
అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సుల్తానాబాద్(పెద్దపల్లి): అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలి. వితంతువులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. స్థానికులకు అవకాశం ఇవ్వనుండగా, రాత పరీక్ష ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీపై విధివిధానాలు రావాల్సి ఉందని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తెలిపారు.
జిల్లాలో ఖాళీలు ఇలా..
ఐసీడీఎస్ ప్రాజెక్టు టీచర్లు ఆయాలు
పెద్దపల్లి 17 96
రామగుండం 04 37
మంథని 39 87