ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
ధర్మారం(పెద్దపల్లి): ధాన్యంలో నిర్దేశి త తేమశాతం వచ్చిన వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. దొంగతుర్తి, ఖిలావనపర్తి, సాయంపేట, నందిమేడారంలోని ధాన్యం కొనుగో లు కేంద్రాలతోపాటు నందిమేడారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఖిలావనపర్తి పల్లె దవాఖానాను కలెక్టర్ బుధవా రం తనిఖీ చేశారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ గర్భిణి వివరాలను నమోదు చేయాలని, బీపీ, మధుమేహం బాధితులకు మందులు పంపిణీ చేయాలన్నారు. అనంతరం బంజేరుపల్లిలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 71 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్ర గతిపై ఆరా తీశారు. ఏఎంసీ చైర్మన్ రూప్లానాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.


