కార్మికులకు అందని ఇన్సెంటివ్‌ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు అందని ఇన్సెంటివ్‌

Apr 30 2025 12:43 AM | Updated on Apr 30 2025 12:43 AM

కార్మికులకు అందని ఇన్సెంటివ్‌

కార్మికులకు అందని ఇన్సెంటివ్‌

గోదావరిఖని: అధికారుల తప్పిదమా.. బ్యాంకర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ.. యూనియన్‌ బ్యాంక్‌ కస్టమర్ల వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల్లో గత మార్చినెలకు సంబంధించిన ఇన్సెంటివ్‌ జమకాలేదు. సింగరేణిలోని రామగుండం డివిజన్‌–2 ఏరియాలో అత్యధిక బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకునే కార్మికులకు ప్రతీనెల యాజమాన్యం ప్రత్యేక ఇన్సెంటివ్‌ (ప్రోత్సాహకం) అందిస్తోంది. నెలలో పనిచేసిన మస్టర్లు, ట్రిప్పుల ఆధారంగా ఇన్సెంటివ్‌ అందజేస్తోంది. ఈ లెక్కన మార్చిలో సుమారు రూ.1,500 – రూ.3,500 వరకు ఒక్కోకార్మికుడి బ్యాంక్‌ ఖాతాలో జమకావాల్సి ఉంది. ఇది నెల వేతనానికి అదనమని అధికారులు చెబుతున్నారు. ప్రతీనెల 20వ తేదీన ఇన్సెంటివ్‌ ఖాతాలో జమకావాల్సి ఉంది. ఈవిషయంపై యూనియన్‌ బ్యాంక్‌ అధికారులను సంప్రదిస్తే.. తమకు సంబందం లేదని, యా జమాన్యం జమచేస్తే తాము బ్యాంక్‌ ఖాతాల్లో జ మచేస్తామంటున్నారని కార్మికులు వాపోతున్నారు. ఎస్‌బీఐ ఖాతాదారులకు గతనెల 23వ తేదీ వరకే ఇన్సెంటివ్‌ జమచేశారని వారు పేర్కొంటున్నారు.

ఇబ్బందుల్లో యూనియన్‌ బ్యాంక్‌ కస్టమర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement