
అకాలం.. అపార నష్టం
ముత్తారం/ఓదెల/రామగిరి: జిల్లాలోని ముత్తారం, ఓదెల, రామగిరి మండలాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన కురిసింది. ముత్తారం మండలం ఓడేడ్, ముత్తారం, పారుపల్లి, అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, మైదంబండ, మచ్చుపేట, కేశనపల్లి, లక్కారంతోపాటు ఓదెల మండలం పొత్కపల్లి, జీలకుంట, పొత్కపల్లి, ఇందుర్తి, బాయమ్మపల్లె తదితర గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికి అందే దశలోని వరి పంట నేలవాలింది. ఈసారి అత్యధికంగా సాగైన ఆడ, మగ(సీడ్) పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. బలమైన గాలిదుమారానికి మామిడికాయలు రాలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం సాయంత్రం వర కూ కొన్నిగ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. ముత్తారం మండలంలో దాదాపు 11 కరెంట్ స్తంభాలు విరిగి సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని ట్రాన్సకో ఇన్‌చార్జి ఏఈ సంతోష్‌రెడ్డి తెలిపారు. వరి పంటను మండల వ్యవసాయాధికారి అనూష, ఏఈవోలు బుధవారం పరిశీలించారు. ముత్తారం మండలంలోని వివిధ గ్రామాల్లో దాదాపు 2వేల ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో మామిడితోటల నష్టం వాటిల్లిందని ఏవో తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. అదేవిధంగా ఓదెల మండలం పొత్కపల్లి, జీలకుంట, పొత్కపల్లి, ఇందుర్తి, బాయమ్మపల్లె తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నదని ఏవో భాస్కర్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఓదెల మండలం ఇందుర్తిలోని తొడెటి శ్రీనివాస్‌కు చెందిన ఇల్లు కూలింది. అప్రమత్తమైన శ్రీనివాస్ కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఓదెల మండలం జీలకుంట, బాయమ్మపల్లె, శానగొండ, పొత్కపల్లిలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నాయకులు కొండపాక నర్సింహాచారి, పులి కొముర య్య, కుక్కల మహేందర్, దాత రాకేశ్‌పటేల్, పు ల్ల సదయ్యగౌడ్, అనిల్, కృష్ణ పాల్గొన్నారు. రామగిరి మండలం బేగంపేటలోని రాందేని బక్కయ్యకు చెందిన 5 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ముత్తారం, ఓదెల మండలాల్లో అకాల వర్షంతో ఆగమాగం
రెండు వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం
అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్ల వాన

అకాలం.. అపార నష్టం

అకాలం.. అపార నష్టం