ప్రభుత్వ పాఠశాలలకు అవార్డు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఊశన్నపల్లె ప్రభుత్వ పాఠశాల ఎఫ్‌ఎల్‌ఎన్ చాంపియన్ స్కూల్ అవార్డు లభించింది. హెచ్‌ఎం సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేశ్‌కుమార్‌కు డీఈవో మాధవి మంగళవారం చాంపియన్ స్కూల్ అవార్డు అందజేశారు. చతుర్వి ద ప్రక్రియలతో ఆంగ్లభాషలో బోధన చేయడంతో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచినందున 2024–25 విద్యా సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంకై ంది. ఎంఈవో మహేశ్‌కుమార్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సునీత, స్కూల్ కాంప్లెక్స్ చైర్‌పర్సన్ స్వరూప, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
కమాన్‌పూర్(మంథని): ముల్కలపల్లి, రాజాపూర్, గొల్లపల్లె, నాగారం ప్రభుత్వ పాఠశాలలు ఎఫ్‌ఎల్‌ఎన్ చాంపియన్లుగా ఎంపికయ్యాయి. దీంతో డీఈవో చాంపియన్ అవార్డును హెచ్‌ఎంలకు అందజేశారు. ఎంఈవో విజయ్‌కుమార్ ఉన్నారు.
‘గురుకులం’లో వందశాతం ఉత్తీర్ణత
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): దుబ్పపల్లిలోని మై నార్టీ గురుకుల కళాశాల(బాలురు)లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి మొత్తం 100మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందరూ పాసైనట్లు ప్రిన్సిపాల్ చంద్రమోహన్ తెలిపారు. ఈటీ ప్రథమ సంవత్సరంలో చరణ్‌తేజ(993/1000), ఎంఎల్‌టీ మొ దటి సంవత్సరంలో మహమ్మద్ రెహమాన్ (493 /500) రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. అలాగే ఎంఎల్‌టీ ద్వితీయ సంవత్సరంలో వెంకటేశ్ (976 /1000), ఈటీ మొదటి సంవత్సరంలో గణేశ్(489 /500) మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ చంద్రమోహన్, అధ్యాపకులు అభినందించారు.
నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన
గోదావరిఖని: ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత బుధవారం కోల్‌బెల్ట్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 5గంటలకు గోదావరిఖనిలోని రేణుకా ఎల్ల మ్మ కల్యాణవేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ముఖ్య శ్రేణులతో సమావేశమవుతారు.
ప్రభుత్వ పాఠశాలలకు అవార్డు


