‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
జూలపల్లి(పెద్దపల్లి): భూ భారతి ఆర్‌వోఆర్ చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. భూ వివాదాలు, ఇతర సమస్యల సత్వర పరిష్కారానికి ఈ చట్టం మార్గం చూపుతుందని వివరించారు. తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీవో పద్మ, ఏవో ప్రత్యూష, డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్, ప్యాక్స్ చైర్మన్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
వంతెన అభివృద్ధికి చర్యలు
రామగుండం: స్థానిక రైల్వే ఫ్లై ఓవర్‌ను టీ–జంక్షన్‌గా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ సిబ్బంది సోమవారం పలుచోట్ల మట్టి శాంపిళ్లు సేకరించారు. ఫ్లై ఓవర్ ప్రస్తుతం గోదావరిఖని నుంచి రామగుండం రైల్వేస్టేషన్ మధ్య రాకపోకలు సాగించే వారికే సౌకర్యంగా ఉంది. దీంతో దీనిని విస్తరిస్తూ అంతర్గాం బైపాస్ నుంచి వచ్చిపోయే వాహనదారులకు కూడా సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈక్రమంలోనే గురుకుల విద్యాలయం సమీపం వరకు టీ జంక్షన్‌గా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. ఫలితంగా అంతర్గాం నుంచి రాకపోకలు సాగించే వాహనాలు నేరుగా వంతెనపై నుంచి రైల్వేస్టేషన్, గోదావరిఖని వెళ్లే అవకాశం ఉంటుంది.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని రేవెల్లి శిరీష జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బాలిక అత్యంత ప్రతిభ కనబర్చిందని పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో శిరీష తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటుందని ఆయన వివరించారు. శిరీషను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
23న ఉద్యోగ మేళా
కమాన్‌పూర్(మంథని): గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 23న ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.సుధాకర్ తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బీపీసీ చదివి 20ఏళ్ల లోపు వయసు గలవారు అర్హులన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.15 వేల వేతనంతోపాటు ఉచిత భోజన, వసతి కల్పిస్తారన్నారు. అంతేకాదు.. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదువుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుందని ఆయన వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు బుధవారం ఉదయం 9.30 గంటలకు కళాశాలలో హాజరు కావాలని ఆయన కోరారు.
క్రీడలకు ఎన్టీపీసీ పెద్దపీట
జనరల్ మేనేజర్ అలోక్ కుమార్ త్రిపాఠి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రాజెక్టు జనరల్ మేనేజర్ అలోక్‌కుమార్ త్రిపాఠి అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ ఉద్యోగులు విధులతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని తెలి పారు. పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో జీఎంలు ముఖుల్ రాయ్, కేసీ సింగరాయ్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ గనేశ్వర్ జడ్జితోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం


