చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?
● కమాన్‌చౌరస్తా, జెండా కూడలిలో మూత్రశాలలు లేవు ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణవాసులు, చిరువ్యాపారులు
అధికారులు చొరవ చూపాలి
జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని ప్రధాన కూడళ్లలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలి. మూత్రవిసర్జన కోసం కనీస ఏర్పాట్లు చేయాలి. కమాన్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చొరవచూపి సులభ్‌కాంప్లెక్స్ నిర్మించాలి.
– కనుకుంట్ల సదానందం, సామాజిక కార్యకర్త
స్థలం అందుబాటులో లేదు
పెద్దపల్లిలో మరోరెండు పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరముంది. ఇందుకోసం నిధులు ఉన్నాయి. స్థలమే లభించడం లేదు. కమాన్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ టాయిలెట్లను వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నిర్వాహకులకు తగిన సూచనలు ఇచ్చాం.
– ఆకుల వెంకటేశ్,
మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి
పెద్దపల్లిరూరల్: అసలే జిల్లా కేంద్రం.. పట్టణంతోపాటు సమీప గ్రామీణులు వివిధ అవసరాల కోసం రోజూ ఇక్కడకు వచ్చిపోతుంటారు. ఒకటి, రెంటికి పబ్లిక్ టాయిలెట్లు లేక ఉక్కబట్టుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
మహిళల బాధ చెప్పుకోలేనిది..
తమ అవసరాల కోసం పెద్దపల్లికి వచ్చే పరిసర మండలాలు, గ్రామాల ప్రజలు మల, మూత్రవిసర్జ నకు నానాతిప్పలు పడుతున్నారు. మహిళల బాధ లు వర్ణణాతీతం. పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు సమీపంలో (సాగర్‌రోడ్డువైపు) నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చివెళ్లే చిరువ్యాపారులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే రోజూవారీ వ్యాపారులు పొద్దంతా శ్రమించి సంపాదించిన సొమ్ములో రూ.20 నుంచి రూ.30 వ రకు మల, మూత్రవిసర్జనకే వెచ్చించాల్సి వస్తోంద ని వాపోతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వ సూలు చేస్తున్న నిర్వహకులతో కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద ‘మూ త్రవిసర్జన ఉచితం’ అనే బోర్డు ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.
స్థలం అందుబాటులో లేకనే..
పట్టణంలోని కమాన్ ప్రాంతంలో గల పెట్రోల్ బంకు వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని గతంలో తీర్మానించారు. అక్కడ పనులు ప్రారంభించకున్నా కనీసం సమీపంలో మరోచోట కూడా పబ్లిక్ టాయిలెట్ నిర్మించలేకపోయారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా మూత్ర, మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహిళలు గోస పడుతుండ్రు
వివిధ పనుల నిమిత్తం పెద్దపల్లికి వచ్చేవారికి కనీస సౌకర్యాలు లేవు. మల, మూత్రవిసర్జనకు పడుతున్న బాధలు అన్నీఇన్నీకాదు. ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చిన మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కమాన్ ప్రాంతంలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మించాలి.
– జ్యోతి, సీఐటీయూ నాయకురాలు
పెద్దపల్లి కమాన్‌చౌరస్తా ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ సౌకర్యం లేదు.. పట్టణవాసులతోపాటు వివిధ పనుల కోసం వచ్చే సమీప గ్రామస్తులు ఒకటి, రెంటికి అవస్థలు పడుతున్నారు.. ఒప్పందం చేసుకుని ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించడం లేదు.. గత్యంతరం లేక నేను నిరసన తెలియ జేయాల్సి వస్తోంది..
– అప్పటి కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇలా ప్రాస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?
చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?
చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?
చెప్పుకోలేని బాధలకు పరిష్కారం లేదా?


