మే నెలంతా సెలవులివ్వాలి
పెద్దపల్లిరూరల్: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా మే నెలంతా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సెలవులివ్వాలని అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి కోరారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావుకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావుతో పాటు శోభ, అంజనాదేవి, శ్యామల, రామలక్ష్మి, కృష్ణకుమారి, సుగుణ, మహేశ్వరి, సులోచన, వసంత పాల్గొన్నారు.


