పెద్దపల్లి | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి

Jan 11 2026 9:45 AM | Updated on Jan 11 2026 9:45 AM

పెద్ద

పెద్దపల్లి

ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026 ● పునర్వవస్థీకరణ నేపథ్యంలో చిగురిస్తున్న ఆశలు ● నియోజకవర్గం అంతా ఒకేజిల్లా పరిధిలోకి.. ● శ్రీపాద జిల్లాగా ఏర్పాటవుతుందని ఆశాభావం ● తూర్పు డివిజన్‌లో మళ్లీ జోరందుకున్న చర్చలు

ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
తెరపైకి మంథని జిల్లా
● పునర్వవస్థీకరణ నేపథ్యంలో చిగురిస్తున్న ఆశలు ● నియోజకవర్గం అంతా ఒకేజిల్లా పరిధిలోకి.. ● శ్రీపాద జిల్లాగా ఏర్పాటవుతుందని ఆశాభావం ● తూర్పు డివిజన్‌లో మళ్లీ జోరందుకున్న చర్చలు

I

మంథని: పరిపాలన సౌలభ్యం పేరిట గత ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన కొత్త జిల్లాలు అశాసీ్త్రయంగా ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జి ల్లాల పునర్వవస్థీకరణ హాట్‌టాపిక్‌గా మారింది. మంథని వాసుల్లోనూ మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. 1992లోనే మంథనిని పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని వినతులు, నిరాహా ర దీక్షలు చేశారు. ఎంతో చరిత్ర కలిగిన మంథని.. జిల్లాగా ఆవిర్భవిస్తే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుని ఎంతో లాభదాయకంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న మంథని నియోజకవర్గం మళ్లీ ఒకే ప్రాంతంగా ఏర్పడితే బాగుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అన్నివిధాలా అనుకూలం..

సాధారణంగా ఓ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు దానికి తగిన ప్రాధాన్యం తప్పనిసరి. జిల్లా కేంద్రాలైతే.. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు, మౌలిక వసతులు, వారి అవసరాల కోసం ఏర్పడే విద్య, వ్యాపార తదితర సంస్థలతోపాటు అనేక మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేస్తే అక్కడి ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందుబాటులో వనరులు..

మంథని మారుమూల ప్రాంతం. అయినా జిల్లా కేంద్రం ఏర్పాటుకు అన్నివనరులు అందుబాటులో ఉన్నాయి. విస్తీర్ణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం మంథని. బొగ్గు గనులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉంది. మంథని నుంచి మణుగూరు మధ్య రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్రప్రభుత్వ ఇటీవల రూ.4వేల కోట్లు విడుదల చేసింది. మంథనిలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు డిపో ఉంది. విద్యుత్‌, ఫారెస్ట్‌ డివిజన్‌ కార్యాలయాలు, జేఎన్టీయూ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నా యి. త్వరలోనే మెడికల్‌ కాలేజీ కూడా రాబోతోంది.

నాగ్‌పూర్‌ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే..

నాగ్‌పూర్‌ – విజయవాడ మధ్య చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మంచిర్యాల – వరంగల్‌ హైవే మంథని నుంచే వెళ్తోంది. రూ.125 కోట్ల వ్యయంతో మంథని నుంచి మంచిర్యాల జిల్లా శివ్వారం వరకు, ఆరెంద వద్ద మానేరుపై రూ.203 కోట్లతో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యా యి. మంథని సమీపం నుంచి ఆ వంతెనకు అనుసంధానంగా బైపాస్‌ రహదారి కూడా నిర్మిస్తున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో హైటెక్‌ హంగులతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షిల్‌ స్కూల్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మంథనిని జిల్లా కేంద్రంగా మార్చితే.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా అవతరిస్తుంది.

శ్రీపాద జిల్లాగా ఏర్పాటుపై ఆశాభావం

పీవీ నర్సింహారావు అనంతరం మంథనిలో దుద్ధిళ్ల శ్రీపాదరావు తెరపైకి వచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతోకీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు సైతం వరుసగా హ్యాట్రిక్‌ సాధించి మంథని ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. దీంతో జిల్లాల పునర్వవస్థీకరణ లోనూ మంథని జిల్లాగా ఏర్పాటవుతుందని ఈ ప్రాంత ప్రజ లు ఆశించారు. అనూహ్యంగా పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించడంతో మిన్నకుండిపోయారు. అయినా.. జిల్లాల ఏర్పాటు ప్రస్తావన వచ్చిన ప్రతీసారి జిల్లా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న మంథని జిల్లా ఏర్పాటు కల ఈసారైనా నెరవేరుతుందనే ఆశతో ఉన్నారు.

మంథని పట్టణం

మంథని పీవీ జిల్లా కోసం దశాబ్దాల పోరాటం

మంథనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోనే ఈ ప్రాంతవాసులు గళమెత్తారు. దివంగత మాజీప్రధాని పీవీ నరసింహారావు పేరిట ప్రత్యేక జిల్లా కావాలని నిరాహారదీక్షలు సైతం చేపట్టారు. మంథని నుంచి పీవీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ర ్టసీఎంగా పనిచేసిన సమయంలోనూ మంథని నుంచే ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మంథని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఆదినుంచీ బలంగా ఉంది. ఈ క్రమంలోనే 1992 లో అప్పటి సీఎంలు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలోనే జిల్లా ఏర్పాటు కోరుతూ వినతిపత్రాలు అందించారు.

పెద్దపల్లి1
1/2

పెద్దపల్లి

పెద్దపల్లి2
2/2

పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement