జాతరకు ఏర్పాట్లు
పెద్దపల్లి: జిల్లాలో జరిగే సమ్మక్క – సారలమ్మ జా తరకు జిల్లా అధికార యంత్రాంగంతోపాటు జా తర కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. 28న సార్లమ్మ, 29న సమ్మక్క గద్దెలకు వ స్తారు. 30న అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. 31 న అమ్మవార్ల వన ప్రవేశంతో వేడుకలు ముగుస్తా యి. జిల్లాలో గోదావరిఖని, గోలివాడ, ఓదెల మండలం కొలనూరు, సుల్తానాబాద్ మండలం నీరుకు ల్ల, కొదురుపాకలో జాతరలు జరుగుతాయి. వీటితోపాటు హనుమంతునిపేట, గర్రెపల్లి, తొగర్రా యి, మడక, పెగడపల్లి, మీర్జంపేట, గుండారం, ఈసాలతక్కలపల్లి, ఎలిగేడు, వెంకట్రావుపల్లిలో నూ వన దేవతల జాతరలు జరుగుతాయి. ఈమే రకు ఆయా జాతర కమిటీలు భక్తులకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాయి.


