ రహదారి వెంట అక్కడక్కడా గోడలపై ‘చలో బీఆర్ఎస్ సభ’ అంటూ వాల్ రైటింగ్‌లు రాస్తున్నారు. ఇవి స్థానికులకు పాత రోజులు గుర్తుచేస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగావకాశం కల్పించాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ సూచించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రామాల డివిజన్ల అభివృద్ధి సంక్షేమంపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తేవాలన్నారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలని, కుందనపల్లి గ్రామాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని కోరారు. రోడ్లు, సర్వీస్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. వీర్లపల్లి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఇళ్లు నిర్మించే బాధ్యతను ఆర్ఎఫ్సీఎల్ తీసుకోవాలని సూచించారు. ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, ఆర్ఎఫ్సీఎల్ హెచ్ఆర్ సోమనాథ్, తహసీల్దార్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తన భర్త చనిపోయాగా కాంట్రాక్టు కార్మికురాలిగా విధుల్లోకి తీసుకున్న ఎన్టీపీసీ.. నెలలో 15రోజులే పని కల్పిస్తోందని నర్రశాలపల్లికి చెందిన నిర్వాసితురాలు ఈదునూరి కనకతార ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌కు విన్నవించారు. తనకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ -
విద్యార్థులే ‘సాగు’లో శాస్త్రవేత్తలు
● రావెప్కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఎంపిక ● రైతులతోనే నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయి పాఠాలు ● భౌగోళిక స్వరూపం, ప్రదర్శనల రూపకల్పనకరీంనగర్ అర్బన్: అవును.. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా సలహాలు, సూచనలు అందించనున్నారు. అంతర్జాలం ద్వారా అందే సేవలను వివరించడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను రూపొందించనుండగా గ్రామ భౌగోళిక స్వరూపాన్ని డయాగ్రామ్ ద్వారా నివేదించనున్నారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం (రావెప్)లో భాగంగా వ్యవసాయ విద్యార్థినులు నాలుగు నెలలపాటు గ్రామాల్లోనే బస చేయనున్నారు. కరీంనగర్ ఏరువాక ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా ఇప్పటికే విద్యార్థులు రైతులతో మమేకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ కళాశాలకు చెందిన మొత్తం 21మంది విద్యార్థులకు గానూ 4–5గురు విద్యార్థులతో బృందాలను ఏర్పాటు చేసి, మండలానికో గ్రామం ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండ గ్రామాల్లో క్షేత్రస్థాయి అనుభవాలను గడిస్తున్నారు. జూన్ వరకు కార్యక్రమాల నిర్వహణతో పాటు అనుభవాలను పొందనున్నారని కరీంనగర్ ఏరువాక సమన్వయకర్త డా.మదన్‌మోహన్‌రెడ్డి వివరించారు. యూట్యూబ్, టోల్‌ఫ్రీ సేవలపై ప్రచారం రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించేలా అంతర్జాల వివరాలపై అవగాహన కల్పించనున్నారు. రైతు వేదికలో ఎప్పకటిప్పటి సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. గ్రామీణ విశ్లేషణాత్మక తులనం(పీఆర్ఏ)లో భాగంగా సోషల్ మ్యాప్ వేసి గ్రామంలో ఉన్న భౌగోళిక వివరాలు, పోస్టాఫీస్, బ్యాంకులు, ఇతరత్రా వివరాలను రూపొందించనున్నారు. యూట్యూబ్ ఛానల్ ‘పీజేటీఎస్‌ఎయూ’లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వీడియోలు ఉండనుండగా అథెంటిక్‌గా రూపొందించారు. ప్రధాన శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు చూసుకోవచ్చు. రైతుల విజయగాథలు ఉండనుండగా నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న, పెసలు, మినుములు, అపరాలు, తృణధాన్యాలపై వీడియోలు ఉండనున్నాయి. కిసాన్ సారథి టోల్‌ఫ్రీ నంబర్ 14426 లేదా 18001232175 ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను వివరిస్తే పరిష్కారం చూపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలందనుండగా రైతులు ఫోన్ చేస్తే ఏ జిల్లా నుంచి చేస్తున్నారో ఆ జిల్లా ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు లైన్లోకి రానున్నారు. ఇక వ్యవసాయ యూనివర్శిటీలు రూపొందించిన విత్తనాలను రైతుల క్షేత్రాల్లో ప్రాక్టికల్‌గా పరీక్షించనున్నారు. విత్తు నుంచి కోత వరకు సేవలు ఒక్కో విద్యార్థినికి ఒక్కో రైతును అటాచ్ చేయగా వివిధ రకాల విత్తనాలు వేసిన నుంచి పంట కోత వరకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధితో పాటు పంటలకు ఆశించే చీడపీడల నివారణ, దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకు అనుసరించిన యజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తల సూచనల క్రమంలో ఫీల్డ్‌లో అమలు చేయనున్నారు. ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల వినియోగం పొదుపుగా జరిగేలా సూచనలు చేయనున్నారు. అలాగే ఏ గ్రామంలో సేవలందిస్తున్నారో ఆ గ్రామ నైసర్గిక స్వరూపంతో పాటు వనరులను వివరిస్తూ డయాగ్రామ్ రూపొందించనున్నారు. నాలుగు నెలల పాటు సేవలు మాది సిద్దిపేట. సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో అగ్రి కల్చర్ లాస్ట్ ఇయర్ చదువుతున్న. వ్యవసాయ విద్యార్థులకు తరగతి బోధనలతో పాటు ప్రాక్టీకల్ అవగాహన అవసరం. అందుకే నాలుగు నెలల పాటు పంట పొలాలు, రైతుల మధ్య తిరుగుతూ నివేదికలు, మ్యాప్‌లు రూపొందించాల్సి ఉంటుంది. – పి.స్పందన, ఆగ్రికల్చర్ విద్యార్థి, సిద్దిపేట -
ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ సందర్శన
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌ను రామగుండం ట్రాఫిక్ పోలీస్ అధికారులు సోమవారం సందర్శించినట్లు వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తుండడంతో.. ఈ సెంటర్ నిర్వహణపై అధ్యయనం చేసేందుకు అక్కడి సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించాల్సిన రికార్డులు, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహణ తదితర అంశాలను ఏసీపీ సత్యనారాయణ వివరించారు. అనంతరం మందుబాబులకు కౌన్సెలింగ్ విధానాన్ని రామగుండం పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో ప్రీ ఫ్యాబ్రికేషన్ చెక్‌పోస్టులు
● యువ ఉద్యోగుల నియామకానికి చర్యలు ● రిటైర్డ్ సెక్యూరిటీ సిబ్బంది స్థానంలో యువతతో భర్తీ ● సంస్థ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం ● అంతర్గత ఉద్యోగులకే అవకాశంగోదావరిఖని: సింగరేణి సంస్థ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ విభాగం బలోపేతంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహించే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రీఫ్యాబ్రికేషన్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెరిగిపోవడం, ప్రతీనెల పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగ విరమణ పొందుతుండటంతో చాలాఏరియాల్లో ఖాళీలు అధికంగా ఏర్పడుతున్నాయి. ఇదేస్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీతో సమానంగా పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉండాలనే నిబంధన ప్రకారం యువ ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. త్వరలో సెక్యూరిటీ విభాగంలో అంతర్గతంగా యువ ఉద్యోగులను నియమిస్తుందని అంటున్నారు. పదోన్నతులకు శ్రీకారం.. సింగరేణిలో సీనియర్ సెక్యూరిటీ సిబ్బందికి పదోన్నతి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వారికి అన్ని పరీక్షలు నిర్వహించిన సింగరేణి యాజమాన్యం.. 26 మందిని సెక్యూరిటీ జమేదార్లుగా ఎంపిక చేసింది. వీరికి వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సెక్యూరిటీ పోస్టులను ఖరారు చేయనుంది. జమేదార్ నుంచి జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు నిర్ణయించింది. సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఇలా 12 మందిని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆధునిక డిజైన్లలో నిర్మాణం.. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే లా రూపొందించిన ప్రీ ఫ్యాబ్రికేషన్ చెక్‌పోస్టుల ను తయారు చేయించడంపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిలో ఇప్పటికే కొన్నినిర్మాణం పూర్తికాగా ఇంకా 56 ప్రీ ప్యాబ్రికేషన్ చెక్‌పోస్టులను త్వరలో పూర్తిచేయించి ఏరియాలకు పంపించనున్నారు. క్యాబిన్, టేబుల్, రెండు చెయిర్స్, ఫాల్సీలింగ్తో ఆధునిక డిజైన్లలో వీటిని నిర్మిస్తున్నారు. -
రామగుండం.. ఇక మహానగరం
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మహానగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక తిలక్‌నగర్ డౌన్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద సింగరేణి నిర్మించిన ప్రజాపార్క్ను ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. తిలక్నగర్వాసుల కోసం రూ.25 లక్షల వ్యయంతో పార్క్ నిర్మించిందని ఎమ్మెల్యే అన్నారు. సింగరేణి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సింగరేణి అధికారులు గోపాల్‌సింగ్, కిరణ్‌బాబు, వీరారెడ్డి, కర్ణ, జితేందర్‌సింగ్, వరప్రసాద్, హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, పెద్ద్దెల్లి ప్రకాశ్, ముస్తఫా తదితరులు పా ల్గొన్నారు. అనంతరం సింగరేణి ఏరియా ఆ స్ప త్రిలో నిర్మిస్తున్న క్యాథ్‌ల్యాబ్‌ను జీఎంతో కలి సి ఎమ్మెల్యే పరిశీలించారు. గుండె సంబంధిత వ్యా ధుల నిర్ధారణ, చికిత్స కోసం సింగరేణి క్యా థ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ కార్మికులకు వాటర్ బాటిళ్లు పంపిణీ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ వాటర్ బాటిళ్లు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్టీల్ వాటర్ బాటిళ్లను శ్రీపాదరావు స్మారకార్ధం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, పెద్దెల్లి ప్రకాశ్, తిప్పారపు శ్రీనివాస్ పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ -
ప్రైవేట్‌కు అప్పగించొద్దు
గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్‌కు అప్పగి స్తే ఊరుకునేదిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షు డు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని, యువ కార్మికులు సైనికుల్లాగా కదిలివచ్చి సంస్థను కాపాడుకోవాలని కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు కొరిమి రాజ్‌కుమార్, ఆరెల్లి పోశం, ఎ ల్.ప్రకాశ్, మడ్డి ఎల్లాగౌడ్, వైవీ రావు, వీరభద్రం, స్వామి, రాజరత్నం, రాంచందర్ పాల్గొన్నారు. కాలనీలో ఘనస్వాగతం యైయెటింక్లయిన్కాలనీ: అంతకుముందు సాంబశివరావుకు యైటింక్లయిన్‌కాలనీలో ఆర్జీ–2 బ్రాంచ్ నాయకులు ఘనస్వాగతం పలికారు. నాయకులు ప్రకాశ్, రాజారత్నం, రవీందర్, తిరుపతి, రవికుమార్, మహేందర్, నారాయణ, రమేశ్ ఉన్నారు. -
స్వశక్తి సంఘాలకు చేయూత
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): స్వశక్తి సంఘాల్లోని మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్టలో ఇందిరా మహిళాశక్తి ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రంతోపాటు ధూళికట్ట, ముప్పిరితోట, రాములపల్లి, ర్యాకల్‌దేవుపల్లి, ఎలిగేడు, జూలపల్లి మండలం పెద్దాపూర్, తెలుకుంట, చీమలపేట, నాగులపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడా రు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వి ద్యార్థుల యూనిఫాం కుట్టించి ఉపాధి కల్పిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం నాగేశ్వర్రావు, ఐకేపీ ఏపీఎం సుధాకర్, సీసీ మల్లేశం, మార్కెంటింగ్ కమిటీ సభ్యులు బాలుసాని పరుశరాములుగౌడ్, వెంకటేశ్వర్రావు, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, పోల్సాని పుల్లారావు, సింగిల్‌విండో చైర్మ న్లు గోపు విజయభాస్కర్‌రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్‌రావు, ఆర్ఐ జయలక్ష్మి, సీఈవోలు రవీందర్‌రెడ్డి, విక్రమ్, బూర్ల వెంకటసత్యం, వెంకటేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, బాసంపల్లి కొండయ్య, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్‌రూరల్: కనుకుల, రామునిపల్లి, రేగడిమద్దికుంట, ఆల్లీపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, కోట వీణ, నాయకుడు చిలుక సతీశ్, సీఈవోలు శంకరయ్యగౌడ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లో సోమవారం(ఈనెల 21న) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి కొత్తగా భూ భారతి ఆర్వోఆర్ విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూభారతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇందులో జిల్లా అధికారులు అందరూ పాల్గొంటున్నారని, దీంతోనే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. మే డేకు ఏర్పాట్లు పెద్దపల్లిరూరల్: జిల్లాలో మే డేను పోరాట దినోత్సవంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు కోరారు. మే డే ఉత్సవాల ప్రచార పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన కోసం తమ యూనియన్ అండగా ఉందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్కోడ్లను అమలులోకి తేవ డం ద్వారా కార్మికులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. వాటిని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, జ్యోతి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. నియామకం పెద్దపల్లిరూరల్: జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి యువత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పెగడ రమేశ్‌యాదవ్‌ను నియమించారు. ఈమేరకు సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన రమేశ్.. యాదవుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారు. బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన యాదవ, కురుమలు రాజకీయాల్లో రాణించేలా ప్రోత్సాహం అందించాలని రాములు సూచించారు. 27న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్ లో ప్రవేశాల కోసం ఈనెల 27న పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వి ద్యార్థులు ఈనెల 21లోగా ఆన్లైన్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించా రు. ఈ నెల 27న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆరో తరగతి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడో తరగతి– పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. అడుగంటుతున్న చెక్‌డ్యామ్‌లు సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. భూగర్భ జలాలు ఆడుగంటిపోతున్నాయి. నీరుకుల్ల, గొల్లపల్లి గ్రామాల్లోని మానేరు వాగులో నిర్మించిన చెక్‌డ్యాంల్లో గతనెలాఖరు వరకు సమృద్ధిగా నీళ్లు ఉండగా.. ఈనెలలో ఆడుగంటిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఇసుక తెలి కనిపిస్తోంది. వ్యవసాయ, మంచినీటి బావులు సైతం వట్టిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. దాహం తీర్చని చలివేంద్రం పెద్దపల్లిరూరల్: వేసవిలో ప్రయాణికులు, బా టసారుల దాహం తీర్చేందుకు స్వచ్ఛందంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలు.. ఆ త ర్వాత నిర్వహణను విస్మరించారు. ఇందుకు ని దర్శనమే కమాన్ బస్టాప్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో నీళ్లులేని రంజన్లు కనిపించాయి. చల్లనినీరు తాగేందుకు యత్నించిన పలువురు ‘అయ్యో.. ఇందులో నీళ్లు లేవు’ అని ఉసూరుమని కనిపించారు. ఎండలు తగ్గేవరకూ చలివేంద్రంలో చల్లనినీరు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. -
‘సీబీఎస్ఈ’ విద్యా బోధనకు ఏర్పాట్లు
● నర్సరీ – ఎనిమిదో తరగతి వరకు బోధన ● ఆ తర్వాత ఉన్నత తరగతులకు విస్తరణకు చర్యలు ● తొలుత సెక్టార్ –3 పాఠశాలలో అమలు ● దశల వారీగా సంస్థ వ్యాప్తంగా అమలు ● కార్మిక, ఉద్యోగ కుటుంబాల హర్షం ● నేటినుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యాబోధనకు అనుమతి మంజూరు కావడంతో ఈమేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలుత రామగుండం –2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి పాఠశాలను ఇందుకోసం ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి సీబీఎస్ఈ పద్ధతిన విద్యా బోధన చేసేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఇతర సౌకర్యాలన్నీ కల్పించారు. సింగరేణిలోనే తొలిసారి.. సింగరేణి చరిత్రలోనే తొలిసారి యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 పాఠశాలను ఎంపిక చేశారు. తొలుత నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువు చెబుతారు. ఇందుకోసం ఈనెల 21(సోమవారం) నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సుందర్రావు వివరించారు. పాఠశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులతోపాటు ఒక్కో తరగతికి 80 మంది చొప్పున మొత్తం వెయ్యి మందికిపైగా విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌లో ఉపాధ్యాయులు చదువు చెబుతారు. సింగరేణి కార్మికుల పిల్లలతో పాటు సింగరేణి ప్రభావిత గ్రామాల విద్యార్థులు ఇందులో చదువుకునేందుకు అర్హులని హెచ్ఎం వివరించారు. సింగరేణి సీఎండీ బలరాం ప్రత్యేక చొరవతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తక్కువ ఖర్చుతో సీబీఎస్ఈ విద్యను అందించడంపై కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్థలం లేక ఇబ్బంది
వడ్లను ఆరబెట్టేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అవసరం మేరకు కల్లాలు లేక పొలాలు, రోడ్లపై వడ్లు ఆరబోయాల్సిన పరిస్థితి ఉంది. పొలాల్లో ఆరబోసిన ధాన్యంలో మట్టిపెల్లలు వస్తున్నయి. వాటిని తొలగించడం సమస్యగా మారింది. – తిరుపతిరావు, రైతు, నిట్టూరు కష్టాలు తప్పడం లేదు విత్తనం మొదలు దిగుబడి విక్రయించే దాకా మాకు కష్టాలు తప్పడం లేదు.మద్దతు ధరకు అమ్ముకోవడం కూడా ఇబ్బందిగానే ఉంది. అందరికీ ఒకే సారి పంట చేతికి రావడంతో ఆరబోయడం ఇబ్బందిగా మారింది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆరబోస్తున్నాం. – కోట రాజయ్య, రైతు, పెద్దబొంకూర్ సాఫ్ట్వేర్ మారింది మూడేళ్లక్రితం వరకు ఈజీఎస్‌లో కల్లాల నిర్మాణానికి అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్ పనుల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. అప్పటినుంచి కల్లాల మంజూరుకు అవకాశం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనులు చేపడతాం. – రమేశ్‌బాబు, ఏపీవో, ఈజీఎస్, పెద్దపల్లి -
ఆరబోతకు అష్టకష్టాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో వరి పండించిన రైతులు.. వడ్లను ఆరబోసేందుకు కల్లాలు లేక అష్టకష్టాలు ప డుతున్నారు. ఈసారి యాసంగిలో సుమారు 1.98 లక్షల ఎకరాల్లో వరి సాగైందని అంచనా. దాదాపు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మూడేళ్లుగా కల్లాల పనుల్లేవ్.. జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు ధాన్యం ఆరబోసేందుకు ఉపాధిహామీ ద్వారా కల్లాలు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరమైన మెటీరియల్ పనులకు అనుమతి ఇవ్వబోమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేయడంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అప్పటికే జిల్లాలో 2,073 పనులకు అనుమతి వచ్చినా.. 139 పనులే ప్రారంభించారు. అందులోనూ 56 పనులే పూర్తయినట్లు సమాచారం. కల్లాల నిర్మాణంతో తాము స్థలం కోల్పోవాల్సి వస్తుందని రైతులు భావించడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లపై ధాన్యం.. రైతులు సమీపంలోని మెయిన్‌రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. వాహనదారులు ఆ కుప్పలను గ మనించక ప్రమాదాలబారిన పడే అవకాశాలు ఉ న్నాయి. నాణ్యమైన వడ్లు తేవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిబంధన విధించడంతో ఇలా ఆరబోయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అంతటా ఉత్కంఠ.. వరి పంట చేతికి అందే దశలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేశాయి. దాదాపు 1,035 మంది రైతులు సుమారు 1,514 ఎకరాల్లో వరి పంట నష్టపోయారని వ్యవసాయాధికారుల సర్వేలో తేలింది. మొక్కజొన్నకు 1,084 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం రైతులను కలవరపెడుతోంది. అందుకే వీలైనంత త్వరగా వడ్లను విక్రయించాలనే ఆలోచనలతో ప్రమాదమని తెలిసినా.. రోడ్లపై వడ్లు ఆరబోస్తున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. వడ్లు ఆరబోసేందుకు కల్లాలు లేక అన్నదాతకు తిప్పలు ప్రధాన రహదారులు.. లేదంటే పొలాలే దిక్కు తేమశాతం కోసం రైతులకు తప్పని అగచాట్లు వెనువెంటనే రైస్‌మిల్లర్లకు విక్రయిస్తున్న మరికొందరు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గోపమ్మ. పెద్దపల్లి మండలం నిట్టూరు స్వగ్రామం. తాను పండించిన వడ్లను ఆరబోసేందుకు తగిన స్థలంలేదు. దీంతో పొలం మడుల్లోనే ధాన్యం ఆర బోసింది. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట నుంచి కాసులపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డు ఇది. కాసులపల్లి గ్రామ రైతులు పండించిన వడ్లను రోడ్డుపై ఇలా ఆరబోస్తున్నారు. రేయింబవళ్లు కాపలా కాయడం కష్టంగానే ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో రోడ్డుపై రైతులు ఆరబోసిన ధాన్యం ఇది. ఈ ధాన్యాన్ని గుర్తించకుండా వాహనదారులు ముందుకు వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అయినా, గత్యంతరం లేక ఇలా ఆరబోయాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ‘యాసంగి ధాన్యం చేతికి వస్తోంది. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ, నిర్దేశిత తేమశాతం వచ్చేందుకు వడ్లు ఆరబోయాలంటే అన్నదాతలకు స్థలం లభించడంలేదు. దీంతో కొందరు రోడ్లపై, మరికొందరు పొలాల్లో ఆరబోస్తున్నారు. ఇంకా కొందరు పంట కోసిన వెంటనే రైస్మిల్లరుకు విక్రయిస్తున్నారు’ అని కాసులపల్లికి చెందిన రైతు తిరుపతిరెడ్డి వాపోయాడు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
● జేఎన్టీయూ ఎదుట సమ్మె రామగిరి(మంథని): రాష్ట్రంలోని 12 విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రె గ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ ఎదుట శనివారం ని రవధిక సమ్మె ప్రారంభించారు. స్టేట్ కో ఆర్డినేట ర్ల పిలుపు మేరకు ఆందోళనకు దిగారు. అధ్యాపకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌లోని ప్రస్తుత మంత్రులు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క తమ డిమాండ్లు న్యాయబద్దమైనవి గుర్తించారన్నారు. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక తమ డిమాండ్లను విస్మరించడం సరికాదన్నారు. మంత్రులు, ప్రజాప్రతి నిధులు, అధికారులకు తాము వినతిపత్రాలు ఇస్తున్నా.. వారినుంచి ఎలాంటి స్పందన రావ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజు లుగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం హామీలు ఇవ్వడం లేదని, గత్యంతరం లేక సమ్మెకు దిగామని వివరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. పలువురు కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఆ పాఠశాలకు అనుమతిలేదు
గోదావరిఖనిటౌన్: నగరంలోని మార్కండేయకాలనీలో గల బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌కు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో మూసివేస్తున్నట్లు మండల విద్యాధికారి చంద్రయ్య శనివారం తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. అందులో ప్రవేశాల కోసం ప్రోత్సహించినా, ప్రచారం చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాల, కళాశాలలో పిల్లలను చేర్పించే ముందు ప్రభుత్వ అనుమతి ఉందా, లేదా? అని తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఆయన కోరారు. గాలికుంటు నివారణ టీకా తప్పనిసరి జ్యోతినగర్(రామగుండం): పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి శంకర్ సూచించారు. బల్దియా మూడో డివిజన్ మేడిపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. పాడి రైతులు తమ గేదెలు, ఆవులు, ఎద్దులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని అన్నారు. ప్రభుత్వం టీకాలు ఉచితంగా అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాంకిరణ్తోపాటు రైతులు పాల్గొన్నారు. లైవ్ సర్టిఫికెట్ ఇవ్వండి గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్ పొడిగింపు కోసం డిజిటల్ లైవ్ సర్టిఫికెట్ సమర్పించాలని గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరి పచౌరీ కోరా రు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పరిధిలో సుమారు 65 వేల మంది బొగ్గుగని కార్మికులు పింఛన్ పొందుతున్నారని, వీరిలో 60శాతం మంది డిజిటల్ లైవ్ సర్టిఫి కెట్ ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా వారు అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. వాస్తవానికి ఏటా నవంబర్ ఆఖరు వరకు ఈప్రక్రియ ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. నేడు యువ ఉద్యోగుల సదస్సు గోదావరిఖని: సింగరేణి సంస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆదివారం గౌతమినగర్ శ్రీమయి ఫంక్షన్హాల్లో యువ ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తామని ఏఐటీయూసీ నాయకులు స్వామి, మడ్డి ఎల్లాగౌడ్ తెలిపారు. తొలుత ఫైవింక్లయిన్చౌరస్తా నుంచి మెయిన్ చౌరస్తా, మార్కండేయకాలనీ, గౌతమినగర్ నుంచి శ్రీమయి ఫంక్షన్‌హాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. 24న జాబ్‌మేళా పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేట్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 24న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. పెద్దపల్లిలో పనిచేసేందుకు 12 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. నెలకు రూ.18,500 వేతనం చెల్లి స్తారని పేర్కొన్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని కోరారు. వివరాల కు 96529 53759, 89853 36947 సెల్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ ఎదుట వీహెచ్‌పీ నేతల నిరసన పెద్దపల్లిరూరల్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం కలెక్టరేట్ ఎదుట విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. హిందువులపై దాడులకు తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్కిరణ్గౌడ్ డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులమల్యాల సత్యం, బత్తుల విజయ్, తారాబాయి, దిలీప్, రమేశ్, మహేందర్, కవిత, శ్రీవాణి, మణిదీప్, చందు, అజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
సన్నబియ్యంపై ప్రజల్లో సానుకూల స్పందన
గోదావరిఖని: సన్నబియ్యం పంపిణీపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. 46వ డివిజన్లో రేషన్‌కార్డుదారు ఇంట్లో శనివారం వారు సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. అనంతరం మాట్లాడారు. రేషన్‌కార్డుల ద్వారా ఇకనుంచి సన్నబియ్యమే పంపిణీ చే స్తామని వారు తెలిపారు. ఈ సంతోష సమయంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్, అ ధికారులతోపాటు నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంబానికి చేరాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలపై ఆయన సమీక్షించారు. పేదల కోసం అందుబాటులో ఉంచిన సన్నబి య్యం పథకం గురించి ప్రజలకు వివరించాలన్నా రు. లబ్ధిదారుకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కార్యకర్తలు ప్రజలతో సన్నిహితంగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని ఆయన అన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే ఠాకూర్ -
నిబంధనలు పాటించని ఆస్పత్రుల సీజ్
జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా ఫిజియోఽథెరపీ నిర్వహిస్తున్న సెంటర్‌తోపాటు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవే టు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. శనివారం ఆమె ఈ విషయం వెల్లడించారు. కమాన్ ప్రాంతంలో ఇటీవల బోగస్ పేర్లతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రి యజమా న్యం రిజిస్ట్రేషన్ చేసుకుని, వైద్యుల పేరిట వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించామని ఆమె అన్నారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన విజయ అనే 25 వారాల గర్భిణికి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసినట్లు గుర్తించామని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రు యాజమాన్యాలు నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఇష్టా నుసారంగా వ్యవహరిస్తూ, ప్రజల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లిరూరల్: రెప్యూటెడ్(కార్పొరేట్) జూనియర్ కాలేజీ స్కీం కోసం ఈనెల 30వ తేదీలోగా ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనార్టీ, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులకు ప్రైవే ట్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కళాశాల యజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు పేర్కొన్నారు. రెసిడెన్షియల్ వసతి కలిగి, కాంపిటేటివ్ పరీక్షల్లో అధిక ఉత్తీర్ణత శాతం కలిగిన కళాశాలలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకుని, హార్డ్ కాపీలను తమ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు. -
● బోనస్ చెల్లిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే ● ‘కోత’లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుతోపాటు నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కలమద్దికుంట, కాసులపల్లి, పాలి తం, గోపయ్యపల్లి, కాపులపల్లి, కనగర్తి, బొంపల్లి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, అప్పన్నపేట, గౌరెడ్డిపేట, ముత్తారం గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు నర్సింహారెడ్డి, ప్రదీప్, గిర్నేని సంపత్‌రావు, చింతపండు సంపత్, సీఈవో మదన్మోహన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. గీట్ల ముకుందరెడ్డికి ఘనంగా నివాళి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి వర్ధంతి సందర్భంగా కూనారం క్రాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. -
సమస్య పరిష్కారానికే భూభారతి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మారం(ధర్మపురి): ధరణితో భూములు కోల్పోయిన పేదల సమస్య పరిష్కారానికే కాంగ్రెస్ ప్రభు త్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని విప్ లక్ష్మ ణ్‌కుమార్ అన్నారు. నందిమేడారం రైతువేదికలో శనివారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విప్ మా ట్లాడారు. సామాన్యులకు మేలు చేసేలా భూభారతి చట్టం తయారు చేశామన్నారు. సాదాబైనామాపై కొనుగోలు చేసిన భూములు రిజిస్ట్రేషన్‌కు నోచు కోలేదని తెలిపారు. భూ భారతితో ఇలాంటి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ చట్టం ఆధారంగా హక్కుదారుల వివరాలను పంచాయతీ కా ర్యాలయాల్లో ఏటా ప్రదర్శిస్తారని అన్నారు. రెవె న్యూ అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని సూచించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ధరణిలో అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లే అ వకాశం ఉండేదని, ప్రస్తుతం భూసమస్యలపై అధికార్డులు జారీచేసే ఆర్డర్లపై పైఅధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆ తీర్పుపై నా సంతృప్తి కలుగకుంటే సివిల్ కోర్టుకు వెళ్లేవీలు ఉంటుందన్నారు. ఆధార్ మాదిరిగా ప్రతీరైతుకు భూధార్ సంఖ్య కేటాయిస్తారని వివరించారు. కా గా, బంజేరుపల్లికి చెందిన పులిపాక మల్లమ్మ ఇందిరమ్మ ఇంటిని బేస్మెంట్ వరకు నిర్మించగా, అందుకు సంబంధించిన రూ.లక్ష విలువైన చెక్కును వారు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘మైకు’
మేల్కొలుపుతోంది..● గంట గంటకూ ఆధ్యాత్మిక సందేశం ● ఊరందరికీ ప్రామాణికం ● సమయం.. రోజు.. వారం.. నెల.. గంటకొట్టి చెబుతోంది ● బావుసాయిపేటలో బహుముఖ ప్రయోజనాలుతెల్లవారుజాము 5 గంటలు.. ‘ఏమయ్యో మైకు మోగింది.. లెవ్వు.. లేచి బర్రెపాలు పిండి, పాలకేంద్రంలో పోసిరా పో..’ అంటూ భర్తను భార్య పురమాయిస్తుంటోంది. ‘అగో తెల్లారుతోంది.. లేచి పొలం చుట్టూ తిరిగిరాపో’ అంటూ.. మరో ఇల్లాలు తన భర్తను అప్రమత్తం చేస్తుంటోంది.సాయంత్రం 5 గంటలు.. మూలవాగు ఒడ్డున గల రవి పొలంలో ముదురుకలుపు తీసేందుకు పది మంది మహిళలు కై కిలి వచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి కలుపుతీత పని కొనసాగుతోంది. మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు కూలీలు భోజనం చేశారు. మళ్లీ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఊరిలోని మైకు గంటలు మోగాయి. భగద్గీత శ్లోకం వినిపించింది. ఈ రోజు ఆదివారం, ఏప్రిల్ నెల.. 2025.. ఇప్పుడు సమయం ఐదు గంటలు అంటూ.. మైకులో సందేశం వినిపించింది. అంతే అప్పటి వరకు పొలంలో ముదురుకలుపు తీసిన కూలీలు వెంటనే ఒడ్డుపైకి చేరారు. టైమైంది మేం పోతున్నామంటూ ఇంటిబాట పట్టారు.మైకు చెబుతోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట జనాన్ని మైకు మేల్కొలుపుతోంది. ఆ ఊరి మైకు చెప్పే.. సమయం.. రోజు, వారం, నెల ఆ గ్రామస్తులకు ప్రామాణికమయ్యాయి. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. వ్యవసాయం ప్రధానవృత్తి. కోళ్లు, పాడిపరిశ్రమలు ఉన్నాయి. ఊరంతా ఆ మైక్ చెప్పే సమయాన్ని పాటిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. -
రైతుల సంక్షేమమే ధ్యేయం
పాలకుర్తి/ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రైతు ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎ మ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. అనంతరం జయ్యారంలో సన్నబి య్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రమోద్‌కుమార్, ఏఈవోలు శశి ధర్, యోజన, సింగిల్‌విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, పుట్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
తగ్గుతున్న పర్మినెంట్.. పెరుగుతున్న ప్రైవేట్
గోదావరిఖని: లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ, యూ రియా తయారీ కర్మాగారం ఆర్ఎఫ్సీఎల్, అల్ట్రాటెక్(కేశోరాం) సిమెంట్ పరిశ్రమల్లో ఏటికేడు పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండగా.. అదేస్థాయి లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాంత్రీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణతో పరిశ్రమల యాజమా న్యాలు పర్మినెంట్ ఉద్యోగాలపై వేటు వేస్తున్నాయి. సింగరేణిలో 1.38లక్షల నుంచి 42 వేలకు.. ఒకప్పుడు(1993కు ముందు) 1.38లక్షల మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణిలో ప్రస్తుతం ప ర్మినెంట్ కార్మికుల సంఖ్య సుమారు 42 వేలకు పడిపోయింది. ఇదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య దాదాపు 60 వేలకు చేరుకుందని పలు కార్మి క సంఘాల నాయకులు చెబుతున్నారు. మరోవై పు.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 40 మిలియన్ టన్నుల నుంచి 76 మిలియన్ టన్నులకు చేరింది. వేతనం తక్కువ.. పని ఎక్కువ.. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెంచడంతో పరిశ్రమలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. వీరికి ఉద్యోగ భద్రత, క్వార్టర్, వైద్యం, విద్య తదితర సౌకర్యాల కల్పనలో పెద్దగా ఆసక్తిచూపకపోవడం, జీతభత్యాల విషయంలో కొర్రీలు పెట్టడం, సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోవడంతో తరచూ పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. తగ్గిన ఉద్యోగులు.. పెరిగిన విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీలో ప్రస్తుతం 520 మంది అధికారులు పనిచేస్తుండగా, 270మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య సుమారు 4,500కు చేరింది. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగి, పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గినా.. విద్యుత్ ఉత్పత్తి ఏటా రికార్డుస్థాయిలో పెరుగుతూ రావడం గమనార్హం. 800 మంది కాంట్రాక్టు కార్మికులు.. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 100 మంది అధికారులు ఉండగా, 580 పర్మినెంట్ ఉద్యోగులు, మరో 800 మంది కాంట్రాక్టు కార్మికులు యూరియా ఉత్పత్తిలో భాగస్వాలవుతున్నారు. రెండేళ్ల క్రితమే పునరుద్ధరించిన ఈ సంస్థలో ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 680 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉంటే.. అంతకు మించి 800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేయడం గమనార్హం. అల్ట్రాటెక్(కేశోరాం) సిమెంట్‌లో.. బసంత్‌నగర్‌లోని కేశోరాం సిమెంట్ పరిశ్రమ ఇటీవల అల్ట్రాటెక్గా పేరు మార్చుకుంది. ఇందులో పర్మినెంట్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు కార్మికులే అధికంగా ఉన్నారు. వీరికి పర్మినెంట్ ఉద్యోగుల కన్నా తక్కువ వేతనాలు కావడం, అధిక పనులు చేయడంతో సిమెంట్ ఉత్పత్తి పెరుగుతోంది. ఏటా లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం 200మంది అధికారులు, 375 పర్మినెంట్ ఉద్యోగులు, 750మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ‘కోశోరాం’లో ప్రైవేట్ జోరు వేగంగా పెరుగుత్తున్న కాంట్రాక్టు కార్మికుల సంఖ్య చాలీచాలని వేతనాలు.. గ్యారెంటీ లేని బతుకులు సింగరేణిలోని పర్మినెంట్ ఈపీ ఆపరేటర్ నెల వేతనం రూ.1.50లక్షలు ప్రైవేట్ ఓబీ వోల్వో ఆపరేటర్(కాంట్రాక్టు కార్మికుడు) నెల వేతనం రూ.20 వేలు ఎన్టీపీసీలోని పర్మినెంట్ ఇంజినీర్ నెల వేతనం రూ.1.50లక్షలు అదేస్థాయి కాంట్రాక్టు కార్మికుడి నెల వేతనం రూ.30వేలు పరిశ్రమల్లో పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం సింగరేణి రకం అధికారులు పర్మినెంట్ కాంట్రాక్టు అప్పుడు 2300 1.38 లక్షలు – ఇప్పుడు 2,200 42వేలు 60వేలు ఎన్టీపీసీ అప్పుడు 300 830 3,000 ఇప్పుడు 520 27 4,500 ఆర్ఎఫ్సీఎల్ అప్పుడు 60 800 400 ఇప్పుడు 100 580 800 అల్ట్రాటెక్(కేశోరాం) అప్పుడు 400 1,000 200 ఇప్పుడు 200 375 750కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం సింగరేణిలో ఒకప్పుడు 1.38 లక్షల మంది ఉన్న కార్మికులు ప్రస్తుతం 42వేల మందికి తగ్గిపోయారు. వారిస్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరిగింది. యాంత్రీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ శరవేగంగా సాగుతోంది. విద్య, వైద్యం, సంక్షేమంలో కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతోంది. – రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఎన్టీపీసీలోని కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించి కాంట్రాక్టు కార్మికులతో పనిచేయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాపేక్షతో కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి. చట్టబద్ధ హక్కులను కాలరాయొద్దు. – భూమళ్ల చందర్, జిల్లా అధ్యక్షుడు, ఐఎన్టీయూసీ శ్రమదోపిడీ చేస్తున్నారు కాంట్రాక్టు కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నారు. లాభాల కోసమే ఆర్ఎఫ్సీఎల్ పనిచేస్తోంది. పర్మినెంట్ కార్మికుల సంఖ్య తక్కువ, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారందరికీ చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. లాభాల బోసన్ ఇవ్వాలి. విద్య, వైద్యం, గృహ వసతి కల్పించాలి. – అంబటి నరేశ్, అధ్యక్షుడు, ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ -
సన్నబియ్యంపై స్మగ్లర్ల కన్ను
మంథని: ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు జిల్లా అధికారులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ సన్నబియ్యాన్ని కూడా దొడ్డిదారిన మళ్లించేందుకు అక్రమార్కులు అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. రాయితీబియ్యం అక్రమ రవాణాపై పోలీసులు నిఘా తీవ్రతరం చేసినా దందాకు అడ్డుకట్ట పడడంలేదు. మంథని నుంచి మహారాష్టకు.. జిల్లాలోని మంథనితోపాటు గోదావరిఖని, పెద్దపల్లి సమీప ప్రాంతాల నుంచి సన్నబియ్యం సేకరించే స్మగ్లర్లు మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. రేషన్ దుకాణాల్లో దొడ్డుబియ్యం పంపిణీ చేసిన సమయంలో లబ్ధిదారులు కేజీ రూ.6 – రూ.8చొప్పున డీలర్లకే విక్రయించేవారు. వాటిని రిసైక్లింగ్ చేశాక వ్యాపారులు మహారాష్ట్రకు తరలించేవారు. ప్రస్తు తం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో దానికి పాలిసింగ్ చేసి తరలిస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని తొలు త నిల్వ చేసి ఆ తర్వాత మినీవ్యాన్లు, లారీల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెరుగుతున్న వ్యాపారుల సంఖ్య.. జిల్లాలో సన్నబియ్యం దందా చేసే అక్రమ వ్యాపారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రేషన్‌కార్డుదారుల నుంచి సేకరించిన రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రలోని సిరొంచ తరలిస్తున్నట్లు గతంలో పట్టుబడిన సందర్భాల్లో వాహన డ్రైవర్లు వెల్లడించిన సమాచారం బట్టి తెలుస్తోంది. సన్నబియ్యం సైతం చాలామంది లబ్ధిదారు లు తినేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో సన్నబియ్యం కూడా బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బ్యారేజీ.. వంతెనలే మార్గం లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు నిఘాలేని మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంథని మండలం సిరిపురం గ్రామ సమీప పార్వతీ బ్యారేజీ నుంచి మంచిర్యాల జిల్లా దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజీ చేరుకుంటున్నారు. అక్కడి వంతెన అటు తర్వాత దామెరకుంట, కాళేశ్వరం, అంతర్ రాష్ట్ర వంతెన దాటి మహారాష్ట్రలోకి బియ్యం వ్యాపారులు చేరుతున్నట్లు సమాచారం. మంథని నుంచి వెళ్లే బియ్యం వాహనాల్లో లోడ్ అయ్యే వరకూ ఇక్కడి వ్యాపారులు.. ఆ తర్వాత తీసుకెళ్లే బాధ్యత అటువైపు వ్యాపారులు తీసుకొంటున్నారు. దీంతో అక్రమ దందా ‘మూడు లారీలు. ఆరు వ్యాన్లు’ అన్నట్లు యథేచ్ఛగా సాగుతోంది. లబ్ధిదారుల నుంచి సేకరించే పనిలో దళారులు రేషన్ డీలర్లతో మంతనాలు.. కిలో రూ.15 నుంచి రూ.20 నిఘా పెంచిన పోలీసులు.. కట్టడికి చర్యలు 6ఏ కేసులతో సరిపెట్టకుండా కఠినంగా వ్యవహరించాలంటున్న పేదలు 6– ఏ కేసులతో సరి జిల్లాలో పలుచోట్ల సబ్సిడీ బియ్యం పట్టుబడుతుంటే అప్పటికప్పుడు అధికారులు 6–ఏ కేసులతో సరిపెడుతున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వ్యాపారి ఎవరు? అనే కోణంలో విచారణ జరపడంలేదని విమర్శులు ఉన్నాయి. మూలాల్లోకి వెళ్లకపోవడంతో వ్యాపారులు తమ దందా ను ఆపడం లేదు. ఒకట్రెండుసార్లు పట్టుబడితే పీడీ యాక్టులకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొందరు వ్యాపారులు బినామీ పేర్లు వెలుగులోకి తెస్తూ కేసులు నమో దు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు, సివిల్ సప్లయ్ అ ధికారులు దృష్టి సారిస్తే అక్రమ దందా ఆపవచ్చనే వాదనలు ఉన్నాయి. అధి కారుల ఉదాసీనతతోనే అక్రమ దందా అడ్డగోలుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై సంబంధిత శాఖల అధికారులను సంప్రదించగా.. సన్నబియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నిచోట్ల నిఘా తీవ్రతరం చేశామని వెల్లడించారు. -
రైతుల సంతోషమే లక్ష్యం
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): రైతుల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లా డారు. డీపీఎం నాగేశ్వర్రావు, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్లు జూపల్లి సందీప్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, కోట వీణ, సీఈవోలు నబీయొద్దీన్, బుర్గు సంతోష్, శంకరయ్యగౌడ్, నాయకులు సతీశ్, మహేందర్, కల్లెపల్లి జానీ, పులి వెంకటేశం, తిరుపతి, బక్కయ్య, రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతేరాజు ఓదెల(పెద్దపల్లి): కాంగ్రెస్ హయాంలో రైతేరా జు అని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి మాట్లాడారు. ఒక్క గింజ కూ డా కోత లేకుండా కొనుగోళ్లు సాగుతున్నాయని తెలిపారు. ప్రతినిధులు ఆళ్ల సుమన్‌రెడ్డి, అంజిరెడ్డి, గోపు నారాయణరెడ్డి, బైరి రవిగౌడ్, ని మ్మనాయక్, చిలుక హరికాంత్, మధు, గట్టుయాదవ్, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కనీస పింఛన్ రూ.5వేలు ఇవ్వాలి
గోదావరిఖని: దేశంలోని బొగ్గు గనికార్మికుల కనీ స పింఛన్‌ను రూ.5వేలకు పెంచాలని సీఎంపీఎ ఫ్ ట్రస్టీ బోర్డు నాయకులు డిమాండ్ చేశారు. గు రువారం న్యూఢిల్లీలో కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ట్రస్టీ (బీవోటీ)184వ సమా వేశం జరిగింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ విక్రమ్ దేవ్‌దత్ అధ్యక్షత వహించారు. ఎఫ్‌పీఎఫ్ 1971 పింఛనుదారులకు రూ.వెయ్యి కనీస పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈటీఎఫ్(ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్)లో పెట్టుబడుల శాతాన్ని 7 నుంచి 10 వరకు పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకో వాలని, సీఎంపీఎఫ్ హెడ్డాఫీస్లో కూడా పెట్టుబడులను అజమాయిషీ చేసే యంత్రాంగం ఉండా లని, నూరుశాతం ఆన్లైన్ పద్ధతి అమలు చే యాలని కోరారు. మే నెలాఖరు వరకు పూర్తయ్యేటట్లు చూస్తామని బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపా రు. కోలిండియా నిర్ణయించినట్లు సింగరేణి కూ డా పింఛన్ ఫండ్‌లో టన్ను బొగ్గుపై రూ.20 జమచేయాలని సభ్యులు సూచించగా, సింగరేణి సీ ఎండీ బలరాంనాయక్ అంగీకరించారన్నారు. -
ముందుకు.. వెనక్కి!
● కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం కదులుతున్న ఫైళ్లు ● సిరిసిల్లలో 751 ఎకరాల సేకరణకు రూ.400 కోట్లు వెచ్చింపు ● దాచారం నుంచి బోయినపల్లి వరకు భూమిని గుర్తించిన అధికారులు ● మరో 107 ఎకరాల కోసం రూ.69 కోట్లు అవసరం ● మిడ్‌మానేరులో 37ఎకరాలకు బదులుగా కోనరావుపేటలో భూమి ● కరీంనగర్లోనూ 50 ఎకరాలు సేకరించిన అధికారులుకరీంనగర్లో 50 ఎకరాలకు రూట్ క్లియర్ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేట్రాక్ కోసం గంగాధర మండలం ఉప్పర మల్యాల రెవె న్యూ గ్రామం పరిధిలోని ఉప్పరమల్యాల, రంగారావుపల్లెలో 50.19 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ భూమిలో కొత్తపల్లి– వేములవాడ మధ్య ఐదు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను అధికారులు నిర్మించనున్నారు. ఈ భూమితోపాటు ఇక్కడ ఉన్న 23 ఇళ్లను ప్రభుత్వం రైల్వేశాఖకు అప్పగించడంతో పనులు మొదలు కానున్నాయి. ఇంటికి రూ.15లక్షలు, ఎకరానికి రూ.20 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గత సెప్టెంబరులో ఈ భూమిపై అభ్యంరాలపై నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం గ్రామసభలతో కొలిక్కి తీసుకొచ్చింది. వేములవాడ నుంచి వచ్చే ఈ ట్రాక్ గంగాధర సమీపంలోని కొత్తపల్లి స్టేషన్‌కు అనుసంధానం చేయడంతో మార్గం పూర్తవుతుంది.సాక్షిప్రతినిధి,కరీంనగర్: కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణలో అధికారులు కాస్త వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఈ పనుల్లో నెలకొన్న జాప్యాన్ని చూస్తుంటే.. ఒకడుగు ముందుకుపడితే.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతమైతే ఈ పనుల కోసం ఇటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు దస్త్రాలను చకచకా ముందుకు కదుపుతున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దాచారం నుంచి బోయినపల్లి వరకు దాదాపు 954 ఎకరాల భూమిని అధికారులు రైల్వేలైన్ కోసం గుర్తించగా ఇప్పటి వరకూ 751 ఎకరాలు సేకరించారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించింది. రైల్వేలైన్ కోసం దాదాపు 107ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ భూమికి పరిహారంగా మరో రూ.69 కోట్ల వరకు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి వస్తే భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. మరోవైపు మిడ్‌మానేరు పరిధిలోని చింతల్మెట్, తాడూరు పరిధిలోని దాదాపు 37ఎకరాల అటవీభూమిని సేకరించారు. ఇందకోసం ప్రత్యామ్నాయంగా కోనరావుపేటలో మరో 40 ఎకరాల భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అప్పగించారు. సిరిసిల్ల వరకు పనులు నత్తనడకే మనోహరాబాద్– కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్లకు రూ.1167 కోట్లతో 2016లో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం 79కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తయి.. సిద్దిపేట వరకు రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు జల, రోడ్ల మార్గాలు అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ కల్వర్టులు, వంతెనలకు నిధుల విడుదల్లో జాప్యంతో పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. 2023 మార్చిలోనే రైల్వే పనులు సిరిసిల్ల వరకు పూర్తికావాలి. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయేందుకు దాదాపు రూ.850 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని దక్షిణమధ్య రైల్వే అంచనా వేస్తోంది. ఈ లెక్కన చూస్తే.. కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే రాజధానితోపాటు జగిత్యాల మీదుగా ముంబై, పెద్దపల్లి మీదుగా ఢిల్లీ, వరంగల్‌కు మార్గం సుగమం అవుతుంది. -
కటింగ్ పేరుతో మోసం చేస్తే చర్యలు
● ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్‌రూరల్/ఓదెల: కటింగ్ పేరుతో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరించారు. నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరందించేందుకు ఎస్సారెస్పీ కాలువల పూడికతీతకు త్వరలోనే శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల పీఏసీఎస్ ఆధ్వర్యంలో దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్నకల్వల(రెబ్బల్దేవుపల్లి)లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. అలాగే ఓదెల మండలం పొత్కపల్లి, కనగర్తి, మడక, గుండ్లపల్లి, పిట్టలపల్లె గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని శానగొండ, బాయమ్మపల్లి, ఇందుర్తి, రూపునారాయణపేట గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దన్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, విండో చైర్మన్లు దేవరనేని మోహన్‌రావు, ఆళ్ల సుమన్‌రెడ్డి, సతీశ్, మహేందర్, మూల ప్రేంసాగర్‌రెడ్డి, రవికుమార్, శంకర్, రాజన్న పాల్గొన్నారు. -
సమ్మె జయప్రదం చేయండి
గోదావరిఖని(రామగుండం): లేబర్‌కోడ్స్ రద్దుకోసం పోరాటం చేయాలని, ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రామికభవన్‌లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సామాజిక ఉద్యమ నిధి రూ.38,640 ిసింగరేణి అనుబంధ ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు చేతుల మీదుగా రాష్ట్ర నాయకత్వానికి అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై పనిచేస్తున్న కేవీపీఎస్, స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవాలని రాష్ట్ర కమిటీ భావించి సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి సేకరించారన్నారు. సమావేశంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, బిక్షపతి, ఎం.రామాచారి, ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సుల్తానాబాద్(పెద్దపల్లి): అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలి. వితంతువులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. స్థానికులకు అవకాశం ఇవ్వనుండగా, రాత పరీక్ష ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీపై విధివిధానాలు రావాల్సి ఉందని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తెలిపారు. జిల్లాలో ఖాళీలు ఇలా..ఐసీడీఎస్ ప్రాజెక్టు టీచర్లు ఆయాలు పెద్దపల్లి 17 96 రామగుండం 04 37 మంథని 39 87 -
ఆవేదన జీవితాంతం
ఆవేశం అదే క్షణం● చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలు ● ఒంటరవుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలుసాక్షి ,పెద్దపల్లి ●: అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. రోజూ ఇద్దరు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. నివారిద్దాం ఇలా.. నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి. గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి. ● ‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’. ● ‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’. ● ‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది. ...వీరంతా బతకాల్సిన వారే కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి.. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం
జ్యోతినగర్/రామగుండం: భూ భారతి చట్టంపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్ ఉద్యోగ వికాస కేంద్రం మిలీనియం హాలు, అంతర్గాం మండలం రైతు భవన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. భూ భారతి చట్టం జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని, అవగాహన కల్పించేందుకు ఈనెల 28వరకు ప్రతి మండల కేంద్రంలో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి మోక్షం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నూతన చట్టంలో తహసీల్దార్‌తో భూ సమస్య పరిష్కారం కానప్పుడు ఆర్డీవోను సంప్రదించవచ్చని, అక్కడ కాకుంటే జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించేలా రెండంచెల అప్పీల్ వ్యవస్థను రూపొందించడం జరిగిందన్నారు. కలెక్టర్ వద్ద కూడా న్యాయం జరగని పక్షంలో భూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో న్యాయపరమైన సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, తద్వారా కోర్టులను ఆశ్రయించి కాలం వృథా చేసుకునే అవకాశం ఉండదన్నారు. ఈ వ్యవస్థలో ఏ అధికారి ఎన్ని రోజుల్లో సమస్యను పరిష్కరించనున్నారనే విషయమై ముందుగానే మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే రోజు ఉంటాయని, కొనుగోలు, భూదానం, తనఖా, భూ బదిలీ తదితర పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిష్ట్రేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్లు ఈశ్వర్, రవీందర్‌పటేల్, డీఎఫ్‌వో, మండల పరిషత్ ప్రత్యేకాధికారి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతిగౌడ్, కాంగ్రెస్ మండల ప్రతినిధి పెండ్రు హన్మాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
హామీల అమలు తర్వాతే ఓటడగాలి
గోదావరిఖని(రామగుండం): గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటడగాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్ దేశంలో రెండు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందన్నారు. నాయకులు నీరటి శ్రీనివాస్, అచ్చే వేణు, అంజలి, ముద్దసాని సంధ్యారెడ్డి, చల్లా రవీందర్‌రెడ్డి, తిమోతి, మేడి సదయ్య, దాసరి బాలరాజు, శంకర్, శ్రావణ్, శేషగిరి, వాసు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి రామగుండం: ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చే యాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బ్రాహ్మణపల్లి పంపుహౌజ్ ప్రాంగణంలో అంతర్గాం, పాలకుర్తి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్రాహ్మణపల్లి ఎత్తిపోతలను ప్రారంభించి పంటలకు నీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మురళీధర్‌రావు, గోపు అయిలయ్యయాదవ్, సంతోష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు
రామగిరి(మంథని): రైతులకు ఇచ్చే విశిష్ట గుర్తింపు కార్డుతో ప్రభుత్వ పథకాలు అందజేస్తారని మంథని ఏడీఏ అంజని అన్నారు. గురువారం రత్నాపూర్ రైతువేదికలో రైతు గుర్తింపు కార్డులకు సంబందించి మంథని డివిజన్లోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ, వ్యవసాయ డిజిటలీకరణలో భాగంగా రైతులకు ఆధార్ తరహలో విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తారన్నారు. విశిష్ట గుర్తింపు కార్డుతో రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి ఉపయోగించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల వ్యవసాయ అధికారులు చిందం శ్రీకాంత్, అనూష, రామకృష్ణ, నవ్య తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాకు చర్యలు
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్లో గురువారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్, ఎస్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా పర్యటించారు. ఎన్టీపీసీ పైప్‌లైన్ ద్వారా ఐదురోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత దృష్టికి బాబర్ తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో పైప్‌లైన్ వేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఏజీఎం స్పష్టం చేశారు. కాకతీయనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో సైతం పర్యటించి ప్రజల సమస్యలు తెలసుకున్నారు. ఎన్టీపీసీ సీఎస్సార్ ద్వారా నిధులు కేటాయించి వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీపీసీ సివిల్ విభాగం అధికారి ఎల్ఆర్ఎస్ రెడ్డి, దాసరి ఆనంద్, జహీరొద్దీన్, గౌస్‌పాషా, శేఖర్ పాల్గొన్నారు. బ్రిడ్జి పరిశీలన జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిని గురువారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ పరిశీలించారు. మల్కాపూర్ నుంచి గోదావరినది వైపు వెళ్లే రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించామని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే ప్రజలకు ఉపయోగకరంగా బ్రిడ్జితో పాటు రోడ్ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు రామన్, హనుమనాయక్, డీసీసీ సెక్రటరీ ఎండీ.రహీం తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులివ్వాలిపెద్దపల్లిరూరల్/రామగుండం: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద గల డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని రైటర్లు ఇఫ్తెకార్, తిరుమల్ తదితరులు కోరారు. అలాగే రామగుండంలో డాక్యుమెంట్ రైటర్లు గురువారం కార్యాలయాలను మూసివేసి నిరసన తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ బాలకిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రైటర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమకు లైసెన్సులు మంజూరు చేసి శాశ్వత ఉపాధి భద్రత కల్పించాలని కోరారు. క్వింటాల్ పత్తి రూ.7,415 పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మార్కెట్లో గురువారం పత్తి క్వింటాల్ గరిష్ట ధర రూ.7,415, కనిష్టం రూ.6,308, సగటు ధర రూ.7,144 పలికినట్లు ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. -
నీడ లేదు.. నీరూ లేదు..!
కూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందా మంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణ ప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో.. -
యూడైస్ ప్లస్ పునఃపరిశీలన
జ్యోతినగర్(రామగుండం): విద్యా వ్యవస్థను బలోపేతం చేసేక్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన యూడైస్ ప్లస్ పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఎన్టీపీసీ సుభాష్‌నగర్ పాఠశాలను కరీంనగర్ డైట్ కళాశాల విద్యార్థిని మాసుమా రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, తరగతి గదుల సంఖ్య, మూత్రశాలలు తదితర అంశాలపై ఆ రా తీస్తున్నామన్నారు. నివేదికను యూడైస్‌లో పొందుపరిచిన ఆ తర్వాత మార్పులు, చేర్పుల గురించి హెచ్ఎం శారదకు వివరించారు. క్లస్ట ర్ రిసోర్స్ పర్సన్ రామ్‌కుమార్ ఉన్నారు. లెక్చరర్ల ఇంటింటి ప్రచారం రామగుండం: పదో తరగతి పరీక్షలు రాసిన వి ద్యార్థుల కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ క ళాశాల లెక్చరర్లు బుధవారం ఇంటింటా పర్యటించారు. అంతర్గాం మండలం పొట్యాల, మ ద్ధిర్యాల తదితర గ్రామాల్లో ప్రిన్సిపాల్ చింతల మోహన్ ఆదేశాల మేరకు లెక్చరర్లు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గ్రూపులు, వసతులు, ని ష్ణాతులైన అధ్యాపకులు తదితర అంశాల గు రించి వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేర్పించాలని కోరారు. 30లోగా దరఖాస్తు చేయాలి పెద్దపల్లిరూరల్: ‘టెట్’ కోసం ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మాధవి తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు https://tgtet.apton line.in/tgtet/ వెబ్సైట్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని డీఈవో సూచించారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ పెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధ వారం తెలిపారు. సన్నరకం ధాన్యం క్వింటాల్ రూ.500 బోనస్ వర్తింపజేస్తామన్నారు. ఐకేపీ, ప్యాక్స్‌లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు గోనె సంచులు, లారీల ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు ఉంటే 79950 50780 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్‌రూమ్ ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌నంబర్ 08728–224045కు ఫోన్‌చేసి ఫిర్యాదు అందించాలని ఆయన పేర్కొన్నారు. ముగిసిన ‘సబార్డినేట్’ పరీక్షలు రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో బుధవారం జ్యుడీషియల్, మినీస్టరియల్, సబార్డినేట్ ఆన్లైన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారని అధికారు లు తెలిపారు. ఉదయం వేళ 100 మందికి 67 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యా హ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 56 మంది హా జరు కాగా 44 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు చేపట్టారు. నేటి నుంచి ‘భూ భారతి’పై సదస్సులు పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భూ భారతి(ఆర్వోఆర్) చట్టంపై ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 17న అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, ఎన్టీపీసీ టీటీఎస్ మిలీనియం హాల్, 19న ధర్మారం మండలం నందిమేడారం, 21న ఎలిగేడు మండలం ఎలిగేడు, జూలపల్లి మండలం గోల్డెన్ ఫంక్షన్‌హాల్, 22న రామగిరి మండలం సెంటినరీకాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్, కమాన్‌పూర్ మండలం నాగారం, 23న మంథని మండలం నాగారం, 24న ఓదెల మండల కేంద్రం, ముత్తారం తహసీల్దార్ కార్యాలయం, 25న పాలకుర్తి మండలం పాలకుర్తి, కాల్వశ్రీ రాంపూర్ రెడ్డి ఫంక్షన్‌హాల్, 26న సుల్తానాబాద్ మండలం సుద్దాల, 28న పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రోజూ ఉదయం 10.00 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 2.00 గంటలకు మరో అవగాహన సదస్సు ఉంటుందన్నారు. -
అకాలం.. అపార నష్టం
ముత్తారం/ఓదెల/రామగిరి: జిల్లాలోని ముత్తారం, ఓదెల, రామగిరి మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన కురిసింది. ముత్తారం మండలం ఓడేడ్, ముత్తారం, పారుపల్లి, అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, మైదంబండ, మచ్చుపేట, కేశనపల్లి, లక్కారంతోపాటు ఓదెల మండలం పొత్కపల్లి, జీలకుంట, పొత్కపల్లి, ఇందుర్తి, బాయమ్మపల్లె తదితర గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికి అందే దశలోని వరి పంట నేలవాలింది. ఈసారి అత్యధికంగా సాగైన ఆడ, మగ(సీడ్) పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. బలమైన గాలిదుమారానికి మామిడికాయలు రాలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం సాయంత్రం వర కూ కొన్నిగ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. ముత్తారం మండలంలో దాదాపు 11 కరెంట్ స్తంభాలు విరిగి సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని ట్రాన్సకో ఇన్చార్జి ఏఈ సంతోష్‌రెడ్డి తెలిపారు. వరి పంటను మండల వ్యవసాయాధికారి అనూష, ఏఈవోలు బుధవారం పరిశీలించారు. ముత్తారం మండలంలోని వివిధ గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో మామిడితోటల నష్టం వాటిల్లిందని ఏవో తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. అదేవిధంగా ఓదెల మండలం పొత్కపల్లి, జీలకుంట, పొత్కపల్లి, ఇందుర్తి, బాయమ్మపల్లె తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నదని ఏవో భాస్కర్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఓదెల మండలం ఇందుర్తిలోని తొడెటి శ్రీనివాస్‌కు చెందిన ఇల్లు కూలింది. అప్రమత్తమైన శ్రీనివాస్ కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఓదెల మండలం జీలకుంట, బాయమ్మపల్లె, శానగొండ, పొత్కపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాయకులు కొండపాక నర్సింహాచారి, పులి కొముర య్య, కుక్కల మహేందర్, దాత రాకేశ్పటేల్, పు ల్ల సదయ్యగౌడ్, అనిల్, కృష్ణ పాల్గొన్నారు. రామగిరి మండలం బేగంపేటలోని రాందేని బక్కయ్యకు చెందిన 5 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముత్తారం, ఓదెల మండలాల్లో అకాల వర్షంతో ఆగమాగం రెండు వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్ల వాన -
నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర
● నిర్దేశిత తేమశాతం వచ్చాకే మార్కెట్‌కు తేవాలి ● అన్నదాతలకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనలు సుల్తానాబాద్(పెద్దపల్లి): నిర్దేశిత తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు, రవాణాలో హమాలీ సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని సూచించారు. గ్రేడ్ ఏ– రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,300 మద్దతు ధర చెల్లించాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్, అధికారి రాజేందర్, తహసీల్దార్ రాంచందర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డిప్యూటీ తాహసీల్దార్ మహేశ్, మార్కెట్ కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో 90 రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించారని, మిగతా మిల్లులకు కూడా ధాన్యం కేటాయించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. అయితే, బకా యి పడిన మిల్లులకు ధాన్యం కేటాయించేది లేదని, బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వాటికి కేటాయిస్తామని ఆయన వివరించారు. హమాలీ సమస్య పరిష్కరించాలని పలువురు కలెక్టర్‌కు విన్నవించారు. -
చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?
● కమాన్‌చౌరస్తా, జెండా కూడలిలో మూత్రశాలలు లేవు ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణవాసులు, చిరువ్యాపారులు అధికారులు చొరవ చూపాలి జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని ప్రధాన కూడళ్లలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలి. మూత్రవిసర్జన కోసం కనీస ఏర్పాట్లు చేయాలి. కమాన్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చొరవచూపి సులభ్‌కాంప్లెక్స్ నిర్మించాలి. – కనుకుంట్ల సదానందం, సామాజిక కార్యకర్త స్థలం అందుబాటులో లేదు పెద్దపల్లిలో మరోరెండు పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరముంది. ఇందుకోసం నిధులు ఉన్నాయి. స్థలమే లభించడం లేదు. కమాన్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ టాయిలెట్లను వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నిర్వాహకులకు తగిన సూచనలు ఇచ్చాం. – ఆకుల వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: అసలే జిల్లా కేంద్రం.. పట్టణంతోపాటు సమీప గ్రామీణులు వివిధ అవసరాల కోసం రోజూ ఇక్కడకు వచ్చిపోతుంటారు. ఒకటి, రెంటికి పబ్లిక్ టాయిలెట్లు లేక ఉక్కబట్టుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మహిళల బాధ చెప్పుకోలేనిది.. తమ అవసరాల కోసం పెద్దపల్లికి వచ్చే పరిసర మండలాలు, గ్రామాల ప్రజలు మల, మూత్రవిసర్జ నకు నానాతిప్పలు పడుతున్నారు. మహిళల బాధ లు వర్ణణాతీతం. పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు సమీపంలో (సాగర్రోడ్డువైపు) నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చివెళ్లే చిరువ్యాపారులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే రోజూవారీ వ్యాపారులు పొద్దంతా శ్రమించి సంపాదించిన సొమ్ములో రూ.20 నుంచి రూ.30 వ రకు మల, మూత్రవిసర్జనకే వెచ్చించాల్సి వస్తోంద ని వాపోతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వ సూలు చేస్తున్న నిర్వహకులతో కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద ‘మూ త్రవిసర్జన ఉచితం’ అనే బోర్డు ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. స్థలం అందుబాటులో లేకనే.. పట్టణంలోని కమాన్ ప్రాంతంలో గల పెట్రోల్ బంకు వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని గతంలో తీర్మానించారు. అక్కడ పనులు ప్రారంభించకున్నా కనీసం సమీపంలో మరోచోట కూడా పబ్లిక్ టాయిలెట్ నిర్మించలేకపోయారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా మూత్ర, మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలు గోస పడుతుండ్రు వివిధ పనుల నిమిత్తం పెద్దపల్లికి వచ్చేవారికి కనీస సౌకర్యాలు లేవు. మల, మూత్రవిసర్జనకు పడుతున్న బాధలు అన్నీఇన్నీకాదు. ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చిన మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కమాన్ ప్రాంతంలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మించాలి. – జ్యోతి, సీఐటీయూ నాయకురాలు పెద్దపల్లి కమాన్‌చౌరస్తా ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ సౌకర్యం లేదు.. పట్టణవాసులతోపాటు వివిధ పనుల కోసం వచ్చే సమీప గ్రామస్తులు ఒకటి, రెంటికి అవస్థలు పడుతున్నారు.. ఒప్పందం చేసుకుని ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించడం లేదు.. గత్యంతరం లేక నేను నిరసన తెలియ జేయాల్సి వస్తోంది.. – అప్పటి కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇలా ప్రాస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
యువ‘వికాసం’!
దరఖాస్తుల● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాలా మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులురాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులుపెద్దపల్లి 47,470జగిత్యాల 31,128రాజన్న సిరిసిల్ల 23,477కరీంనగర్ 29,000సాక్షిప్రతినిధి, కరీంనగర్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైనా దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియడంతో నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించిన ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. సెలవులతో అర్జీలు పెండింగ్‌లో రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కులం సర్టిఫికెట్లు పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది యువతీయువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల తర్వాత సుమారు ఆరేళ్ల తర్వాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25వ తేదీన ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. – ఏదుల కిరణ్‌కుమార్, జగిత్యాల -
వైద్య కళాశాలకు దేహదానం
ఓదెల/సుల్తానాబాద్(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన జీగురు ఓదెలు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి అప్పగించారు. తొలుత మృతుడి నివాసంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సమక్షంలో సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, సుల్తానాబాద్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మృతుడి కుమారులు జీగురు నాగయ్య, ఐలయ్య, రవీందర్, రాంచందర్ నేతృత్వంలో పార్థివదేహాన్ని ప్రతిమ మెడికల్ కాలేజీ నిర్వాహకులకు అప్పగించారు. మృతుడి భార్య జీగురు కనకలక్ష్మి సైతం గతంలో శరీరదానానికి అంగీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి
కరీంనగర్‌టౌన్: వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ (ఎస్ఏఎస్సీఐ) పథకం కింద నిధులను మంజూరు చేయాలని విన్నవించారు. సిరిసిల్ల లేదా సిద్దిపేట జిల్లాల్లో సైనిక్‌స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించారు. ఈమేరకు న్యూఢిల్లీలో బుధవారం కలిసి వినతిపత్రాలు అందించారు. కేంద్రం సైనిక్‌స్కూల్‌ను మంజూరుచేస్తే భూమి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సైనిక్‌స్కూల్ మంజూరు చేయండి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్‌లకు బండి సంజయ్ వినతి -
ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య
గోదావరిఖని: ఎంకాం చదివి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదవి ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదని కొంతకాలంగా మదనపడుతోంది. ఇదేవిషయాన్ని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేది. ఈక్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో రేకులషెడ్డు పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం రాలేదని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తన మూడో కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చుంచు విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
జీజీహెచ్‌లో పనిచేయని ఫ్రీజర్లు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో బాడీ ఫ్రీజర్లు ప నిచేయడం లేదు. మార్చురీలో మూడు ఫ్రీజర్లు ఉండాల్సి ఉండగా, ఒకటే పనిచేస్తోంది. మిలిగిన రెండు పనిచేయడం లేదు. దీంతో ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు మార్చురీకి వచ్చినప్పుడు వాటిని ఫ్రీ జర్‌లో పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఆస్ప త్రి సిబ్బందితోపాటు మృతుల కుటుంబాలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రా త్రి ప్రత్యూష అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం పోస్టుమార్టం చేయాల్సి ఉంది. దీంతో ఆ మృతదేహాన్ని మార్చురీలో ఉంచడానికి వన్‌టౌన్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి రైలు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పని చేస్తున్న ఫ్రీజర్‌లో పెట్టి ఉంచడంతో ఆస్పత్రి సి బ్బంది ఏం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో యువతి మృతదేహం పాడవకూడదని భావించిన మృతురాలి తండ్రి విఠల్.. డబ్బులు వెచ్చించి అద్దె కు ఫ్రీజర్బాక్స్ తెప్పించి అందులో తన కూతురు మృతదేహాన్ని పెట్టాల్సి వచ్చిందని ఆవేదనతో తెలిపాడు. బోధాన ఆస్పత్రిగా అభివృద్ధి చెందుతున్న జీజీహెచ్‌లో అన్నివసతులు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లపై అనేక ఫిర్యాదులు వచ్చినా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యంత్రాంగం తీరుపై నిరసన -
అభివృద్ధి పనుల పరిశీలన
ఎలిగేడు(పెద్దపల్లి): ఉపాధిహామీ ద్వారా ధూళికట్ట గ్రామంలో చేపట్టిన మట్టిరోడ్డు పనులను డీఆర్డీవో కాళిందిని బుధవారం పరిశీలించారు. నిర్మాణం తీరు, ఉపాధిహామీ కూలీలకు కల్పించి తాగునీరు, నీడ తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం, తేమశాతం తనిఖీ చేశారు. ఎలిగేడు, ఽసుల్తాన్పూర్ గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిచారు. ఈకార్యక్రమంలోఎంపీడీవో భాస్కర్‌రావు, టీ సెర్ప్ ఏపీఎం సుధాకర్, ఈజీఎస్ ఏపీవో సదానందం, సీసీలు, ఫీల్డ్అసిస్టెంట్లు ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు. వివరాలు సేకరిస్తున్న డీఆర్డీవో కాళిందిని -
‘భట్టి’ని కలిసిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు
గోదావరిఖని: డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ) నిధులు విడుదల చేయాలని కోరుతూ కోల్బె ల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయనను కలిసి లేఖ అందజేశారు. కోల్‌బెల్ట్ ప్రాంత అభివృద్ధి కి నిధులు త్వరగా విడుదల చేయాలన్నారు. కో ల్బెల్ట్ ప్రాంతాల్లో మైనింగ్‌తో ప్రజల ఆరోగ్యం, జీ వన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంద న్నారు. స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా, రహదారి, ఆరోగ్య శిబిరాలు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఈనిధులు ఎంత గానో తోడ్పతాయని అన్నారు. ఇప్పటికే నిధులు మంజూరైనా విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోందన్నారు. డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. ప్రత్యే కంగా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ప్ర భుత్వ ప్రాధాన్యత, సంబంధిత శాఖలతో చర్చించి, త్వరితగతిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజ్‌ఠాకూర్, గంట సత్యనారాయణ, బీర్ల ఆయిలయ్య తదితరులు ఉన్నారు. -
నీడ లేదు.. నీరూ లేదు..!
సిరిసిల్ల పాత బస్టాండులో నీడలేని ప్లాట్‌ఫామ్స్ ● కరీంనగర్ స్మార్ట్‌సిటీలో బస్షెల్టర్లు నామమాత్రం. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి, కమాన్ ప్రాంతంలో ఉన్న నిలువనీడ కరువయ్యింది. కోర్టు ఎదురుగా చొప్పదండి , పెద్దపల్లికి వెళ్లే రూట్లో బస్‌షెల్టర్ లేకపోవడంతో జనం ఎండలో నిలబడుతున్నారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, సహా ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, బోయినపల్లిలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. పలుగ్రామాల్లో బస్సులు నిలిపే స్థలం, బస్సుషెల్టర్లు లేవు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉన్న కొత్తబస్టాండ్‌లో ప్రయాణికులు నామమాత్రంగా వెళ్తుంటారు. పాతబస్టాండ్ ఏరియానే నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతోంది. ఇక్కడ ప్లాట్‌ఫామ్స్‌పై నిలువనీడలేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బస్సుల కోసం నీరిస్తున్నారు. ఇల్లంతకుంటలో తాగునీటి వసతిలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయం లేదు. కోనరావుపేట, గంభీరావుపేటలో ప్రయాణ ప్రాంగంణం నిరుపయోగంగా ఉంది. ప్రయాణికులు బస్సుల కోసం దుకాణాల నీడలో నిలబడుతున్నారు. ● జగిత్యాల జిల్లా రాయికల్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రాయికల్ పాతబస్టాండ్‌లో కూర్చునేందుకు, నీడలేదు. ఇబ్రహీంపట్నంలో బస్ షెల్టర్ల వద్ద బస్సులు ఆపడంలేదు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడుతున్నారు. తాగునీటి వసతీ లేదు. పెగడపల్లిలో తాగునీరు కరువైంది. ఉన్న టాయిలెట్స్ సరిగాలేవు. కథలాపూర్‌లో కనీస వసతులు లేవు. టాయిలెట్ కోసం దూరప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిరీక్షిస్తున్నారు. కరీంనగర్–గోదావరిఖని రాజీవ్ రహదారిలో బస్షెల్ట ర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. బొమ్మకల్, చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, గోపాల్పూర్, ఇరుకుల్ల, మొగ్ధుంపూ ర్ గ్రామాల స్టేజీలపై బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్ర యాణికులు బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. – సిరిసిల్లటౌన్/ గంభీరావుపేట/ కోనరావుపేట/బోయినపల్లి/రాయికల్/ కథలాపూర్/కాల్వశ్రీరాంపూర్/పెగడపల్లి అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్లు, షెల్టర్లు ప్రయాణికులకు ఎండ కష్టాలు తాగడానికి నీరులేదు.. ఒంటికి, రెంటికి తిప్పలే ఓ వైపు ఎండలు మండుతున్నాయి. ఎండవేడిమికి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి కష్టాలు వర్ణనాతీతం. చంటిపిల్లల తల్లులు, మహిళలు, వృద్ధులు పడరానిపాట్లు పడుతున్నారు. బస్సుల కోసం ఎదురు చూడడం.. వేసవి తాపం.. గొంతు తడుపుకోవడానికి కనీసం నీటివసతి కరువు. డీహైడ్రేషన్.. బస్టాండ్, బస్టాప్‌లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నారు. -
ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్
వేములవాడ: ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్‌గా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రెస్‌క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు పాత్రికేయ మిత్రులతో 1987 నుంచి అనుబంధం ఉందని, ఒకప్పుడు రుద్రంగి నుంచి వేములవాడకు వచ్చి వార్తలు అందించిన మిత్రులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాతో మంచి, చెడు రెండు ఉంటున్నాయన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్తలాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వేములవాడ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఐతో పొంచి ఉన్న ముప్పు – ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పత్రికరంగంలో మార్పులు వస్తూనే ఉన్నాయని.. ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్.. ఆతర్వాత సోషల్‌మీడియా వచ్చిందని.. ఇప్పుడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో మరించి ముప్పు పొంచి ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని, ఆర్థికశాఖ మంత్రి మాట్లాడినట్లు వీడియోలు వైరల్ చేస్తూ హైరానా సృష్టించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏఐ, దాని పరిణామాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులు నిర్వహించామని, త్వరలోనే వేములవాడలో రెండు రోజులపాటు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఐజేయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ వేములవాడ ప్రెస్‌క్లబ్ ముందు నుంచి అన్ని రంగాల్లో ముందుందన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్, కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. పాత్రికేయులు ప్రజాసేవకులు కరోనా తర్వాత పాత్రికేయరంగం మారింది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో కలిసి ప్రెస్‌క్లబ్ సమావేశ మందిరం ప్రారంభం -
భద్రతకు భరోసా
● సింగరేణిలో సేఫ్టీ మేనేజ్మెంట్ అమలు ● ఏటా తగ్గుతున్న బొగ్గుగని ప్రమాదాలు ● ఎస్వోపీ, సీవోపీపై ప్రత్యేక దృష్టి ● ప్రతీఒక్కరికి రక్షణ పరికరం పంపిణీ ● సగానికి తగ్గిన ప్రమాదాలుగోదావరిఖని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలోని సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాజమాన్యం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు, కార్మికుల అప్రమత్తత ఇందుకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. 2021 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో 13 మంది ఉద్యోగులు చనిపోతే.. గతేడాది ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గింది. 2021లో సీరియస్ ప్రమాదాలు 122 జరిగితే.. గతేడాది 88 ప్రమాదాల్లో 88మందికి తీవ్ర గాయాలయ్యాయని సింగరేణి రికార్డులు చెబుతున్నాయి. ప్రతీ కార్మికుడికి రక్షణపై ప్రత్యేక శిక్షణ ప్రతీకార్మికునికి వృత్తి శిక్షణతోపాటు పీరియాడికల్ ట్రైనింగ్ ఇస్తూ రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. కీలకప్రాంతాల్లోని కోల్కట్టర్లు, ట్రామర్లకు రెండేళ్ల కోసారి రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ), కోడ్ ఆఫ్ ప్రాక్టీస్(సీవోపీ)పై ప్రతీఒక్కరిపై తర్ఫీదు ఇస్తున్నారు. పనిస్థలాల్లో ప్రమాదాల నియంత్రణకు పనిపై అవగాహన పెంచుకోవడం ఒక ఎత్తయితే.. కార్మికులు తమ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం కీలకంగా మారుతోంది. దీంతో ప్రమాదాలు తగ్గుతున్నాయి. సూపర్వైజర్లపై ప్రధాన దృష్టి పనిస్థలాలను పర్యవేక్షించే సూపర్వైజింగ్ సిబ్బందికి ప్రమాదాల నియంత్రణపై సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్(ఎస్ఎంపీ)పై శిక్షణ ఇస్తున్నారు. ప్రమాద ప్రాంతాలు సందర్శించి ఘటనకు దారితీసిన అంశాలపై అధ్యయనం చేసేందుకు రూట్‌కెనాల్ అనాలసిస్ చేపడుతున్నారు. అలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ఇది ఎంతోదోహదం చేస్తోంది. సేఫ్టీటూల్స్ వినియోగంపై.. సింగరేణిలోని అన్ని విభాగాల ఉద్యోగులకు యాజమాన్యం సేఫ్టీ మెటీరియల్ అందిస్తోంది. బూట్లు, టోపీ, లైట్తోపా పీపీఈ కిట్లు సరఫరా చేస్తోంది. ట్రేడ్స్మెన్లు, సూపర్వైజర్లు, కార్మికులు సేఫ్టీ టూల్స్ వినియోగించడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ఎలక్ట్రికల్ ఉద్యోగులు విద్యుత్ షాక్‌కు గురికాకుండా ప్రత్యేకమైన షూస్ అందిస్తోంది. ఒక్కోసారి 11 కేవీషాక్ వచ్చినా తట్టుకునేలా ఈ షూస్ పనిచేస్తాయని యాజమాన్యం చెబుతోంది. మెటీయల్ తరలింపుపైనా.. భారీ యంత్ర, పరికరాలు, ఇతర వస్తువుల తరలింపుపైనా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. లోడింగ్, అన్లోడింగ్ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటోంది. బరువు ఎత్తే సమయంలో సేఫ్టీ యంత్రాలు వినియోగిస్తోంది. తద్వారా ప్రమా దాలు తగ్గాయని యాజమాన్యం చెబుతోంది. భూగర్భ గనుల్లో గతంలో తరచూ ప్రమాదాలు అధికంగా జరిగేవి. పనిస్థలాల్లో రక్షణ చర్యలు పటిష్టం చేయడంతో ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రమాదాల నియంత్రణపై ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గింది. మానవతప్పిదాలతో ఎక్కడైనా ప్రమాదం జరిగితే నియంత్రణకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రమాద ప్రాంతాలకు సూపర్వైజర్లను పంపించి రూట్‌కెనాల్ అనాలసిస్ ద్వారా నివేదిక తయారు చేస్తున్నారు. అలాంటి ప్రమాదాలు పునావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
జిల్లా సమాచారం ● ఊపందుకుంటున్న వరి కోతలు ● ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తున్న వడ్లుపెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు పూర్తి చేసిన రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి కూడా హార్వెస్టర్లతోనే వరి కోతలు ముమ్మరం చేశారు. దిగుబడి అంచనా 4.50లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో ఈసారి 1,98,201 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అఽధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ప్యాడీ క్లీనర్లు.. నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో చెత్తాచెదారం, మట్టిపెళ్లలు తొలగించేందుకు ప్యాడీ క్లీనర్లు, తూర్పార పట్టేయంత్రాలు, తేమశాతం నిర్ధారించే పరికరాలు, తూకం యంత్రాలు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. పాత పద్ధతిన ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు 521 ఉండగా, లేటెస్ట్ టె క్నాలజీతో కూడిన మరో 154 ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని వారు తెలిపారు. వీటిని అత్యధికంగా ధాన్యం నిల్వలు ఉండే కొనుగోలు కేంద్రాల్లో వినియోగిస్తామని వారు వివరించారు. 1.12 కోట్ల గన్నీ సంచులు అవసరం.. ధాన్యం కోసం దాదాపు 1.12 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతానికి 20 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరిన్నొ తెప్పిస్తామని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు 150 లారీలను సిద్ధం చేశారు. హమాలీలను అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాలు 324 వరి సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 1,98,201 దిగుబడి అంచనా(మెట్రిక్ టన్నుల్లో) 4,50,000 ప్యాడీ క్లీనర్లు(పాతవి) 521 ప్యాడీ క్లీనర్లు(ఆధునికమైనవి) 154 అవసరమయ్యే గన్నీ సంచులు 1,12,00,000 అందుబాటులో ఉన్నవి 20,00,000 రవాణా కోసం సిద్ధం చేసిన లారీలు 150 -
ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చింది
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రామగిరి(మంథని): కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సూచించారు. సెంటినరీకాలనీ తెలంగాణ చౌరస్తాలోని అసంపూర్తి కల్వర్టు పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా అభివృద్ధి పనులు చేయడంలో మంత్రి విఫలమయ్యారన్నా రు. అయినా, మళ్లీ శిలాఫలకాలు వేస్తున్నారని, కమాన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని విమర్శించారు. ముందుగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయా లని హితవు పలికారు. ఓడేడు వంతెన గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఓటు విలువ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, నా యకులు శంకేశీ రవీందర్, కాపురబొయిన భాస్కర్, కుమార్ యాదవ్, అల్లం తిరుపతి, దేవ శ్రీనివాస్, కొండవేన ఓదేలు, బుర్ర శంకర్, బుద్దె ఉదయ్, రోడ్డ శ్రీనివాస్, కలవేన సదానందం పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంపై ధరల ప్రభావం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెరిగిన సిమెంట్ ధరలు నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతాయని పలు వురు ఇళ్ల నిర్మాణదారులు పేర్కొంటున్నారు. బ్రాండ్‌ను బట్టి బస్తాపై రూ.70 నుంచి రూ.100 వరకు ధర పెరిగింది. అసలే వేసవి కావడంతో ఇళ్ల నిర్మా ణం జోరుగా సాగుతోంది. పెరిగిన సిమెంట్ ధరలతో తమపై మరింత ఆర్థిక భారం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 28మంది డీలర్లు.. జిల్లాలో సిమెంట్ హోల్‌సేల్ డీలర్లు సుమారు 28 మంది వరకు ఉన్నారు. వీరికితోడు పట్టణాలు, గ్రా మాల్లో రిటైల్ డీలర్లు కూడా వ్యాపారం సాగిస్తున్నా రు. అయితే, అధిక స్టాక్ హోల్‌సేల్ డీలర్లు తెప్పించుకుని నిల్వ చేసుకుంటారు. సిమెంట్ పరిశ్రమ యజమానులు ధరలు పెంచడంతో డీలర్లు సైతం చేసేదేమీలేక పెంచిన ధరలు అమలు చేస్తున్నారు. రెండేళ్లుగా నిలకడగానే.. సుమారు రెండేళ్ల నుంచి సిమెంట్ ధరలు నిలకడగానే ఉంటున్నాయని, అయితే, ఈనెలలోనే ధరలు ఒక్కసారిగా పెరిగాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రభావం రిటైల్ రంగంపై ఉంటుందని వారు అంటున్నారు. ఒక్కోబస్తాపై గతంలో రూ.250 ధర ఉండగా ఈనెలలో రూ.280 – రూ.390 వరకు ధర పలుకుతోంది. బ్రాండ్, నాణ్య తను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులూ ఉంటున్నా యి. మరోవైపు.. స్టీల్ ధరలు సైతం క్వింటాల్‌కు రూ.6,500 నుంచి రూ.8,000 వరకు పలుకుతోందని ఇళ్ల నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలపైనా ప్రభావం.. జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పె ద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. పెరిగిన సిమెంట్ ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. పెరిగిన సిమెంట్ ధరలు ఒక్కో బస్తాపై రూ.100 వరకు పెంపుసబ్సిడీపై ఇవ్వాలి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిర్మాణం పూర్తిచేసేందుకు సిమెంట్ అవసరం. ఇప్పుడు సిమెంట్ ధర పెరి గింది. ఇది మాకు ఆర్థికంగా భారం అవుతుంది. ప్రభుత్వమే ఆలోచన చేసి రాయితీపై సిమెంట్ అందించాలి. – దాసరి రాజమల్లు, ఇందిరమ్మ లబ్ధిదారు, కాట్నపల్లి -
సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
● రేపటి నుంచి అవగాహన సదస్సులు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ‘భూభారతి’ ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి అధికారులతో భూభారతి అమలు తీరుపై సమీక్షించారు. ఈనెల 17 నుంచి 30వరకు భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీరోజు కనీసం రెండు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్, మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లుండొద్దు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండొద్దని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. అర్హులైన పేదలకే ఇళ్లు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందని, అందులో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేశామని, మిగతా వాటిని అర్హులైన వారికి కేటాయించాలన్నారు. ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు మరోసారి క్షేత్రస్థాయి తనిఖీ చేయాలని ఆయన చెప్పారు. అనర్హులను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య, సీఈవో నరేందర్ పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు.. వేసవి ముగిసే వరకూ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని ఆయన అన్నారు. తాగునీటి సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. గ్రిడ్ ఈఈ పూర్ణచందర్రావు, ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.