
స్థలం లేక ఇబ్బంది
వడ్లను ఆరబెట్టేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అవసరం మేరకు కల్లాలు లేక పొలాలు, రోడ్లపై వడ్లు ఆరబోయాల్సిన పరిస్థితి ఉంది. పొలాల్లో ఆరబోసిన ధాన్యంలో మట్టిపెల్లలు వస్తున్నయి. వాటిని తొలగించడం సమస్యగా మారింది.
– తిరుపతిరావు, రైతు, నిట్టూరు
కష్టాలు తప్పడం లేదు
విత్తనం మొదలు దిగుబడి విక్రయించే దాకా మాకు కష్టాలు తప్పడం లేదు.మద్దతు ధరకు అమ్ముకోవడం కూడా ఇబ్బందిగానే ఉంది. అందరికీ ఒకే సారి పంట చేతికి రావడంతో ఆరబోయడం ఇబ్బందిగా మారింది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆరబోస్తున్నాం.
– కోట రాజయ్య, రైతు, పెద్దబొంకూర్ సాఫ్ట్‌వేర్ మారింది
మూడేళ్లక్రితం వరకు ఈజీఎస్‌లో కల్లాల నిర్మాణానికి అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్ పనుల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. అప్పటినుంచి కల్లాల మంజూరుకు అవకాశం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనులు చేపడతాం.
– రమేశ్‌బాబు, ఏపీవో, ఈజీఎస్, పెద్దపల్లి

స్థలం లేక ఇబ్బంది

స్థలం లేక ఇబ్బంది