
శాంతిచర్చలు జరపాలి
పెద్దపల్లిరూరల్: కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆదివాసీలపై జరుపుతున్న ఏకపక్ష దాడులను ఆపేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ తదితరులు మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసి, గిరిజన ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబి క్కుమంటూ బతుకుతున్నారన్నారు. సాయుధ పోలీసు బలగాలను వెనక్కి పిలిపించి, మావోలతో శాంతి చర్చలు జరపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో వ్యవహరించడం సరి కాదని, అరెస్టు చేసిన ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలన్నారు. నాయకులు నరేశ్, అశోక్, శంకర్, రాజేశం, మల్లేశ్, చంద్రయ్య, లింగమూర్తి, రమేశ్, బుచ్చయ్య, బాలకృష్ణ, బాబు, రాయమల్లు, ప్రసాద్, మొండయ్య తదితరులున్నారు.