నేటినుంచి టీసీసీ పరీక్షలు
పెద్దపల్లిరూరల్: జిల్లా లో శనివారం నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కో ర్సు(టీసీసీ) పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తం 620మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా పరీక్షల కో ఆర్డినేటర్ రాంరెడ్డి తెలిపారు. పెద్దపల్లిలోని జె డ్పీ బాలుర ఉన్నత, బాలికోన్నత, అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.


