
ఆరెకరాల్లో మక్క నేలవాలింది
నాకున్న ఆరెకరాల్లో మొక్కజొన్న పంట వేశా. అకాల వర్షంతో కంకి పెట్టే సమయంలో పంట పూర్తిగా నేలవాలింది. దాదాపు రూ.రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. పరిహారం ఇస్తే బాగుంటుంది.
– మేకల రామయ్య, మియ్యాపూర్
సర్వేలతో సరిపెట్టవద్దు
నాకున్న ఏడెకరాల్లో వరి పంట సాగు చేశా. దాదాపు రూ.2.10లక్షలు పెట్టుబడి పెట్టా. ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట కిందపడి నష్టం జరిగింది. అధికారులు సర్వేలతో సరిపెట్టకుండా, పరిహారం అందిస్తే మాకు కొంత నష్టం పూడుతుంది.
– గోపతి సమ్మయ్య, ఓదెల
గింజలు రాలిపోయాయి
నాకున్న రెండెకరాల్లో సన్నవడ్లు నాటు పెట్టిన. గాలివానకు పొలమంతా నేలమీద పడ్డది. వానకు గింజలు రాలిపోయాయి. అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతంలో లెక్క సర్వేతో సరిపెట్టక పరిహారం అందించి ఆదుకోవాలి.
– బుర్ర కొమరయ్య, పెద్దరాతుపల్లి

ఆరెకరాల్లో మక్క నేలవాలింది

ఆరెకరాల్లో మక్క నేలవాలింది