రాష్ట్రస్థాయిలో ప్రతిభ
రామగుండం: కామారెడ్డిలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన–2026లో లింగాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని దేపూరి వైష్ణవి ‘స్థిర వ్యవసాయం’ ఉపథీమ్‌లో ‘లేజర్ ఫెన్సింగ్’ ప్రాజెక్టు ప్రదర్శించి అబ్బు రపర్చింది. ఈ ప్రదర్శనకు రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం లభించిందని ప్రిన్సిపాల్ సదానందం యాదవ్ తెలిపారు. ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేసిన సైన్స్ ఉపాధ్యాయుడు జి.అఖిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
హర్షితకు అభినందన
కమాన్‌పూర్(మంథని): జూలపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కొత్తపల్లి హర్షిత జూనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి తెలంగాణ ఇంగ్లిష్ ఒలింపియాడ్ పోటీలకు ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు అభినందించారు. సినియర్స్‌లో బొజ్జ మణిచరణ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. గైడ్ టీచర్ నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
‘భాషిణి’తో భాషా అవరోధాలకు చెక్
జ్యోతినగర్(రామగుండం): భాషిణి యాప్‌తో భాషా అవరోధాలకు ముగింపు ఉంటుందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో శనివారం విశ్వహిందీ దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, హిందీని సమర్థవంతంగా ఉపయోగించడం, మీడియాలో దాని పాత్రపై దృష్టి సారించడం చాలా ముఖ్యమని ఆయన సూచించారు. భాషిణి యాప్ ద్వారా మనదేశంలోని అనేక భాషల్లో అ నువాదం, వాయిస్ ద్వారా సంభాషణ, టెక్ట్స్ ట్రాన్స్‌లేషన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. భాషా స మానత్వం, డిజిటల్ భారత్ లక్ష్య సాధనలో భా షిణి ఒక వినూత్న ముందడుగుగా నిలుస్తోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అధికార భా షా విభాగం కన్సల్టెంట్ కేవల్ కృష్ణన్ అన్నారు. ఏజీఎం హెచ్‌ఆర్ బిజయ్‌కుమార్ సిగ్దర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ
రాష్ట్రస్థాయిలో ప్రతిభ


