రోడ్డుపై కంకర, ఇసుక కుప్పల తరలింపు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై కంకర, ఇసుక కుప్పల తరలింపు

Apr 29 2025 12:08 AM | Updated on Apr 29 2025 12:08 AM

రోడ్డ

రోడ్డుపై కంకర, ఇసుక కుప్పల తరలింపు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఇసుక, కంకర కుప్పలు, స్టీలు సామగ్రి.. పాటు అక్కడక్కడా పైపులైన్‌ లీకేజీ మరమ్మతు కుప్పలు.. రోడ్లపై రాకపోకలు సాగించే ప్రజలను తిప్పలు పెడుతున్నాయంటూ ‘సాక్షి’లో సోమవారం ‘మున్సిపాలన ఆగమాగం’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రోడ్లపై పోసిన కంకర, ఇసుకను తీసుకెళ్లారు. చాలారోజులుగా ఉన్న కుప్ప ల తరలింపు మొదలు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ కి కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డుపై కంకర, ఇసుక కుప్పల తరలింపు1
1/1

రోడ్డుపై కంకర, ఇసుక కుప్పల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement