నేడు ‘ఖని’లో మంత్రుల పర్యటన
పటిష్ట పోలీస్ బందోబస్తు
గోదావరిఖని: ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభంతోపాటు వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 12.40 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభాస్థలిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ శనివారం పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు
మంత్రుల పర్యటన సందర్భంగా కట్టుదిట్టమై పోలీస్ బందోబస్తు చేపట్టామని గో దావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. బహిరంగ సభకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరుకానున్న నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి మార్కండేయకాలనీ శ్రీ రాజ్యలక్ష్మి గార్డెన్స్‌లో ప్రత్యేకంగా సూచన లు, సలహాలు ఇచ్చారు. ఏఆర్ ఏసీపీ ప్ర తాప్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ప్రవీణ్‌కుమార్, ప్రసాదరావు, రాజు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు ప్రారంభించే అభివృద్ధి పనులు ఇవే
గోదావరిఖని/కోల్‌సిటీ: నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ శనివారం వివరాలు వెల్లడించా రు. రూ.255.82కోట్ల వ్యయంతో అమృత్ పథకం ద్వారా చేపట్టిన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రూ.100 కోట్లతో చేపట్టిన సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.88.90 కోట్లతో చేపట్టిన తాగునీటి సరఫరా, రూ. 50కోట్లతో సీసీరోడ్ల పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. డీఎంఎఫ్‌టీ, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నుంచి రూ.169.84కోట్లతో చేపట్టే పలు పనులకు శంకుస్థాపన చేస్తా రు. మంత్రుల సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మై దానంలో బహిరంగ సభ నిర్వహించను న్న నేపథ్యంలో చౌరస్తా నుంచి బస్టాండ్‌కు వెళ్లేవారు న్యూఅశోకటాకీస్ మీదుగా ప్రయాణం చేయాలని సూచించారు.


