మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
గోదావరిఖని: మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్‌తోపాటు రెవెన్యూ శాఖ మంత్రి రా మగుండం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రామగుండం నియోజకవర్గంలో ఈనెల 11న మంత్రులు పర్యయిస్తారని ఆయన అన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ శుక్రవారం నగరంలో క లెక్టర్ పర్యటించారు. డబుల్ బెడ్రూమ్‌ల ఇళ్లు ప్రా రంభించడంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమా ల్లో మంత్రులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. హెలిక్యాప్టర్ ల్యాండింగ్ కోసం పోలీస్ కమిషనరేట్‌లోని హెలిప్యాడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాటు, గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను సందర్శించారు. కలెక్టర్ వెంట డీసీపీ రాంరెడ్డి, ఆర్‌డీవో గంగయ్య, ఏసీపీ రమేశ్, అధికారులు ఉన్నారు.


