30 ఏళ్ల క్రితమే సీఎంలకు వినతి
పీవీ జిల్లాగా మంథనిని ఏర్పాటు చేయాలని 1992లోనే అప్పటి సీఎంలు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరెడ్డికి వినతిపత్రాలు సమర్పించాం. అప్పుడు శాసనసభ స్పీకర్‌గా శ్రీపాదరావు ఉన్నారు. జిల్లా కోసం ఆనాటినుంచి ఏదోరూపంలో ప్రభుత్వానికి విజ్ఞాపణలు చేస్తూనే ఉన్నాం, మంథని జిల్లా ఏర్పాటుకు అన్నిరకాలుగా అర్హతలు ఉన్నాయి.
– కొండేల మారుతి,
స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, మంథని
శ్రీపాద జిల్లాగా ఏర్పాటు చేయండి
జిల్లాలను పునర్వవ్యస్థీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయం. మంథనిని రెండు జిల్లాల్లో విస్తరించడం ద్వారా చాలానష్టం వాటిల్లింది. మంథనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనేది ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష. శ్రీపాద జిల్లాగా ఏర్పాటు చేయాలి. – బెజ్జంకి డిగంబర్,
విద్యార్థి జేఏసీ నాయకుడు, మంథని
30 ఏళ్ల క్రితమే సీఎంలకు వినతి


