రైల్వే ఏడీఆర్‌ఎం పర్యటన
రామగుండం: రైల్వే సికింద్రాబాద్ అదనపు డి విజనల్ మేనేజర్ సంజీవరావు, పలువురు ఉ న్నతాధికారులు శుక్రవారం స్ఠానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పలు కార్యాలయాల్లో త నిఖీ చేశారు. బద్రిపల్లి/మల్యాలపల్లి మధ్య అ డ్డుగా ఉన్న రైల్వేట్రాక్ సమస్య పరిష్కరించాల ని డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివా స్ ఏడీఆర్‌ఎంకు విన్నవించారు. స్థానికులు ఎండీ అజీం, సైదులు, రమేశ్ పాల్గొన్నారు.
చెమన్‌సింగ్‌కు పురస్కారం
జూలపల్లి(పెద్దపల్లి): కుమ్మరికుంట నివాసి, హైదరాబా ద్‌లో స్థిరపడ్డ సాహితీవేత్త, కవి చెమన్‌సింగ్.. రాష్ట్రస్థా యి అలిశెట్టి సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. అట్టడుగు పేదల జీవితాలకు ఆద్దం పట్టే కవిత్వం రాసిన అలిశె ట్టి ప్రభాకర్ పేరిట ఏటా రాష్ట్రస్థాయి అవార్డు ఇస్తున్న విషయం విదితమే. ఈనెల 12న కరీంనగర్‌లో పురస్కారం అందించనున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
కేటీఆర్‌ను కలిసి ఈశ్వర్
పెద్దపల్లి: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు కేటీఆర్‌ను కలువగా.. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సా ధించాలని వారికి దేశనిర్దేశం చేశారు.
సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం తహసీల్దార్ కా ర్యాలయంలో డిప్యుటేషన్‌పై సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్ ఆలీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంతియాజ్ ఆలీ.. గతంలో పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూ నియర్ అసిస్టెంట్, రికార్డుల నిర్వహణ అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో పహణిలో పే రును అనధికారికంగా, తప్పుగా నమోదు చేశా రు. పట్టాదారు ఫిర్యాదుమేరకు విచారణ జరిపి ఇంతియాజ్ ఆలీని సస్పెండ్ చేశారు.
సర్కారు బడుల్లోనే మంచి విద్య
సుల్తానాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మె రుగైన సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందిస్తున్నామని డీఈవో శారద అన్నారు. సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో భవిత కేంద్రం, ప్రీ ఫ్రైమరీ క్లాస్ రూంను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్లా నింగ్ కో ఆర్డినేటర్ మల్లేశం, సీఎంవో కవితారె డ్డి, ఎంఈవో రాజయ్య, హెచ్‌ఎం రత్నాకర్‌రెడ్డి, సర్పంచ్ సంపత్‌యాదవ్ పాల్గొన్నారు.
నేటి నుంచి సంక్రాంతి సెలవులు
పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించామని డీఈవో శారద తెలిపారు. సెలువులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు అతి క్రమించే పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైల్వే ఏడీఆర్‌ఎం పర్యటన
రైల్వే ఏడీఆర్‌ఎం పర్యటన


