వీడని కపాస్ కష్టాలు
● ఎకరాకి ఏడు క్వింటాళ్లే యాప్‌లో నమోదు ● అధికారులు అనుగ్రహిస్తేనే 12 క్వింటాళ్లకు అనుమతి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి సాగు చేసిన రైతుల ను కపాస్ యాప్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నా యి. దిగుబడి సాధించిన అన్నదాతలను గుర్తించి.. యాప్‌లో పూర్తిదిగుబడి నమోదుకు అనుమతి ఇ వ్వాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా సంబంధిత శా ఖల అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వ స్తున్నాయి. దిగుబడిని విక్రయించేందుకు కపాస్ యాప్‌తో స్లాట్ బుకింగ్ కష్టాలు తప్పడం లేదు. పత్తి పండించిన రైతులు.. తమ దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్‌యార్డు, సీసీఐ కొనుగో లు కేంద్రాలకు వెళ్తే.. యాప్‌లో ఎకరాకి ఏడు క్వింటాళ్లనే నమోదు చేసుకునే అవకాశం ఉంది. అ యితే, ఎకరాకి 12 క్వింటాళ్లను విక్రయించుకునేందుకు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తీరణాధికారి, మండల వ్యవసాయాధికారి అనుమతి పత్రం ఇస్తేనే అమ్ముకునేందుకు అవకాశం ఉందని సంబంధితశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ది గుబడి సాధించిన కొంతమంది రైతులు.. తమ పంటను అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు స్పందించడం లేదని పలువురు వాపోతున్నారు.
పెద్దపల్లి మార్కెట్‌కు వచ్చిన పత్తి
పత్తి సాగు చేసిన రైతులు తమ దిగుబడి ఎకరాకి 12 క్వింటాళ్ల చొప్పున మద్దతు ధరకు కొనేలా అనుమతినివ్వాలి.
– వ్యవసాయశాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశం
వీడని కపాస్ కష్టాలు


