జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులపై నిరసనలు
పెద్దపల్లిరూరల్: జమ్ముకశ్మీర్‌లో హిందూ పర్యాటకు లు లక్ష్యంగా ఉగ్రదాడులకు దిగిన ముష్కరుల చర్య ను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కమాన్‌వద్ద రాజీవ్‌రోడ్డుపై బుధవారం బైఠాయించా రు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజే పీ పట్టణ అధ్యక్షుడు రాకేశ్, మండల అధ్యక్షుడు ర మేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిలారపు పర్వతాలు, నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, శ్రీనివాస్, తిరుపతి, రాజగోపాల్, శంకర్, రాజన్నపటేల్, శ్రీకాంత్, హరీశ్, రాజేశం, కృష్ణ, మధుకర్, అంజి, శివసాయి, దేవేందర్, లింగయ్య, రాజు, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ఐఎన్టీయూసీ నేత బాబర్ సలీంపాషా, ఉద్యోగ గుర్తింపు సంఘం నేత ఆరెపల్లి రాజేశ్వర్, మాజీ కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కొలని కవితారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి అమరులకు నివాళి అర్పించారు.


